టాప్‎లోకి దూసుకొచ్చిన మధ్య తరగతి ఎక్కువగా కొనే కారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. గత నెల, అంటే మే 2026 సేల్స్ రిపోర్ట్‌ను గమనిస్తే టాటా కార్లకు కస్టమర్లు బ్రహ్మరథం పట్టారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మోడల్ వైజ్ కార్ల అమ్మకాలను పరిశీలిస్తే, టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని మార్కెట్లో రారాజుగా నిలిచింది. ఈ ఒక్క మోడల్ అమ్మకాల ధాటికి కంపెనీకి చెందిన మిగిలిన 8 మోడళ్లు వెనుకబడిపోయాయి.

దేశంలో అత్యధికంగా అమ్ముడైన 7 సీటర్ ఇదే.. ఎర్టిగా రికార్డ్ సేల్స్!

భారత మార్కెట్లో 7-సీటర్ MPV సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కుటుంబాల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన ఈ MPV, మే 2026లో కూడా అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారుగా నిలిచి తన నంబర్-1 స్థానాన్ని కొనసాగించింది. మే 2026లో మారుతి సుజుకి మొత్తం 20,350 ఎర్టిగా యూనిట్లను విక్రయించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఇది 26 శాతం వృద్ధి కావడం విశేషం. ప్రస్తుతం SUVల హవా కొనసాగుతున్నప్పటికీ, పెద్ద కుటుంబాల అవసరాలకు అనుగుణంగా ఉండే ఎర్టిగాపై వినియోగదారుల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

బడ్జెట్ కార్లలో కింగ్ మళ్లీ ఇదే! ఆల్టో K10 సేల్స్‌లో డబుల్ గ్రోత్ హీట్

భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాల కారు కలను నిజం చేసిన వాహనాల గురించి మాట్లాడితే, మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది. దశాబ్దాలుగా భారతీయుల విశ్వాసాన్ని సంపాదించుకున్న ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల తొలి నాలుగు చక్రాల ప్రయాణానికి నాంది పలికిన మధుర జ్ఞాపకం. 1990ల చివరలో భారత రోడ్లపై అడుగుపెట్టి, కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు, అప్‌డేట్లను అందుకుంటూ నేటికీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రారంభంలో 800cc ఇంజన్‌తో వచ్చిన ఈ కారు, ప్రస్తుతం మరింత శక్తివంతమైన 1.0-లీటర్ K10 పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. చిన్న కుటుంబాలకు, నగర ప్రయాణాలకు అనువైన కారుగా ఆల్టో K10 ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది.

దేశంలో ఇంత మంచి కారు చూపించగలరా?

భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) ఒకటి. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత రోడ్లపై తనదైన ముద్ర వేసిన ఈ కారు, యువత నుంచి కుటుంబాల వరకు ప్రతి వర్గం వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, చురుకైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు, అద్భుతమైన మైలేజ్ కారణంగా స్విఫ్ట్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. మార్కెట్లోకి ఎన్నో కొత్త కార్లు వచ్చినా, SUVల హవా పెరిగినా, స్విఫ్ట్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ ఈ కారు తనకు ఉన్న డిమాండ్‌ను మరోసారి నిరూపిస్తూనే ఉంది. తాజా అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Advertisement

దేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసిన కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా SUVల హవా కొనసాగుతోంది. చిన్న కార్ల నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు ఎక్కడ చూసినా SUVలకే ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. కొత్తగా కారును కొనుగోలు చేయాలనుకునే చాలా మంది వినియోగదారులు కూడా SUVల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సెడాన్ కారు మాత్రం అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ఆ కారు మరెదో కాదు.. మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire). ఒకప్పుడు భారతీయ కుటుంబాల తొలి ఎంపికగా నిలిచిన సెడాన్ కార్లకు SUVల రాకతో డిమాండ్ తగ్గుతుందని చాలామంది భావించారు. కానీ డిజైర్ మాత్రం ఆ అంచనాలను తప్పు చేస్తూ వరుసగా అమ్మకాల పరంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.

చిన్న కుటుంబాలకు పర్ఫెక్ట్ కారు ఇదేనా?.. టాటా టియాగో రివ్యూ!

భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కారు టాటా టియాగో (Tata Tiago). ఈ కారు ఎప్పుడూ పెద్దగా హడావుడి చేయలేదు, ఆకర్షణీయమైన ప్రకటనలతో సందడి సృష్టించలేదు. కానీ వినియోగదారుల అవసరాలను తీర్చుతూ, నమ్మకమైన పనితీరుతో, అందుబాటు ధరతో నిరంతరం మంచి అమ్మకాలను నమోదు చేస్తూ వచ్చింది. అందుకే టాటా మోటార్స్ 2026 టియాగో ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకొస్తోందనే వార్త వెలువడినప్పటి నుంచి ఆటోమొబైల్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కొత్త 2026 టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌ను చూసిన వెంటనే ఇది కేవలం చిన్నపాటి అప్‌డేట్ కాదని అర్థమవుతుంది.

ఓలా, ఉబెర్‌కు కొత్త టెన్షన్.. పూర్తిగా ఎలక్ట్రిక్ టాక్సీలు వచ్చేశాయి!

ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ మొబిలిటీ రంగంలో వేగంగా ఎదుగుతున్న వియత్నాం సంస్థ గ్రీన్ SM, ఇప్పుడు భారత మార్కెట్లో కూడా తన అడుగులు మోపింది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల ఆధారంగా నడిచే తన ప్రీమియం టాక్సీ సర్వీస్ గ్రీన్ SM లిమో (green sm limo)ను అధికారికంగా దేశంలో ప్రారంభించింది. పెరుగుతున్న కాలుష్యం, ఇంధన వినియోగం నేపథ్యంలో ఈ కొత్త సేవ ఇండియాలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రీన్ SM తన ఎలక్ట్రిక్ టాక్సీ సేవను ఆవిష్కరించింది. గ్రీన్ స్మార్ట్ మొబిలిటీ వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్‌కు అనుబంధ సంస్ధగా పనిచేస్తుంది. టాక్సీ సేవను ప్రారంభించడంతో విన్‌ఫాస్ట్ ఇప్పుడు టాక్సీ సేవలోకి కూడా ప్రవేశించింది.

ఈ కారు కొంటే డబుల్ ధమాకా.. దీని డిస్కౌంట్‎తో ఇంకో కారు కొనొచ్చు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా మన దేశీ బ్రాండ్ టాటా మోటార్స్ ఈవీ విభాగంలో తిరుగులేని రారాజుగా దూసుకుపోతోంది. మీరు కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. టాటా మోటార్స్ తన పాపులర్ కూపే స్టైల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV) పై జూన్ 2026లో బంపర్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం నడుస్తున్న జూన్ సేల్స్ ఆఫర్లలో భాగంగా సరికొత్త టాటా కర్వ్ ఈవీని కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ.3.35 లక్షల వరకు భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్‌లో నేరుగా ఇచ్చే క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, ఇతర బెనిఫిట్స్ కూడా కలిసి ఉన్నాయి.
Advertisement

