ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌ రాబోతుంది.. మైలేజీ ఎంతో తెలుసా?

టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్‌ (TVS Jupiter CNG Scooter)ని ఆ సంస్థ భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది. ఈ స్కూటర్ కేవలం కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శించినప్పటికీ ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి సీఎన్‌జీ స్కూటర్ కావడం విశేషం. దీని విడుదలపై కంపెనీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది భారతీయ మార్కెట్‌లో బజాజ్‌ ఫ్రీడమ్‌ సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ని లాంచ్‌ చేసింది. దీనికి ఆటోమోబైల్‌ ఔత్సాహికుల నుంచి భారీ స్పందన లభించింది. ఇది సేల్స్‌లోనూ ఇతర సంప్రదాయ టూవీలర్స్‌తో పోటీగా దూసుకెళ్తుంది. ఇప్పుడు స్కూటర్లలో జూపిటర్‌ రాకతో మరో టూవీలర్‌ అందుబాటులోకి వచ్చేస్తుంది. దీని వివరాలపై ఓ లుక్కేయండి. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ కావడం విశేషం. ఇది 1.4 కిమీ సీఎన్‌జీ కిట్‌తో రానుంది. ఈ స్కూటర్‌లో భారీ అండర్ సీట్ స్టోరేజీ, ఇతర ప్లేస్‌మెంట్ కూడా నీట్‌గా ఉంది. ఇక ఇందులోని ట్యాంక్‌ని ప్లాస్టిక్ ప్యానెల్‌తో టీవీఎస్‌ కవర్ చేసింది. ప్రెజర్ గేజ్ చూపించడానికి చుట్టూ ఫిల్లర్ నాజిల్ ఉన్నాయి. ఈ సీఎన్‌జీ స్కూటర్‌ కిలో సీఎన్‌జీకి 84 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలదని టీవీఎస్ పేర్కొంది.

యూత్ కోసం యమహా నుంచి సరికొత్త సైలిష్ బైక్.. దీని డిజైన్ చూస్తే మర్చిపోలేరు

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా ఇండియా (Yamaha India) సరికొత్త టెనెరే 700 (Tenere 700) అడ్వెంచర్ బైక్ ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తుండగా, తాజాగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్లో దీన్ని ప్రదర్శనకు ఉంచింది. దీని చివరి వెర్షన్‌ను మిలన్‌లో జరిగిన EICMA 2024 ఈవెంట్‌లో మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. 2025లో కొత్తగా వస్తున్న ఈ అడ్వెంచర్ బైక్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఇది సరికొత్త డిజైన్‌తో అడ్వెంచర్లు కోరుకునే కస్టమర్లను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆటో ఎక్స్‌పో 2025లో దీన్ని చూసినట్లయితే చాలా అందంగా స్టైలిష్ రూపంతో కనిపిస్తుంది.

కియా కొత్త కారు కెవ్వుకేక.. ఆటో ఎక్స్‌పోలో అందరీ కళ్లు దీనివైపే!

ఆటో ఎక్స్‌పో 2025లో కియా ఇండియా కొత్త సబ్-4 మీటర్‌ ఎస్‌యూవీ కియా సైరోస్‌ (Kia Syros in Auto Expo 2025)ని ప్రదర్శించింది. ఈ సైరోస్‌ తొలి యూనిట్‌ అనంతపురంలో ఆవిష్కరించారు. ఇది పూర్తిగా ఈ ప్లాంట్‌లోనే ఉత్పత్తి అయ్యింది. ఈ మొట్టమొదటి యూనిట్‌ ఆటో ఎక్స్‌పో 2025లో ఆకట్టుకోనుంది. డిసెంబర్‌లో తొలిసారిగా ఈ కారును ఆవిష్కరించి బుకింగ్స్ ప్రారంభించింది. ఎవ్వరూ ఊహించిని విధంగా ఈ కారుకి ఫుల్‌ రెస్పాన్స్‌ వచ్చింది. విడుదలకు ముందే రికార్డు స్థాయిలో 10,258 ప్రీ-లాంచ్ బుకింగ్స్‌ని రాబట్టింది. ఈ కియా కొత్త సైరస్ ధరలను ఫిబ్రవరి 1 న కంపెనీ వెల్లడించనుంది.

Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా బజాజ్.. ఇథనాల్, ఎలక్ట్రిక్ బైకులు.. తగ్గేదేలే!

ఆటోమొబైల్ రంగం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో ప్రారంభం కావడానికి మరికొన్ని ఘడియలే మిగిలి ఉంది. అనేక దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు.. ఈ ఎక్స్‌పోలో తమ వాహనాలను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ కూడా.. 'తగ్గేదేలే' అంటోంది. ఈసారి ఆ సంస్థ.. తమ బ్రాండ్ నుంచి సరికొత్త మోడళ్లను పరిచయం చేయనుంది. దేశమంతా ప్రస్తుతం.. సుస్థిరాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో.. బజాజ్ సంస్థ కూడా అందులో భాగం కావాలని భావిస్తోంది. ఇందుకోసం ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇథనాల్‌తో నడిచే మరో వాహనాన్ని కూడా ఈ ఎక్స్ పోలో పరిచయం చేయనుంది. దాంతోపాటు ఇటీవలే వినియోగదారుల ముందుకు తెచ్చిన.. చేతక్ 35 సిరీస్ తోనూ ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement

ప్రధాని మోదీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కానున్న అతిపెద్ద ఆటో ఈవెంట్

ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్ ఈ రోజు ఎంతో ఘనంగా ప్రారంభం కానుంది. జనవరి 17 నుంచి మొదలు అవుతున్న కార్యక్రమం 22 జనవరి 2025 వరకు జరుగుతుంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండప వేడుక ప్రారంభానికి సిద్ధం అయింది. ఈ షోను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM)నిర్వహిస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10 గంటలకు ఈ వేడుకును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మందికి పైగా వస్తారని అంచనా. దీనిలో వాహన తయారీ కంపెనీలు తమ వాహనాలను ఆవిష్కరించబోతున్నాయి. ఇప్పటికే తయారీదారులు అక్కడికి చేరుకుని తమ బైక్స్, స్కూటర్లు, కార్లు, బస్సులు, వాణిజ్య వాహనాలను లాంచ్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈవీల్లో కింగ్ అయ్యేలా హోండా ప్లాన్స్.. ఈ రెండు కొత్త స్కూటర్ల బుకింగ్స్‌లో జోష్!

ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే నడుస్తోంది. ఖర్చులు కలిసి వస్తాయని చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక టూ వీలర్ మార్కెట్‌లోనూ ఈవీల సందడి కొనసాగుతోంది. అనేక స్టార్టప్ సంస్థలతోపాటు దిగ్గజ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో పోటీ పెంచాయి. గతేడాది నవంబర్లో దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ హోండా.. తమ బ్రాండ్ నుంచి తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశంలో లాంఛ్ చేసింది. హోండా activa e, హోండా QC1 పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువచ్చింది. Swappable బ్యాటరీ సదుపాయంతో హోండా activa e మోడల్‌ని తీసుకురాగా.. ఫిక్స్‌డ్ బ్యాటరీతో హోండా QC1 ని తీసుకువచ్చింది. ఈ రెండు స్కూటర్లు బుకింగ్స్‌లో దూసుకుపోతున్నాయి. వీటికి సంబంధించి పూర్తి కథనం

సర్వాంగ సుందరంగా సిద్ధమైన భారత మండపం.. రేపటి నుంచి ఈవెంట్ స్టార్ట్

దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో అట్టహసంగా ప్రారంభం కాబోతుంది. జనవరి 17 నుంచి మొదలుకు కానున్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. దీని కోసం ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. జీ20 సమ్మిట్ తర్వాత ప్రసిద్ధి చెందిన భారత్ మండపంలో ఈ ఆటో ఎక్స్‌పో ఈవెంట్ 22 జనవరి 2025 వరకు జరుగుతుంది. దీనిలో వాహన తయారీ కంపెనీలు పెద్ద ఎత్తున తమ మోడళ్లను ప్రదర్శించబోతున్నాయి. దీనిలో పాల్గొనే కంపెనీలకు చెందిన బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. దేశీయ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు తమ ప్రదర్శనలతో భారత్ మండపాన్ని ఉర్రుతలుగించడానికి సిద్ధం అయ్యాయి.

