ఈవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో విదేశీ సంస్థ.. ఈ కారుతో ప్రత్యర్థులకు గట్టి సవాలే!

వియత్నాంకు చెందిన దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్.. భారత మార్కెట్ వైపు దృష్టి సారించింది. విదేశాల్లో ఈ సంస్థకు చెందిన కార్లు ఇప్పటికే వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ఇప్పుడు భారతీయ కస్టమర్లను సైతం అదే స్థాయిలో లక్ష్యంగా పెట్టుకుందీ సంస్థ. ఇందులో భాగంగా... త్వరలో భారత మార్కెట్లోకి వివిధ కార్లను లాంఛ్ చేయనుంది. ఇటీవల జరిగిన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో ఈ సంస్థ.. కొన్ని కారు మోడళ్లను పరిచయం చేసి ఔరా అనిపించింది. దాంట్లో 'VF3' ఎలక్ట్రిక్ కారు అందరి దృష్టినీ ఆకర్షించింది. త్వరలోనే దీన్ని లాంఛ్‌కు సిద్ధమవుతోంది. మరి ఆ ఈవీ ధర అంచనా, పర్ఫార్మెన్స్, ఇతర స్పెసిషికేషన్లు ఏమున్నాయో చూసేద్దాం.

రూ. 4.5 లక్షలతో 23 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు.. చిన్న కుటుంబాలకు బెస్ట్

ఇండియాలో చిన్న కుటుంబాల కార్లకు ఎప్పుడు ఆదరణ ఉంటుంది. దశాబ్దాల కాలంగా ఎస్‌యూవీలు, ఎంపీవీ మోడళ్లు విడుదల అవుతున్నప్పటికి కూడా హ్యాచ్‌బ్యాక్ కార్లకు మాత్రం డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తక్కువ ధరలో లభించడం, అలాగే మంచి మైలేజ్‌తో పాటు మెరుగైన పెర్ఫామెన్స్ అందించడం వంటి పలు కారణాలతో ఈ సెగ్మెంట్ కార్లను దేశంలో అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మంచి ఆదరణ కలిగి ఉన్న కార్లలో రెనాల్ట్ క్విడ్ (renault kwid) ఒకటి. ఇది చిన్న కుటుంబ వినియోగదారులకు అత్యంత అనువైన మోడల్. తాజాగా ఈ కారులో 2024 డిసెంబర్ నెలలో ఎన్ని సేల్స్ నమోదు చేసిందో ఆ వివరాలు వెల్లడయ్యాయి. రెనాల్ట్ నుంచి వచ్చిన డేటా ప్రకారం, గత ఏడాది డిసెంబర్‌లో ఈ కారును 628 మంది కొనుగోలు చేశారు.

సింగిల్ ఛార్జ్‌తో 550 కి.మీలు ప్రయాణించే టయోటా కొత్త ఎలక్ట్రిక్ కారు

భారత్‌లో ప్రసిద్ధి చెందిన కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ (TKM) అత్యుత్తమైన ప్రమాణాలతో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ, దేశంలో మంచి గుర్తింపు పొందింది. లోకల్‌గా చాలా కంపెనీలు మార్కెట్లో తమ కార్లను విడుదల చేస్తుండగా వాటికి పోటీగా అధునాతన డిజైన్లతో, ఆకర్షణీయంగా ఉండే కార్లను లాంచ్ చేస్తూ వాటికి ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుంది. ప్రతి ఏడాది పలు కొత్త కార్లను తీసుకొస్తున్న టయోటా ఈ కొత్త ఏడాదిలో కూడా మరిన్ని మోడళ్లను లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ఘనంగా జరిగిన ప్రపంచ అతిపెద్ద ఆటోమొబైల్ ఈవెంట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో కార్యక్రమంలో టయోటా పలు మోడళ్లను ప్రదర్శించింది. దీనిలో ప్రధానంగా 'అర్బన్ క్రూయిజర్ BEV (urban cruiser bev)' కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUVని కంపెనీ ఆవిష్కరించింది.

