సేఫ్టీ విషయంలో డిజైర్ కారుపై డౌట్స్ క్లియర్... ఈ యాక్సిడెంట్ వీడియోనే సాక్ష్యం

కార్ల సేఫ్టీకి సంబంధించి గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ విధానాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. కొన్ని కార్లను పరీక్షించి, అవి సేఫ్టీ పరంగా ఏ స్థాయిలో ఉన్నాయో తెలుపుతూ వాటికి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ సాధించడం అంటే.. ఆ కారు భద్రతాపరంగా అత్యున్నతం అని అర్థం. అయితే.. ఈ రేటింగ్స్ సాధించిన కార్లు నిజంగా ప్రయాణికులకు సేఫ్టీ అందిస్తాయా అనే విషయంలో వినియోగదారులకు చాలా సందేహాలే ఉండేవి. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి నుంచి 5 స్టార్ రేటింగ్ సాధించిన బ్రాండ్ న్యూ డిజైర్ కారు విషయంలోనూ ఈ సందేహాలు ఎందరికో ఉన్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా ఈ కారు మంచి పేరే సొంతం చేసుకుంది.

సైబర్‌ట్రక్‌తో ఫోటోలు దిగిన హీరోయిన్.. సినిమాలకు బ్రేక్.. దుబాయ్‌లో ఎంజాయ్

తెలుగుతో పాటు తమిళ్, మలయాళ చిత్రసీమలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సునయన (sunaina) ఇటీవల కాలంలో సినిమాలు తక్కువగా చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సునయన తెలుగులో మొదటగా కుమార్ వెర్సస్ కుమారి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళయాళం, కన్నడ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కొన్ని టెలివిజన్ సిరీస్‌లలో కూడా నటించింది. ప్రస్తుతం సినిమాల్లో కనిపించనప్పటికి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు పలకరిస్తుంది. తాజాగా ఆమె అరబ్ దేశానికి చెందిన యూట్యూబర్‌తో రిలేషన్ షిప్ ఉందని ప్రచారం జరుగుతుంది. దుబాయ్‌కి చెందిన ఖలీద్ అల్ అమెరిలలో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమాల్లో యాక్టివ్‌గా లేనప్పటికి దుబాయ్‌లో తన ప్రేమికుడితో కలిసి చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని తెలుస్తుంది.

అయ్యయ్యో.. ఈ కారుకు ఏమైంది?.. ఎందుకింత చిన్న చూపు? ఆరు నెలల్లో అంత తక్కువ‌ మంది కొన్నారా..!

దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా.. తమ వాహనాలతో ఎన్నో ఏళ్లుగా భారత కస్టమర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. అయితే ఈ సంస్థ ఇప్పుడు ఓ కారు కారణంగా కష్టాలెదుర్కొంటోంది! సేల్స్ పెంచుకోలేక సతమతమవుతోంది. అదే మహీంద్రా నుంచి వచ్చిన మరాజో ఎంపీవీ. ఇది లాంచ్‌ అయిన కొత్తలో వినియోగదారులను బాగానే ఆకట్టుకుంది. 7- సీటర్ వాహనాల్లో భారతీయుల్లో చాలామందికి ఫేవరేట్ వాహనంలా నిలిచింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఈ కారుని జనాలు కొనేందుకు భారతీయ వినియోగదారులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.

ఈ ఇ-స్కూటర్‌తో ఖర్చులు సేఫ్ అయినట్లే.. అదిరే లుక్‌లో, అదుర్స్ అనిపించే ఫీచర్లతో!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. టూ వీలర్ వినియోగదారుల్లో చాలామంది ఇప్పుడు ఈవీలవైపు మొగ్గుచూపుతున్నారు. ఓలా, ఏథర్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఈ రంగంలో సత్తా చాటుతున్నాయి. మరోవైపు కొన్ని స్టార్టప్ సంస్థలు కూడా తమ ఈవీలతో మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. భారతీయ వినియోగదారులు వాహనం బాగుంటే చాలు.. బ్రాండ్‌తో సంబంధం లేకుండా.. ఈవీలను ఆదరిస్తూ వస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నాసిక్‌కు చెందిన జితేంద్ర ఈవీ అనే టూ వీలర్ స్టార్టప్ సంస్థ తమ కొత్త మోడల్‌తో మార్కెట్లోకి వచ్చేసింది. యూనిక్ పేరుతో తీసుకువచ్చిన ఈ ఇ-స్కూటర్‌ను అనేక ప్రత్యేకతలతో తయారు చేసింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
Advertisement

మార్కెట్లోకి అదిరిపోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. అదరగొట్టిందా? ఫర్ఫామెన్స్‌ ఎలా ఉందంటే?

ద్విచక్ర వాహనాల EV మార్కెట్‌లో బెంగళూరుకు చెందిన మరో స్టార్టప్ న్యూమెరోస్ మోటార్స్, మార్చి 2024లో డిప్లోస్ ప్రోను ప్రారంభించింది. వాణిజ్య విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వెనుక క్యారియర్, పెద్ద-ఇష్ ఫ్లోర్‌బోర్డ్ మరియు కఠినమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. . ఇది క్లెయిమ్ చేయబడిన IDC పరిధి 140కిమీ.

ఒక్క సారి ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీల పైనే.. 5 మందికి ఖర్చు చాలా తక్కువ

దేశీయ దిగ్గజ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) కార్ల సేల్స్‌లో అగ్రస్థానంలో ఉంటుంది. తక్కువ ధరలో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు మొదటగా ఈ కంపెనీ వైపు చూస్తారు. మధ్య తరగతి వినియోగదారులు ఎక్కువగా మారుతీ కార్లను వాడుతుంటారు. ప్రతి ఏడాది కూడా కంపెనీ వాహనాల సేల్స్ ఇతర కంపెనీల కంటే అధికంగా నమోదు అవుతుంటాయి. 2024 ఏడాదిలో ఇండియాలో కార్ల అమ్మకాల పరంగా మారుతీ సుజుకీ టాప్ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల ముగిసిన తరువాత తాజాగా ఆ నెలలో మోడళ్ల వారీగా జరిగిన సేల్స్ వివరాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో మారుతీకి చెందిన ప్రసిద్ధ కాంపాక్ట్ SUV ఫ్రాంక్స్(fronx) సేల్స్ డేటాను ప్రకటించింది. ఈ కారు గత నెలలో మెరుగైన అమ్మకాలను సాధించింది.

హ్యుందాయ్‌ ఐ10 నియోస్‌, వెర్నా, వెన్యూ కార్లు విడుదల.. స్పెషల్‌ ఏంటంటే?

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన లైనప్‌లోని వెర్నా, వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్‌ కార్లను కొత్త వేరియంట్లలో విడుదల చేసింది. ఈ మూడు హ్యుందాయ్‌ కార్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న కొన్ని వెర్షన్లను అప్‌గ్రేడ్ చేసి తీసుకువచ్చింది. ఎంట్రీ లెవల్ కారు గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లోని స్పోర్ట్స్ (ఓ) వేరియంట్‌ ఇప్పుడు కొత్త 1.2 లీటర్ల కప్పా పెట్రోల్‌ ఇంజిన్‌ మాన్యువల్‌తో పాటు AMT గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. దీని మాన్యువల్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధర రూ.7,72,300 కాగా, AMT వేరియంట్ ధర రూ.8,29,100 ఎక్స్‌షోరూమ్‌గా ఉంది.

రోడ్డు యాక్సిడెంట్లను తగ్గించడానికి ఇకపై సేఫ్టీ పరికరాలు తప్పనిసరి

ఇండియాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. దేశంలో చోటుచేసుకుంటున్న మరణాల్లో ఎక్కువగా యాక్సిడెంట్ల ద్వారానే నమోదు అవుతున్నాయి. ప్రతి నిమిషం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంపై ఆందోళన చేస్తూ వీటిని తగ్గించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనికోసం ఆయన కఠిన నిబంధనలను రూపొందించమని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇక మీదట ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి భారీ వాహనాల్లో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
Advertisement

ఈవీలపై భారీ తగ్గింపు ప్రకటించి టాటా మోటార్స్ సంస్థ... ఏకంగా రూ.85,000 వరకు డిస్కౌంట్!

భారత ఆటోమోబైల్ ఇండస్ట్రీలో.. తమ వాహనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాటా మోటార్స్ సంస్థ. అన్ని వర్గాల వినియోగదారులకు సరిపడే వాహనాలను తయారు చేస్తూ కస్టమర్స్ నుంచి మన్ననలు అందుకుంటూ ఉంది. ఈవీల్లోనూ తగ్గేదేలా అన్నట్లుగా తమ జోరు చూపెడుతోంది. ఈ సంస్థ నుంచి గతేడాది టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) మోడళ్లు అమ్మకాలతో అదరగొట్టాయి. ఇప్పుడు తమ సేల్స్‌ను మరింత పెంచుకునేందుకు టాటా మోటార్స్ సంస్థ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు మోడళ్ల ఈవీలపై ఏకంగా రూ.85,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు అందుబాటులో ఉండనుంది? ఈ తగ్గింపుతో ఈ కార్ల ధరలు ఎలా ఉండబోతున్నాయి? వంటి వివరాలు చూసేద్దాం.

ఒక నెలలో కేవలం 24 మంది మాత్రమే కొన్న ఎలక్ట్రిక్ కారు ఇదే

భారతదేశపు ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ఇప్పటికే పెట్రోల్, డీజిల్ విభాగాల్లో తన కార్లను విక్రయిస్తుంది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఆ దిశగా అడుగులు వేస్తూ ఈవీ విభాగంలో కూడా తన కార్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా గతంలో ఐయోనిక్ 5(Ioniq 5) ఈవీ కారును తీసుకొచ్చింది. ప్రస్తుతం దీన్నే విక్రయిస్తుంది. ప్రపంచంతో పాటు భారత మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనే వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో ఈ పరిశ్రమలో పోటీ ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలో ఈవీ తయారీదారులు పోటీ పడుతూ మరి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నారు. ఈ కొత్త 2025 ఏడాదిలో కూడా అధునాతన ఈవీలు రాబోతున్నాయి.

మంచి మైలేజీ ఇచ్చే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే వీటిపై తప్పక లుక్కేయాల్సిందే!

కారు కొనేటప్పుడు ఎవరైనా సరే దాని డిజైన్, బ్రాండ‌తో పాటు ముఖ్యంగా చూసే అంశం మైలేజీ. అసలే ఫ్యూయల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనం ఉంటే.. ఖర్చులను కొంతైనా తగ్గించుకోగలం. అందుకే మార్కెట్లో మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లకు డిమాండ్ ఎక్కువ. తయారీదారులు కూడా వీలైనంత మేరకు ఇలాంటి కార్లను తయారు చేసేందుకే ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం దేశంలో స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల హవా కొనసాగుతోంది. ఈ సెగ్మెంట్‌లో మరిన్ని ఆప్షన్ల కోసం వినియోగాదారులు ఎదురు చూస్తున్నారు. దీంతో దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు తమ బ్రాండ్ నుంచి కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఏయే కార్లు మార్కెట్లో హల్‌చల్ చేయనున్నాయో చూసేద్దాం.

టాప్ కంపెనీ నుంచి కొత్త ఈవీ వచ్చేస్తోంది... ఖర్చులు తగ్గించాలనుకునేవారికి కరెక్ట్ ఛాయిస్!

దేశంలో ప్రస్తుతం ఈవీల జోరు కొనసాగుతోంది. భారతీయ వినియోగదారులు వీటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ వాహన తయారీ సంస్థలు కూడా గేరు మార్చి, ఈవీల తయారీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇదే కోవాలో ఇప్పుడు దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ టయోటా.. ఈవీల్లో మరో అడుగు ముందుకు వేసింది. తమ బ్రాండ్ నుంచి అర్బన్ క్రూజర్ ఈవీని లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఈవీనీ ఈ నెలలో జరగనున్న భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఇంట్రడ్యూజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తమ జీరో- ఎమిషన్ వాహనాల లైనప్‌ను విస్తరించాలని భావిస్తున్న టయోటా.. ఈ ఈవీతో సేల్స్ పెంచుకోవాలని చూస్తోంది. మరి ఈవీ ఎలా ఉండబోతుంది? దీని ఫీచర్లలో ఏమేం ఉండబోతున్నాయి? వంటివి చూసేద్దాం.
Advertisement

రోడ్డుపై బైక్‌తో స్టంట్లు.. ఎదురుగా ట్రక్కు.. తరువాత ఏ జరిగిందంటే..

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఓ రేంజ్‌లో పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి ఘటన జరిగిన కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. చాలా మంది సెలబ్రిటీ హోదా పొందడానికి ఇష్టం వచ్చినట్లు రీల్స్ చేస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంత మంది అయితే ఇలా రీల్స్ కోసం వీడియోలను చేస్తున్న సమయంలో తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. ప్రాణాలు పోతున్న ఘటనలు జరుగుతున్నా కూడా ప్రమాదకరమైన రీతిలో వీడియోలను తీయడం మాత్రం ఆపడం లేదు. ముఖ్యంగా రీల్స్ కోసం బైక్స్‌తో రోడ్లపై ఇతరుల ప్రాణాలతో పాటు తమ ప్రాణాలకు ప్రమాదం జరిగే విధంగా రాష్ డ్రైవింగ్ చేస్తున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇటీవలే ఇలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వచ్చే వాహనాలను పట్టించుకోకుండా బైక్స్‌తో స్టంట్లు వేయగా ఎదురుగా ట్రక్కును తాకి కింద పడిపోయారు.

హీరో అజిత్‌కు యాక్సిడెంట్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

హీరో అజిత్ కుమార్‌కు కార్లు, బైకులన్న చాలా ఇష్టం అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన ఒక రేసర్. గతంలో చాలా సార్లు ఇలాంటి వాటిల్లో పాల్గొన్నారు. రోడ్లపై స్పోర్ట్స్ బైకులతో రైడింగ్ చేస్తూ కెమెరాల కంట పడ్డారు. అయితే తాజాగా హీరో అజిత్‌కు ఒక ప్రమాదం జరిగింది. కార్ రేసింగ్‌లో పాల్గొనడానికి ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో కార్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. అజిత్‌కు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే సీని తారలతో పాటు, ఆయన అభిమానులు చాలా కంగారు పడ్డారు. అయితే అజిత్‌కు ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ న్యూస్‌గా మారింది. వీడియోను చూసిన అందరూ కూడా తమ అభిమాన హీరో క్షేమంగా ఉన్నాడని సంతోష పడుతున్నారు.

టాప్‌ ఎలక్ట్రిక్ కార్ ధరను పెంచేసిన సంస్థ.. ఎంత పెరిగిందంటే?

గత కొన్ని రోజులుగా దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ఎంజీ మోటార్స్‌ తెరపైకి వచ్చింది. ఈ కంపెనీకి చెందిన ఎంజీ కామెట్‌, ఎంజీ జెడ్‌ఎస్‌, ఎంజీ విండ్సర్‌ ఎలక్ట్రిక్‌ కార్లు అమ్మకాల్లో టాటా కార్లను అధిగమించాయి. ప్రస్తుతం ప్రతీ నెలా మార్కెట్‌లో వీటి సేల్స్‌ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సీన్‌ మారిపోయింది. భారత్‌లో ఎంజీ మోటార్స్‌ నుంచి అడుగుపెట్టిన విండ్సర్‌ ఈవీ అమ్మకాల్లో దూసుకెళ్తుంది. ప్రస్తుతం విండ్సర్‌ ఈవీ టాప్‌లో కొనసాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇకపై ఈ కారుని కొనుగోలు చేసే వారికి షాక్‌ తగలనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

100 మందిలో 90 మంది ఫ్యాన్స్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న థార్

భారతీయ వాహన పరిశ్రమలో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి మహీంద్రా(Mahindra) తన కార్ల అమ్మకాలతో దూసుకుపోతుంది. వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో సరికొత్త డిజైన్లతో వాహనాలను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే, SUV విభాగంలో తన పట్టును నిలుపుకోవడానికి గతంలో తీసుకొచ్చిన థార్(Thar) మోడల్ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కారుగా నిలిచింది. థార్‌కు దేశవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇది ఆఫ్ రోడ్ ప్రయాణాలకు అత్యంత అనువైన మోడల్. దీని ఆకట్టుకునే డిజైన్, పెర్ఫామెన్స్‌తో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల అమ్మకాలను సాధించింది. దేశంలో చాలా మంది ఈ మోడల్‌కు ఫ్యాన్స్‌గా ఉన్నారు. దీంతో రోడ్డుపై ప్రయాణం చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇది అన్ని నగరాలు, పట్టణాల్లో కనిపిస్తుంది. ఇది మార్కెట్లోకి లాంచ్ అయినప్పటి నుంచి మహీంద్రా కంపెనీ అమ్మకాల్లో ఇదే హైలెట్‌గా నిలుస్తుంది.
Advertisement

ఆ హ్యుందాయ్‌ కారు ధర పెరిగింది.. ఎంత పెంచారంటే?

ఈ కొత్త సంవత్సరంలో కారును కొనాలనుకునే వారికి కార్ల కంపెనీలు ఝలక్ ఇస్తున్నాయి. కారు కోసం డబ్బులు కూడబెట్టుకుని మంచి కారు కొనుగోలు చేయాలనుకునే జనాల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. రేటుపోటుతో హడలెత్తిస్తున్నాయి. మొన్న సిట్రోయిన్ సంస్థ తమ కారు ధరను పెంచగా.. ఇప్పుడిక దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యూందాయ్ వంతు వచ్చింది. 2025 జనవరిలో తమ బ్రాండ్ నుంచి కొన్ని వాహనాల ధరలు పెంచనున్నట్లు గత డిసెంబరులోనే ఈ సంస్థ ప్రకటించింది. చెప్పినట్లుగానే.. తమ సంస్థ నుంచి ఓ కారు మోడల్ ధరను అమాంతం పెంచేసింది. దీంతో ఫ్యాన్స్‌కు షాక్ తగిలినట్లయింది. అసలు హ్యూందాయ్ సంస్థ కారు ధరను పెంచడానికి దారి తీసిన పరిస్థితులేంటి? ఇప్పుడిక ఈ కార్ల ధరలు ఎలా ఉండబోతున్నాయి? వంటి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

మారుతీ బంపర్ ఆఫర్.. రూ.2.15 లక్షల తగ్గింపుతో కారును సొంతం చేసుకునే ఛాన్స్

కొత్తగా కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు పండగ సమయాల్లో కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. దీనికి ప్రధాన కారణం వాహన తయారీ కంపెనీలు ఫెస్టివల్స్‌కు తమ కార్లపై భారీ ఎత్తున తగ్గింపులు, డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్‌ను అందిస్తుంటాయి. దీంతో కొత్త కస్టమర్లు వీటిని సద్వినియోగం చేసుకుని కార్లను తక్కువ ధరకే కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్తుంటారు. 2024 ఏడాది దసరా, దీపావళి సమయాల్లో కార్ల తయారీ కంపెనీలు తమ మోడళ్లపై తగ్గింపులను ప్రకటించడం వలన చాలా మంది కస్టమర్లు తమకు నచ్చిన కారును తక్కువకే కొన్నారు. పండగల లేని సమయాల్లో సేల్స్ సాధారణంగా తక్కువగా జరుగుతుంటాయి. ఒక ఏడాదిలో మొత్తం జరిగే అమ్మకాల్లో సగానికి పైగా ఫెస్టివల్ సమయాల్లో నమోదు అవుతుంటాయి. భారత్‌లో ప్రజలందరూ కూడా పండగ సమయాల్లోనే కొత్త కార్లను తమ ఇంటికి తెచ్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.

Auto Expo 2025 ఆటో ఎక్స్‌పోలో విడుదల కానున్న కార్లు ఇవే!