బైకుల ఎగుమతుల్లో నంబర్ వన్ సీటు ఈ కంపెనీదే

భారతదేశపు టూ-వీలర్ మార్కెట్ దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా బైకులు, స్కూటర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. తాజాగా ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ 2026 గణాంకాలను పరిశీలిస్తే.. భారతదేశం నుంచి జరిగే టూ-వీలర్ ఎగుమతులు ఏకంగా 23.44 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతుల సంఖ్య 41.96 లక్షలుగా ఉండగా, ఈ ఏడాది అది ఏకంగా 51.80 లక్షల యూనిట్లకు చేరుకోవడం విశేషం. భారతదేశంలో హీరో, హోండా లాంటి కంపెనీల హవా ఎక్కువగా ఉన్నప్పటికీ.. విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో మాత్రం బజాజ్ ఆటో (Bajaj Auto) ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో బజాజ్ కంపెనీ ఏకంగా 18,80,155 బైకులను విదేశీ కస్టమర్లకు విక్రయించింది. గత ఏడాది ఎగుమతి చేసిన 16.06 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 17.01 శాతం ఎక్కువ. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఎగుమతి అవుతున్న మొత్తం భారతీయ టూ-వీలర్లలో అత్యధికంగా 36.29 శాతం మార్కెట్ షేర్ ఒక్క బజాజ్ కంపెనీదే కావడం విశేషం. ఎగుమతుల రేసులో బజాజ్ తర్వాత స్థానంలో టీవీఎస్ మోటార్స్ (TVS) దూసుకుపోతోంది. టీవీఎస్ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 14,13,074 యూనిట్లను ఎగుమతి చేసి 31.81 శాతం బలమైన వృద్ధిని సాధించింది. దీని మార్కెట్ షేర్ 27.28 శాతంగా ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న హోండా కంపెనీ 6,20,241 యూనిట్ల ఎగుమతులతో 23.16 శాతం వృద్ధిని నమోదు చేయగా.. మన దేశంలో నంబర్ వన్ సేల్స్ ఉన్న హీరో మోటోకార్ప్ విదేశీ ఎగుమతుల్లో మాత్రం కేవలం 4,02,743 యూనిట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. అయితే హీరో కంపెనీ వార్షిక వృద్ధి పరంగా 39.19 శాతం మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ప్రముఖ క్లాసిక్ బైక్స్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా అంతర్జాతీయ మార్కెట్లో మంచి వృద్ధిని సాధిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 1,31,336 బుల్లెట్ బైకులను విదేశాలకు పంపి 22.58 శాతం గ్రోత్ సాధించింది. మరోవైపు స్పోర్ట్స్ బైక్స్ బ్రాండ్ కేటీఎం (KTM) ఊహించని రేంజ్‌లో సంచలనం సృష్టించింది. కేటీఎం ఎగుమతులు ఏకంగా 107.21 శాతం పెరిగి, గత ఏడాది ఉన్న 29 వేల నుండి ఈ ఏడాది ఏకంగా 61,585 యూనిట్లకు చేరాయి. యామహా (3.41 లక్షలు), సుజుకి (2.64 లక్షలు) కంపెనీలు కూడా తమ ఎగుమతులను విజయవంతంగా పెంచుకున్నాయి. ఒకవైపు సాధారణ బైకుల ఎగుమతులు పెరుగుతుంటే.. లగ్జరీ, ప్రీమియం బ్రాండ్లయిన ట్రయంఫ్ (-21.9%), అప్రిలియా (-20.51%), బీఎమ్‌డబ్ల్యూ (-24.38%), హుస్క్‌వర్నా (-87.54%) కంపెనీల ఎగుమతులు ఈ ఏడాది భారీగా క్షీణించాయి. అయితే ఈ రేసులో సరికొత్త ఆశగా ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్రాండ్ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నిలిచింది. ఏథర్ కంపెనీ ఎగుమతులు ఏకంగా 256.77 శాతం వృద్ధి చెంది, గత ఏడాది కేవలం 805 యూనిట్లుగా ఉన్న ఎగుమతుల సంఖ్యను ఈ ఏడాది 2,872 యూనిట్లకు పెంచుకుని గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.

మార్కెట్లోకి వచ్చి కొద్ది రోజులే కానీ బ్లాక్‌బస్టర్ హిట్.. టాప్-3 SUVల్లో చోటు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో దశాబ్దాలుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మారుతి సుజుకి, హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లలో మాత్రమే కాదు, ఇప్పుడు SUV సెగ్మెంట్‌లో కూడా తన పట్టు బలపరుచుకుంటోంది. గత కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారుల అభిరుచులు వేగంగా SUVల వైపు మారుతున్న నేపథ్యంలో, ఈ విభాగంలో మరింత బలమైన స్థానం సంపాదించేందుకు కంపెనీ అనేక వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మార్కెట్లోకి వచ్చిన మారుతి సుజుకి విక్టోరిస్(Maruti Suzuki Victoris), చాలా తక్కువ సమయంలోనే వినియోగదారుల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైంది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత పోటీ ఉన్న విభాగాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ విభాగంలో ఇప్పటికే ఎన్నో ప్రముఖ కంపెనీల మోడళ్లు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నప్పటికీ, విక్టోరిస్ మాత్రం తన ప్రత్యేకతతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.

యాక్టివా e, QC1 జోరు.. హోండాకు ఎప్పుడూ లేని సేల్స్!

భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో తన ఉనికిని మరింత బలంగా చాటుకుంటూ, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, కంపెనీ మే 2026లో తన చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను నమోదు చేసింది. హోండా యాక్టివా ఇ, క్యూసి1 వంటి మోడళ్లకు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణ కారణంగా, గత నెలలో కంపెనీ దేశవ్యాప్తంగా మొత్తం 520 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించగలిగింది. ఈ సంఖ్య సాధారణ అమ్మకాల గణాంకం మాత్రమే కాదు. హోండా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఇది ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.

