కొత్తగా కారు కొనేవారికి మంచి ఛాన్స్ ఇస్తున్న మహీంద్రా.. ఫ్యామిలీ కారుపై భారీ డిస్కౌంట్

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra) గురించి అందరికీ తెలిసిందే. అధునాతన కార్లను విక్రయిస్తూ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి తయారీదారులకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. గత ఏడాది భారతీయ వినియోగదారుల కోసం అదిరిపోయే మోడళ్లను తీసుకొచ్చిన కంపెనీ 2025లో కూడా పలు మోడళ్లను తీసుకురావడానికి ప్రణాళికలు చేసింది. ఇదిలా ఉంటే మహీంద్రా తన కార్ల అమ్మకాలను పెంచుకోడానికి సాధారణంగా తగ్గింపు ఆఫర్స్‌ను అందిస్తూ కస్టమర్లను తనవైపు తిప్పుకుంటుంది. ఈ క్రమంలో వారిని ఆకట్టుకోవడానికి మరోసారి తన ప్రసిద్ధ 7 సీటర్ ఎంపీవీ (MPV) కారు అయినటువంటి మారాజ్జో (marazzo)పై భారీ తగ్గింపును అందిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం కుటుంబ ప్రయాణాలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఎక్కువ మంది కలిసి ప్రయాణించే కార్లకు దేశంలో డిమాండ్ బాగా పెరిగింది.

వేలంటైన్స్ డే రోజున జర్నీ ప్లాన్ చేస్తున్నారా..? ఇదిగో ఈ టిప్స్ మీకోసమే..!

ఫిబ్రవరి 14th, వేలంటైన్స్ డే వచ్చేస్తోంది. యువత.. మరీ ముఖ్యంగా ప్రేమికులు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే తమ ప్లాన్స్ కూడా రెడీ చేసుకుని ఉంటారు. చాలా మంది ఆరోజున తమ ప్రేయసి లేదా ప్రేమికుడితో కలిసి సరదాగా గడపాలనుకుంటారు. మరికొంతమంది అదే రోజున తమ ప్రేమను అవతలి వ్యక్తితో చెబుతుంటారు. ఇందుకోసం మంచి ప్లేస్ చూసుకుని వెళ్లాలనుకుంటారు. కార్లలో లేదా బైకులపై జాలీగా వెళ్లి ఆరోజును హాయిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అక్కడే తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. మరి ఆరోజున లవర్స్ పాటించాల్సిన కొన్ని సేఫ్టీ టిప్స్ ఏంటో చూసేద్దాం.

10 చక్రాలు కలిగిన యోధుడు.. శత్రువులు భయపడి పారిపోవాల్సిందే..

ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ కార్లను తయారు చేసే ప్రముఖ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ప్యాసింజర్ వాహనాలతో పటు ఇతర అవసరాలకు ఉపయోగపడే వాటిని కూడా తయారు చేస్తుంది. ప్రస్తుతం సైనిక వినియోగానికి ఉపయోగకరంగా ఉండే ఒక ట్రక్కును తయారు చేసినట్లు సమాచారం. ఇది చాలా శక్తివంతమైనదని, అన్ని వాతావరణ కఠిన పరిస్థితులను సులభంగా తట్టుకుని సైనికులకు అన్ని విధాలుగా సహాయకరంగా ఉంటుంది. ఈ ట్రక్కు పేరు మెర్సిడెస్ అరోక్స్ 4042 AS 6X6 (mercedes arocs 4042 as 6x6). ఈ శక్తివంతమైన ట్రక్కును మెర్సిడెస్ బెంజ్ అబుదాబిలో జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ రక్షణ ప్రదర్శన అండ్ సమావేశంలో ప్రదర్శనకు ఉంచింది. ఇది కేవల సైనిక అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలుస్తుంది. ఈ ఈవెంట్‌లో వివిధ కంపెనీలకు చెందిన సైనిక , సరిహద్దు భద్రతలో వాడే వాహనాలను, ఇతర పరికరాలను ప్రదర్శనకు ఉంచారు.

