కొండల్లో కూడా చొచ్చుకుపోయే డుకాటి డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ బుకింగ్స్ స్టార్ట్

దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ డుకాటి ఇండియా (Ducati India) సరికొత్త బైక్స్‌లను విడుదల చేయడంలో ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లోకి పలు మోడళ్లను లాంచ్ చేసి మెరుగైన అమ్మకాలను నమోదు చేయగా, కంపెనీ ఈ కొత్త ఏడాదిలో కూడా అధునాతన బైక్స్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. 2025లో డుకాటి నుంచి వచ్చే మోడళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా కంపెనీ మంచి శుభవార్త చెప్పింది. డుకాటి ఇండియా కొత్తగా డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ (desert-x-discovery) అనే బైకును విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను ఇటీవల ప్రారంభించింది. చాలా కాలంగా డుకాటి నుంచి ఎప్పుడు కొత్త బైక్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న వారికి ఇది పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. ఈ బైక్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

కారు ముందు బోల్డ్ లుక్స్‌తో మెరిసిపోయిన బాలీవుడ్ భామ.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

బాలీవుడ్ తారలు కార్ల కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. నచ్చిన కార్లను అవసరమైతే విదేశాల నుంచి తెప్పించుకుని వాడుతుంటారు. అయితే కొందరు నటులు మాత్రం.. విదేశీ కార్లకంటే భారత్‌లో తయారైన కార్లపై ఇంకా ఎక్కువ స్థాయిలో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ కంగనా శర్మ మహీంద్రా XUV 7OO కారుతో కనిపించి కనువిందు చేసింది. హాట్ లుక్స్‌తో ఉన్న ఈ బ్యూటీ ఈ కారు ముందు మరింత మెరిసిపోయి కనిపించింది. కంగనాను ఆమె కారును చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపెట్టారు. కారుతో కనిపించిన ఈ భామ ఫొటోలు తీసుకుని మురిసిపోయారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విడుదలకు ముందే 30,000 ప్రీ-బుకింగ్స్.. వెరైటీ ఎలక్ట్రిక్ ఆటోకారుకు డిమాండ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. దిగ్గజ సంస్థల నుంచి మొదలకుని పలు స్టార్టప్ కంపెనీల నుంచి అదిరిపోయే మోడళ్లు మార్కెట్లోకి వరుసగా విడుదల అవుతున్నాయి. గత ఏడాదిలో చాలా ఈవీలు మార్కెట్లో సందడి చేశాయి. 2024 ఏడాదిలో మొత్తం వాహనాల సేల్స్‌లో ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన అమ్మకాలు కూడా మెరుగ్గానే నమోదు అయ్యాయి. ఇప్పుడు ఈ కొత్త ఏడాది 2024లో కూడా అంతకంటే ఎక్కువ ఈవీలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రపంచపు అతిపెద్ద ఆటోమొబైల్ ఈవెంట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో పలు ఈవీ తయారీదారులు తమ మోడళ్లను ప్రదర్శించారు. ఇవి చాలా వరకు అందిరిని ఆకట్టుకునే డిజైన్లతో అధునాతన ఫీచర్స్‌తో ఉన్నాయి. ఎంజీ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు తమ ఈవీలను ప్రదర్శించాయి.

టాటా జెండా మళ్లీ ఎగరబోతోంది.. అందిరికి ఇష్టమైన ఈవీ కారు కొత్తగా రాబోతుంది

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్(tata motors) సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల(EV)ను కూడా విడుదల చేస్తుంది. గతంతో పోలిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువ అయింది. ఇప్పటికే ఇతర కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో సరికొత్త కార్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తుండగా, వాటి నుంచి వచ్చే పోటీని తట్టుకుని నిలబడటానికి టాటా కంపెనీ మరింత ముందడుగు వేస్తూ, అధునాతన ఫీచర్స్‌తో కూడిన కార్లను విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఈవీలలో టాటా కంపెనీ టాప్ ప్లేస్‌లో ఉంది. కంపెనీ పలు ఈవీలను విక్రయిస్తుండగా, వాటిని మరింత అప్‌డేట్ చేస్తూ మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలో భారతీయ ప్రజల్లో అత్యంత డిమాండ్ కలిగిన నెక్సాన్(Nexon) కారును గతంలో టాటా ఎలక్ట్రిక్(EV) వెర్షన్లో తీసుకువచ్చి అందరిని ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.నెక్సాన్ ఈవీ లాంచ్ అయిన తక్కువ కాలంలోనే చాలా మంది వినియోగదారులకు చేరువ అయింది.
Advertisement

మార్కెట్‌ను షేక్ చేసే ప్లాన్స్‌తో వస్తున్న హోండా.. విదేశాల్లో పాపులర్ అయిన కారుతో భారత్‌లోకి ఎంట్రీ..!

