ఇండియాలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఈవీని దించుతున్న టాటా మోటార్స్

భారతదేశపు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఈవీ ప్రియుల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా సియెర్రా EV (Tata Sierra EV) ప్రొడక్షన్ మోడల్ లాంచ్ డేట్‌ను కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ సరికొత్త ఆల్-న్యూ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జూన్ 30న భారత మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఒకప్పుడు భారత రోడ్లపై సంచలనం సృష్టించిన ఐకానిక్ సియెర్రా కారును, ఇప్పుడు సరికొత్త మోడ్రన్ ఎలక్ట్రిక్ అవతారంలో టాటా సంస్థ రీ-లాంచ్ చేస్తుండటంతో మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

10 వేల మార్క్ దాటిన ఇన్నోవా.. ఈ కారుకు క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు!

భారతీయ మార్కెట్లో టయోటా ఇన్నోవా (Toyota Innova)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ వినియోగం, కమర్షియల్ అవసరాలు, దూర ప్రయాణాలు.. ఇలా ఏ కోణంలో చూసినా ఇన్నోవా తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సంవత్సరాలు గడిచినా ఈ ఎంపీవీకి ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ప్రస్తుతం టయోటా ఈ వాహనాన్ని ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తోంది. ఈ రెండు మోడళ్లకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా విడుదలైన మే 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, మే 2026 నెలలో ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ కలిపి మొత్తం 10,325 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ధర కేవలం రూ.4.24 లక్షలే.. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 1200 కిమీ రేంజ్ ఇచ్చే కారు

భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వినియోగాన్ని పెంచాలని స్వయంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దీని తర్వాత దేశీయ ఈవీ మార్కెట్‌లో ఊహించని రేంజ్ డిమాండ్ పెరిగింది. చాలా మంది కస్టమర్లు తమ పాత ఐసీఈ (ICE-పెట్రోల్/డీజిల్) వాహనాలను వదిలేసి ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

వాహన నిర్వహణ ఖర్చులు సంవత్సరాలుగా ఎందుకు పెరుగుతాయి? అసలు కారణాలు ఇవే!

Vehicle maintenance tips. వాహనం పాతబడే కొద్దీ మెయింటెనెన్స్ ఖర్చులు ఎందుకు పెరుగుతాయో తెలుసుకోండి. ఇంజిన్ ఆరోగ్యం, విడిభాగాల మార్పు మరియు ఖర్చులను తగ్గించుకునే మార్గాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Advertisement

ఇండియాలో రాబోయే టాప్ 5 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు

భారత ఆటోమొబైల్ రంగంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex Fuel) కార్లకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఆధారిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా దేశంలో కీలక అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా దేశంలోనే తొలి E85 ఫ్యూయల్ డిస్పెన్సింగ్ స్టేషన్ ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైంది. అదే సమయంలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ దేశంలోని తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా గుర్తింపు పొందింది. ఇది పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ కలిగిన ఇంధనంతో కూడా నడుస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు తమ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. దీంతో ఈ జాబితా మరింత విస్తరించే అవకాశం ఉంది. త్వరలో రానున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు ఏవో తెలుసుకుందాం.

కేరళ వ్యక్తి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతుండటంతో చాలా మంది వినియోగదారులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల కోసం చూస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి తన అవసరాలకు అనుగుణంగా స్వయంగా ఎలక్ట్రిక్ కారును తయారు చేసుకుని ఉపయోగించడం చాలా అరుదుగా కనిపించే విషయం. అలాంటి అరుదైన ఘనతను కేరళ రాష్ట్రానికి చెందిన 67 ఏళ్ల ఆంటోనీ జాన్ సాధించారు. ఇది సుమారు 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. కానీ పాఠకుల కోసం ఇప్పుడు ఈ కథణంలో ఆయన తయారు చేసిన కారు గురించిన వివరాలు చూద్దాం.

ఇంజిన్ ఒక్కసారిగా ఎందుకు కంపిస్తుంది? దీని వెనుక ఉన్న షాకింగ్ కారణాలు ఇవే!