బంపర్ ఆఫర్ ఇస్తున్న ఫోక్స్‌వ్యాగన్.. ఏకంగా రూ.4.20 లక్షల తగ్గింపు

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్(Volkswagen) అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మోడళ్లను విడుదల చేస్తూ మంచి మార్కెట్‌ను కలిగి ఉంది. ఇతర దేశాల్లోనే కాకుండా భారత్‌లో కూడా ఈ కంపెనీ కార్లు ఎక్కువగా కనిపిస్తాయి. పోలో అనే సూపర్‌మినీ కారును విడుదల చేసి ఆటోమొబైల్ పరిశ్రమలో అతిపెద్ద సంచలనం సృష్టించి రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. ఫోక్స్‌వ్యాగన్ నుంచి వచ్చిన టైగన్ (Taigun), వర్టస్ (Virtus) మోడళ్ల ద్వారా తన మార్కెట్‌ను దేశీయంగా నిలుపుకుని ఇతర కార్ల తయారీదారులకు పోటీగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో 2024 ఏడాదిలో మెరుగైన అమ్మకాలను సాధించిన ఫోక్స్‌వ్యాగన్ 2025లో కూడా మెరుగైన అమ్మకాలను సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంంది. అందులో భాగంగా పలు కొత్త మోడళ్లను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటిపై తగ్గింపు ఆఫర్స్ అందిస్తుంది.
Advertisement

జరిమానాతో ఝడిపించిన ట్రాఫిక్ పోలీసులు.. రూ.80 వేల స్కూటర్ పై రూ.లక్ష ఫైన్

"చారాణ కూరకు బారానా మసాలా" అనే సామెత మీరు వినే ఉంటారు. చిన్న దానికి ఎక్కువ ఖర్చు చేసిన సందర్భంలో దీన్ని వాడుతుంటారు. ఈ సామెత ఇప్పుడు ఓ స్కూటరిస్టుకు సరిగ్గా సరిపోయేలా మారింది. ఎందుకంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ వ్యక్తికి భారీ ఫైన్ పడింది. ఇలా రూల్స్ ఫాలో కాకపోతే.. ఫైన్లు ఎదుర్కోవడం కామనే అయినా.. ఇక్కడ జరిమానా అమౌంట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అది పాపం... అతడి స్కూటర్ ధరను మించిపోయి ఉంది. ఈ ఫైన్ కట్టే డబ్బులతో అతను వేరే కొత్త స్కూటర్‌ను కొనేయొచ్చు. అసలింతకీ ఏం జరిగిందంటే..

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర పెంపు.. ఎంత పెంచారంటే?

మారుతి సుజుకి సంస్థ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామీలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ కంపెనీ చాలా తక్కువ ధరలో ప్రీమియ ఫీచర్లతో కార్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ లిస్ట్‌లో ఉన్న మొట్టమొదటి కారుగా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ (Maruti Suzuki Fronx)ని చెప్పవచ్చు. ఈ కారుకి ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ మంచి డిమాండ్‌ ఉంది. ఇది బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, బ్రెజా ఎస్‌యూవీ మధ్యలో ఉండే కారుగా ఉంటుంది. ఈ కారుని జనాలు సైతం అంతే మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి డిజైన్‌ స్టైలింగ్, సరసమైన ధరలతో ఈ కారు మరింత పవర్‌ఫుల్‌గా ఉంది.

టాటా నానో ఈవీ కారు లాంచ్ అయిందా? ఇది అదేనా?

భారతదేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. అందరికీ సొంత ఇళ్లుతో పాటు, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే టూవీలర్, కారును కొనడం ప్రతి ఒక్కరి కల. టూవీలర్స్ దాదాపు అందరి దగ్గర ఉన్నప్పటికి కారు మాత్రం ఉండటం చాలా అరుదు. మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ ధరలో అయిన లభించే వాటిని కొనాలని చాలా మంది అనుకుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి కోరికను తీర్చడానికి సామాన్య ప్రజలకు ఒక టూవీలర్ కొనగలిగే ధరలోనే కారును కూడా అందించాలనే ఆశయంతో ఎప్పుడు కూడా పేద, మధ్య తరగతి ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఆలోచన కలిగి ఉండే ఇటీవల మరణించిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా గతంలో టాటా నానో కారును తీసుకొచ్చారు. కేవలం ఒక లక్ష రూపాయల ధరలో ఈ నానో కారును విడుదల చేసి ఏకంగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

సేల్స్‌లో సత్తా చాటుతున్న స్కోడా కైలాక్‌.. కనీవినీ ఎరగని రీతిలో‌ పెరిగిన అమ్మకాలు!

