అందరూ చూస్తుండగానే మారుతీ కారును ఈడ్చుకెళ్ళిన లారీ
ఆటోమొబైల్స్
- 1 year, 7 month, 4 days ago
భారతదేశంలో ప్రతి నిమిషం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. యాక్సిడెంట్ల కారణంగా చోటుచేసుకుంటున్న మరణాలు ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి. కొంతమంది అయితే శాశ్వత వైకల్యంతో బాధపడుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడమే. ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎన్ని సార్లు చెప్పినప్పటికీ కూడా కొంత మంది అవేమీ పట్టించుకోకుండా రోడ్లపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తున్నారు. భారీగా ఫైన్‌లను విధిస్తున్నప్పటికి కూడా ట్రాఫిక్ నియమాలను పాటించని వారు ఉన్నారు. దేశంలో ప్రస్తుతం వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. తొందరగా గమ్యానికి చేరాలనే భావనతో రాంగ్ రూట్‌లో ప్రయాణించే వారు ఇటీవల రోడ్లపై ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఇలా వెళ్తున్నప్పుడు డ్రైవర్లకు మధ్య తగాదాలు కూడా జరుగుతుంటాయి.