జపాన్‌కు చెందిన ఆటో మొబైల్ సంస్థ హోండా.. భారత్‌లో బాగా ఫేమస్ అయిన బ్రాండ్. తమ వాహనాలతో ఎన్నో ఏళ్లుగా వినియోగదారుల మనసు దోచుకుంటూ వస్తోంది. ఈ సంస్థ నుంచి వచ్చిన హోండా సిటీ, సివిక్‌, అమేజ్ వంటి సెడాన్ కార్లతో భారత కస్టమర్లకు బాగా చేరువైంది. వీటితో ఈ సంస్థ లాభాల్ని కూడా ఆర్జించింది. ఆ తర్వాత హోండా.. ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా.. 'ఎలివేట్' పేరుతో ఒక మిడ్-సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఒకప్పుడు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నవి కారు ఇప్పుడు.. డీలా పడ్డట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. కొత్త కార్లను భారత మార్కెట్లోకి తీసుకువచ్చి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం.

స్విఫ్ట్‌ కారుకి యాక్సిడెంట్‌.. బిల్డ్‌ క్వాలిటీని మెచ్చుకుంటున్న జనాలు!

మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న కార్లు సేఫ్టీలో ఏమాత్రం సురక్షితం కాదని జనాల్లో ఓ భావన ఉంది. అయితే వాటిని పటాపంచలు చేస్తూ ఆ సంస్థ మారుతి సుజుకి డిజైర్‌ని అత్యున్నత ప్రమాణాలతో తీసుకువచ్చింది. మారుతి నుంచి ఈ కారు తొలిసారి సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌ని సాధించింది. ఈ విషయం కాసేపు పక్కన పెడితే దీనికి బ్రదర్‌ కారుగా పిలుస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 2024 సుజుకి స్విఫ్ట్‌ ఏమాత్రం చెక్కుచెదరలేదు. పెద్ద ఇటుకలు కారుపై పడినా ఏమాత్రం డ్యామేజీ జరగలేదు. ఈ విజువల్స్‌ ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆ యాక్సిడెంట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

నీ సాహసానికి దండాలు.. హైవేపై ఆ ఫీట్లు ఏంటి గురూ! రోడ్డు మీదకు ట్రెయిన్ వచ్చిందా అనేటట్టు!

జర్నీ మధ్యలో కారు చెడిపోయినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? రోడ్డు పక్కన కారును ఆపి, ఎవరినైనా సహాయం కోసం పిలుచుకొస్తాము. దాన్ని సరిచేపిస్తాం. మరి ఆ కారు గ్యారేజీకి తీసుకువెళ్తేనే పరిష్కారం అవుతుందంటే..? ఇక ఆ చెడిపోయిన కారునే అక్కడకు తీసుకువెళ్లక తప్పదు. అలాంటప్పుడు.. మరొక కారుతో కట్టి దాన్ని లాగి తీసుకువెళ్తుంటాం. ఇది ఇండియాలో అంతటా జరిగేదే! హైవేలపై ఇలాంటి దృశ్యాలు తరచుగా కనిపిస్తుంటాయి. అయితే.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఒక కారుకు ఇంత బలం ఉంటుందా అని అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 'ఇది పెద్ద సాహసమే' అని నోరెళ్లబెట్టేలా చేస్తోంది. అసలింతకీ అందులో ఏముందంటే..?