కొత్త ఈవీతో అంచనాల్ని పెంచేస్తున్న మహీంద్రా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ. వెళ్లేలా..!

జనవరి 17 నుంచి ప్రారంభమయ్యే ఆటో ఎక్స్‌‌పో కోసం.. ఆటోమొబైల్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. వాహన తయారీ సంస్థలు కూడా తమ కొత్త మోడళ్లను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ.. కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు గట్టి ప్లాన్స్‌తో వస్తోంది. తమ బ్రాండ్ నుంచి కొత్త వాహనాలను పరిచయం చేయనుంది. ఈసారి ఆ సంస్థ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పోర్ట్ ఫోలియోను పెంచుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ సంస్థ నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న మహీంద్రా XEV 7e ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది. ఈ కారు విశేషాలేంటి, ఇది మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చూద్దాం.
Advertisement

నెలకు రూ.25 వేలతో ఈ మంచి ఫ్యామిలీ కారును సొంతం చేసుకోండి

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) ప్రతి ఏడాది కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ మెరుగైన సేల్స్‌ను సాధిస్తుంది. ఇతర కార్ల తయారీ దారులతో పోటీ పడుతూ, మార్కెట్లోకి అధునాతన ఫీచర్లతో కూడిన కార్లను లాంచ్ చేస్తుంది. హ్యుందాయ్ కార్లకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. ప్రధానంగా క్రెటా (Creta) కారు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న మోడల్. లాంచ్ అయిన అనతి కాలంలోనే ఇది చాలా మంది కొత్త కస్టమర్లకు చేరుకుంది. దీని పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా పలు డీలర్‌షిప్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో కూడా నగరంలోని పలు షోరూమ్‌లలో లభిస్తుంది. ప్రస్తుతం చాలా మంది కస్టమర్లు లోన్ సౌకర్యాన్ని ఎంచుకుంటున్నారు. వాయిదా పద్దతిలో చెల్లించడం ద్వారా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. క్రింది కథనంలో క్రెటా Onraod ధర, EMI వివరాలు అందించాము.

అదిరే ఆఫర్‌తో ఫ్లిప్‌కార్ట్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు.. కొనాలంటే ఇదే మంచి ఛాన్స్!

పెట్రోల్‌తో నడిచే స్కూటర్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు ఈ మధ్య కాలంలో వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అనేక స్టార్టప్ సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో దూసుకుపోతున్నాయి. మరోవైపు దిగ్గజ సంస్థలు.. కూడా ఈవీల తయారీకి ముందుకు వస్తున్నాయి. ఈవీ సెగ్మెంట్‌లో టీవీఎస్ సంస్థ.. మంచి పేరు సంపాదించింది. టీవీఎస్ ఐక్యూబ్.. ఇ-స్కూటర్ ఈ కంపెనీకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ స్కూటర్‌పై ఇ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రూ. లక్షకు‌ పైగా విలువ చేసే ఈ వాహనాన్ని రూ.86 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

రతన్ టాటాకు ఉన్నంత ప్రజాదరణ పొందిన కారు.. భద్రతలో రారాజు

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ప్రయాణికులకు అవసరమయ్యే సదుపాయాలతో కార్లను విడుదల చేస్తుంది. ఇండియాలో కార్ల ఉత్పత్తిలో మూడో అతిపెద్ద సంస్థగా ఉంది. రతన్ టాటా పేద, మధ్యతరగతి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందుకే తక్కువ ధరల్లో కార్లు విడుదల అవుతుంటాయి. టాటా కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లకు దేశంలో మంచి ఆదరణ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా కార్ల అమ్మకాల్లో ఇది వృద్ధి చెందుతూనే ఉంది. ఇటీవల వరుసగా తన అమ్మకాల వివరాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో టాటా పంచ్ మైక్రో SUV సేల్స్ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, మార్కెట్‌లోకి లాంచ్ అయిన అనతి కాలంలోనే టాటా పంచ్ 5 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2024 ఏడాదిలో కూడా టాటా పంచ్ ఇండియా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు ఎలా ఉందో తెలుసా? దీనిని కొనుగోలు చేయవచ్చా?