చిన్న కుటుంబాలకు బెస్ట్ కారు ధరను భారీగా పెంచి షాక్ ఇచ్చిన మారుతీ సుజుకీ

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) భారత్‌లో అతిపెద్ద వాహన సంస్థగా ఉంది. పేదలు, మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటులో ధరలో ఉండే విధంగా కార్లను విడుదల చేస్తూ పేదల కంపెనీగా పేరొందింది. అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా మారుతీ దేశీయంగా నెక్సా (Nexa), అరెనా (Arena) డీలర్‌షిప్‌ల ద్వారా తన వాహనాలను విక్రయిస్తుంది. అందరిని ఆకట్టుకునే విధంగా ప్రత్యేక డిజైన్లు, అధునాతన ఫీచర్స్‌తో కూడిన కార్లను లాంచ్ చేస్తుంది. తక్కువ ధరలో కార్లను కొనుగోలు చేయాలనుకునే మొదటగా మారుతీ కార్లను ఎంచుకుంటారు. అయితే కంపెనీ ఇటీవల కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన కార్ల ధరలను ఫిబ్రవరి 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసి అందరిపై పెద్ద బాంబు వేసింది.
Advertisement

పాపులర్ MPV కారుపై ధర పెంచిన కంపెనీ.. ఇక దీన్ని కొనాలంటే ఒక నెల జీతం వదులుకోవాల్సిందే!

దేశంలో కార్ల వినియోగం పెరుగుతోంది. గ్రామాల నుంచి నగరాల వరకు కారు కంపల్సరీ అన్నట్లుగా మారిపోయింది. మధ్యతరగతి వారికి కారు కొనడం ఓ కల. పరిమితమైన ధరలో మంచి ఫీచర్లు ఉన్న కారు కొనాలని వారు ఎదురు చూస్తుంటారు. పెద్ద ఎస్‌యూవీలు, ప్రీమియం ఎంపీవీలను కొనడం అంటే వారికి తలకు మించిన భారమే! ఇలాంటి వారిని సంతృప్తి పరిచేందుకు మారుతి సుజుకి సంస్థ తీసుకువచ్చిన ఎంపీవీ ఎర్టిగా. ఫ్యామిలీ కోసం ఈ కారు చక్కగా సరిపోయే కారు అందుబాటు ధరలో ఉంటుంది. అయితే మారుతీ సంస్థ ఇప్పుడు ఈ కారు కొనాలనుకునేవారికి షాక్ ఇచ్చింది. దీని ధరను రూ.15,000 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పుడు కారు కొనాలంటే ఎంత ఖర్చు చేయాలి? ఈ కారులో ఉండే ప్రత్యేకతలేంటో చూసేద్దాం.

కుటుంబం మొత్తం ఒకే ట్రిప్‌లో ఈ 8 సీటర్ కారులో వెళ్ళొచ్చు

భారత్‌లో కార్ల అమ్మకాల్లో మెరుగైన గణంకాలను సాధిస్తూ ఇతర వాహన తయారీదారులకు గట్టి పోటీగా నిలుస్తున్న టయోటా(Toyota) గురించి అందరికీ తెలిసిందే. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కార్ల సంస్థలకు పోటీగా అధునాతన ఫీచర్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ భారతీయ కస్టమర్లలో ప్రసిద్ధి చెందిన వాహన కంపెనీగా పేరొందింది. టయోటా నుంచి గతంలో విడుదల అయిన ఇన్నోవా(Innova) మోడల్ కారకు దేశీయంగా భారీ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం టయోటా ఇన్నోవా క్రిస్టా(Crysta), ఇన్నోవా హైక్రాస్ (Hycross) అనే రెండు వెర్షన్లను విక్రయిస్తుంది. సాధారణంగా ఇన్నోవా కార్లకు భారతీయ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో టయోటా ఇన్నోవా కార్లు గత ఏడాది డిసెంబర్ నెలలో మెరుగైన అమ్మకాలను నమోదు చేశాయి. తాజాగా టయోటా నుంచి విడుదల అయిన డేటా ప్రకారం, 2024 డిసెంబర్ నెలలో మొత్తం 9,700 టయోటా ఇన్నోవా కార్లు అమ్ముడుపోయాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన హోండా, సుజుకి.. మరి ఈ రెండు స్కూటర్లో ఉండే తేడాలేంటి? ఏది కొంటే బెటర్?