క్రమక్రమంగా భారతీయ కస్టమర్లను ఆకట్టుకుంటూ వారికి చేరువైన విదేశీ కార్ల తయారీ సంస్థ స్కోడా. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన కొన్ని మోడళ్లకు భారత వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ కస్టమర్ బేస్‌ను మరింత బలపర్చుకోవడంపై దృష్టి సారించిందీ సంస్థ. ఇందులో భాగంగా వినియోగదారుల కోసం కొత్త కారు మోడళ్లను లాంఛ్ చేయనుంది. వాటిని అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల విడుదలైన స్కోడా జనవరి నెల సేల్స్ రిపోర్టర్ ఈ విషయాలు వెల్లడిస్తున్నాయి. ఇక వీటి పూర్తి వివరాలు ఏంటో చూసేద్దాం.
Advertisement

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల ధరలు వచ్చేశాయ్‌.. ఏ మోడల్ ఎంతంటే?

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో అందిరికి తెలిసిందే. గత మూడు నాలుగేళ్ల నుంచి ఈవీలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా గత ఏడాదిలో ఇది మరింత పెరిగింది. సాంప్రదాయ ఇంధన కార్ల అమ్మకాలతో పాటు ఎలక్ట్రిక్ కార్స్ కూడా పోటీ పడి మరి సేల్స్‌ను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తయారీదారులు కూడా వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణండా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఇటీవల దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా కొత్తగా BE 6,XEV 9e ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చింది. అయితే వీటి ధరలను తాజాగా ఇప్పుడు ప్రకటించింది. ఈ కార్ల కోసం చాలా మంది గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇవి SUV (ఎస్‌యూవీ) కార్స్. వీటితో పాటు మహీంద్రా మరో రెండు వేరియంట్లను కూడా అదనంగా తీసుకొచ్చింది.

కారు కొనుగోలుదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్న పన్నులు.. 58శాతం దాకా ట్యాక్స్‌తో గుండెలు గుబేల్!

కారు కొనడం చాలా మందికి చిన్న నాటి కల. ఆ కల నెరవేర్చుకోవడానకి చాలా మంది ఎంతో శ్రమిస్తుంటారు. తీరా కారు కొనే సమయంలో వాటి ధరలు చూసి.. "బాబోయ్.. మాకొద్దీ కారు తంటాలు" అంటున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. దీనికిి కారణం పన్నులు. పన్నులు చేసే ఘోరాలు "ఇంతింత కాదయా" అనేలా ఉన్నాయి. ఏ వస్తువు కొన్నా సరే దానికి పన్ను కట్టడం దేశ పౌరులుగా అది అందరి బాధ్యత, అది తప్పనిసరి అంశం. అయితే.. కారు విషయానికి వచ్చేటప్పటికీ దాదాపు 58శాతం వరకు ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే మాత్రం.. చాలా మంది భారంగా ఫీలవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

సరికొత్త అడ్వెంచర్ ప్రపంచంలోకి తీసుకెళ్లే KTM బైక్స్ వచ్చేశాయ్

ప్రపంచవ్యాప్తంగా టూవీలర్ విభాగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీ కేటీఎమ్ (KTM) ప్రీమియం స్పోర్ట్స్ బైక్స్‌ను విడుదల చేస్తూ అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. ఇండియాలో బజాజ్ ఆటోతో భాగస్వామ్యంతో కలిసి అధునాతన స్పోర్ట్స్ మోడల్ తరహా బైక్స్‌లను విడుదల చేస్తుంది. మార్కెట్లో పోటీ వాతావరణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాజాగా 3 కొత్త అడ్వెంచర్ బైక్‌లను KTM లాంచ్ చేసింది. 250 (adventure) అడ్వెంచర్, 390 అడ్వెంచర్ (adventure), 390 అడ్వెంచర్ (adventure) X అనే మోడళ్లను భారతీయ వినియోగదారుల కోసం విడుదల చేసింది. ఇవి స్టైలిష్ డిజైన్‌తో యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఆస్ట్రియాకు చెందిన KTM ఇండియాలో కూడా తన ఉనికిని కలిగి ఉంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీకి పోటీగా ఇతర బైక్స్ లాంచ్ అవుతున్న నేపథ్యంలో తన మార్కెట్‌ను నిలబెట్టుకోడానికి వీటిని తీసుకొచ్చింది.