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ గత సంవత్సరం ఇదే సమయంలో ఫేస్‌లిఫ్టెడ్ క్రెటాను భారతదేశానికి తీసుకువచ్చింది. అప్పటి నుండి, అప్‌డేట్ చేసిన SUV దేశం అంతటా ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో వినియోగదారులను ఆకర్షిస్తూ బెస్ట్ మోడల్‌గా ఉంది. గత సంవత్సరం ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా ఇండియా రోడ్లపై ప్రయాణించినప్పుడు క్రెటా వేరియంట్ రాక గురించి చాలా మంది ఎదురుచూశారు. ఇది ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్‌గా వెళ్తుంది. వేగంగా గడిచిపోయిన కాలం తరువాత హ్యుందాయ్ సరికొత్త క్రెటా ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చింది. ఇది భారతీయ మాస్-మార్కెట్‌లో మొదటి ఈవీ. దీనిని ఆటో ఎక్స్‌పో 2025లో లాంచ్ చేయబోతున్నారు. దీనికి ముందు సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ను మా డ్రైవ్‌స్పార్క్ టీం టెస్ట్ రైడ్ చేసింది. క్రెటా ఎలక్ట్రిక్‌ కారును నడిపిన సమయంలో మాకు అనిపించి ఎక్స్‌పీరియన్స్ గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.
Advertisement

సేఫ్టీలో తిరుగులేనిదిగా స్కోడా కొత్త కారు.. ఇక దీన్ని కళ్లు మూసుకుని కొనేయొచ్చు!

కారు కొనే ముందు ఎవరైనా సరే.. దాని లుక్, మైలేజ్‌తో పాటు చూసే ముఖ్యమైన అంశం సేఫ్టీ. అన్నీ బాగున్నప్పటికీ.. ఆ కారు సురక్షితం కాదు అని తేలినప్పుడు దాన్ని కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ప్రమాదాలు జరిగినప్పుడు.. ప్రాణాపాయం కలగకుండా ఆ కారులో ఉండే సేఫ్టీ ఫీచర్లు కాపాడుతాయి. కాబట్టి, సేఫ్టీని చూసి కారు కొనుగోలు చేస్తాం. అయితే ఈ కార్లు ఎంత మేరకు సురక్షితమో తేల్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్. ఈ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ ఏ కారైనా పొందితే అది సేఫ్టీ‌లో తిరుగులేనిది అని అర్థం. తాజాగా ఈ క్రాష్ టెస్టులో స్కోడా సంస్థ నుంచి కైలాక్ కారు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. దాని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

షాక్ ఇచ్చిన మరో కంపెనీ.. ఆ టాప్ కారుపై ధర రూ.7,500 పెంపు

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మైక్రో ఎస్యూవీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. హ్యాచ్‌బ్యాక్ ధరల్లోనే ఈ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటులో ఉండడంతో చాలా మంది దీన్ని కొనుగోలు చేస్తున్నారు. దిగ్గజ సంస్థ హ్యూందాయ్ నుంచి వచ్చిన Exter మోడల్.. కస్టమర్లను బాగా ఆకట్టుకుంది. ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీనిచ్చి అనతి కాలంలోనే సేల్స్ పెంచుకుంది. కాంపాక్ట్ అప్పియరెన్స్‌తో తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉండడంతో ఈ మైక్రో ఎస్‌యూవీ వినియోగదారులకు చేరువైంది. ఈ మోడల్.. మార్కెట్లో దూసుకుపోతున్న తరుణంలో హుందాయ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ ఫీచర్స్.. అన్ని అదిరిపోతున్నాయ్..

ఎలక్ట్రిక్ వాహనాలపై క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఖర్చులు కలిసి వస్తాయని చాలా మంది టూ- వీలర్ వినియోగదారులు.. ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. ఓలా, ఏథర్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో తమదైన ముద్ర వేశాయి. మరోవైపు.. మరిన్ని స్టార్టప్ సంస్థలు కూడా వీటి కంటే ముందు నుంచే ఈవీ రంగంలో నిలదొక్కుకుని ఉన్నాయి. ఇలాంటి సంస్థల్లో యాంపియర్ ఒకటి. ఈ కంపెనీ నుంచి నెక్సస్ ఇ-స్కూటర్ ఈ కంపెనీనికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సంస్థ మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. సరికొత్త డిజైన్‌తో వచ్చిన ఈ ఇ-స్కూటర్ ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ స్కూటర్లో ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