దేశంలో ఎలక్ట్రిక్ టూ- వీలర్స్ వాడకం పెరుగుతోంది. ఫ్యూయల్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈవీలైతే ఖర్చులు కలిసి వస్తాయని అందరూ ఇటువైపే మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ టూ- వీలర్ సెగ్మెంట్‌లో స్టార్టప్ సంస్థలైన ఓలా, ఏథర్ వంటివి మంచి పేరు సంపాదించాయి. మరోవైపు పెట్రోల్ స్కూటర్ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉన్న హోండా, సుజుకీ సంస్థలు సైతం.. ఈవీల్లోకి అడుగు పెట్టడంతో మార్కెట్ లెక్కలు మారబోతున్నట్లు కనిపిస్తున్నాయి. హోండా సంస్థ తమ యాక్టివా- ఇ స్కూటర్‌తో, సుజుకీ సంస్థ ఇ- యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఈ రెండు స్కూటర్లు కూడా పాపులర్ ఐసీ‌ఈ స్కూటర్లు అయిన యాక్టివా, యాక్సెస్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్లుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు స్కూటర్ల మధ్య ఉన్న తేడాలేంటో చూసేద్దాం.

టాటా ఆల్ట్రోజ్ V/s మహీంద్రా థార్... సేఫ్టీలో ఏది బెటర్..? యాక్సిడెంట్‌లో తేలిన నిజం!

కారు కొనేముందు దాని డిజైన్, ఫీచర్లు, మైలేజీతో పాటు అందరూ చూసే ముఖ్యమైన అంశం సేఫ్టీ. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కారు ప్రయాణికులకు ఎంత మేరకు సురక్షితమో చూసి మరీ కొనుగోలు చేస్తాం. అందుకే సేఫ్టీ రేటింగ్ అనేది.. వివిధ వాహనాల విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటుంది. అన్నీ బాగున్నా సేఫ్టీ రేటింగ్‌లో పడిపోయిన కారును కొనేందుకు ఎక్కువగా ఎవరూ ఆసక్తి చూపరు. ఇక బిల్డ్ క్వాలిటీ విషయంలో దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా, మహీంద్రా సంస్థల పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. సేఫ్టీ పరంగా ఉన్నత ప్రమాణాలు పాటిస్తాయని ఈ కంపెనీలు పేరు సాధించాయి. అయితే మరి ఈ రెండింట్లో ఏది సేఫ్టీలో బెస్ట్? ఈ విషయం ఓ యాక్సిడెంట్ ద్వారా నిరూపితమైంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
Advertisement

తక్కువ ధరలో లభించే స్కోడా కైలాక్ ఎలా ఉందో తెలుసా? దీనిని కొనుగోలు చేయవచ్చా?

భారతదేశంలో స్కోడా కంపెనీ చాలా కాలంగా కార్లను విక్రయిస్తుంది. దేశీయంగా చాలా వాహన తయారీదారులు ఉన్నప్పటికి కూడా ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే మోడళ్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఏడాది తన వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త కార్లను విడుదల చేస్తూనే ఉంది. ఇప్పటికే కుషాక్ SUV,స్లావియా సెడాన్‌లను విక్రయిస్తుంది. ఇండియాలో స్కోడా ఏడాది విక్రయాలు 50,000ల మార్కును దాటాయి. అయితే కంపెనీ తన అమ్మకాలను మరింత పెంచడానికి కైలాక్ సబ్-4-మీటర్ SUVని తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ రాకతో మార్కెట్లో స్కోడా సేల్స్‌ను రెట్టింపు చేయాలని చూస్తోంది.