ఓలా నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ బైకు... దీనికి పోటీ ఇవ్వనున్న హీరో స్ప్లెండర్ బైకు.. వీటిలో ఏది కొంటే బెటర్‌?

ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో బెంగళూరుకు చెందిన ఈ సంస్థ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఈవీలు భారత వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సంస్థకు లాభాల్ని కూడా తెచ్చిపెట్టాయి. ఇదే జోష్‌తో ఈ సంస్థ.. రోడ్‌స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలో కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. అలాగే హీరో స్ప్లెండర్.. ఈ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్లుగా పల్లెల నుంచి పట్టణాల వరకు అందరికీ చేరువైన టూ- వీలర్. ఇప్పుడు ఓలా నుంచి ఎలక్ట్రిక్ బైకు రానున్న నేపథ్యంలో.. ఈ ఎలక్ట్రిక్ బైకుకు, చాలా మందికి ఫేవరేట్‌గా పేరుగాంచిన స్ప్లెండర్ బైకుకు మధ్య ఉన్న పోలికలు, తేడాలు ఏంటో ఈ కథనంలో చూసేద్దాం.
Advertisement

దేశంలో ఏ కారును ఎక్కువ మంది కొంటున్నారో తెలుసా..?

ప్రపంచదేశాల కంటే భారత్‌లోనే కార్ల వినియోగం భారీగా పెరుగుతుంది. ఒకప్పుడు ఇంటికి ఒక టూవీలర్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇంటికి ఒక కారు కచ్చితంగా కనిపిస్తుంది. ప్రజలు తమ రోజువారి అవసరాలకు టూవీలర్స్‌తో పాటు కార్లను కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో లభించే కార్లు అయితే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తయారీదారులు ప్రజల నుంచి వస్తున్న ఆదరణకు అనుగుణంగా కార్ల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నారు. ప్రతి నెల కూడా కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2025 జనవరి నెలలో ఇండియాలో మొత్తం 4 లక్షలకు పైగా కార్లు అమ్ముడుపోయాయి. ఇది గత ఏడాది (2024) జనవరితో పోలిస్తే మరింత ఎక్కువ. దీన్ని బట్టి దేశీయంగా కార్ల మార్కెట్ ఏ రేంజ్‌లో ఉందో తెలిసిపోతుంది.

అల్ట్రావయోలెట్‌ F77 సూపర్‌స్ట్రీట్ ఎలక్ట్రిక్ బైక్ .. ఫర్ఫామెన్స్‌ ఎలా ఉందంటే?

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు అయినటువంటి అల్ట్రావయోలెట్‌ (Ultraviolette) దేశంలో ఈవీ టూవీలర్ విభాగంలో ఎప్పుడు కూడా అమ్మకాల్లో ఇతర కంపెనీలకు గట్టి పోటీని ఇస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా అధునాతన మోడళ్లను విడుదల చేస్తున్న అల్ట్రావయోలెట్‌ తాజాగా ఇటీవల F77 సూపర్‌స్ట్రీట్ (F77 Superstreet) మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది రైడర్లకు మంచి అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనిని F77 మాక్ 2 ఆధారంగా రూపొందించారు. దానిలాగే, లుక్స్ పరంగా ఒకేలా కనిపించినప్పటికి ప్రత్యేకంగా కొన్ని అప్‌డేట్స్‌ను దీనిలొ ఇచ్చారు. రైడింగ్ పొజిషన్ రోజువారీ ఉపయోగం కోసం కొంచెం ముందుకు వంగి ఉన్నట్లు ఉంది. తాజాగా F77 సూపర్‌స్ట్రీట్ బైక్‌ను మా డ్రైవ్‌స్పార్క్ టీం బెంగళూరులో టెస్ట్ డ్రైవ్ చేసింది. దానిని కొద్ది సమయం పాటు నడిపినప్పుడు మాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్ గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది

హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?

