tvs నుంచి అదిరిపోయే స్కూటర్.. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరణ

దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్స్ (TVS) ఢిల్లీలో ఎంతో ఘనంగా జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో 2025 iQube ST కాన్సెప్ట్‌ను తాజాగా ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్నటువంటి iQube ST ఆధారంగా దీనిని తీసుకొస్తున్నారు. ఈ కొత్త స్కూటర్ అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తుంది. దీని లుక్ చూసినట్లయితే ప్రీమియం మోడల్ లాగా అనిపిస్తుంది. ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శనకు ఉంచారు. ఈ స్కూటర్‌ చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. iQube ST ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఇది ప్రీమియం వెర్షన్ లాగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఈవెంట్‌లో చాలా రకాల ఈవీలు ఆవిష్కరించబడ్డాయి. ఇప్పుడు ఈ కొత్త ఎలక్ట్రిక్ రాకతో టీవీఎస్ కంపెనీ ఈవీ సెగ్మెంట్‌లో మరింత పుంజుకుంటుంది.

ఆటో ఎక్స్‌పోలో రాకెట్ వేగంతో దూసుకుపోయే BMW లగ్జరీ బైక్‌

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ఇండియాలో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. ఇది లగ్జరీ కార్లతో పాటు బైక్స్‌ను కూడా విడుదల చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టూవీలర్లను లాంచ్ చేస్తుంది. దేశంలో కార్ల విభాగంతో పాటు, బైక్స్ అమ్మకాల్లో కూడా మెరుగైన సేల్స్‌ను సాధిస్తున్న కంపెనీ తాజాగా S1000 RR బైక్‌ను విడుదల చేసింది. దీనిని 2024 ఏడాది అక్టోబర్‌లో ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు దీన్ని దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమను మన తిప్పుకునేలా ఎంతో అట్టహసంగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో విడుదల చేసింది. జనవరి 17 నుంచి మొదలైన ఈ ఈవెంట్ 22వ తేదీ వరకు జరుగుతుంది.

క్రెటా విషయంలో హ్యుందాయ్ ‘తగ్గేదేలే’.. ఈసారి మరో డిఫరెంట్ వెర్షన్‌లో..

హ్యూందాయ్ క్రెటా.. లాంఛ్ అయిన అనతి కాలంలోనే వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఎస్‌యూవీ. ఈ కారు సేల్స్ పెంచుకుంటూ హ్యుందాయ్ సంస్థకు మంచి లాభాల్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ ఎస్‌యూవీ.. డీజిల్, పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే.. ఈ సంస్థ ఇప్పుడు న్యూ‌దిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ క్రెటాను లాంఛ్ చేసింది. దాంతోపాటుగా ఈ ఈవెంట్‌లోనే క్రెటా మరో కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. హ్యూందాయ్ క్రెటా ఫ్లెక్ల్‌ ఫ్యూయల్ మోడల్‌ను తీసుకువచ్చింది. ఈ కొత్త కారు మోడల్‌లో ఉండే విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. ఫస్ట్ ఈ నగరంలో స్టార్ట్..

భారతదేశ రాజధాని ఢిల్లీలో జనవరి 17 నుంచి ప్రారంభమైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్ ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనిలో దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ అవుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు కార్లు, బైక్స్, వాణిజ్య, ఇతర వాహనాలను ఆవిష్కరించాయి. వీటిలో భవిష్యత్తులో విడుదల కాబోయే కాన్సెప్ట్ మోడళ్లు కూడా ఉన్నాయి. వీటిలో పలు వాహనాలు తమ రూపంతో ఆకట్టుకుంటున్నాయి. వెరైటీ డిజైన్లతో కనిపిస్తూ చూసే వారిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ సరళ ఏవియేషన్ పాల్గొంది. ఈ షోలో కంపెనీ శూన్య అనే కొత్త ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్‌ను ఆవిష్కరించి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం దీనిని ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు.
Advertisement