ఇండియాలో అత్యంత సేఫ్టీ కారు.. డేట్ గుర్తుపెట్టుకుని బుక్ చేసుకోండి

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కోడా ఇండియా (Skoda India) దేశీయంగా మంచి మార్కెట్ కలిగి ఉంది. చాలా కాలంగా అధునాతన ఫీచర్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ, ఇతర కంపెనీలకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ క్రమంలో కొత్త వినియోగదారులను ఆకట్టుకోడానికి కంపెనీ ఇటీవలే కైలాక్ (kylaq) కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. లాంచ్ అయిన తక్కువ కాలంలోనే ఇది రికార్డు స్థాయిలో బుకింగ్స్‌ను సాధించింది. స్కోడా వెల్లడించిన దాని ప్రకారం, ఈ కారు బుకింగ్స్ ఓపెన్ చేసిన 10 రోజుల్లోనే ఏకంగా 10,000 మంది కస్టమర్లు బుకింగ్ చేసుకున్నారు. ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంత మంది కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం గమనార్హం. ఈ గణంకాలను చూసినట్లయితే భారతీయ మార్కెట్లో ఈ కారుకు ఉన్న డిమాండ్‌ను ఇది తెలియజేస్తుంది. కస్టమర్ల నుంచి భారీ స్పందన రావడంతో స్కోడా డిసెంబర్ మధ్యలో బేస్ వేరియంట్‌కు సంబంధించిన బుకింగ్స్‌ను నిలిపివేసింది.

తెలుగు భాషలో ఇకపై ఏథర్ ఇ-స్కూటర్ డ్యాష్ బోర్డ్... ఈ ఫీచర్‌తో ప్రత్యర్థులకు గట్టి సవాల్!

ఎలక్ట్రిక్ టూ- వీలర్ తయారీ రంగంలో ఏథర్ ఎనర్జీ మంచి పేరు దక్కించుకుంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఈవీలు.. భారత కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ సేల్స్ పెంచుకుంటూ ఈవీల్లో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ కంపెనీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తమిళనాడు హోసూర్‌లో కూడా ఉంది. అయితే.. తాజాగా ఈ సంస్థ తెలుగు ప్రజలకు ఓ మంచి వార్త చెప్పింది. ఇక నుంచి తమ రిజ్తా జెడ్ స్కూటర్ మోడల్‌లోని డ్యాష్ బోర్డులో తెలుగు భాష సహా 8 ప్రాంతీయ భాషల్ని కూడా వినియోగించనున్నట్లు తెలిపింది. దీంతో ఇకపై వినియోగదారులు వివిధ భాషల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

పేదలకు ఇష్టమైన కంపెనీ నుంచి బడ్జెట్‌లో రాబోతున్న టాప్ బెస్ట్ కార్లు..

ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ దశాబ్ద కాలంగా మధ్యతరగతి వినియోగదారుల కోసం తక్కువ ధరలో కార్లను విడుదల చేస్తుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే వాహనాల ధరలు చాలా వరకు అందుబాటులోనే ఉంటాయి. వీటి డిజైన్లు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మైలేజ్ విషయంలో ఎక్కువగానే ఇస్తాయి. ప్రతి ఏడాది కూడా కార్ల సేల్స్ పరంగా దేశంలోనే ఇతర తయారీదారుల కంటే మొదటి స్థానంలో ఉంటుంది. 2024 ఏడాదిలో కూడా కారంల అమ్మకాల్లో మారుతీ సుజుకీ అగ్రస్థానం పొందింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ప్రజలను ఆకట్టుకోవడానికి తక్కువ ధరలో పలు మోడళ్లను విడుదల చేయాలని చూస్తుంది. తాజాగా తన కార్ల ధరలను పెంచి అందరికి షాకిచ్చిన కంపెనీ రెండు, మూడేళ్లలో రూ.10 లక్షల లోపు ధరలో కొత్త కార్లను తీసుకురావడానికి ప్రణాళికలు చేసింది. వాటి గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం..
Advertisement

రయ్.. రయ్.. అంటూ వచ్చేసిన కొత్త స్కూటర్.. ఫీచర్లలో ఇది వెరీ‌ వెరీ సూపర్!