హోండా కార్లు మార్కెట్‌లో మరితం గ్రిప్‌ పెంచుకోవడం కోసం సిటీ, అమేజ్ ఎలివేట్ SUVలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ప్రోత్సాహకాలు నగదు డిస్కౌంట్లు, బైబ్యాక్ ఆప్షన్లు, ఎక్స్‌ఛేంజ్‌, కార్పొరేట్ బెనిఫిట్స్‌తో పాటు ఏడేళ్ల వరకు పొడగించిన వారంటీలను పొందవచ్చు. ఈ ఆఫర్లు 2024, 2025 మోడళ్లకు వర్తిస్తాయని అలాగే డీలర్‌షిప్‌లలో స్టాక్ ఉన్నంత వరకే ఇవి అందుబాటులో ఉంటాయని హోండా తెలిపింది. ఈ ప్రత్యేకమైన డిస్కౌంట్లు, ప్రయోజనాలు సిటీలను బట్టి మారుతాయని కంపెనీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఆఫర్ల వివరాలు ఈ కథనంలో మీకోసం..

ఈ పాస్‌ కొన్నట్లయితే టోల్‌ ఛార్జీ లేకుండా అపరిమితంగా వెళ్ళొచ్చు

దేశంలో జాతీయ రహదారుల్లో టోల్‌ ప్లాజా నుంచి తరుచుగా ప్రయాణించే ప్రైవేట్ కార్ల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతుంది. బస్సులు, రైళ్లలో ఇచ్చినట్టుగానే ప్రైవేట్ కార్ల ఓనర్లకు ఆర్థికంగా ఉపయోగకరంగా ఉండటానికి టోల్ గేట్ నుంచి రెగ్యులర్‌గా ప్రయాణించే వారికోసం వార్షిక, జీవిత కాలపు పాస్‌లను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రముఖ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఏడాది పాస్‌కు రూ.3000, అదే 15 సంవత్సరాలు లేదా జీవిత కాల పాస్‌కు రూ.30,000 ఫీజును వసూలు చేయనున్నారని తెలస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనల గురించి చర్చలు జరుపుతుందని సమాచారం ఉంది. ఇప్పటికే ప్రతి కారులో ఫాస్ట్‌ట్యాగ్‌లను ఇచ్చినందు వలన కొత్తగా పాస్‌లు జారీ చేయాల్సిన అవసరం లేకుండా వీటిమీదే పాస్‌లను ఇచ్చే అవకాశం ఉంది.
Advertisement

భారత్ పేద దేశం కాదు! ఒక్క నెలలో ఏకంగా 4 లక్షలకు పైగా కార్లు

ఇండియాలో ప్రస్తుతం కార్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు టూవీలర్స్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరూ కూడా టూవీలర్స్‌తో పాటు కచ్చితంగా కారును కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారు. ప్రజల ఆదాయ స్థితిలో మార్పు రావడం, ముఖ్యంగా యూత్ బాగా చదువుకుని చిన్న వయసులోనే లక్షలాది రూపాయల జీతాన్ని ఆర్జించటం, కుటుంబం అంతా కలిసి బస్సులు, రైళ్లు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి వాటిల్లో ప్రయాణించడం కష్టతరం కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంత కార్లలో వెళ్ళడానికి చాలా మంది తక్కువ ధరలో, లేదా స్థోమతను బట్టి మరింత ఎక్కువ ధరలో అయిన లభించే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రోడ్డుపై రోజురోజుకూ కార్ల సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో జనాభా పెరుగుతున్నంత వేగంగా కార్ల కొనుగోళ్ళు కూడా బాగా పుంజుకుంటున్నాయి.

జనవరి నెలలో ఇరగదీసిన మహీంద్రా.. టాటా, హ్యూందాయ్‌లకు ముచ్చెమటలు పట్టించేలా సేల్స్!

దేశీయ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా... భారత మార్కెట్లో 'తగ్గేదేలే' అన్నట్లుగా దూసుకుపోతోంది. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ.. తమ కార్ల విక్రయాల్లో జోరు చూపెడుతోంది. ప్రతి నెలా విడుదలయ్యే కార్ల సేల్స్ రిపోర్ట్‌లో ఎప్పుడైనా సరే మారుతీ సుజుకీ సంస్థ అగ్రస్థానంలో కనిపిస్తుంటుంది. అయితే రెండు, మూడు స్థానాల కోసం మాత్రం హ్యూందాయ్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలు పోటీ పడుతుంటాయి. 2025 జనవరి నెల సేల్స్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే... 2.12 లక్షల యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ సంస్థ ఎప్పటిలానే అగ్రస్థానంలో కొనసాగింది. అయితే.. ఈసారి అనూహ్యంగా మహీంద్రా సంస్థ ఆ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ విశేషాలు తదితర అంశాలను ఈ కథనంలో పూర్తిగా చూసేద్దాం.