హిందూజా గ్రూప్ నుంచి సరికొత్త వెహికల్.. పెట్రోల్, డీజిల్ అవసరం లేదు

హిందూజా గ్రూప్‌కు చెందిన భారీ వాహనాల తయారీ సంస్థ స్విచ్ మొబిలిటీ (switch mobility) భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో IeV8 అనే వాణిజ్య వాహనాన్ని విడుదల చేసింది. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్. లైట్ వెయిట్‌తో వచ్చింది. భారీ వస్తువులను మోసుకెళ్లలేదు. అయితే కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, 7.2 టన్నుల బరువున్న వస్తువులను మాత్రం తీసుకెళ్లగలదు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల యుగం ప్రారంభమైన తరుణంలో కార్లు, బైక్స్ ఇప్పటికే ఈవీ వెర్షన్లలో విడుదల అవుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కు మంచి ఆదరణ లభిస్తుండటంతో భారీ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఇప్పుడు సరుకుల రవాణకు ఉపయోగించే వాణిజ్య వాహనాలను కూడా ఈవీలలో తీసుకొస్తున్నారు.

ఆటో ఎక్స్‌పోలో మూడు ఈవీలతో గోదావరి... అన్నీ అదుర్స్ అనిపించేలానే!

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్.. తమ సత్తా చాటింది. ఈ సంస్థ మూడు కొత్త ఈవీలను ఆవిష్కరించి ఆకట్టుకుంది. ఇబ్లూ ఫియో జెడ్‌ ఇ- స్కూటర్, ఇబ్లూ రోజీ డీఎక్స్‌ (ఇ-స్కూటర్), ఇబ్లూ రోజీ ఈకో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ పేర్లతో ఈ వాహనాలను తీసుకువచ్చింది. పర్యావరణ హితంగా ఉంటూనే అడ్వాన్స్‌డ్ ఫీచర్లు జోడించి వీటిని తీసుకువచ్చింది. ఈ వాహనాలు భారతీయ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఉంటాయని చెబుతోంది గోదావరి సంస్థ. దాంతో పాటు ఓ యాప్‌ను కూడా లాంఛ్ చేసింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

టాటా సంచలన ఆవిష్కరణ.. ఫుల్ ట్యాంక్‌‌తో 2400 కి.మీలు

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలో కంపెనీ కొత్తగా ఎల్‌ఎన్‌జీ (LNG) శక్తితో నడిచే ట్రక్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ పేరు ప్రైమా జి.55ఎస్‌ (prima G.55s). ఆటోమొబైల్ రంగంలో ఇది కీలక మైలురాయి అని చెప్పవచ్చు. ఎల్‌ఎన్‌జీ శక్తితో కూడిన ఇంజిన్‌ భారత్‌లోకి రాకను ఈ ట్రక్ సూచిస్తుంది. ప్రధానంగా ఇది ఫుల్ ట్యాంక్‌‌తో ఏకంగా 2400 కి.మీ వరకు ప్రయాణించగల కెపాసిటీ కలిగి ఉంటుందని టాటా మోటార్స్ ప్రకటించడం గమనార్హం. ఈ రేంజ్ వరకు ప్రయాణించడం అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం మార్కెట్లో సరుకు రవాణాకు ట్రక్కులు చాలా కీలకం.

ఆటో ఎక్స్‌పోలో అదరగొట్టిన కొత్త కార్గో వాహనాలు... వీటితో రోజువారీ అవసరాలకు ఏ ఢోకా లేదిక!

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కార్లు, బైకులే కాదు.. కార్గో వెహికిల్స్ కూడా అదరగొడుతున్నాయి. మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ... రెండు కొత్త వాహనాలను పరిచయం చేసి తగ్గేదేలే అనిపించింది. ఈ రెండూ ఎలక్ట్రిక్ వాహనాలే కావడం విశేషం. 'Eviator' పేరుతో ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికిల్‌ను, Super Cargo పేరుతో ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను లాంఛ్ చేసింది. ఈ రెండు వాహనాలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డీ. కుమారస్వామి ఆవిష్కరించారు. ఈ వాహనాలలో ఉండే ఫీచర్లు, వీటి ధర తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement

రూ.3.25 లక్షలకే సోలార్ కారు వచ్చేసింది.. పైసా ఖర్చు లేకుండా ప్రతి ఏడాది 3000 కిమీలు