భారత ఆటో మొబైల్ రంగంలో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. పేరు ఎంతో విశిష్టమైనది. దీని గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తమ వాహనాలతో గల్లీ నుంచి దిల్లీ దాకా అందరికీ చేరువైంది. ఈ సంస్థ నుంచి వచ్చే కొత్త వాహనాల కోసం వినియోగదారులు ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తారో ప్రత్యర్థి సంస్థలు కూడా అంతే స్థాయిలో ఆసక్తి ప్రదర్శిస్తాయి. ఈ సంస్థ ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో... తమ కొత్త టూ- వీలర్ మోడల్స్‌తో మెరిసింది. సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌ను అప్‌డేటెడ్ వెర్షన్‌లో లాంఛ్ చేసింది. ఈ కొత్త స్కూటర్‌ను అట్రాక్టివ్ డిజైన్‌తో, అడ్వాన్స్ డ్ ఫీచర్లు జోడించి తీసుకువచ్చింది. దీని ధర, మైలేజీ, పర్ఫార్మెన్స్ తదితర వివరాలపై ఓ లుక్కేయండి.

బ్లూటూత్, USB, నావిగేషన్ వంటి అప్‌డేట్స్‌తో యాక్టివా కొత్త మోడల్ విడుదల

దేశ జనాభా పెరుగుతున్న కొద్ది రవాణ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టింది మొదలు కచ్చితంగా బైక్ లేదంటే స్కూటర్స్, కార్స్ వంటివి తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసే వారికి టూవీలర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా కష్టపడుతూ ప్రయాణించడం కంటే సొంతంగా టూవీలర్ కొనుక్కొని ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా వెళ్లడం బెస్ట్ అని చాలా మంది కూడా టూవీలర్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రారంభంలో బైక్స్ వినియోగం ఎక్కువగా ఉండేది. అయితే ఇవి పురుషులు మాత్రమే నడపడానికి అనువుగా ఉండేవి. తర్వాత కాలంలో మహిళల కోసం స్కూటర్స్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నటూవీలర్ విభాగంలో ఇవి మంచి స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీదారు హోండా ఈ సెగ్మెంట్‌లో ఇండియాలో టాప్ ప్లేస్‌లో ఉంది.

రూ.6.20 లక్షల్లోనే అన్ని ఫీచర్స్ ఉన్న టాటా కారు.. ఉత్పత్తిలో రికార్డు

భారత్‌తో పాటు అంతర్జాతీయంగా సేఫ్టీ పరంగా అత్యుత్తమైన కార్లను తయారు చేయడంలో దిగ్గజ కంపెనీగా పేరుగాంచిన టాటా మోటార్స్ (Tata Motors) అమ్మకాల్లో దూసుకుపోతుంది. వినియోగదారుల నుంచి గొప్ప కార్ల తయారీ కంపెనీగా ప్రశంసలు అందుకుంటుంది. దేశీయ మార్కెట్లో అనేక మోడళ్లను విక్రయిస్తుంది. కంపెనీ నుంచి వచ్చిన చాలా కార్లు కూడా సేల్స్ పరంగా మెరుగైన గణంకాలను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో టాటా ప్రసిద్ధ మోడల్ పంచ్ (Punch) కారుకు దేశంలో మంచి ఆదరణ లభిస్తుంది. చాలా మంది ఈ మైక్రో SUVని కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఈ కారు ఉత్పత్తికి సంబందించి సరికొత్త చరిత్రను లిఖించింది. టాటా మోటార్స్ నుంచి వచ్చిన గణంకాల ప్రకారం, పంచ్ మోడల్ 5 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయికి చేరుకుంది. ఇది పెట్రోల్, CNG,ఎలక్ట్రిక్ మోడళ్ల మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది.