ఇక పెట్రోల్ బైక్స్‌కు గుడ్‌బై..! ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది

రైడ్ షేరింగ్ కంపెనీగా మొదలై అంచెలంచెలుగా ఎదిగి ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ విభాగంలో టాప ప్లేస్‌లో ఉన్నటువంటి ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) దేశంలో మరో సంచలన ఆవిష్కరణ చేసింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బైక్‌ను తాజాగా విడుదల చేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఈ కొత్త మోడల్ పేరు 'ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ (Ola Roadster X)'. ఈ బైక్ రాకతో దేశంలో సాధారణ పెట్రోల్ బైక్‌లకు గట్టి పోటీ తప్పేలా లేదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసి ప్రజల చూపును తన వైపు తిప్పుకునేలా చేసుకుంది. రోడ్‌స్టర్ ఎక్స్ ఎంట్రీ లెవల్ ధర రూ.74,999. ఇది ఎక్స్ షోరూమ్ ధర.

దేశంలో బాగా డిమాండ్ ఉన్న కారు ధరను భారీగా పెంచిన హోండా

భారత్‌లో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ కార్లను కొనుగోలు చేసే వారితో పోలిస్తే, తక్కువ ధరలో లభించే బడ్జెట్ కార్లు ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి. దీంతో ఆటోమొబైల్ తయారీదారులు కూడా ఇలాంటి కార్లను అత్యధికంగా మార్కెట్లోకి విడుదల చేస్తుంటారు. ప్రధానంగా భారత్‌లో మారుతీ సుజుకీ కంపెనీ బడ్జెట్ వినియోగదారుల కోసం కార్లను తీసుకువస్తుంది. దీనికి పోటీగా హోండా(Honda) కూడా బడ్జెట్ ధరలో పలు మోడళ్లను విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో హోండా నుంచి అమేజ్ కారు మార్కెట్లోకి వచ్చింది. ఇది అన్ని వర్గాల వారు కొనగలిగే విధంగా అందుబాటు ధరలోనే లభిస్తుంది. ముఖ్యంగా ఇండియాలో కాంపాక్ట్ సెడాన్ విభాగంలో తోపు మోడల్ అయిన మారుతీ సుజుకీ డిజైర్‌కు ఈ హోండా అమేజ్ (Honda Amaze) అతిపెద్ద ప్రత్యర్థిగా ఉంది. ఈ కారుకు దేశంలో మంచి ఆదరణ ఉంది.
Advertisement

టాటా మోటార్స్‌కు ఝలక్ పుట్టించిన జనవరి నెల!.. సేల్స్ రిపోర్ట్‌లో ఏం ఉందంటే!

భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ పేరు ప్రత్యేకం. ఎన్నో ఏళ్లుగా భారతీయ వినియోగదారులను తమ వాహనాలతో ఆకట్టుకుంటూ వస్తోంది. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరికీ సరపడే వాహనాలతో వినియోగదారులకు చేరువైంది. అయితే ఈ ఏడాది జనవరి నెలలో ఈ సంస్థకు కష్టకాలం కొనసాగింది. గతనెలలో 78,159 యూనిట్ల వాహనాలను అమ్మినప్పటికీ ఇయర్- ఆన్- ఇయర్ సేల్స్ పరంగా మాత్రం ఇది 7 శాతం పడిపోయింది. ఇక ఈ సంస్థ అమ్మకాలు జనవరి నెలలో ఏ విధంగా కొనసాగాయో ఈ కథనంలో చూసేద్దాం.

