రూ.10 లక్షల లోపు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ CNG కార్లు ఇవే!

ఇండియాలో చాలా మంది కార్ల వినియోగదారులు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లతో పాటు Cngలను సైతం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వీటి మెయింటెనెన్స్ చేయడం చాలా ఈజీ, అలాగే ఖర్చు కూడా తక్కువగానే వస్తుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో కొత్తగా కార్లను కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వారు ఈవీతో పాటు Cngల వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా కంపెనీలు ఇలాంటి వాటిని విడుదల చేస్తున్నాయి. మారుతీ సుజుకీ నుంచి మొదలుకుని దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్, దేశీయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ వరకు సీఎన్‌జీ కార్లను మార్కెట్లో ప్రస్తుతం విక్రయిస్తున్నాయి. చాలా మంది కస్టమర్లు రూ.10 లక్షల లోపు ధరలో లభించే వాటిని కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్లో ఈ ధరలోపు అందుబాటులో ఉన్న కార్ల గురించి కింది కథనంలో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే టెస్లా ఈవీ తయారీ ప్లాంట్!

ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచంలోనే అతిపెద్ద గమ్యస్థానంగా మారింది. దేశీయంగా ప్రజలు ప్రస్తుతం సాంప్రదాయ పెట్రోల్, డీజిల్, CNG వాహనాలతో పాటు ఈవీలను కూడా ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా ఉన్నటువంటి తయారీ దారులు వరుసగా ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఇండియాలో ప్లాంట్‌లను ఏర్పాటు చేయగా, ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా (Tesla) కూడా భారత మార్కెట్‌పై కన్నేసి ఇక్కడ కార్లను ఉత్పత్తి చేసి లోకల్ ప్రజలు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచడంతో పాటు ఇతర దేశాలకు సైతం ఇక్కడి నుంచి ఎగుమతి చేయడానికి ప్రణాళికలు వేసింది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఇండియాలో తయారీ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో ఆలోచన చేస్తుంది.

1970, 80లలో అందరి ఫేవరెట్ బైక్ కొత్త రూపంలో వచ్చింది.. అదిరిపోతున్న ప్రమోషన్ వీడియో

ఇండియాలో TVS XL బైక్ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది కచ్చితంగా కనిపిస్తుంది. ఎంత బరువు ఉన్నప్పటికీ కూడా బురద రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. భారతీయ మార్కెట్లో ఈ బైక్ అత్యంత ప్రసిద్ధి చెందిన మోడల్. అయితే దీని కంటే ముందు ఇండియాలో ఇదే తరహ డిజైన్‌తో ఉన్న ఒక మోడల్ దేశంలో భారీ డిమాండ్ ఉన్న టూవీలర్‌గా ఉండేది. దాని పేరే 'కైనెటిక్ లూనా'. టీవీఎస్ మోటార్ నుంచి వచ్చిన XL బైక్ కంటే ముందుగా ఈ లూనానే చాలా మంది వాడేవారు.

అరుదైన బైక్‌ను విడుదల చేసిన జావా.. దీన్ని పొందాలంటే అదృష్టం ఉండాలి

ఇండియాలో రెట్రో క్లాసిక్ టూవీలర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఈ సెగ్మెంట్‌లో దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉంటుంది. మార్కెట్లోకి ఈ కంపెనీకి పోటీగా చాలా టూవీలర్ తయారీదారులు వచ్చినప్పటి రాయల్ ఎన్‌‌ఫీల్డ్‌ను మాత్రం ఎవరు దాటలేకపోయారు. అయితే దీనికి పోటీగా రెట్రో క్లాసిక్ టూవీలర్స్‌‌ను విడుదల చేస్తూ భారత్‌లో ప్రసిద్ధ కంపెనీగా అవతరించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ నెమ్మదిగా ఇక్కడి మార్కెట్లో వాటాను పెంచుకుంటున్న జావా కొత్తగా అదిరిపోయే బైక్‌ను మార్కెట్లోకి దింపింది. దీని పేరు 'జావా 350 లెగసీ (jawa 350 legacy)'. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గతంలో విడుదల అయిన క్లాసిక్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న మోడల్. ఈ బైక్‌కు పోటీ ఇప్పటి వరకు ఏది రాలేకపోయంది. అయితే దీనిని ఎదుర్కోవడానికి జావా తన 50 లెగసీని విడుదల చేసింది.
Advertisement