ఢిల్లీలో ఎంతో ఘనంగా జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ కార్లు, బైక్స్, వాణిజ్య, ఇతర వాహనాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో కొన్నింటిని ఇప్పుడు విడుదల చేయగా, మరికొన్ని భవిష్యత్తులో విడుదల కాబోయే కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శిస్తున్నారు. దీనిలో కొన్ని వాహనాలు మాత్రం విచిత్రమైన డిజైన్లతో చూపరులను ఆకట్టుకున్నాయి. వాటి ఫీఛర్స్, పనితీరు గురించి ప్రక్కన పెడితే వాటి రూపానికే అట్రాక్టివ్‌గా అనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో స్టార్టప్ బ్రాండ్ అయిన వేవ్ ( Vayve) సంస్థ ఎవా (Eva) ప్రగతి మైదాన్‌లో శిలాజ ఇంధనాల ముగింపు పలకాలనే ఉద్దేశంతో కొత్తగా భారతదేశంలో మొట్టమొదటి సౌరశక్తితో నడిచే కారును విడుదల చేసింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న కారణంగా చాలా మంది కొత్తగా కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో చేస్తున్న వారు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నారు.

ఆటో ఎక్స్‌పోలో కొత్త ఎలక్ట్రిక్ కారుతో వచ్చిన బీవైడీ.. బుక్సింగ్స్ కూడా షురూ

న్యూదిల్లీ వేదికగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 జోరుగా హుషారుగా సాగుతోంది. స్టార్టప్‌ల నుంచి మొదలుకుని దిగ్గజ వాహన తయారీ సంస్థలు ఇందులో తమ కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎక్స్‌పోలో చైనాకు చెందిన దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ బీవైడీ ఇండియా.. భారత్‌లో తమ బ్రాండ్ నుంచి రానున్న ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసి 'వావ్' అనిపించింది. సీలయన్ 7 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ సంస్థ లాంఛ్ చేసింది. ఈ కారు బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారు డెలివరీలు మార్చి నుంచి ప్రారంభించనుంది బీవైడీ సంస్థ. ఈ కారు పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం

వావ్.. ఆటో ఎక్స్‌పోలో మినీ కూపర్.. చూడటానికి రెండు కళ్లు చాలవు

దేశరాజధాని ఢిల్లీలో ఎంతో ఘనంగా జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో బ్రిటిష్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ మినీ (Mini) కొత్తగా మినీ కూపర్ S JCW ప్యాక్‌ (Mini Cooper S John Cooper Works Pack) ను విడుదల చేసింది. ఇది చూడటానికి ఒక మహరాణిలాగా కనిపిస్తుంది. దీని డిజైన్ సరికొత్తగా ఉంది. దాని ముందు భాగంలో ఉన్నటుంటి హెడ్‌లైట్ సెటప్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లోనే ధర. బుకింగ్ వివరాలను కూడా వెల్లడించింది. మినీ కూపర్ S JCW ప్యాక్‌ ప్రారంభ ధర రూ..55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. దీని డెలివరీలను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభిస్తామని మినీ ఇండియా అధికారులు తెలిపారు.

ఆటో ఎక్స్‌పోలో ఇంటర్నేషనల్ కారుతో మెరిసిన హ్యూందాయ్… ఇది సూపరో సూపర్!

దిల్లీలో జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో.. వివిధ ఆటో మొబైల్ సంస్థల నుంచి కొత్త కొత్త వాహనాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో హ్యూందాయ్ సంస్థ ఓ సరికొత్త వాహనాన్ని ప్రదర్శించింది. అదే హ్యుందాయ్ స్టారియా ఎంపీవీ. విదేశాల్లో ఇప్పటికే కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ కారును దేశంలో ఆవిష్కరించడం ఇదే తొలిసారి. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఉన్న ఈ కారు పెద్ద ఫ్యామిలీలకు సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. 11 మంది ప్రయాణికులకు సరిపోయేలా సౌకర్యవంతమైన సీటింగ్ సదుపాయం ఇందులో ఉంటుంది. ఈ కారు ధర ఎంత ఉంటుంది? దీని ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో ఉండే ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement

ఎలక్ట్రిక్ కార్లలో కొత్త శకం.. టాటా- మహీంద్రాకు పోటీగా కొత్త ఈవీ కార్లు వచ్చేశాయ్