ఏకంగా టాటాకే షాక్ ఇచ్చిన హ్యుందాయ్.. ఇక తగ్గేదేలే అంటుంది

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai)కి అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా మంచి మార్కెట్ ఉంది. దేశంలో ప్రస్తుతం అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా మారుతీ సుజుకీ ఉంటుంది. దాని తరువాత హ్యుందాయ్ నిలుస్తుంది. అధునాతన ఫీచర్స్, సరికొత్త డిజైన్లతో మార్కెట్లోకి అదిరిపోయే కార్లను విడుదల చేస్తూ హ్యుందాయ్ తన వ్యాపారాన్ని ఢిల్లీ నుంచి గల్లి వరకు కూడా విస్తరిస్తోంది. అంతటి ప్రసిద్ధి చెందిన కంపెనీ తాజాగా తన కార్ల సేల్స్ వివరాలను వెల్లడించింది. 2025 జనవరిలో హ్యుందాయ్ ఈ విషయంలో దేశీయ మరో అతిపెద్ద కంపెనీ అయిన టాటా మోటార్స్‌ను అధిగమించి రెండో స్థానంలో నిలవడం గమనార్హం. భారత్‌లో తన మార్కెట్‌ను పెంచుకోవడానికి ఎంతో కాలంగా తీవ్రంగా కృషి చేస్తున్న హ్యుందాయ్‌ జనవరిలో మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది.

సేల్స్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న హ్యూందాయ్.. అందరూ ఈ కారే కోరుకుంటున్నారు!

భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో దిగ్గజ వాహన తయారీ సంస్థ హ్యూందాయ్.. అందరికీ సుపరిచితమైన బ్రాండ్. తమ వాహనాలతో భారత కస్టమర్లకు ఎంతో చేరువైందీ సంస్థ. ఈ సంస్థ నుంచి వచ్చిన క్రెటా ఎస్‌యూవీ అయితే చాలా మందికి ఫేవరేట్ కారుగా పేరు సంపాదించింది. వినియోగదారులను ఆకట్టుకుంటూ ఈ కంపెనీకి మంచి లాభాల్ని తెచ్చిపెడుతోంది. 2025 జనవరి నెల అమ్మకాల్లో ఈ క్రెటా కారు కొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఒక్కనెలలోనే దీన్ని 18,522 మంది కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్ల అమ్మకాలు ఇప్పటివరకు ఎలా కొనసాగాయో చూసేద్దాం.

ఓలా నుంచి అధికారికంగా ఎలక్ట్రిక్ బైక్‌ వచ్చేస్తుంది.. వెంటనే షోరూమ్‌కి పరుగెత్తండి!

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో ఓలా సంస్థ దూసుకెళ్తుంది. ఏ కంపెనీకి అందని రేంజ్‌లో స్కూటర్ మార్కెట్‌ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఇప్పటికే దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. పెట్రోల్‌తో నడిచే బైకులకు సైతం ఈ కంపెనీ గట్టి పోటీని ఇస్తుంది. కేవలం తక్కువ రోజుల్లోనే ఈవీ టూవీలర్స్‌కి ఓలా కేరాఫ్ అడ్రస్‌గా అవతరించింది. ఈ కంపెనీ స్కూటర్‌ మార్కెట్‌లో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇదే జోష్‌లో ఇప్పటికే చాలా తక్కువ ధరలో మోటార్‌సైకిల్స్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హీరో స్ప్లెండర్ వంటి కమ్యూటర్ మోటార్ సైకిళ్లతో పోటీ పడేందుకు ఇప్పుడు చాలా తక్కువ ధరకే మోటార్‌సైకిల్స్‌ని ప్రవేశపెట్టనుంది.
Advertisement

రూ.కోటి కారు ముందు మెరిసిన బాలీవుడ్ బ్యాటీ... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

లగ్జరీ కార్లకు పెట్టింది పేరు విదేశీ దిగ్గజ సంస్థ మెర్సిడెస్ బెంజ్. ఈ సంస్థ కార్లు వాడుతున్నవారికి నలుగురిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అంతలా ఈ కారు తన బ్రాండ్ వ్యాల్యూని ఏర్పాటు చేసుకుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన మెర్సిడెస్- బెంజ్- ఇ- క్లాస్(Mercedes-Benz E-Class) కారు... లగ్జరీ ఫీచర్లతో వినియోగదారులకు చేరువైంది. సెలబ్రెటీలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఈ కారుతో కనిపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ ఈ కారుతో తళుక్కున మెరిసింది. ఆమె ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.