ముంబైలో పెట్రోల్-డీజిల్ వాహనాల యజమానులకు షాకింగ్ న్యూస్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే విషపూరిత వాయువుల ద్వారా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అయింది. దీంతో మనుషులు స్వచ్చమైన గాలిని పీల్చుకోవడం చాలా కష్టతరం అవుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో జనాభా ఎక్కువగా కావడం వలన సొంత వాహనాల వాడకం పెరిగిపోయి వాయు కాలుష్యం పెరుగుతుంది. ప్రధానంగా భారత్‌‌లో వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ముంబై నగరంలో ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో వాహనాలు రోడ్లపై నడుస్తుంటాయి. దీంతో వాటి నుంచి వెలువడే విషపూరిత వాయువుల కారణంగా ముంబై మహానగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై మెట్రోపాలిటన్ ఏరియాల్లో పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకంపై నిషేధం విధించి ఎలక్ట్రిక్, CNG వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి సాహసోపేతమైన చర్య తీసుకుంది.
Advertisement

స్కోడా కొత్త కారులో సేఫ్టీ ఎంత మేరకు..? ఈ యాక్సిడెంట్‌తో కాస్త క్లారిటీ దొరికినట్లే!

కారు సేఫ్టీ విషయంలో వినియోగదారులకు అవగాహన పెరుగుతోంది. కారు కొనుగోలు చేసేటప్పుడు ధర, మైలేజీ వంటి వాటితో పాటు దాని సేఫ్టీ గురించి కూడా ఆరా తీస్తున్నారు. సేఫ్టీ రేటింగ్‌లో డీలా పడ్డ కార్ల విక్రయాలు చాలా వరకు తగ్గిపోతుండడం ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. అయితే.. దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ స్కోడా.. కైలాక్ పేరుతో కొత్త ఎస్‌యూవీ మోడల్‌ను ఇటీవల లాంఛ్ చేసింది. ఈ కారు లాంఛ్ చేసిన కొన్ని గంటల్లోనే 10 వేల బుకింగ్స్ సాధించింది. ఈ కారు భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించింది. అయితే.. డెలివరీ ప్రారంభించక ముందే ఈ కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే...?

KTM లవర్స్ ఇక ధైర్యంగా ఉండండి.. అదిరిపోయే కొత్త స్టన్నింగ్ బైక్ వస్తుంది

భారత్‌లో స్టైలిష్ స్పోర్ట్స్ మోడల్ తరహా బైకులకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. సాధారణ టూవీలర్స్‌తో పోలిస్తే ఇవి మెరుగైన ఇంజిన్ పనితీరును కలిగి ఉంటాయి. దేశంలోని చాలా టూవీలర్ తయారీ మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకుని నిలబడటానికి అధునాతన ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్లతో స్టైలిష్ మోడల్ బైక్స్‌లను విడుదల చేస్తున్నారు. ఇలాంటి మోడళ్లను తయారు చేసి విడుదల చేయడంతో ప్రముఖ కంపెనీ కేటీఎమ్ (Ktm) చాలా ప్రసిద్ది చెందింది. అంతర్జాతీయంగా కూడా ఇది మంచి మార్కెట్‌ను కలిగి ఉంది. ప్రపంచ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందిన తన మోడళ్లను ఇండియాలో కూడా విడుదల చేస్తూ ఇక్కడి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కేటీఎమ్ బైక్స్ ఇండియాలో నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు ఈ బైక్స్ పెట్టింది పేరు. వీటి డిజైన్ చూడగానే ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్‌గా అనిపించేలా ఉంటాయి.

మన కారును జపాన్ వాళ్లు తీసుకుంటున్నారు.. సరికొత్త పేరుతో అక్కడ విక్రయం..

దేశీయ అతిపెద్ద వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియాలో ప్రతి ఏడాది వాహనాల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరల్లో కార్లను విడుదల చేస్తూ, ఇతర వాహనాల తయారీ కంపెనీల కంటే ముందు స్థానంలో ఉంది. లోకల్‌గా కార్లను విక్రయిస్తూ అంతర్జాతీయంగా కూడా ఇతర దేశాలకు కూడా తన మోడళ్లను ఎగుమతి చేస్తుంది. ఆఫ్‌రోడ్ కింగ్ అయినటువంటి మారుతీ 3-డోర్ జిమ్నీ (3-Door Jimny) కారును ఇక్కడే తయారు చేయడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసింది. ఆ తరువాత 2023లో 3-డోర్ వెర్షన్‌ను మరింత అప్‌డేట్ చేసి 5-డోర్ జిమ్నీని తీసుకొస్తామని ప్రకటించగా, తన మాటను కూడా నిలబెట్టుకుంది. భారత్‌లో ఈ మోడల్‌కు అంతగా ఆదరణ లభించలేదు. ప్రధానంగా మహీంద్రా థార్ కారణంగా జిమ్నీని తక్కువ కొనుగోలు చేశారు.