ఆటో ఎక్స్‌పోలో కొత్త ఎస్‌యూవీ మోడల్‌తో ఆకట్టుకున్న టాప్ కంపెనీ.. దీని ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేయాలనుకుంటారు!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ స్కోడా.. భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో క్రమక్రమంగా ఎదుగుతోంది. తమ వాహనాలతో వినియోగదారుల నుంచి మన్ననలు అందుకుంటోంది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ సంస్థ కొత్త వాహనాలను పరిచయం చేసి ఆకట్టుకుంది. అందులో తమ పాపులర్ ఎస్‌యూవీ అయిన కొడియాక్‌కు సెకండ్ జనరేషన్ మోడల్‌ను కూడా ఉంది. దీన్ని MQB EVO ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్ మీద తయారు చేసింది. ఆధునాతన టెక్నాలజీతో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు జోడించి తీసుకువచ్చింది. ఈ కారు డిజైన్, ఇంజిన్, సేఫ్టీ తదితర పూర్తి వివరాలతో దీనికి మాార్కెట్లో పోటీగా ఉన్న కార్లేంటో చూసేద్దాం.
Advertisement

ఓలా-ఏథర్ కంపెనీలకు బిగ్‌ షాక్.. హీరో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ దేశీయంగా పేదలు, మధ్యతరగతి వినియోగదారుల కోసం అందుబాటు ధరలో ఉండే విధంగా టూవీలర్స్‌ను లాంచ్ చేస్తుంది. సాధారణంగా ఈ కంపెనీ నుంచి వచ్చే వాహనాలు తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందిస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. పెట్రోల్ టూవీలర్స్‌ను మాత్రమే కాకుండా ఈవీలను కూడా చాలా మంది కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తయారీదారులు వినియోగదారుల కోసం అధునాతన సదుపాయాలతో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకురావడంపై కీలకంగా దృష్టి సారించింది. విడా బ్రాండ్‌ పేరుతో ఇ స్కూటర్లను లాంచ్ చేస్తుంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచేలా జరిగిన భారత మొబిలిటి గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమంలో కూడా తన మోడళ్లను ప్రదర్శించింది.

రోడ్లపై తిరుగుతూ కనిపించిన స్విఫ్ట్ కొత్త కారు… దీని డిజైన్, ఫీచర్లు.. అబ్బో.. మామూలుగా లేవు!

భారతీయ ఆటో మొబైల్ ఇండస్ట్రీలో మారుతీ సుజుకీ పేరు అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ నుంచి వచ్చే కొత్త కారు మోడళ్ల కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ కంపెనీ నుంచి పాపులర్ హ్యాచ్ బ్యాక్ అయిన స్విఫ్ట్.. ఎంతో మంది కస్టమర్లకు ఫేవరేట్ కారుగా పేరు సంపాదించింది. దాని అట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లతో సేల్స్ పెంచుకుని టాప్‌లో ఒకటిగా కొనసాగుతోంది. గతేడాది ఈ కారుకు సంబంధించి ఫోర్త్ జనరేషన్ మోడల్‌ను తీసుకువచ్చిందీ సంస్థ. అయితే... దీంట్లో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న సుజకీ స్విప్ట్ మోడల్‌లో ఉండే ఫీచర్లన్నీ లేవు. కానీ, ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది‌ మారుతీ సంస్థ. అత్యాధునిక హంగులతో కొత్త స్విఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ విశేషాలేంటో చూసేద్దాం.

ఈ కారు సేల్స్ చూసి షాక్ అయిన కంపెనీ.. అసలు ఎందుకిలా జరిగింది..?