కాలేజీ స్టూడెంట్స్ కోసం కొత్త స్పోర్టీ స్కూటర్.. ఫీచర్లకు ఎలాంటి ఢోకా లేదు

కొత్త ఏడాదిలో దేశీయ మార్కెట్లోకి వరుసగా స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. టూవీలర్ తయారీలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీలు పోటా పోటీగా కొత్త స్కూటర్లను విడుదల చేస్తూ, తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. భారత్‌లో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి హోండా తాజాగా కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు 2025 హోండా డియో (Honda Dio).ఇప్పటికే హీరో కంపెనీ స్కూటర్ల విభాగంలో హోండాకు గట్టి పోటీ ఇవ్వడానికి డెస్టినీ మోడల్‌ను తాజాగా లాంచ్ చేయగా, ప్రత్యర్థి కంపెనీ హోండా ఇప్పుడు 2025 డియోను మార్కెట్లోకి దింపింది. ఈ కొత్త మోడల్‌ ఎంట్రీతో మార్కెట్లో పోటీ మరింత తీవ్రం అయింది. హోండా కంపెనీ ప్రసిద్ధ మోడల్ యాక్టివా 125 ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా ఉండగా, అదే ఊపును కొనసాగించడానికి 2025 డియోను కంపెనీ తీసుకొచ్చింది.
Advertisement

చిన్న కుటుంబాలకు మారుతీ బెస్ట్ కారు.. 34.43 కి.మీల మైలేజ్ ఇస్తుంది

భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీదారుగా ఉన్నటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా 2024 ఏడాదిలో కార్ల సేల్స్‌లో దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. కొత్త ఏడాదిలో కూడా కంపెనీ ఇంకా ఎక్కువ అమ్మకాలను నమోదు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. అందులో భాగంగా 2025లో అధునాతన ఫీచర్లతో కూడిన కార్లను విడుదల చేయడానికి ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. మారుతీ Nexa, Arena డీలర్‌షిప్‌ల ద్వారా ఆకట్టుకునే కార్లను వినియోగదారులకు విక్రయిస్తుంది. పాత ఏడాదికి ఘనంగా ముగింపు పలికిన కంపెనీ ఇటీవల వరుసగా తన కార్ల అమ్మకాల వివరాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో మారుతీ తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ సెలెరియో (celerio) డిసెంబర్ నెలకు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. మారుతీ పేర్కొన్నదాని ప్రకారం, సెలెరియో 2024 డిసెంబర్‌లో 748 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఇది గత ఏడాది (2023) డిసెంబర్‌లో 247 యూనిట్లు అమ్ముడుపోయింది.

పెట్రోల్ లేకుండా రోజూ 100 కి.మీలు వెళ్లండి.. 5 సంవత్సరాల వారంటీ!

దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్(Greaves Electric Mobility Limited(GEML)) ఇండియాలో ఈవీ విభాగంలో మంచి పేరున్న సంస్థ. ఇది చాలా ఏళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుంది. దీని కింద పలు బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో ఆంపియర్ (ampere) ఒకటి. ఈ కంపెనీ తాజాగా మార్కెట్లోకి కొత్త మోడల్‌ను విడుదల చేసంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు మాగ్నస్ నియో (magnus Neo). ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైన మోడల్. దీని డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. స్టైలిష్ రూపం అందరినీ ఆకట్టుకుంటుంది. దీని ధర కూడా పేద, మధ్యతరగతి వారు కొనుగోలు చేసే విధంగా అందుబాటులోనే ఉంది. పెర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొత్త మాగ్నస్ నియో రాకతో ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లలో పోటీ మరింత ఎక్కువ అయింది.

మార్కెట్లోకి హీరో సరికొత్త డెస్టినీ 125 స్కూటర్‌ లాంచ్.. దీని ప్రత్యేకతలు ఎంటో తెలుసా?