ఆనంద్ మహీంద్రాకు నచ్చిన ఈ వెరైటీ కారు.. మహా కుంభమేళాలో పాపులర్ అయిన దంపతులు!

ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా... సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన విభిన్న వీడియోలను, ఫొటోలను 'ఎక్స్' వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఆయన పోస్ట్ చేసిన తర్వాత వైరల్‌గా మారిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఓ కన్నడ జంట కూడా చేరిపోయింది. కర్ణాటకకు చెందిన ఈ భార్యాభర్త.. తమ టయోటా ఇన్నోవా ఎంపీవీని ఒక ఇల్లు (మొబైల్ హోమ్)గా మార్చేశారు. హాయిగా అందులో నివసిస్తూ నచ్చిన ప్రాంతానికి వెళ్తున్నారు. మహాకుంభమేళాలో కనిపించిన ఈ కపుల్స్ పాపులర్ అయిపోయారు. వీరి ఇంటర్వ్యూ కోసం కూడా మీడియా ఛానెల్స్ ఎగబడుతున్నాయి. అసలు వీళ్లకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? వీళ్ల ప్లాన్స్ ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
Advertisement

‘జూమ్ జూమ్' అంటూ వచ్చేసిన కొత్త స్కూటర్.. ఇది యూత్‌కి ఫేవరేట్ అయిపోద్దంతే!

భారత టూ- వీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్ సంస్థ పేరు అందరికీ సుపరిచితమే! ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థ వాహనాలు భారతీయుల మనసు దోచుకుంటున్నాయి. ఈ సంస్థ నుంచి 'స్ప్లెండర్' బైకు అయితే.. పల్లెల నుంచి పట్టణాల దాకా అందరికీ చేరువైంది. ఈ సంస్థ నెమ్మదిగా స్కూటర్ సెగ్మెంట్‌లోనూ తన మార్క్ చూపెడుతూ వస్తోంది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తమ బ్రాండ్ నుంచి ఓ కొత్త స్కూటర్‌ను లాంఛ్ చేసి ఆకట్టుకుంది. అదే 'Xoom 160' స్కూటర్. బైకు కంటే తక్కువ, రెగ్యులర్ స్కూటర్ కంటే ఎక్కువ అనేటట్లు ఉన్న ఈ స్కూటర్‌ను అధునాతన ఫీచర్లు జోడించి, అదిరే లుక్‌లో తీసుకువచ్చింది హీరో సంస్థ. మరి ఈ స్కూటర్‌లో ఉన్న ఇతర ఫీచర్లు, ధర వంటి విశేషాలేంటో చూసేద్దాం.

టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి ఎందుకు తొక్కిస్తారో తెలుసా? దీని వెనుక అసలు రహస్యం ఇదే!

భారతదేశంలో సంస్కృతి, సాంప్రదాయాలకు అత్యంత విలువనిస్తారు. ప్రతి హిందువు కూడా జాతకం, జ్యోతిష్యంపై నమ్మకం కలిగి ఉంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే సమయంలో లేదా వస్తువులను కొనుగోలు చేసే సమయంలో అయినా కచ్చితంగా మంచి శుభముహుర్తం చూసుకుని పనులు మొదలుపెడతారు. అందరు కూడా దేశంలో ఆచారాలను నియమ నిష్టలతో పాటిస్తుంటారు. ముఖ్యంగా కొత్త వాహనాలను మొదటగా నడిపే సమయంలో టైర్ల క్రింద నిమ్మకాలను కచ్చితంగా ఉంచుతారు. ఈ ఆచారం ఇప్పటిది కాదు. పురాతన కాలంగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొత్తగా బైక్ లేదా కార్స్, ఇతర వాహనాలను నడిపినప్పుడు లేదంటే ఎక్కడికైన దైవ దర్శనాలు, దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ముందుగా టైర్ల క్రింద నిమ్మకాయలను ఉంచి వాటిని తొక్కించిన తరువాతనే వాహనాలను నడుపుతారు.

