ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో చైనీస్ బ్రాండ్లు
ఆటోమొబైల్స్
- 1 year, 6 month, 25 days ago
ప్రపంచ వాహన పరిశ్రమలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేసేవారు, Cngలు కూడా అనుకున్నంత స్థాయిలోనే సేల్స్‌ను నమోదు చేసేవి. అయితే ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల(ev) వైపు అడుగులు వేస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి విడుదల అవుతున్న వాటిలో ఎక్కువగా ఈవీలే ఉంటున్నాయి. ప్రజలు పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా ఈవీ తయారీ సంస్ధలు ఉన్నాయి. వీటిలో దిగ్గజ కంపెనీల నుంచి మొదలుకుని పలు మధ్యస్థ స్థాయి కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చాలా సంస్థలు ఉండగా, వాటన్నింటిలో చైనా దేశాలకు చెందిన కంపెనీలు ముందంజలో ఉన్నాయి.