ప్రపంచదేశాలు ఆశ్యర్యపోయేలా దేశరాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్ మండప వేదికగా జరుగుతున్న అతిపెద్ద వాహన ఈవెంట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతుంది. శుక్రవారం ఈ వేడుకను భారత ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ ఆటో ఎక్స్‌పోలో వాహన తయారీ కంపెనీలు తమ మోడళ్లను ప్రదర్శిస్తున్నాయి. ఇదే క్రమంలో విదేశాలకు చెందిన కార్ల తయారీదారులు తమ మోడళ్లను భారత గడ్డపై ఆవిష్కరిస్తున్నారు. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ ఇతర దేశాలతో పోలిస్తే పెద్దదిగా ఉండటం కారణంగా విదేశీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో వియత్నాంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారులలో ఒకటైన విన్‌ఫాస్ట్ (VinFast) ఆటో ఎక్స్‌పో 2025లో తన వాహనాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈ ఈవెంట్‌లో కంపెనీ VF 6,VF 7, VF 8 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది.

మళ్లీ వచ్చేసిన 90ల నాటి టాటా కారు.. రెట్రో స్టైల్‌కు మోడ్రన్ ఫీచర్లు జోడించి…

దిల్లీలో శుక్రవారం ప్రారంభమైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో వైభవంగా సాగుతోంది. అనేక వాహన తయారీ సంస్థలు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్.. ఈ ఈవెంట్‌లో తమ వాహనాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సంస్థ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్(ICE)తో ఉండే సియెర్రా ఎస్‌యూవీని ఈ ఎక్స్‌పో‌లో ఆవిష్కరించింది. నోస్టాలిజిక్ డిజైన్‌ని గుర్తు చేస్తూ.. మోడర్న్ డిజైన్‌ను మేళవించి, ఈ ఎస్‌యూవీని ప్రదర్శించింది. 90వ దశకంలో.. భారతీయ వినియోగదారులను ఆకట్టుకున్న సియెర్రాను మళ్ళీ గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ కారు వీక్షకులను కట్టిపడేస్తోంది. ఈ కారు విశేషాలేంటో తెలుసుకుందాం.

రెండు కుటుంబాలకు సరిపోయే స్కోడా కొత్త కారు.. ఫార్చ్యూనర్‌కు పోటీ వచ్చేసింది

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కోడా (Skoda) నుంచి కొత్త మోడల్ వచ్చింది. దేశ రాజధాని న్యూ ఢిల్లిలోని ప్రగతి మైదాన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో స్కోడా రెండో తరం కొడియాక్ (kodiaq) మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది దాని పాత మోడల్‌తో పోలిస్తే, కొత్తగా మరిన్ని ఫీచర్స్‌తో అప్‌డేట్ అయి వచ్చింది. ఈ ఎస్‌యూవీ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. భారత్‌లో స్కోడా కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే దీని పాత మోడల్‌ను చాలా మంది కొనుగోలు చేశారు. దీంతో ఈ కారుకు ప్రజల నుంచి మంచి ఆదరణ రావడంతో ఇప్పుడు ఈ కొత్త రెండో తరం‌ను తీసుకొచ్చింది. దీనిని 'మోడరన్ సాలిడ్' డిజైన్ శైలిలో రూపొందించారు. పొడవు కొంచెం ఎక్కువగా ఉంటుంది. లోపల ప్రయాణికుల సౌలభ్యం కోసం మరింత స్థలాన్ని అందించడానికి పొడవును పెంచినట్లు తెలుస్తోంది.

అదుర్స్ అనిపించేలా ఎంజీ కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. వీటి ఫీచర్లు మామాలుగా లేవుగా!

బ్రిటిష్ మోటారింగ్ బ్రాండ్ జేఎస్ డబ్యూ ఎంజీ మోటార్ ఇండియా.. తమ వాహనాలతో భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. తమ కార్లతో అన్ని వర్గాల వారికి చేరువైంది. ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ సాగుతున్న నేపథ్యంలో.. ఈవీల తయారీపై ఈ సంస్థ దృష్టి సారించింది. ఈ సంస్థ ఆటో ఎక్స్‌పోలో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్ల మోడళ్లను ఆవిష్కరించింది. అందులో ఒకటి Cyberster EV కాగా.. మరొకటి లగ్జరీ ఎంపీవీ అయిన MG M9. మార్చిలో సైబర్ స్టర్ ఈవీ, ఎం9 కార్ల బుకింగ్స్ ప్రారంభించి, ఏప్రిల్‌లో వీటి డెలివరీలను మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. ఈ కార్ల పీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement

చూడ చక్కని పొట్టి ఈవీ కారు.. చిన్న కుటుంబాల కోసం బెస్ట్ మోడల్

ప్రపంచదేశాలను అబ్బురపరిచేలా దేశరాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్ మండప వేదికగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఆటోమొబైల్ తయారీ దారులు అందరూ కూడా తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం విడుదల కాబోతున్న వాహనాలు, అలాగే భవిష్యత్తులో రాబోతున్న కార్లు, బైక్స్, వాణిజ్య ఇతర వాహనాలకు సంబంధించిన కాన్సెప్ట్ వాహనాలను ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత మార్కెట్ ప్రపంచ దేశాలతో పోలిస్తే వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆటోమొబైల్ పరిశ్రమలో పేరుగాంచిన పలు వాహన తయారీ కంపెనీలు తమ కార్లను భారత్‌లో విడుదల చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఢిల్లీలో అత్యంత ఘనంగా జరుగుతున్న అతిపెద్ద ఆటో ఎక్స్‌పో 2025 కార్యక్రమంలో ఈ కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శిస్తున్నాయి.

టాటా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. ఏకంగా 500 కి.మీలు

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దూసుకుపోతుంది. ఇండియాలో ఈవీలకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో కంపెనీ వరుసగా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడంపై కీలకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం హ్యుందాయ్, మహీంద్రా, కియా మోటార్స్ వంటి వాహన తయారీదారులు ఈవీ సగ్మెంట్‌లో మంచి మార్కెట్ కలిగి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కూడా ఈవీ కారును తీసుకురావడంతో ఈ విభాగంలో పోటీ మరింత పెరిగింది. దీంతో భారత ప్రజలకు అత్యంత సేఫ్టీ ప్రమాణాలతో అత్యుత్తమైన నాణ్యతతో కార్లను తీసుకువస్తుందనే ప్రసిద్ధ పేరు కలిగిన టాటా మోటార్స్ ఇప్పుడు తన హారియర్ ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ (Harrier Suv Electric) రూపంలో ఆవిష్కరించింది.

ఆటో ఎక్స్‌పోలో క్రేజీగా ఈ కాన్సెప్ట్ బైకు.. దీన్ని చూస్తే తొలిచూపులోనే ప్రేమలో పడిపోతారు!

దిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో అట్టహాసంగా కొనసాగుతోంది. అనేక ఆటో మొబైల్ సంస్థలు తమ వాహనాలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దిగ్గజ టూ- వీలర్ సంస్థ టీవీఎస్ సంస్థ కూడా తమ బ్రాండ్ నుంచి రానున్న వాహనాలను ప్రదర్శిస్తోంది. అయితే.. ఈ ఎక్స్ పోలో ఓ కాన్సెప్ట్ బైకుతో తళుక్కున మెరిసిందీ సంస్థ. చూడగానే 'వావ్' అనిపించేలా ఉన్న ఈ బైకు.. ఆటో ఎక్స్‌పోలో ఆకర్షణీయంగా నిలిచింది. టీవీఎస్ RTS X Concept పేరుతో దీన్ని ప్రదర్శించింది టీవీఎస్ సంస్థ. 300 సీసీ ఇంజిన్‌తో ఉన్న ఈ బైకు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రెడ్ కలర్ డ్రెస్సులో ఖరీదైన కారుతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఊర్వశి

ఊర్వశి రౌటేలా అంటే తెలియని వారు ఉండరు. అటూ బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది. తెలుగులో ఇటీవల కాలంలో స్టార్ హీరోలతో ఐటెం సాంగ్స్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. మొదటగా ప్రైవేట్ సాంగ్స్‌లలో నటించి ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. గత ఏడాది ఇదే సంక్రాంతి సమయంలో విడువలైన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సాంగ్స్‌కు స్టెప్పులు వేసింది. ఇటీవల సంక్రాతి కానుకుగా వచ్చిన డాకు మహారాజ్‌ సినిమాలో కూడా నట సింహం సందమూరి బాలయ్యాతో కూడా చిందులు వేసింది. ఈ మధ్య కాలంలో ముంబైలో హడావుడి చేస్తూ, హైదరాబాద్‌లో కూడా తరుచుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఊర్వశి రౌటేలాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Advertisement

2025 సుజుకి యాక్సెస్‌ వచ్చేసింది.. కత్తిలాంటి ఫీచర్లు, కెవ్వుకేక ఫర్ఫామెన్స్‌!