క్రెటా ఈవీతో సై అంటున్న హ్యూందాయ్.. బీఈ 6తో కాలు దువ్వుతున్న మహీంద్రా.. ఈ ఈవీల మధ్య పోటీ గట్టిగానే!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థలైన హ్యూందాయ్, మహీంద్రా.. భారతీయ వినియోగదారులకు సుపరిచితమే! ఈ రెండు సంస్థల నుంచి వచ్చిన కార్లలో చాలా మోడల్స్.. వినియోగదారులకు ఫేవరేట్ కార్లుగా పేరు సంపాదించాయి. ఇప్పుడు దేశంలో ఈవీల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ సంస్థలు ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి అడుగు పెట్టాయి. హ్యూందాయ్ సంస్థ తమ బెస్ట్- సెల్లింగ్ ఎస్‌యూవీ అయిన క్రెటాను ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన క్రెటా ఈవీని తీసుకువచ్చింది. మహీంద్రా సంస్థ నుంచి అట్రాక్టివ్ లుక్స్‌లో బీఈ 6 పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్‌ చేసింది. ఈ రెండు కార్లు ఒకదానికికొకటి గట్టి పోటీనిచ్చేలా ఉన్నారు. మరి ఈ ఈవీల మధ్య ఉండే పోలికలేంటి? వీటి బ్యాటరీ, రేంజ్, పర్ఫార్మెన్, ధర ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రపంచదేశాల్లో సక్సెస్ అయిన హైబ్రిడ్ కారు ఇకపై ఇండియాలో

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా (Honda) భారత్‌లో మంచి మార్కెట్ కలిగి ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఇతర కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి తయారీదారుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి రానున్న రోజుల్లో హోండా కొత్త కార్లను విడుదల చేసే ఆలోచనలో ఉంది. దీనిలో భాగంగా కంపెనీ ZR-V హైబ్రిడ్ మోడల్‌ను త్వరలోనే లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కారు లాంచ్‌తో హోండా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో తన పట్టును సాధించాలని చూస్తుంది. ఈ కొత్త కారుకు సంబంధించి కంపెనీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికి రానున్న రోజుల్లో ఇది మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీలకు భారత్‌లో మంచి ఆదరణ ఉంటుంది.
Advertisement

రికార్డు స్థాయిలో బుకింగ్స్ సాధించిన కియా సైరోస్‌ను కొనచ్చా?

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియో మోటార్స్ ఇండియాలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే దేశంలోని టాప్ వాహన తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో వరుసగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ తన మార్కెట్‌ను క్రమంగా విస్తరిస్తుంది. ఇప్పటికే కంపెనీ B-సెగ్మెంట్ SUV మార్కెట్లో సబ్-4-మీటర్ సోనెట్, సెల్టోస్‌లను తీసుకొచ్చింది. తాజాగా కియా దేశీయ వినియోగదారులను ఆకట్టుకోడానికి సైరోస్ (syros) ఎస్‌యూవీని ఆవిష్కరించింది. 2024 ఏడాది డిసెంబర్ 19వ తేదీని కియా తన 'సైరోస్' ఘనంగా ప్రపంచానికి పరిచయం చేసింది. తాజాగా ఈ ఎస్‌యూవీని మా డ్రైవ్‌స్పార్క్ టీం టెస్ట్ డ్రైవ్ చేసింది. ఈ కారు నడిపిన సమయంలో మాకు అనిపించి ఎక్స్‌పీరియన్స్ గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది

కేక పెట్టించే లుక్స్‌లో టాటా కొత్త ఎస్ యూవీ.. ధర కూడా తక్కువే.. చూస్తే ఇప్పుడే కొనేయాలనుకుంటారు!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ మరో కొత్త మోడల్ కారుతో భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ సంస్థ నుంచి గతంలో వచ్చిన నెక్సాన్ ఎస్‌యూవీ భారత వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. దీని డైజన్, ఫీచర్లతో అందరికీ చేరువైంది. అందుబాటు ధరలో ఈ కారు ఉండడంతో సేల్స్ పరంగానూ ఈ కారు టాటా సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ఇందులో ఇప్పుడు కొత్త మోడల్‌ను తీసుకువచ్చిందీ సంస్థ. ఇటీవల జరిగిన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో 'Nexon CNG Red Dark Edition' పేరుతో దీన్ని ప్రదర్శించగా... సోమవారం దీన్ని లాంఛ్ చేసింది. ఈ కారులో ఉండే ఫీచర్లు, దీని పర్ఫార్మెన్స్, మైలేజీ, ధర వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.