ఆటోమొబైల్ చరిత్రలోనే ఇలాంటి ఆఫర్ ఉండదు

సొంతంగా ఒక లగ్జరీ ఎస్‌యూవీ (SUV) కారు కొనాలని కలలు కనే వారికి మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా కొత్త కారు కొని కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత దాని రీసేల్ వాల్యూ (సెకండ్ హ్యాండ్ ధర) సగానికి పైగా పడిపోతుంది. కానీ, ప్రస్తుతం ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్ల కోసం అదిరిపోయే అష్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్లను లైవ్ చేశాయి.
Advertisement

8 సీట్లతో సుజుకి కొత్త మినీవ్యాన్ ఎంట్రీ.. ఫ్యామిలీ ట్రిప్స్‌కు బెస్ట్!

ప్రపంచంలోని ప్రతి దేశానికి తనదైన ఆటోమొబైల్ సంస్కృతి ఉంటుంది. వినియోగదారుల జీవనశైలి, రహదారి పరిస్థితులు, కుటుంబ అవసరాలు, ప్రయాణ విధానాలను బట్టి అక్కడి వాహన మార్కెట్ రూపుదిద్దుకుంటుంది. ఈ విషయంలో జపాన్ ఆటోమొబైల్ మార్కెట్ ప్రత్యేక గుర్తింపు పొందింది. అక్కడ ఎక్కువ మంది వినియోగదారులు కేవలం స్టైలిష్‌గా కనిపించే కార్లకంటే, రోజువారీ జీవితంలో ఎక్కువ ఉపయోగపడే వాహనాలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే జపాన్‌లో మినీవ్యాన్‌లకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. విశాలమైన క్యాబిన్, ఎక్కువ మంది ప్రయాణించే సౌకర్యం, కుటుంబ అవసరాలకు అనుకూలమైన డిజైన్ కారణంగా మినీవ్యాన్‌లు అక్కడి మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలుగా మారాయి. కుటుంబ ప్రయాణాలు, వ్యాపార అవసరాలు, రోజువారీ వినియోగం.. ఇలా ఎన్నో అవసరాలకు ఒకే వాహనం సరిపోవడం వీటి ప్రత్యేకత.

మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్.. జూన్ 30 వరకే ఛాన్స్

సొంతంగా ఒక మంచి కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మధ్యతరగతి వాళ్ల కోసం టాటా మోటార్స్ ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. ఈ జూన్ నెలలో తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్ అయిన అల్ట్రోజ్, టియాగో హ్యాచ్‌బ్యాక్‌లతో పాటు టిగోర్ సెడాన్ కార్లపై కంపెనీ భారీ ఆఫర్లను ప్రకటించింది. జూన్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కస్టమర్లు గరిష్టంగా రూ.40,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ రూపంలో ఈ ఆఫర్లు అందిస్తున్నారు.

కార్ల మార్కెట్లో డిజైర్ హవా.. టాప్-10లో క్రెటా చివరి స్థానం!

జూన్ నెల ప్రారంభం కావడంతో మే 2026 కార్ల అమ్మకాల గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఏ మోడల్‌కు ఎక్కువ డిమాండ్ ఉందో ఈ సంఖ్యలు స్పష్టంగా చూపించాయి. అమ్మకాల పరంగా మారుతి సుజుకి డిజైర్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ అత్యధిక అమ్మకాలు నమోదు చేసింది. ఒకప్పుడు టాప్‌లో కొనసాగిన టాటా పంచ్ వంటి ప్రముఖ మోడళ్లను కూడా వెనక్కి నెట్టి డిజైర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మిగతా మోడళ్ల వారీగా కూడా చూసినట్లయితే కొన్ని తమ స్థానాలను కోల్పోగా, మరికొన్ని తమ పాత స్థానాల కంటే మరింత మెరుగ్గా ముందుకు దూసుకువచ్చాయి. మరి గత నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా కొనే కారు.. సరికొత్తగా ముస్తాబై రాబోతుంది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో హ్యుందాయ్ i20(Hyundai i20) ఒకటి. ఇప్పుడు ఈ పాపులర్ కారును మరింత స్టైలిష్‌గా, అడ్వాన్స్‌డ్‌గా మార్చడానికి కంపెనీ సిద్ధమైంది. హ్యుందాయ్ తన నెక్స్ట్ జనరేషన్ i20(Hyundai i20) మోడల్‌కు సంబంధించిన అధికారిక టీజర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ టీజర్ ద్వారా కారు ఫ్రంట్ డిజైన్ ఎలా ఉండబోతోందనేది క్లియర్ గా తెలిసిపోతోంది. వచ్చే నెల, అంటే జులై 2026లో ఈ సరికొత్త కారును గ్లోబల్ మార్కెట్లో కంపెనీ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.
Advertisement

