ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కు వెళ్లడానికి 7 సీటర్ కార్స్.. త్వరలో రాబోతున్నాయ్
ఆటోమొబైల్స్
- 1 year, 8 month, 15 hr, 35 min ago
భారతదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో అట్టహసంగా జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో వాహన తయారీదారులు తమ కొత్త మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేశారు. వీటిలో కొన్నింటిని ఇప్పుడే మార్కెట్లోకి విడుదల చేయగా, మరికొన్నింటిని కాన్సెప్ట్ మోడల్‌గా ఆవిష్కరించారు. జనవరి 17న భారత మండపంలో మొదలైన కార్యక్రమం 22వ తేదీ వరకు జరిగింది. అనేక కొత్త మోడళ్లు వాహన ప్రియులను ఎంతో ఆకట్టుకున్నాయి. చిత్ర విచిత్రమైన వాహనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఈవెంట్‌లో ముఖ్యంగా ఫ్యామిలీ కార్స్ అధునాతన డిజైన్, ఫీచర్స్‌తో అలరించాయి. 2025 ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో పెద్ద కుటుంబాలకు అనువుగా ఉండే 7 సీటర్ కార్లను కొన్ని కంపెనీలు ప్రదర్శనకు ఉంచాయి. వాటిలో కొన్నింటి గురించి క్రింది కథనంలో చూద్దాం.