ఈ కార్లను కొనడం అందరికి కుదరదు.. ఎందుకంటే ఇవి చాలా ప్రత్యేకమైనవి

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భారతీయ వినియోగదారులకు అందుబాటు ధరలో వాహనాలను విక్రయిస్తూ, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీలకు పోటీగా అమ్మకాలతో దూసుకుపోతుంది. ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమమైన ఫీచర్స్‌తో కార్లను విడుదల చేయడంలో టాటా కంపెనీకి దేశంలోని పేరుంది. దేశీయంగా కొత్త కస్టమర్లను సాధించడానికి రెండు ప్రసిద్ధ కార్ మోడళ్లను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త కార్ల పేరు 'హారియర్ స్టెల్త్ ఎడిషన్ (Harrier stealth edition)', 'సఫారీ స్టెల్త్ ఎడిషన్ (Safari stealth edition)'. ఇవి ప్రత్యేకమైన ఎడిషన్లు. టాటా సఫారీ 27 సంవత్సరాల గుర్తింపుగా కంపెనీ ఈ ప్రత్యేక ఎడిషన్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే కొనుగోలుకు లభిస్తాయి. టాటా నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ స్టెల్త్ ఎడిషన్లు 2,700 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

రోడ్డుపై రాజసంగా.. కొత్త కియా సెల్తోస్ ఎంట్రీ అదిరిపోయిందిగా

దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్‌(Kia Motors)కు ఇండియాలో బలమైన మార్కెట్ ఉంది. ఇక్కడ అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కార్ల తయారీదారులకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. భారతీయ కస్టమర్లను తన వైపు తిప్పుకోవడానికి ఎప్పటికప్పుడు కియా లేటెస్ట్ ఫీచర్స్‌తో కూడిన కార్లను లాంచ్ చేస్తూ, తన మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటుంది. 2024లో అదిరిపోయే సరికొత్త మోడళ్లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా ఇండియాలో 2025 కియా సెల్టోస్(Seltos) భారతదేశంలోకి తీసుకొచ్చింది. అప్‌డేటెడ్‌తో వచ్చిన ఈ కారులో ఎనిమిది కొత్త వేరియంట్‌లను కంపెనీ పరిచయం చేసింది. అదనంగా పలు వేరియంట్లలో 24 ట్రిమ్‌లలో కస్టమర్లకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. భారతదేశంలోని SUV లలో కియా సెల్టోస్ ఒక ప్రసిద్ధ మోడల్. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా దాదాపు ఆరు లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.

అప్రిలియా టువోనో 457 బైక్ ఎలా ఉందో తెలుసా?

భారత మార్కెట్లో ప్రస్తుతం టూవీలర్ తయారీ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో వరుసగా కొత్త మోడళ్లు లాంచ్ అవుతూ సందడి చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ అప్రిలియా దేశీయంగా కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. దీని పేరు టువోనో 457 (Tuono 457). అప్రిలియా తన 457 లైనప్‌కు తదుపరి మోడల్‌గా ఈ కొత్త బైకును భారతీయ వినియెగదారులకు అందించింది. దీని డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఇది KTM RC 390, యమహా R3 స్ట్రీట్ ఫైటర్‌లకు బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఇలాంటి టువోనో 457 బైకును మా డ్రైవ్‌స్పార్క్ టీం బెంగళూరులో టెస్ట్ డ్రైవ్ చేసింది. దానిని కొద్ది సమయం పాటు నడిపినప్పుడు మాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్ గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

అతి తక్కువ ధరకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లతో ఇది ప్రత్యర్థి సంస్థలకు పెద్ద పరేషానే!

దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనేక వాహన తయారీ సంస్థలు కొత్త కొత్త మోడళ్లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా.. ఆల్ఫా వెక్టార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టూ-వీలర్ తయారీ సంస్థ.. "నైంటీ వన్" బ్రాండ్ కింద ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంఛ్ చేసింది. "XE సిరీస్" పేరుతో దీన్ని తీసుకువచ్చింది. కిలోమీటర్‌కు 15 పైసల కంటే తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో ఉన్న ఈ కారు.. సేఫ్టీ పరంగాను 'భేష్' అనేట్లుగా ఉంది. మరి ఈ కారులో ఉండే ఫీచర్లు దీని రేంజ్ తదితర వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
Advertisement

మార్కెట్లోకి త్వరలో మరో కొత్త అవతారం.. మారుతీ ఓమ్ని స్థానాన్ని భర్తీ చేస్తుంది!

భారతదేశంలో ఒకప్పుడు మారుతీ సుజుకీ ఓమ్ని వ్యాన్ అంటే తెలియని వారు ఉండరు. చాలా మందికి ఇది ఎప్పటికీ మర్చిపోలేని వాహనంగా నిలిచిపోతుంది. రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోవడంలో దీనికి ఏది సాటిరాదు. చాలా సినిమాల్లో దీనిని విలన్లు ఎక్కువగా వాడుతుండే వారు. ప్రధానంగా కిడ్నాప్ సన్నివేశాలకు సంబంధించి ఓమ్ని వ్యాన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. దీన్ని ప్యాసింజర్ల రావాణకు మాత్రమే కాకుండా పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లే వ్యాన్‌గా, అంబులెన్స్‌గా, సరుకులను ఇతర చోట్లకు తరలించే కార్గో వ్యాన్‌గా ఇది భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నటికి చెరిగిపోని ముద్రను వేసింది. ఓమ్ని వ్యాన్ తర్వాత దాని స్థానంలో మార్కెట్లోకి చాలా రకాల వాహనాలు వచ్చినప్పటికి దేశీయ ప్రజల్లో దీనికి వచ్చినటువంటి ఆదరణను ఏ మోడల్ కూడా సంపాదించలేకపోయింది. తాజాగా ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మార్కెట్లోకి ఒక కొత్త వ్యాన్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది.

కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ లగ్జరీ కారుతో బ్యూటీఫుల్ తమన్నా

ఇండియాలో లగ్జరీ కార్లకు మంచి డిమాండ్ ఉంటుందని అమ్మకాలను చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడి ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో మూడవ అతిపెద్దది. కార్ల వాడకం దేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్ ధరలో లభించే వాటితో పాటు, కోట్లు విలువ చేసే లగ్జరీ కార్ల కొనుగోళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఖరీదు ఎక్కువ కలిగిన వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయిందంటే చాలు దాని గురించి వాకబు చేసి తమ గ్యారేజీలోకి చేర్చుకుంటారు. ఫంక్షన్లు లాంటివి ఏవైనా జరిగినప్పుడు ఆ కార్లతో కనిపిస్తూ, సోషల్‌మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంటారు. తాజాగా కోట్ల ఖరీదు చేసే ల్యాండ్ రోవర్ డిఫెండర్(land rover defender) కారుతో ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా, బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీలు కనిపించారు.

టెస్లా కారు ఇండియాలో ఏ రేటుకు అందుబాటులో ఉంటాయో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్ ఇప్పుడు అతిపెద్ద గమ్యస్థానంగా మారింది. ఇక్కడ చాలా ఈవీ తయారీదారులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. భారత్‌లో తయారైన కార్లను లోకల్ ప్రజలకు విక్రయిస్తూనే, అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయడానికి వాహన తయారీదారులు కీలకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ఎంతో ప్రసిద్ధి చెందిన దిగ్గజ కంపెనీ టెస్లా(Tesla) చాలా కాలంగా భారత్‌లో అడుగుపెట్టాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. గతంలో ఇండియాలోకి తమ కార్లను తీసుకురావడంపై పన్నుల విషయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మినహాయింపులు కోరడంతో కేంద్రం అందుకు ససేమిరా అనడంతో టెస్లా ఈవీ కార్లు భారత్‌లోకి రావడం నిలిచిపోయింది. కానీ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఈవీ నిబంధనలు టెస్లాకు కొంత అనుకూలంగా ఉండటంతో ఇక్కడ అడుగుపెట్టడానికి మార్గం సుగమం అయింది.