Engine vibration causes. మీ కారు ఇంజిన్ అసాధారణంగా కంపిస్తుందా? స్పార్క్ ప్లగ్స్ నుండి ఇంజిన్ మౌంట్స్ వరకు, ఈ సమస్యకు గల ప్రధాన కారణాలు మరియు పరిష్కారాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

ఏనుగు సైజున్న మారుతి కారుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కుటుంబ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన వాహనాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, దూర ప్రయాణాలు చేసే వినియోగదారులు ఎక్కువ సీటింగ్ సామర్థ్యం, విశాలమైన కేబిన్, మెరుగైన సౌకర్యాలు కలిగిన MPV కార్లను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విభాగంలో మారుతి సుజుకి ఎక్స్‌ఎల్6 (Marutu Suzuki Xl6) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రీమియం డిజైన్, ఆరు సీట్ల లేఅవుట్, అధునాతన ఫీచర్లు, మారుతి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కారణంగా ఈ మోడల్‌కు మార్కెట్లో స్థిరమైన డిమాండ్ కొనసాగుతోంది. తాజాగా విడుదలైన విక్రయ గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Advertisement

10 లక్షల మార్క్ దాటిన టీవీఎస్.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త చరిత్ర!

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశీయ ఈవీ మార్కెట్లో తన స్థాయిని మరింత బలపరుచుకుంటూ, భారతదేశంలో 10 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల మైలురాయిని అధిగమించిన కంపెనీగా టీవీఎస్ కొత్త చరిత్ర సృష్టించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకున్న ఈ సంస్థ, జూన్ 11 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 10.04 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి ఈ అరుదైన ఘనతను నమోదు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల ఆసక్తి గణనీయంగా పెరిగింది.

క్రాష్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన కియా కారు

భారతదేశంలో తయారైన కార్లు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ (Kia Motors) తన భారతీయ తయారీ కేంద్రాన్ని గ్లోబల్ ఎగుమతి హబ్‌గా ఉపయోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న కియా తయారీ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే అనేక మోడళ్లు దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ మార్కెట్లకు కూడా పంపబడుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన కియా సోనెట్ (Kia Sonet) కూడా ఉంది. భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందిన ఈ మోడల్, ఆఫ్రికా దేశాల్లో కూడా విక్రయించబడుతోంది. అయితే తాజాగా విడుదలైన ఒక భద్రతా పరీక్ష ఫలితం కియా సోనెట్‌కు సంబంధించిన కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

టాటా నుంచి మరో సంచలనం.. జూన్‌లోనే మార్కెట్‌ను షేక్ చేసే కారు రాబోతుంది!

టాటా మోటార్స్ (tata motors) తన ఐకానిక్ సియెర్రా (Sierra) పేరును మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకువచ్చినప్పటి నుంచి ఈ మోడల్‌పై వినియోగదారుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది. 1990లలో భారత ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన సియెర్రాను, కంపెనీ ఆధునిక డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో తిరిగి పరిచయం చేసింది. 2025 నవంబర్‌లో ఐసీఈ (పెట్రోల్-డీజిల్) వెర్షన్ రూపంలో మార్కెట్లోకి వచ్చిన ఈ ఎస్‌యూవీకి మంచి స్పందన లభిస్తోంది. పాత సియెర్రా గుర్తులను గుర్తుకు తెస్తూనే, కొత్త తరం కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన డిజైన్ ఈ మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది.

టీవీఎస్, బజాజ్ మధ్య దూసుకెళ్తున్న రివర్ ఇండీ

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు మొత్తం టూ-వీలర్ మార్కెట్‌లో కేవలం 6 శాతం వాటాతో పరిమితమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఇప్పుడు 2026 నాటికి 8 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుని తమ బలాన్ని చాటుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మెరుగైన ఛార్జింగ్ సదుపాయాలు వంటి అంశాలు వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఈవీ రంగంలో పోటీ మరింత తీవ్రమవుతోంది. ఇలాంటి అనుకూల పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ బెంగళూరుకు చెందిన రివర్ మొబిలిటీ తన 'రివర్ ఇండీ' ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.
Advertisement

అదనపు బరువు పెరిగితే మైలేజ్ ఎందుకు పడిపోతుంది? నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు!

Fuel efficiency tips. మీ కారులో అనవసరమైన బరువు పెరిగితే మైలేజ్ భారీగా తగ్గుతుంది. ఇంజిన్ పనితీరు మరియు ఇంధన పొదుపుపై బరువు చూపే ప్రభావం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

గెటప్ మార్చి అదిరిపోయే లుక్‎లో వస్తున్న టాటా సుమో

భారత ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు తిరుగులేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన మోడల్ టాటా సుమో (Tata Sumo). ఒక తరం వినియోగదారులను ఎంతగానో అలరించిన ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీని భారతీయులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఇటీవల టాటా మోటార్స్ తన పాత ఐకానిక్ మోడల్ సియెర్రా (Sierra)ను కొత్త రూపంలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి, పాత సుమో కూడా తిరిగి వస్తే బాగుంటుందని వాహన ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆటోమొబైల్ డిజైన్ సంస్థ SRK డిజైన్స్ సరికొత్త టాటా సుమో ఎలా ఉండబోతుందో ఊహిస్తూ ఒక కాన్సెప్ట్ రూపాన్ని సృష్టించింది.