ముందు రెండు చక్రాలు, వెనకాల ఒక చక్రంతో రానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఇది ఈవీల్లో పక్కా గేమ్ ఛేంజర్!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. స్టార్టప్‌ల నుంచి మొదలుకుని దిగ్గజ సంస్థల వరకు ఈవీల తయారీలో జోరు పెంచుతున్నాయి. మరోవైపు.. వినియోగదారులు అందుబాటు ధరలో ఉండే హై-ఎండ్ ఈవీ మోడల్స్ కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో Gensol EV అనే ఓ వాహన తయారీ సంస్థ.. సరికొత్త వాహనాలతో మార్కెట్లోకి రాబోతోంది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ సంస్థ ఓ 3- వీలర్‌ను ఆవిష్కరించింది. దీంట్లో కేవలం రెండు సీట్లే ఉన్నాయి. మరో కార్గో మోడల్‌ను కూడా తీసుకురాబోతోంది. మరి ఈ ఈవీలో ఉన్న ఇతర ఫీచర్లేంటో చూసేద్దాం.

దేశంలోనే అందరి ఫేవరెట్ కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ స్టార్ట్

ఇండియాలో సాంప్రదాయ పెట్రోల్, డీజిల్, cng వాహనాల వాడకం క్రమంగా తగ్గుముఖం పట్టేలా ఉంది. వీటికి ప్రత్నామ్యాయంగా ఎలక్ట్రిక్ కార్స్ సందడి చేస్తున్నాయి. కొత్తగా కార్లను కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న చాలా మందిలో ఎక్కువగా ఈవీలను సొంతం చేసుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ బ్యాటరీ రేంజ్, ఫాస్ట్ ఛార్జ్ కలిగిన మోడళ్ల గురించి మార్కెట్లో తెలుసుకుని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లలో ఈవీలపై మంచి ఆదరణ ఉండటంతో తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ మోడళ్లను విడువల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే దేశీయంగా, అంతర్జాతీయంగా దిగ్గజ వాహన కంపెనీలుగా ఉన్నటువంటి టాటా మోటార్స్, హ్యుందాయ్, ఇతర విదేశీ సంస్థలు అధునాతన బ్యాటరీలతో కూడిన కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉన్న మారుతీ సుజుకీ (Maruti Suzuki) మాత్రం ఇంకా వెనుకబడి ఉంది.
Advertisement

రెండున్నరేళ్లలో 5 లక్షల సేల్స్ సాధించిన రాయల్ ఎన్‌ఫీల్ట్ హంటర్ 350

బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్ట్ అంటే దేశంలో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ నుంచి ఒక మోడల్ మార్కెట్లోకి విడుదల అయిందంటే చాలు, వాటిని కొనడానికి చాలా మంది ఎగబడుతుంటారు. ముఖ్యంగా యూత్ అయితే ఈ బైకులంటే పడిచచ్చిపోతారు. మార్కెట్లో ఎన్ని కొత్త బైకులు లాంచ్ అయినప్పటికి కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఆ మజాయే వేరె లెవల్లో ఉంటుంది. కంపెనీ 350 సీసీ నుంచి మొదలుకుని 650 సీసీ వరకు కూడా టూవీలర్లను విక్రయిస్తుంది. ప్రతి ఏడాది కూడా బైక్స్ అమ్మకాల్లో దూసుకుపోతున్న కంపెనీ తాజాగా తన ఫేవరెట్ మోడల్‌కు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. ఈ మోడల్ పేరు 'హంటర్ 350 (Hunter 350)'. ఈ బైక్ తన సరికొత్త డిజైన్, పెర్ఫామెన్స్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. ఇది మార్కెట్లోకి లాంచ్ అయిన తక్కువ కాలంలోనే భారీగా అమ్మకాలను సాధించింది.

సేఫ్టీలో ఐసీఈ కార్లు v/s ఎలక్ట్రిక్ కార్లు.. క్రాష్ టెస్టులో వెల్లడైన కీలక విషయాలు.. ఇక మీ ఛాయిస్ మారిపోద్ది!

