భారీ అమ్మకాలతో దూసుకుపోతున్న స్కోడా కైలాక్
ఆటోమొబైల్స్
- 1 year, 6 month, 12 days ago
భారత ఆటోమొబైల్ రంగం ఇటీవల కాలంలో బాగా వృద్ధి చెందింది. ఇక్కడ మిడ్ రేంజ్ కార్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. దీంతో అన్ని కంపెనీలు రూ.10లక్షల లోపు కార్లను మార్కెట్లో తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదే కోవలో స్కోడా ఆటో ఇండియా కూడా గతేడాది ఇండియాలో తన మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్యూవీ అయిన స్కోడా కైలాక్ను లాంచ్ చేసింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి బడ్జెట్ ధరలోనే ఈ కారును తీసుకొచ్చింది.