ఈ మారుతీ కారును గమినించారా..? ఒక రూపాయి నాణేలతో మొత్తం కప్పేశారు

ఇటీవల కాలంలో కార్లను తమ ఇష్టానికి అనుగుణంగా చిత్రవిచిత్రంగా మార్పులు చేస్తున ఓనర్లు తరుచుగా సోషల్‌మీడియాలో కనిపిస్తున్నారు. డిజిటల్ యుగంలో చిన్న సంఘటన అయిన సరే వెంటనే ప్రపంచం అంతా పాకుతుంది. తాజాగా ఒక కారును విచిత్రంగా ఒక రూపాయి నాణేలతో అతికించారు. ఇప్పుడు దీనీకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మారుతీ సుజుకీ డిజైర్ కారు మొత్తాన్ని కూడా 1 రూపాయి నాణేలతో అతికించడంతో ఇది రోడ్డుపై ప్రయాణిస్తే మెరుస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది. రాజస్థాన్‌లోని మారుతీ సుజుకీ డిజైర్ కారు ఓనర్ అందరిలాగా కాకుండా కాస్త వెరైటీగా తన కారును అలంకరించాలని సిద్దపడి 1 రూపాయి నాణేలు భారీగా పోగుచేసి దాని బాడీ మొత్తాన్ని కూడా నాణెలతో కప్పేశాడు. టైర్లను మాత్రం మామూలుగా వదిలేశాడు. ఈ కారు ఓనర్ సోషల్ మీడియాలో వైరల్ కావడానికే ఇలా చేసినట్లు తెలుస్తుంది.
Advertisement

2 లక్షలు దాటిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్.. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన కంపెనీ!

భారత ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ దూసుకుపోతోంది. తమ ఎలక్ట్రిక్ కార్ మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ సంస్థ ఈవీల అమ్మకాల్లో మరో రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఈ సంస్థ 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా.. వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చింది.‌ వినియోగదారులకు కృతజ్ఞతలు చెప్పేందుకుగాను రానున్న 45 రోజులపాటు తమ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ఆఫర్లను ఈ సంస్థ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

473 కి.మీల రేంజ్ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు డెలివరీలు స్టార్ట్

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను కస్టమర్లు ఏవిధంగా కొనుగోలు చేస్తున్నారో అందిరికి తెలిసిందే. సాంప్రదాయ పెట్రోల్, డీజిల్, CNG కార్లకు పోటీగా ఈవీల సేల్స్‌లో క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశీయ వాహన తయారీ దారులు టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో మార్కెట్లో అమ్మకాల పరంగా మంచి స్థానంలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈవీల విభాగంలో వెనుకబడి ఉన్న మారుతీ సుజుకీ సైతం ఇటీవల తన కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. వీటన్నింటికి పోటీగా హ్యుందాయ్ కూడా వరుసగా ఈవీ కార్లను విడుదల చేస్తుంది. దక్షిణ కొరియా కంపెనీ అయిన హ్యుందాయ్ దేశంలో ఇంత కాలం ICE ఇంజిన్ వాహనాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుండగా, ఇప్పుడు తన ధోరణిని మార్చుకుని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తుంది. తాజాగా కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ క్రెటా ఈవీని తీసుకువచ్చింది.

మరోసారి కారు ధర పెంచి ఝలక్ ఇచ్చిన హ్యుందాయ్… ప్రస్తుతం ఈ సెడాన్ రేటు ఎంత అంటే?