భారత్‌ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో (Bharat Mobility Auto Expo 2025)లో సుజుకి మోటార్‌సైకిల్స్‌ యాక్సెస్ 125 2025 (2025 Suzuki Access) వెర్షన్‌ స్కూటర్‌ని విడుదల చేసింది. ఈ సరికొత్త స్కూటర్‌ క్రేజీ లుక్‌తో పాటు, భారీ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని ధరను రూ .81,700 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్, స్పెషల్, రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్‌ మంచి సేల్స్‌ని రాబడుతుందని కంపెనీ భావిస్తోంది. దీని రాకతో సేల్స్‌ మరింత పెరిగే అవకాశాలు లేకపోదు. ఈ సరికొత్త అడ్‌డేటెడ్‌ వెర్షన్‌ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ఆటో ఎక్స్‌పోలో హీరో సంస్థ అదుర్స్.. యూత్ కోసం నాలుగు కొత్త మోడల్స్

న్యూ దిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో కొనసాగుతోంది. అనేక ఆటో మొబైల్ సంస్థలు తమ కొత్త వాహనాలను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. దిగ్గజ టూ వీలర్ తయారీ సంస్థ హీరో.. ఈ ఎక్స్‌పోలో నాలుగు కొత్త టూ- వీలర్స్‌ను తీసుకువచ్చింది. Xoom 125, Xoom 160 స్కూటర్లతో పాటు Xtream 250R, XPulse 210 బైకులను లాంఛ్ చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆటో ఎక్స్‌పోలో ఘనంగా లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా ఈవీ

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) ఇండియా తాజాగా ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ క్రెటా ఈవీ (Creta Ev). దీన్ని కంపెనీ ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ప్రదర్శించింది. హ్యందాయ్ ice క్రెటా మోడల్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేసి ఈవీ సెగ్మెంట్‌లో తన వాటాను మరింత పెంచుకోనుంది. ప్రస్తుతం కొత్తగా కారు కొనుగోలు చేసే వినియోగదారులు, ఈవీ కార్లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను గమనించిన చాలా వాహన తయారీ దారులు ఈ సెగ్మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తమ పాత మోడళ్ల కార్లను కొత్తగా ఈవీ వేరియంట్‌లుగా మారుస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నారు.

కిర్రాక్ ఫీచర్లతో వస్తున్న సుజుకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ అదిరిపోయిందిగా!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ సుజుకి ఇండియా.. తమ వాహనాలతో భారతీయ వినియోగదారులను ఎన్నో ఏళ్లుగా ఆకట్టుకుంటోంది. కార్లతో పాటు టూ- వీలర్లలోనూ ఈ సంస్థ తమ వాహనాలతో ప్రత్యేక గుర్తింపును సొతం చేసుకుంది. ఈ ఏడాది ఈ సంస్థ టూ- వీలర్స్‌కు సంబంధించి గట్టి ప్లాన్స్‌తో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా.. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తమ సంస్థ నుంచి కొత్త వాహనాలను పరిచయం చేయనుంది. దేశంలో ప్రస్తుతం ఈవీల హవా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈవీల తయారీపై ఈ సంస్థ దృష్టి సారించింది.
Advertisement

మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్‌ కారు ఆవిష్కరణ.. సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీలు

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) నుంచి ఎప్పుడెప్పుడు ఎలక్ట్రిక్ కారు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు శుభవార్త చెప్పింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ విటారా(e-Vitara)ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఇండియాలోనే ఈవీ వాహనాల వాడకం విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి పలు కార్ల తయారీ కంపెనీలు ఈ విభాగంలో ముందడుగు వేసి ఈవీ కార్లను సేల్ చేస్తున్నాయి. అయితే దేశంలోనే అతిపెద్ద కార్ల ఉత్పత్తి దారుగా ఉన్నటువంటి మారుతీ మాత్రం ఇంత కాలం ఈ సెగ్మెంట్‌లో వెనుకబడి ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ భారత ఎలక్ట్రిక్ మార్కెట్లో ఇ విటారాను తీసుకొచ్చి పెను సంచలనాలకు తెరలేపింది.