ప్రముఖ వాహన తయారీ కంపెనీ స్కోడా ఇండియాలో కార్ల విక్రయాల్లో ప్రతి ఏడాది కూడా మెరుగైన గణంకాలు సాధిస్తుంది. ఈ సంస్థ నుంచి విడుదలయ్యే వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే తాజాగా ఒక మోడల్ మాత్రం అనుకున్నంత సేల్స్‌ను సాధించలేదు. అదే, స్కోడా సూపర్బ్ (2025 Skoda Superb) సెడాన్. ఇది గత ఏడాది డిసెంబర్‌లో అమ్మకాల పరంగా చాలా నిరాశపరిచింది. కంపెనీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ కారును 2024 డిసెంబర్ నెలలో కేవలం ఒక్కరంటే ఒక్కరే కొనుగోలు చేశారు. దీంతో దేశీయంగా ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్‌ల జాబితాలో చివరి స్థానం పొందింది. సాధారణంగా సెడాన్ కార్లకు ఇండియాలో మంచి ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో స్కోడా సూపర్బ్ అమ్మకాల పరంగా మంచి స్థానంలో ఉంటుందని స్కోడా ఇండియా అంచనాలు పెట్టుకున్నప్పటి దానికి భిన్నంగా ఒక్క కారు అమ్ముడుపోవడం గమనార్హం.

2 వేల కిలోల బరువున్న మూడు ట్రక్కులను లాగిన కారు.. ఎస్‌యూవీల్లో దీని స్ట్రెంత్‌కు తిరుగే లేదు!

భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో టాటా మోటార్స్ పేరు ప్రత్యేకం. తమ వాహనాలతో వినియోగదారుల మనసు దోచుకుంటూ టాప్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది. సేఫెస్ట్ కార్ల తయారీలో ఈ సంస్థకు మంచి గుర్తింపు ఉంది. గతేడాది ఈ సంస్థ Curvv Coupe SUVని భారత మార్కెట్లో విడుదల చేసి, కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. విదేశీ సంస్థల లగ్జరీ కార్లకు పోటీనిచ్చే విధంగా అట్రాక్టివ్ ఫీచర్లు జోడించి దీన్ని తయారు చేశారు. తాజాగా ఈ కారు కేపబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో టాటా సంస్థ పరీక్షించింది. ఈ వీడియో చూసిన వారంతా ఈ కర్వ్ ఎస్‌యూవీ స్ట్రెంత్ చూసి, 'ఔరా' అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది? టాటా కర్వ్ ఎంత బలవంతమైనదో? చూసేద్దాం.
Advertisement

కస్టమర్లపై పెద్ద బాంబ్ వేసిన మారుతీ.. ఇంకో 8 రోజుల్లో రేటు పెరుగుతుంది

భారతదేశంలో మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. సొంతంగా కారు కలిగి ఉండటం వారి కల. ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడం కంటే తక్కువ ధరలో, మంచి సేఫ్టీ ప్రమాణాలు, అధునాతన ఫీచర్స్ కలిగిన కార్లను ఎంచుకుంటారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఎప్పుడూ కూడా అన్ని వర్గాల వారు కొనుగోలు చేసే ధరలో, మెరుగైన సదుపాయాలతో కార్లను విడుదల చేసే కంపెనీగా మంచి పేరును కలిగి ఉంది. సాధారణ, మధ్యతరగతి ప్రజలకు మారుతీ కార్లు అంటే చాలా ఇష్టం. తక్కువ ధరలో అధునాతన కార్లను విడుదల చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. అయితే కొత్త ఏడాదిలో మారుతీ కార్లను తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకునే వారికి తాజాగా చేదు వార్త చెప్పింది. తన కార్ల ధరలు 2025 ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచుతున్నట్లు తెలిపింది.

ఆటో ఎక్స్‌పో 2025కు భారీగా వచ్చిన జనం.. ఏకంగా 9 లక్షల మంది.. 200 లాంచ్‌లు

ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగేలా, భారతీయులు గర్వపడేలా దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో ఎగ్జిబిషన్ ఈవెంట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 తాజాగా ముగిసింది. జనవరి 17 నుంచి మొదలైన ఈ ఈవెంట్ 22 వ తేదీ వరకు విజయవంతంగా జరిగింది. దేశ ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈవెంట్‌లో దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన వాహన తయారీదారులు తమ మోడళ్లను ఆవిష్కరించారు. ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ ఆటో ఎక్స్‌పో‌లో భారీ ఎత్తున సందర్శకులు వాహనాలను చూడటానికి వచ్చారు. దాదాపు 9 లక్షల మంది వరకు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ రంగంలో తాజాగా జరిగిన భారత ఎగ్జిబిషన్ వాహన ప్రియుల చేత గొప్ప ప్రసంశలు అందుకుంటుంది.