ఈ కారు మీ ఇంటి ముందు ఉంటే.. కాలనీలో మీకే స్పెషల్ క్రేజ్!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ ప్రస్తుతం అత్యంత పోటీతో కూడుకున్న విభాగంగా మారింది. ఈ సెగ్మెంట్‌లో అనేక కంపెనీలు తమ మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, Toyota అందిస్తున్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Urban cruiser hyryder) మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, హైబ్రిడ్ టెక్నాలజీ, మెరుగైన మైలేజ్, టయోటా బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం వంటి అంశాలు ఈ SUVను కొనుగోలుదారులలో ప్రముఖ ఎంపికగా మార్చాయి. మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే హైరైడర్ మంచి ఆదరణ పొందగా, తాజాగా విడుదలైన మే 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఈ SUVపై ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.

పేదోడి బెంజ్ కారు.. బైక్ ధరకే వస్తోంది.. పైగా 32.73 కిమీ మైలేజ్!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అందుబాటు ధరలో లభించే కార్లకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా తమ జీవితంలో మొదటి కారును కొనుగోలు చేయాలనుకునే పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధర, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్న మోడళ్లే ఎక్కువగా ఆకర్షిస్తాయి. అలాంటి కార్లలో మారుతి సుజుకి ఎస్‌-ప్రెస్సో (Maruti Suzuki S‑Presso) ఒకటి. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఎస్‌యూవీ తరహా డిజైన్, ఎత్తుగా ఉండే డ్రైవింగ్ పొజిషన్, సులభమైన నిర్వహణతో ఈ కారు లక్షలాది భారతీయ కుటుంబాల అభిమానాన్ని సంపాదించుకుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఎంచుకునే మోడళ్లలో ఎస్‌-ప్రెస్సో ముందుంటుంది.
Advertisement

చిన్న చిన్న ప్రయాణాలు మైలేజ్‌ను ఎందుకు భారీగా తగ్గిస్తాయి?

Fuel Efficiency Tips: మీ కారు లేదా బైక్ మైలేజ్ తగ్గిపోతుందా? చిన్న ప్రయాణాల వల్ల ఇంజిన్ వేడెక్కక ఇంధనం ఎలా వృథా అవుతుందో, మైలేజ్ పెంచుకునే మార్గాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

ఈ టాప్ 5 ఎలక్ట్రిక్ బండ్లు కొంటే లక్షల రూపాయలు ఆదా!

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబుకు పెద్ద చిల్లు పెడుతున్నాయి. దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయల మార్కును దాటిపోవడంతో, రోజువారీ ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది వాహనదారులు పెట్రోల్ బండ్లకు గుడ్‌బై చెప్పేసి, పర్యావరణానికి మేలు చేసే చౌకైన, మన్నికైన ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపుతున్నారు. నేటి తరం ఈవీలు అద్భుతమైన రేంజ్, అధునాతన ఫీచర్లతో వస్తూ లక్షల రూపాయల పెట్రోల్ ఖర్చును ఆదా చేస్తున్నాయి. అలాంటి టాప్ 5 బడ్జెట్ టూ-వీలర్స్ వివరాలు తెలుసుకుందాం.

ఉద్యోగులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న బైక్‌లు ఇవే

ఇంధన ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఎక్కువ మైలేజీ అందించే బైక్‌లకే భారతీయులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం ఉపయోగించే 100cc సెగ్మెంట్ బైక్‌లు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యంతో ఇప్పటికీ మార్కెట్లో మంచి డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి. తక్కువ నిర్వహణ వ్యయం, నమ్మకమైన పనితీరు, అందుబాటు ధరలు వీటి ప్రధాన ఆకర్షణలు. హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 బైక్‌లు, ఒక్క లీటర్ పెట్రోల్‌తో వీలైనంత ఎక్కువ మైలేజీ అందించేలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులకు ఇవి అత్యంత ప్రయోజనకరమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ఈ కథనంలో ఈ మూడు బైకుల గురించి చూద్దాం.