భారతదేశపు ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటార్‌కార్ప్(Hero Motorcorp) హోండా, టీవీఎస్ వంటి కంపెనీలకు పోటీగా నిలుస్తూ అమ్మకాల్లో ప్రతి ఏడాది మెరుగైన గణాంకాలను నమోదు చేస్తుంది. హీరో బైక్స్, స్కూటర్లు దేశంలో మంచి ఆదరణ కలిగి ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టూవీలర్లను లాంచ్ చేయడంలో ఇది బాగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం కొత్త మోడళ్లను విడుదల చేస్తున్న హీరో సంక్రాంతి నాడు వినియోగదారులకు మంచి శుభవార్త చెప్పింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సరికొత్త 2025 డెస్టినీ 125 (2025 Destini 125) స్కూటర్‌ను దేశంలో విడుదల చేసింది. కొత్త ఏడాది ప్రారంభంలోనే హీరో తన కొత్త స్కూటర్‌తో ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. భారత్‌లో స్కూటర్లకు బాడా డిమాండ్ ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. పురుషులతో పాటు, మహిళలు నడపడానికి స్కూటర్లు ఈజీగా ఉంటాయి.

సరికొత్త చరిత్రను లిఖించిన Tvs జూపిటర్.. సేల్స్‌లో బిగ్గెస్ట్ రికార్డ్

దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ (Tvs Motor)ఇండియాలో చాలా కాలంగా బైక్స్, స్కూటర్లను విక్రయిస్తూ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. ప్రతి ఏడాది అదిరిపోయే మోడళ్లను లాంచ్ చేస్తూ, కొత్త వినియోగదారులను పెంచుకుంటూనే ఉంది. ఈ కంపనీ నుంచి విడుదలయ్యే టూవీలర్స్ ఆకర్షణీయమైన డిజైన్‌, అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తాయి. పైగా వీటి ధరలు కూడా బడ్జెట్ రేంజ్‌లో ఉంటాయి. మధ్యతరగతి వినియోగదారులకు అనుకూలంగా ఉండే ధరల్లో ఇవి కొనుగోలుకు లభిస్తాయి. ఇదిలా ఉంటే టీవీఎస్ కంపెనీకి చెందిన ప్రముఖ మోడల్ జూపిటర్ (Jupiter) కీలక మైలు రాయికి చేరుకుంది. ఇది ఇండియాలో మరో దిగ్గజ కంపెనీ హోండా మోటార్స్‌కు చెందిన యాక్టివా స్కూటర్ (Activa Scooter)కు ప్రత్యర్థిగా ఉంది. టీవీఎస్ కంపెనీ పేరు దేశవ్యాప్తంగా స్కూటర్ల విభాగంలో మారుమోగడానికి ప్రధాన కారణం అయిన జూపిటర్ స్కూటర్ విక్రయాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Advertisement

మోస్ట్ పాపులర్ కారు.. 15 ఏళ్లుగా విజయవంతంగా అమ్ముడవుతున్న మోడల్

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) భారత్‌లో సేల్స్ పరంగా మొదటి స్థానంలో ఉంటుంది. 2024 ఏడాదిలో కంపెనీ టాప్ సెల్లింగ్‌గా నిలిచింది. దశాబ్దాల కాలంగా మారుతీ ఇండియాలో కార్లను విక్రయిస్తూ ప్రతి గ్రామానికి చేరుకుంది. గతంలో విడుదల అయిన చాలా మోడళ్లకు ఇప్పటికి కూడా డిమాండ్ తగ్గడం లేదు. కంపెనీ తన ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ మార్కెట్లోకి లాంచ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఒక మోడల్‌కు దేశంలో ఇప్పటికి డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం. అదే మారుతీ సుజుకీ ఈకో (eeco). ఈ కారు మొదటగా 2010 జనవరిలో విడుదల అయింది. అప్పటి నుంచి కూడా ఇది అమ్మకాల్లో ప్రతి ఏడాది ఎప్పటికప్పుడు దూసుకుపోతుంది.

రూ.20 వేల తగ్గింపు ఆఫర్‌తో కేటీఎమ్ బైక్ మీ సొంతం చేసుకోండి..

లగ్జరీ తరహా బైకులను విడుదల చేసే ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ కేటీఎమ్ (KTM) ఇండియాలో మంచి మార్కెట్ కలిగి ఉంది. కంపెనీ ప్రతి ఏడాది అమ్మకాల పరంగా ఇతర టూవీలర్ తయారీదారుల కంటే వేగంగా దూసుకుపోతుంది. హై పెర్ఫామెన్స్ కోరుకునే చాలా మంది వినియోగదారులు ఎక్కువగా ఈ కంపెనీ బైక్స్‌లను ఎంచుకుంటారు. వీటి స్టైలిష్ డిజైన్‌కు యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. మార్కెట్లో ఎన్నో ఇతర మోడళ్లు ఉన్నప్పటికి కూడా KTM బైక్స్‌కు మాత్రం సపరెట్ ఫ్యాన్ పేజీ ఉంటుంది. 2024 ఏడాదిలో దేశంలో మెరుగైన సేల్స్ సాధించిన కంపెనీ 2025 ఏడాదిలో కూడా అధునాతన మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ప్రధానంగా కంపెనీ కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి తన మోడళ్లపై ప్రత్యేక తగ్గింపులు అందిస్తుంటుంది. గత ఏడాదిలో ఇయర్ ఎండ్ ‌సేల్‌ను తీసుకువచ్చింది.

అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన టాటా కారు.. ఈ 2025లో పోటీ గట్టిగానే!

దిగ్గజ సంస్థ టాటా మోటార్స్... కస్టమర్లను తమ వాహనాలతో ఆకట్టుకుంటూ భారత ఆటో మొబైల్ మార్కెట్లో టాప్‌లో కొనసాగుతోంది. అందుబాటు ధరలో ఉండే వాహనాలను తయారు చేస్తూ అన్ని వర్గాల వారికి చేరువైంది. ఈ కంపెనీ నుంచి కొత్త లాంఛింగ్స్ కోసం వినియోగదారులే కాదు, ప్రత్యర్థి సంస్థలు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తుంటాయి. ఈ 2025లో కొత్త ప్లాన్స్‌తో ముందుకు వస్తోందీ సంస్థ. ఇందులో భాగంగా.. టాటా టిగోర్ సెడాన్ కారు 2025 కొత్త మోడల్‌ను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. రూ.6 లక్షల ఎక్స్ షో రూమ్ ధరలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త సెడాన్‌లో స్పెషాలిటీస్ ఏం ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మైలేజీలో తోపు స్కూటర్లు ఇవే.. అన్నీ 60 పైనే ఇస్తాయ్.. ఇక చూసి తెచ్చేసుకోవడమే!

దేశంలో టూ వీలర్ వినియోగదారులు రోజురోజుకు పెరుగుతున్నారు. అలా పని మీద బయటకు వెళ్లాలన్నా, ఆఫీసుకు వెళ్లాలన్నా, వీకెండ్లో టూర్‌కు వెళ్లాలన్నా.. బైకో లేదా స్కూటరో ఉండాల్సిందే. టూ వీలర్స్ జర్నీకి మాత్రమే కాదు, డబ్బులు సంపాదించడానికి కూడా కొందరికి ఉపయోగపడుతున్నాయి. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోల్లో పని చేసే గిగ్ వర్కర్స్‌కు టూ వీలర్సే జీవనాధారం. దానిపైనే వాళ్ల బతుకు బండి నడుస్తోంది. మైలేజీలో మెరుగ్గా ఉంటుందని కామన్ మ్యాన్స్ టూ వీలర్స్‌ను ఇష్టపడుతుంటారు. అయితే.. ప్రస్తుతం భారత్ లో తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే స్కూటర్లు ఏం ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement

కోడి పందెం గెలిస్తే అదృష్టమే.. ఏకంగా మహీంద్రా థార్ సొంతం అవుతుంది

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. సంసృతి, సాంప్రాదాయాలకు ప్రతిబింబంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, పండుగ సెలబ్రేషన్స్ ఆకాశన్నంటాయి. బ్రతకు దెరువు కోసం గ్రామాలను విడిచి పట్టణాలు బాట పట్టిన వారు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. విద్యార్థులకు కొద్ది రోజల ముందే సెలవులు ఇవ్వడంతో వారంతా ఇప్పటికే తమ స్వగ్రామాలకు చేరుకుని పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ భారీ ఎత్తున జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఇక్కడ కోడి పందాలు, ఎండ్ల బండి పందాలు, గుండాటలు జోరుగా నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈ 2025 సంక్రాంతికి ఏపీలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగ్స్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇది గత ఏడాది కంటే ఈ సారి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.