ఈ కాన్సెప్ట్ వెహికిల్ అదిరింది గురూ.. ఈ వ్యాను ఎక్కితే ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది!

జనవరి 17న మొదలైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. బుధవారంతో ఘనంగా ముగిసింది. ఈ వేడుకలో అనేక ఆటో మొబైల్ సంస్థలు తమ కొత్త మోడళ్లతో పాటు, కాన్సెప్ట్ వాహనాలతో వీక్షకులను కనువిందు చేశాయి. ఎప్పుడెప్పుడు ఈ మోడళ్లు మార్కెట్లోకి వస్తాయా అని ఎదురుచూసేలా అలరించాయి. ఈ ఎక్స్‌పోలో దిగ్గజ వాహన సంస్థ టయోటా కూడా తమ వాహనాలతో ఆకట్టుకుంది. ఈ సంస్థ ప్రదర్శించిన ఓ కాన్సెప్ట్ వాహనం ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదే టయోటా ఎక్స్- వ్యాన్. ఇల్లు తరహాలో కనిపిస్తున్న ఈ వాహనంలో డ్రైవర్ కోసం ప్రత్యేక డోర్ లేదు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ కాన్సెప్ట్ వాహనాన్ని తీసుకువచ్చింది. దీని పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

యమహా నుంచి మంచి మైలేజ్‌తో కత్తి లాంటి హైబ్రిడ్ బైక్

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ యమహా (Yamaha) ఇండియా మార్కెట్లో 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో అట్టహాసంగా జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో తన మోడళ్లను ప్రదర్శనకు ఉంచింది. ఈ షోలో కంపెనీ 1980,90 ల కాలంలో భారత రోడ్లను శాసించిన యూత్ ఫేవరెట్ బైక్స్ RX100, RD350 మోడళ్లను వాహన ప్రియులకు అందుబాటులో ఉంచడంతో పాటు యమహా FZ సిరీస్, YZF R15 బైకులకు సంబంధించిన మొదటి తరం మోడళ్లను కూడా ప్రదర్శించింది. ఇవన్నీ కూడా ఐకానిక్ హెరిటేజ్ బైక్స్. అయితే వీటితో పాటు హైబ్రిడ్ టెక్నాలజీతో దేశీయ మొదటి 150సీసీ కమ్యూటర్ బైక్ ఎఫ్‌జెడ్‌ఎస్ ఎఫ్‌ఐ(FZ-S Fi)ని ఆవిష్కరించింది. ఇది ఆటో ఎక్స్‌పోలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రే ZR, ఫాసినో మోడళ్ల తరువాత ఈ హైబ్రిడ్ బైక్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.
Advertisement

ఈ టాప్ కంపెనీ కారుపై మరికొన్ని‌ రోజులు పెరిగిన ఆఫర్… ఆలస్యం చేస్తే ఎక్కువ ఖర్చు చేయాల్సిందే!

భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ నెలకొంది. ఈ సెగ్మెంట్ లో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు అదరగొడుతున్నాయి. ఇప్పుడిక ఈ పోటీలో దిగ్గజ సంస్థ హోండా కూడా తగ్గేదేలే అంటోంది. తమ అమేజ్ కారు మోడల్‌కు సంబంధించి జనరేషన్ ఛేంజ్‌తో ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ను గతేడాది డిసెంబరులో తీసుకువచ్చిందీ సంస్థ. దీన్ని వినియోగదారులకు మరింత చేరువచేసి, సేల్స్ పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. ఈ సెడాన్ కారుపై లాంఛింగ్ సందర్భంగా ప్రకటించిన ఇంట్రడక్టరీ ప్రైజ్ ఆఫర్‌ను జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ కారు ధర ఎంత ఉంటుంది? దీంట్లో ఉండే ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం.