సింగిల్ ఛార్జ్‌తో 90 కిమీ.. ఆటోడ్రైవర్ల కడుపు నింపే ఆటో
ఆటోమొబైల్స్
- 2 month, 8 days ago
భారతదేశంలో కమర్షియల్ వాహనాల రంగంలో తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న పియాజియో (Piaggio) సంస్థ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్‌లో సరికొత్త దాడికి తెరలేపింది. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తూ ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంలో తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియోను విస్తరించింది. ఇందులో భాగంగానే సరికొత్త ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో ఆపే వేవ్ (Ape WavE)ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సామాన్యుల, మధ్య తరగతి ఆటో డ్రైవర్ల బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ ఆటోను ఎల్3 (L3) ప్యాసింజర్ ఈవీ కేటగిరీ కింద అందుబాటులోకి తెచ్చింది. భారత మార్కెట్లో ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరను కేవలం రూ.2.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.