రూ.కోటి కారు ముందు మెరిసిన బాలీవుడ్ బ్యాటీ... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
ఆటోమొబైల్స్
- 1 year, 7 month, 19 days ago
లగ్జరీ కార్లకు పెట్టింది పేరు విదేశీ దిగ్గజ సంస్థ మెర్సిడెస్ బెంజ్. ఈ సంస్థ కార్లు వాడుతున్నవారికి నలుగురిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అంతలా ఈ కారు తన బ్రాండ్ వ్యాల్యూని ఏర్పాటు చేసుకుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన మెర్సిడెస్- బెంజ్- ఇ- క్లాస్(Mercedes-Benz E-Class) కారు... లగ్జరీ ఫీచర్లతో వినియోగదారులకు చేరువైంది. సెలబ్రెటీలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఈ కారుతో కనిపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ ఈ కారుతో తళుక్కున మెరిసింది. ఆమె ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.