న్యూఢిల్లీలో జనవరి 17న నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 (Bharat Mobility Auto Expo 2025) ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లో భారతీయ ఆటో కంపెనీలు తమ ఉత్పత్తులను ఆవిష్కరించే అవకాశం ఉంది. పలు సంస్థలు భవిష్యత్తులో తాము ప్రకటించబోయే లేదా విడుదల చేసే వెహికిల్స్‌ని ప్రదర్శించనున్నారు. దీంతో ఈ ఎక్స్‌పో పై ఆటోమోబైల్‌ ఔత్సాహికులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ ఎక్స్‌పోలో భారత మార్కెట్‌లో విడుదల కాబోయే ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎక్స్‌పోలో విడుదల కాబోయే కార్లపై ఓ లుక్కేయండి.

ఇ- స్కూటర్లతో రానున్న వింటేజ్‌ కంపెనీ... అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో అదిరిపోయెట్టుగా!

ప్రస్తుతం భారత్‌లో ఈవీల హవా కొనసాగుతోంది. ఫ్యూయల్ ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతుండడం.. కాలుష్యం అధికమవడం వంటి కారణాలతో జనం ఈవీ వాహనాలను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో అనేక వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారు చేసి, పోటీ పెంచుతున్నాయి. టు- వీలర్స్ విషయంలో దిగ్గజ సంస్థలెన్నో ఈవీలతో తమ మార్క్ చూపెట్టాయి. 90వ దశకంలో ఓ వెలుగు వెలుగిన దిగ్గజ టూ-వీలర్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. అదే ఎల్ఎమ్‌ఎల్ (LML). ఈ విషయం తెలియగానే టూ-వీలర్ ప్రేమికులు ఎల్‌ఎమ్‌ఎల్ సంస్థ గురించి మళ్లీ ఆరా తీస్తున్నారు. ఈ సరికొత్త స్కూటర్‌ ఎలా ఉండబోతుంది, దీని ఫర్పామెన్స్‌, ప్రత్యర్థి స్కూటర్లకు సంబంధించిన వివరాలు ఇక్కడ మీకోసం..
Advertisement

పేదలకు ఇష్టమైన మారుతీ సుజుకీ నుంచి వస్తున్న కార్లు ఇవే

ఎన్నో కొత్త ఆశలతో అడుగుపెట్టిన 2025 ఏడాదిలో దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) పలు కొత్త కార్లను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024లో అమ్మకాల పరంగా ఈ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాదిలో కొత్త మోడళ్లను విడుదల చేసి, వాటిని విజయవంతంగా అన్ని వర్గాల కస్టమర్లకు చేర్చగా, ఇప్పుడు 2025లో అంతకంటే ఎక్కువ సేల్స్‌ను సాధించడానికి, మిగతా కంపెనీల కంటే టాప్ ప్లేస్‌‌లో నిలవడానికి అదిరిపోయే ఫీచర్లతో, ప్రజలకు అందుబాటు ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను ఈ ఏడాది లాంచ్ చేయడానికి సిద్ధం అయింది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ మోడళ్లను కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. మారుతీ సుజుకీ నుంచి ఈ ఏడాదిలో గ్రాండ్ విటారా, బాలెనో వంటి కార్లు లాంచ్ కాబోతున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 కొత్త మోడళ్లను దింపుతున్న డుకాటీ

టూవీలర్ తయారీ కంపెనీ డుకాటీ (Ducati) లగ్జరీ లుక్‌తో అదిరిపోయే బైకులను విడుదల చేస్తూ ప్రపంచంలో దిగ్గజ టూవీలర్ కంపెనీగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పలు మోడళ్లను లాంచ్ చేస్తూనే ఇండియాలో కూడా అధునాతన ఫీచర్లతో కూడిన బైకులను విడుదల చేస్తూ, చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. డుకాటీ బైకులంటే సాధారణంగా యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. ఇండియాలో చాలా కాలంగా కంపెనీ తన వాహనాలను విక్రయిస్తుంది. ప్రతి ఏడాది కొత్త కస్టమర్లను సంపాదించడానికి కొత్త కొత్త డిజైన్లతో అదిరిపోయే బైకులను విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో కూడా పలు మోడళ్లను లాంచ్ చేయడానికి డుకాటీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో టూవీలర్ పరిశ్రమ అభివృద్ధికి అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. దీంతో ఇక్కడి మార్కెట్లో పోటీ ఎక్కువ అయింది.

ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన కారు కంపెనీ.. ఆ కారు ధర మరింత ప్రీమియం!

భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో నంబర్ వన్‌గా ఎదగాలనే లక్ష్యంతో ఎంట్రీ ఇచ్చింది ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్. అమ్మకాలతో ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని భావించింది. అయితే.. ఈ సంస్థ ఆశలు అనుకున్నంత మేర నెరవేరలేదనే చెప్పాలి. అమ్మకాల పరంగా పోటీలో టాప్ కంపెనీలతో పోలిస్తే వెనుకంజలోనే ఉంది. బసాల్ట్ కూప్ ఎస్‌యూవీతో సేల్స్ పరంగా కాస్తో కూస్తో మంచి ఫలితాలు రాబట్టిన ఈ కంపెనీ.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ మోడల్ ఫ్యాన్స్‌కు షాక్ తగిలినట్లు అయింది. మంచి డిమాండ్ ఉన్నప్పుడు దీని ధర తగ్గించడానికి గల కారణమేంటి? ఇప్పుడు దీని రేట్లు ఎలా ఉండబోతున్నాయి? ఈ స్టొరీలో తెలుసుకుందాం.

తక్కువ ధరలో.. బెస్ట్ మైలైజ్ ఇచ్చే మారుతీ సుజుకీ కార్లపై ఓ లుక్కేయండి

ఇండియాలో ఎక్కువ మైలేజ్ అందించే కార్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో రోజువారీ అవసరాలతో పాటు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ టూర్లకు వెళ్లడానికి మైలేజ్ ఇచ్చే కార్లను ఎంపిక చేసుకుని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా వాహన తయారీ కంపెనీలు అధునాతన డిజైన్లతో, సరికొత్త ఫీచర్లతో ఎక్కువ మైలేజ్ అందించే కార్లను విడుదల చేస్తున్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన మోడల్‌ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఆటోమొబైల్ రంగంలో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కార్ల తయారీ కంపెనీలు పోటీ పడుతూ మైలేజ్ విషయంలో కీలకంగా దృష్టి సారించాయి. అందుకే కార్లను లాంచ్ చేస్తున్న సమయంలో లీటర్ పెట్రోల్‌కు లేదా డీజిల్‌కు వచ్చే మైలేజ్‌ను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా మారుతీ సుజుకీ ఈ విభాగంలో ముందు స్థానంలో ఉంటుంది.
Advertisement

టాప్ కంపెనీ నుంచి రానున్న 3 కొత్త కార్లు.. అందరి కళ్లు వీటిపైనే!

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రత్యేక బ్రాండ్ సొంతం చేసుకున్న ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్.. ఈ ఏడాది పక్కా ప్లాన్స్‌తో రాబోతోంది. ఇప్పటికే.. ఈ సంస్థ నుంచి క్విడ్ హ్యాచ్‌బ్యాక్, సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన కైగర్ (kiger), ట్రైబర్ ఎంపీవీతో అమ్మకాల్లో తన జోష్ చూపెట్టింది. ఈసారి ఈ సంస్థ తమ కార్లను అప్డేట్ చేసి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. న్యూ జనరేషన్ ట్రైబర్ ఎంపీవీ, కైగర్ ఎస్‌యూవీలను ఈ ఏడాది రెండో అర్ధభాగంలో లాంచ్ చేయనుంది. అలాగే ఇదే సంస్థ నుంచి మరో మోడల్ అయిన డస్టర్ ఎస్‌యూవీని 2026లో లాంచ్ చేయాలని తమ షెడ్యూల్ సెట్ చేసుకుంది. మరి ఈ అప్డేటెడ్ కార్లలో ఉండే విశేషాలేంటో చూసేద్దాం.