ఈ కొత్త సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దేశంలో ఈవీల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో మీరు కూడా ఈవీలవైపు మళ్లాలని ఆశపడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే! కారు కొనేముందు ఎవరైనా సరే.. సేఫ్టీని చూసి కొనుగోలు చేస్తారు. ఫీచర్లు ఎన్నో ఉన్నా సేఫ్టీ పరంగా సరిగ్గా లేకపోతే ఇక ఆ కారును ఎవరూ ఇష్టపడరు, దాన్ని కొనాలనుకోరు. మరి సేఫ్టీ విషయంలో ఐసీఈ కారు బెటరా? లేదా ఈవీలు వాడడం మంచిదా? ఈ ప్రశ్నలకు సమాధానం ఆస్ట్రేలియన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్(ANCAP) అధికారులు తేల్చారు. వారు నిర్వహించిన క్రాష్ టెస్టులో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో సేఫ్టీ పరంగా ఓ క్లారిటీ కూడా దొరికింది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఎంట్రీ ఇచ్చిన కొమాకి.. అతి తక్కువ ధరకే, అదిరే ఫీచర్లతో మూడు ఈవీలు!

దేశంలో ఈవీల హవా కొనసాగుతోంది. చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. టూ- వీలర్ రంగంలోనూ ఈవీల వాడకం జోరుగా కొనసాగుతోంది. అనేక స్టార్టప్ సంస్థల నుంచి దిగ్గజ సంస్థల వరకు ఈవీలతో మార్కెట్లో పోటీ పెంచుతున్నాయి. ఓలా, ఏథర్, బజాజ్, టీవీఎస్ వంటి సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంచి గుర్తింపు సంపాదించాయి. అయితే వీటి కంటే ముందు నుంచే ఎలక్ట్రిక్- టూవీలర్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంస్థ కొమాకి. అనేక ప్రాంతాల్లో దీని డీలర్‌షిప్ నెట్వర్క్ ఉండడంతో.. దీని పేరు కూడా చాలా మంది ఇదివరకే విని ఉంటారు. ఇటీవల ఈ సంస్థ కొన్ని కొత్త మోడళ్లను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఆ స్కూటర్లు, వాటి విశేషాలేంటో చూసేద్దాం.

మొదటి 100 మందికి కేవలం రూ.1.69 లక్షలకే కొత్త ప్రీమియం బైక్..

ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో టూవీలర్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ప్రజల రోజువారీ అవసరాలకు ఇంట్లో బైక్ లేదా స్కూటర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. దీంతో దేశీయంగా టూవీలర్స్‌ అమ్మకాలు ప్రతి ఏడాది జనాభా పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తయారీదారులు సరికొత్త డిజైన్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. తాజాగా ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ 'కీవే ఇండియా (keeway India)' ఇటీవల కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దాని పేరు 'కీవే కె300 ఎస్ఎఫ్ (keeway k300 sf)'. ఇది ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు అధికారిక కీవే ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ బైకును మొదటగా కొనుగోలు చేసే 100 కస్టమర్లకు ప్రత్యేకంగా తగ్గింపును అందిస్తుంది.
Advertisement

ఈవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో విదేశీ సంస్థ.. ఈ కారుతో ప్రత్యర్థులకు గట్టి సవాలే!

వియత్నాంకు చెందిన దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్.. భారత మార్కెట్ వైపు దృష్టి సారించింది. విదేశాల్లో ఈ సంస్థకు చెందిన కార్లు ఇప్పటికే వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ఇప్పుడు భారతీయ కస్టమర్లను సైతం అదే స్థాయిలో లక్ష్యంగా పెట్టుకుందీ సంస్థ. ఇందులో భాగంగా... త్వరలో భారత మార్కెట్లోకి వివిధ కార్లను లాంఛ్ చేయనుంది. ఇటీవల జరిగిన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో ఈ సంస్థ.. కొన్ని కారు మోడళ్లను పరిచయం చేసి ఔరా అనిపించింది. దాంట్లో 'VF3' ఎలక్ట్రిక్ కారు అందరి దృష్టినీ ఆకర్షించింది. త్వరలోనే దీన్ని లాంఛ్‌కు సిద్ధమవుతోంది. మరి ఆ ఈవీ ధర అంచనా, పర్ఫార్మెన్స్, ఇతర స్పెసిషికేషన్లు ఏమున్నాయో చూసేద్దాం.