కస్టమర్ల ప్రాణాలకు గ్యారెంటీ ఇస్తున్న కార్ కంపెనీ ఇదే

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా మే 2026 నెలకు సంబంధించిన కార్ల అమ్మకాల గణాంకాలను అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం కంపెనీ భారతీయ మార్కెట్లో నాలుగు మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో డస్టర్, కైగర్ వంటి రెండు ఎస్‌యూవీలతో పాటు, 7-సీటర్ ఎంపీవీ ట్రైబర్ మరియు బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా సరికొత్త డస్టర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
Advertisement

షోరూమ్‌కు వచ్చిన వారు ఈ కారే కొంటున్నారు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా వాహనాలను అందించడంలో మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పుడూ ముందుంటుంది. తక్కువ ధరలో లభించే హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ఆధునిక ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాల వరకు విస్తరించిన మోడల్ శ్రేణితో ఈ సంస్థ కోట్లాది భారతీయుల నమ్మకాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా మారుతి విడుదల చేసే వాహనాల్లో విజయవంతమైన మోడళ్ల శాతం చాలా ఎక్కువగా ఉండటం, కంపెనీ మార్కెట్‌పై ఉన్న పట్టును స్పష్టంగా చూపిస్తుంది. ఇటీవలి కాలంలో భారత ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో భారీ పోటీ నెలకొన్నప్పటికీ, మారుతి సుజుకి తన కొత్త SUV విక్టోరిస్‌ (Victoris)తో సంచలన విజయాన్ని నమోదు చేసింది.

చిన్న కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి బంపర్ ఆఫర్

సొంతంగా ఒక చిన్న కారు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఒక అద్భుతమైన వార్త చెప్పింది. ప్రస్తుతం పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల కారణంగా జూన్ నెల నుండి తమ కార్ల ధరలను సుమారు రూ.30,000 వరకు పెంచుతున్నట్లు కంపెనీ గత నెలలోనే ప్రకటించింది. అయితే ఈ ధరల పెంపు వల్ల మొదటిసారి కారు కొనే సామాన్య కస్టమర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మారుతి సుజుకి ఒక ప్రత్యేకమైన ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్ (Price Protection Scheme)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో కారు కొనాలనుకునే వారిలో ఉన్న అతిపెద్ద టెన్షన్ దూరమైంది.

1200 కి.మీ రేంజ్‌తో హైబ్రిడ్ సంచలనం

చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడీ (BYD) ఇప్పుడు తన దిశను మరింత విస్తరించుకుంటూ, కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) ప్రపంచానికే పరిమితం కాకుండా హైబ్రిడ్ టెక్నాలజీ వైపు కూడా బలంగా అడుగులు వేస్తోంది. తాజాగా ఈ కంపెనీ ఆవిష్కరించిన DM-i (Dual Mode Intelligent) ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆటోమొబైల్ రంగంలో కొత్త చర్చకు దారితీసింది. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్‌ను తెలివిగా కలిపి పనిచేసే ఈ సిస్టమ్, డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సమర్థవంతంగా, స్మూత్‌గా మార్చడమే కాకుండా ఇంధన వినియోగాన్ని కూడా గణనీయంగా తగ్గించగలదని కంపెనీ చెబుతోంది. ఈ టెక్నాలజీ ఆధారంగా రానున్న కొత్త హైబ్రిడ్ మోడల్ భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్నట్లు సమాచారం.

తక్కువ బడ్జెట్‌లో ఫుల్ పైసా వసూల్ బండి

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా నెక్సాన్ (Tata Nexon) కారుకు ఉన్న క్రేజ్, ఇమేజ్ అంతా ఇంతా కాదు. 2017లో ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ అయినప్పటి నుంచి సేల్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అదిరిపోయే లుక్, తిరుగులేని భద్రత, బడ్జెట్ ధరలో లభించడం వల్ల మధ్యతరగతి కుటుంబాల నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసులను ఇది దోచుకుంది. ప్రస్తుతం టాటా మోటార్స్ కంపెనీకి అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ కార్లలో నెక్సాన్ అగ్రస్థానంలో ఉంది. ఒకవేళ మీరు కూడా ఈ పాపులర్ కారును సొంతం చేసుకోవాలని అనుకుంటే, షోరూమ్‌కి వెళ్లే ముందు ఐదు ముఖ్యమైన విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి.
Advertisement

ఒకేసారి 7 SUVలను దింపుతున్న మారుతి సుజుకీ

భారతదేశ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రాబోయే మూడేళ్లలో ఏకంగా 9 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో అత్యంత విశేషం ఏంటంటే.. ఈ 9 మోడళ్లలో 7 కేవలం ఎస్‌యూవీ (SUV) కార్లే ఉండబోతున్నాయి. సాంప్రదాయ పెట్రోల్ (ICE) ఇంజన్లతో పాటు ఎలక్ట్రిక్ (EV), హైబ్రిడ్, సిఎన్‌జీ వేరియంట్లలో ఈ అప్‌కమింగ్ ఎస్‌యూవీలను మారుతి డిజైన్ చేస్తోంది.