30 కి.మీల మైలేజ్.. 7 సీటర్ మారుతీ సుజుకీ కొత్త కారు.. అందరూ వెయిటింగ్..
ఆటోమొబైల్స్
- 1 year, 8 month, 10 days ago
దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) 2024 ఏడాదిలో సేల్స్ పరంగా అన్ని కంపెనీల కంటే కూడా టాప్ ప్లేస్‌లో నిలిచింది. గత ఏడాది అదిరిపోయే కార్లను విడుదల చేసి మార్కెట్లో అన్ని వర్గాల వారికి చేరువ కాగా, కొత్త ఏడాది 2025లో కూడా కంపెనీ కార్ల సేల్స్ విషయంలో తన స్థానాన్ని నిలబెట్టుకోడానికి ఈ సంవత్సరం అధునాతన డిజైన్లతో కూడిన కార్లను దేశీయంగా లాంచ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా తన రాబోయే మోడళ్లను మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎగ్జిబిషన్ ఈవెంట్‌లో ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధమైంది. మారుతీ సుజుకీ ఈ ఏడాది 2 కొత్త మిడ్-సైజ్ SUVలను విడుదల చేయాలని ఆలోచన చేస్తుంది. ఇండియాలో మిడ్-సైజ్ సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ ఉన్న తరుణంలో రెండు కార్లను తీసుకురాబోతుంది.