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హ్యుందాయ్ మోటార్ పేరు సుపరిచితమే! అనేక సంవత్సరాలుగా ఈ బ్రాండ్ నుంచి వస్తున్న కార్లు వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. దేశీయ కారు అమ్మకాల్లో హ్యుందాయ్ సంస్థ రెండో స్థానంలో కొనసాగుతోంది. అట్రాక్టివ్ డిజైన్స్, ఫీచర్ల కలబోతతో ఈ సంస్థ నుంచి వస్తున్న కార్లు భారత కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఇటీవల ఈ సంస్థ తమ క్రెటా, అల్కాజర్ టుక్సాన్ ఆరా మోడళ్ల ధరలను పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరో పాపులర్ సెడాన్ కారు మోడల్ 'వెర్నా' ధరను కూడా పెంచి మరోసారి ఝలక్ ఇచ్చింది.

ఈ కారులో 7 మంది కలిసి ప్రయాణించవచ్చు.. పెట్రోల్ కంటే ఎక్కువగా అమ్ముడుపోతుంది

భారతీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీదారు అయిన మహీంద్రా (Mahindra) కార్లకు దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ వాహనాల్లో ఇంజిన్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్లతో కార్లను విడుదల చేయడంలో మహీంద్రాకు మంచి పేరుంది. దేశీయంగా ఉన్న టాటా మోటార్స్, మారుతీ సుజుకీ కంపెనీలకు బలమైన పోటీదారుగా మహీంద్రా కీలక పాత్ర పోషిస్తుంది. 2024లో కంపెనీ అమ్మకాల పరంగా మెరుగైన సంఖ్యలను నమోదు చేసింది. మహీంద్రా పెట్రోల్‌తో డీజిల్ కార్లను కూడా విక్రయిస్తుంది. సాధారణంగా డీజిల్ కార్లను విడుదల చేయడం చాలా వరకు తగ్గిపోయింది. అన్ని కంపెనీలు కూడా పెట్రోల్ మోడళ్లను మాత్రమే విక్రయిస్తుండగా, మహీంద్రా మాత్రం పెట్రోల్‌తో పాటు డీజిల్ వేరియంట్‌ను విక్రయిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో కంపెనీ మంచి మార్కెట్‌ను కలిగి ఉంది.
Advertisement

మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్‌తో లాంచ్ అయిన సూపర్ స్టైలిష్ బైక్

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్స్ (honda motorcycles) ఇటీవల కాలంలో తన దూకుడును పెంచింది. 2025లో తన అమ్మకాలను పెంచుకోడానికి భారతీయ వినియోగదారుల కోసం కొత్తగా పలు బైక్‌లను తీసుకురావడానికి ప్లాన్ చేసింది. ఈ క్రమంలో హోండా తాజాగా 2025 హోండా హార్నెట్ 2.0 (2025 honda hornet 2.0) ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. అధునాతన డిజైన్‌తో, లేటెస్ట్ టెక్నాలజీని కలిగిన బైక్ కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఈ కొత్త మోడల్‌ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. హోండా ఈ బైక్‌ను రెడ్ వింగ్, బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. హార్నెట్ 2.0 ప్రారంభ ధర రూ. 1,56,953. ఇది ఎక్స్‌ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో హోండా కంపెనీకి మంచి మార్కెట్ ఉంది.

విండ్సర్ ఈవీ జయహో.. ఉత్పత్తిలో కనీవినీ ఎరుగని రికార్డ్.. ఎంజీ సంస్థకు లాభాల పంట!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. ఆనేక వాహన తయారీ సంస్థలు ఈవీలతో మార్కెట్లో పోటీ పడుతున్నాయి. స్టార్టప్ సంస్థల నుంచి దిగ్గజ సంస్థల వరకు కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే.. ఈ కంపెనీల్లో ఎంజీ సంస్థ 'తగ్గేదేలే' అంటోంది. ఈ బ్రాండ్ నుంచి ఎంజీ విండ్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కారు అమ్మకాల్లో దూసుకుపోతోంది. వరుసగా నాలుగు నెలలుగా ఈ కారు.. బెస్ట్-సెల్లింగ్ కారుగా కొనసాగుతోంది. అంతకుముందు ఈ స్థానం టాటా నెక్సాన్ ఈవీ పేరిట ఉంది. తాజాగా ఈ ఎంజీ విండ్సర్ ఈవీ కారు ఉత్పత్తి పరంగా ఓ కీలక రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలు ఈ కథనంలో పూర్తిగా చూసేద్దాం.