ఒకప్పుడు చిన్న కంపెనీ.. ఇప్పుడు వేలాది స్కూటర్లు అమ్ముతుంది

భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో వేగంగా ఎదుగుతున్న కంపెనీల్లో ఏథర్ ఎనర్జీ (Ather Energy) ఒకటి. ఒక చిన్న స్టార్టప్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ సంస్థ, నేడు దేశంలోని టాప్-3 ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్‌లలో స్థానం సంపాదించుకుంది. అత్యాధునిక టెక్నాలజీ, ప్రీమియం డిజైన్, స్మార్ట్ ఫీచర్లు, బలమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న ఏథర్, ఇప్పుడు అమ్మకాల పరంగా కూడా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన మే 2026 అమ్మకాల గణాంకాలు కంపెనీ వృద్ధిని స్పష్టంగా చూపిస్తున్నాయి. మే 2026లో దేశవ్యాప్తంగా ఏథర్ ఎనర్జీ మొత్తం 28,211 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ కేవలం 14,101 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది.

25 కిమీ మైలేజ్.. ధర కేవలం రూ.5.79లక్షలే

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) పై కంపెనీ జూన్ 2026 నెలకు గాను అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో కొత్త స్విఫ్ట్ కారును కొనుగోలు చేసే కస్టమర్లు ఏకంగా రూ.45,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ నగదు తగ్గింపులతో (Cash Discounts) పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటి రకరకాల ఆఫర్లను అందిస్తోంది. ఈ కారు మార్కెట్లో తన స్టైలిష్ లుక్, మైలేజ్, నమ్మకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.

హ్యుందాయ్ క్రెటాకు చెక్ పెట్టేందుకు మార్కెట్లోకి రెండు సరికొత్త బ్రహ్మస్త్రాలు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్యూవీ (Midsize SUV) సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం రారాజుగా వెలుగుతోంది. తన అద్భుతమైన లుక్స్, పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లు, అదిరిపోయే ఫీచర్లతో కస్టమర్ల మనసు దోచుకుంది. అయితే, ఇప్పుడు క్రెటాకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, జపనీస్ బ్రాండ్ నిస్సాన్ సంస్థలు సరికొత్త వ్యూహాలతో సిద్ధమయ్యాయి. రాబోయే కొన్ని వారాల్లోనే ఈ రెండు కంపెనీలు తమ సరికొత్త ఎస్‌యూవీలను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

అందరి ఫేవరెట్ కారు ఇప్పుడు మరింత కొత్తగా వచ్చింది

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కుటుంబాల నమ్మకానికి ప్రతీకగా నిలిచిన టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) ఇప్పుడు మరింత ప్రీమియం రూపంలో కస్టమర్ల ముందుకు వచ్చింది. టయోటా కొత్త 2026 ఇన్నోవా క్రిస్టాను అధికారికంగా ఆవిష్కరించింది. రెండు దశాబ్దాలకు పైగా భారతీయ రోడ్లపై విజయవంతంగా కొనసాగుతున్న ఈ MPV, ఇప్పుడు కొత్త డిజైన్ అప్‌డేట్లు, ఆధునిక ఫీచర్లు, మరింత మెరుగైన క్యాబిన్ అనుభవంతో మరోసారి తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి సిద్ధమైంది. గత 21 ఏళ్లుగా లక్షలాది కుటుంబాలు, వ్యాపార సంస్థలు, ట్రావెల్ ఆపరేటర్లకు నమ్మకమైన ప్రయాణ భాగస్వామిగా నిలిచిన ఈ వాహనం, ఇప్పుడు కొత్త అప్‌డేట్లతో వచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ రూ. 19.72 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Advertisement

