గత కొన్ని నెలలుగా విండ్సర్ కారును అందరు తెగ కొంటున్నారు
ఆటోమొబైల్స్
- 1 year, 7 month, 12 days ago
భారతదేశం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో లేని సానుకూలతలు భారత్‌లో ఉండటం కారణంగా అంతర్జాతీయ కంపెనీలు మన దగ్గరే ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. భారత్ ఈవీ భవిష్యత్తుకు అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా గత ఏడాది అమ్మకాలను చూసినట్లయితే గతంలో కంటే కూడా 2024లో ఈవీ సెగ్మెంట్‌లో అన్ని వాహనాల విక్రయాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త మోడళ్ల రాక ఎక్కువ అయింది. దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటా పోటీగా అధునాతన కార్లను లాంచ్ చేస్తూ తమ మార్కెట్‌ను వేగంగా విస్తరించుకుంటున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ కార్ల తయారీ దారు అయిన ఎంజీ (MG) కూడా ఈవీలను విడుదల చేస్తూ తన సత్తాను చాటుకుంటుంది. గతంలో తీసుకొచ్చిన విండ్సర్ (windsor) అమ్మకాల పరంగా దుమ్ములేపుతుంది.