ఇండియాలో అత్యంత సురక్షితమైన కారు.. నమ్మకంగా తిరగండి

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో కారును కొనుగోలు చేసే వారు ప్రమాద సమయంలో రక్షణ అందించే వాటిని ఎంచుకుంటున్నారు. షోరూమ్‌కు వెళ్లినప్పుడు ముందుగా కారు లోపల ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుని తమకు నచ్చిన మోడల్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా కార్లు ఉన్నాయి. వీటిలో సేఫ్టీ ప్రమాణాలు ఉన్నప్పటికి అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుంటున్నారు. కారును కొనడానికి వెళ్ళినప్పుడు సేఫ్టీ రేటింగ్ అనేది అతి ముఖ్యమైన అంశం. అలాగే, ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఇతర ఫీచర్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో కార్ల నాణ్యతను టెస్ట్ చేయడానికి భారత ప్రభుత్వం BNCAPని ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా క్రాష్ టెస్టింగ్ ఉండగా, దానికి ఏమాత్రం తీసిపోకుండా భారత క్రాష్ టెస్ట్‌లో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం తయారీదారులు తమ కార్లను BNCAP కింద టెస్టింగ్ చేస్తున్నారు. వీటిలో వచ్చిన మంచి రేటింగ్‌ను తమ ప్రమోషన్ కోసం వాడుతున్నారు.

సౌత్ ఇండియాలో జనాలు ఎగబడి మరి ఈ కంపెనీ టూవీలర్స్ కొంటున్నారు

దేశంలో హోండా (Honda) కంపెనీకి చెందిన బైక్ లేదా స్కూటర్లను వాడని వారు ఉండటం చాలా తక్కువ. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా హోండా టూవీలర్స్ కనిపిస్తాయి. ప్రజల రోజువారీ అవసరాలకు ఉపయోగకరంగా ఉండే వాహనాలను విడుదల చేయడంలో ఇది దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుంది. తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ లేదా స్కూటర్లను ప్రజల కోసం లాంచ్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో చాలా టూవీలర్ తయారీదారులు ఉన్నప్పటికీ కూడా హోండా నుంచి వచ్చే వాటికి చాలా నమ్మకమైన మోడళ్లుగా మంచి పేరుంది. సేల్స్ పరంగా హీరో, టీవీఎస్, బజాజ్ కంపెనీల కంటే కూడా ముందు వరుసలో ఉంది. తాజాగా కంపెనీ అమ్మకాల పరంగా కీలక మైలురాయికి చేరుకుంది. దక్షిణ భారతదేశంలో ప్రజలు హోండా టూవీలర్స్‌ను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీ బైక్ లేదా స్కూటర్లు సౌత్‌లోని పలు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
Advertisement

మార్కెట్‌లో జనాలు ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే!

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అనేక వాహన తయారీ సంస్థలు.. ఈవీలతో సందడి చేస్తున్నాయి. కొత్త కొత్త మోడళ్లతో మార్కెట్లో పోటీని పెంచుతున్నాయి. ఇప్పటికీ‌ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాప్‌లో కొనసాగుతుండగా.. విదేశీ కంపెనీలు సైతం గట్టి పోటీనిస్తున్నాయి. మొత్తంగా ఈ 2025 జనవరి నెల ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల పరంగా.. మంచి ఫలితాలే అందించింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దూసుకుపోతోంది. గత ఐదు సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఈ సంస్థ తమ మోడళ్లతో వినియోగదారులకు బాగా చేరువైంది.

అదిరిపోతున్న టయోటా ఇన్నోవా ఎలక్ట్రిక్ కారు.. డిజైన్‌కు ఫిదా కావాల్సిందే!

ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీలో ఎంతో ప్రసిద్ధి చెందిన టయోటా మోటార్(Toyota Motor) వరుసగా కార్లను విడుదల చేస్తూ, అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో కూడా తన కార్లను విక్రయిస్తూ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇంత కాలం పెట్రోల్, డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తున్న కంపెనీ తాజాగా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడంపై కీలకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే మిగతా కార్ల తయారీదారులు ఈవీ విభాగంలో కార్లను విడుదల చేస్తూ దూసుకుపోతుండగా, టయోటా మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. ఇలాంటి తరుణంలో కంపెనీ రానున్న కాలంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో టయోటా ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన IIMS 2025 (ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షో)లో టయోటా తన ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది. దీనిని కాన్సెప్ట్ వెర్షన్‌ను ఈవెంట్‌లో ప్రపంచానికి పరిచయం చేశారు.

టీవీఎస్ నుంచి లాంచ్ అయిన సరికొత్త 2025 రోనిన్

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ (Tvs) ఇండియాలో బైక్స్, స్కూటర్స్‌ను విడుదల చేస్తూ, హీరో, హోండా కంపెనీలకు బలమైన ప్రత్యర్థిగా ఉంది. భారతీయ వినియోగదారుల్లో చాలా మంది ఈ కంపెనీకి చెందిన మోడళ్లను వాడుతున్నారు. టీవీఎస్ 100cc నుంచి మొదలుకుని 310cc వరకు పలు బైక్స్‌లను విక్రయిస్తుంది. గత ఏడాదిలో పలు మోడళ్లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా తన ప్రసిద్ధ మోడల్ రోనిన్‌ (Ronin)ను కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది. ఈ సరికొత్త 2025 టీవీఎస్ రోనిన్ పాత దానికంటే అధునాతనంగా ఉంటుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా పేరున్న టూవీలర్ తయారీదారులు భారతీయ వినియోగాదారులను ఆకట్టుకోడానికి పోటా పోటీగా కోత్త బైక్స్‌ను లాంచ్ చేస్తున్న తరుణంలో టీవీఎస్ తన 2025 రోనిన్ మోడల్‌తో సేల్స్ పెంచుకోనుంది.

ట్రయంఫ్ సంస్థ కీలక నిర్ణయం.. ఆ పాపులర్ ప్రీమియం బైక్‌పై భారీ ధర తగ్గింపు.. ప్రస్తుతం ఎంతంటే?

ట్రయంఫ్.. ప్రపంచ దిగ్గజ ప్రీమియం బైక్ తయారీ సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీ నుంచి వివిధ రకాల టూ-వీలర్స్ మోడళ్లు భారత మార్కెట్లో సేల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి Speed T4. ఈ బైకును వినియోగదారులకు మరింత చేరువగా చేసేందుకు ట్రయంఫ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ధరను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు రూపాయలు 2.17 లక్షలుగా ఉన్న ఈ బైక్ ధరను 1.99 లక్షలకు తగ్గించింది. మార్కెట్‌లో ఈ బైక్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. అందవల్ల వీటికి సైతం భారీ స్థాయిలో మార్కెటింగ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ బైక్ కి సంబంధించిన విశేషాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? ఈ కొత్త మోడల్‌పై లుక్కేయండి.. దీంట్లో ఫీచర్లన్నీ కిర్రాకే!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఖర్చులు కలిసి వస్తాయని చాలా మంది ఈవీలవైపు మొగ్గు చూపుతున్నారు. టూ-వీలర్ సెగ్మెంట్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాల భారత రోడ్లపై జోరుగా పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అనేక వాహన తయారీ సంస్థలు కొత్త మోడళ్లతో సందడి చేస్తున్నాయి. తాజాగా BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ.. LOEV+ పేరుతో ఓ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చింది. పట్టణ వినియోగదారులకు అనువుగా ఉండేందుకు దీన్ని రూపొందించింది. BattRE సంస్థ నుంచి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్- షోరూమ్ ధర రూ.69,999గా ఉంది.