మారుతి డిజైర్‌కు గట్టి పోటీ.. హ్యుందాయ్ కారు ధర భారీగా పెంపు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మంచి మైలేజ్, తక్కువ బడ్జెట్ సెడాన్ కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ విభాగంలో హ్యుందాయ్ సంస్థకు చెందిన ఆరా (Hyundai Aura) కారు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే, జూన్ నెల ప్రారంభంలోనే ఈ కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ సంస్థ ఒక చేదు వార్త చెప్పింది. ఆరా మోడల్ ధరలను పెంచడంతో పాటు, కస్టమర్లకు తక్కువ ధరలో లభించే కొన్ని పాపులర్ వేరియంట్లను కంపెనీ మార్కెట్ నుంచి శాశ్వతంగా తొలగించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. హ్యుందాయ్ ఆరా ధరలపై 0.83 శాతం వరకు అదనపు భారం పడింది. దీనివల్ల వివిధ వేరియంట్లను బట్టి వినియోగదారులు దాదాపు రూ.5,700 వరకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయకపోవడం కొంతవరకు ఊరట కలిగించే విషయమే.

దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు వచ్చేసింది

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (maruti suzuki india)తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును అధికారికంగా పరిచయం చేసింది. అంతేకాదు, ఇది కేవలం మారుతి సుజుకి మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మాత్రమే కాకుండా, భారతదేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కారుగా కూడా చరిత్ర సృష్టించింది. కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని తన అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన వ్యాగన్ ఆర్‌ (wagonr)లో ప్రవేశపెట్టింది. భారతీయ కుటుంబాల్లో విశేష ఆదరణ పొందిన ఈ కారు ఇప్పుడు మరింత పర్యావరణహిత సాంకేతికతతో ముందుకు వచ్చింది.

బైక్‌లంటే దేశం మొత్తం ఈ కంపెనీ వెంటపడుతోంది

భారతదేశానికి చెందిన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దశాబ్దాలుగా భారత వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకున్న ఈ సంస్థ, దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. ముఖ్యంగా సరసమైన ధరలు, మంచి మైలేజ్, విశ్వసనీయ పనితీరు కారణంగా హీరో బైక్‌లు, స్కూటర్లు లక్షలాది మంది వినియోగదారుల తొలి ఎంపికగా నిలుస్తున్నాయి. ప్రతి నెలా లక్షల సంఖ్యలో ద్విచక్ర వాహనాలను విక్రయిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న హీరో మోటోకార్ప్, మే 2026లో కూడా మరోసారి ఆకట్టుకునే ఫలితాలను నమోదు చేసింది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాల ప్రకారం, కంపెనీ మే 2026లో మొత్తం 5,70,068 యూనిట్లు విక్రయించింది.

పెద్ద కుటుంబాలు ఉన్న వారి కోసం మారుతి సుజుకి అదిరిపోయే ప్లాన్

భారతదేశంలో కార్ల అమ్మకాల్లో రారాజుగా వెలుగొందుతున్న మారుతి సుజుకి (Maruti Suzuki) భవిష్యత్తుపై భారీ ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే రెండు మూడు ఏళ్లలో ఇండియన్ మార్కెట్లో బ్యాక్ టు బ్యాక్ మూడు సరికొత్త MPV (మల్టీ పర్పస్ వెహికల్) కార్లను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ముఖ్యంగా పెద్ద ఫ్యామిలీ ఉన్న కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ కార్లను డిజైన్ చేస్తున్నారు. ఈ లిస్టులో కస్టమర్ల ఆల్‌టైమ్ ఫేవరెట్ ఎర్టిగా కొత్త మోడల్‌తో పాటు ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్, ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కారు కూడా ఉండటం విశేషం.
Advertisement

అమేజ్, సిటీ, ఎలివేట్ జోరుకు బ్రేకులే లేవు

భారత ఆటోమొబైల్ రంగంలో మే 2026 నెల అమ్మకాల గణాంకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని అగ్రశ్రేణి వాహన తయారీ సంస్థలు తమ విక్రయాల వివరాలను ప్రకటించగా, తాజాగా హోండా కార్స్ ఇండియా (Honda Cars India) కూడా తన నెలవారీ అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ గణాంకాలు చూస్తే, గత ఏడాదితో పోలిస్తే కంపెనీ గణనీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. మే 2026లో హోండా కార్స్ ఇండియా మొత్తం 7,853 వాహనాలను విక్రయించింది. ఇందులో దేశీయ మార్కెట్లో అమ్ముడైన కార్ల సంఖ్య 5,111 యూనిట్లు కాగా, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసిన వాహనాల సంఖ్య 2,742 యూనిట్లుగా నమోదైంది.