రూ.6 లక్షల లోపే దొరుకుతాయి.. మిడిల్ క్లాస్ జనాల ఫేవరెట్ కార్లు ఇవే

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోని హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి సంస్థ తన ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకుంటోంది. గత మే నెల కార్ల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. కంపెనీకి చెందిన మూడు హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు అయిన బాలెనో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ కార్లు గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి.

దేశంలోనే తొలి మాస్ మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లు

భారతదేశంలో ద్విచక్ర వాహనాల రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న హీరో మోటోకార్ప్ (Hero Motocorp) మరో కీలక ముందడుగు వేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్‌సైకిళ్లలో ఒకటైన స్ప్లెండర్ ప్లస్ (+), అలాగే గ్రామీ, పట్టణ ప్రాంతాల్లో విశేష ఆదరణ పొందిన హెచ్‌ఎఫ్ డీలక్స్ మోడళ్లకు ఇప్పుడు ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా కొత్త సాంకేతికతలను మొదట ప్రీమియం లేదా ఖరీదైన వాహనాల్లో ప్రవేశపెట్టే సంప్రదాయానికి భిన్నంగా, హీరో మోటోకార్ప్ సామాన్య ప్రజలు ఎక్కువగా ఉపయోగించే బైక్‌లలోనే ఈ పర్యావరణహిత టెక్నాలజీని అందించడం విశేషం. ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన కొత్త స్ప్లెండర్ ప్లస్, హెచ్‌ఎఫ్ డీలక్స్ మోడళ్లను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది.

డాక్టర్లు, ఇంజనీర్లకు ఎంతో ఇష్టమైన కారు.. ఇప్పుడు కొంటే రూ.52,000 ఆదా

భారత్‎లో అత్యధికంగా అమ్ముడయ్యే ఫ్యామిలీ కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎప్పుడూ ముందుంటుంది. కస్టమర్లలో ఈ కారుకు ఉన్న క్రేజ్‌ను మరింత పెంచేందుకు మారుతి సుజుకి ఇండియా జూన్ నెలలో ఒక భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ కారును కొనుగోలు చేసే కస్టమర్లకు ఏకంగా 52,500 రూపాయల వరకు భారీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమై జూన్ 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది నిజంగా మంచి అవకాశం అని చెప్పవచ్చు.

కేవలం 478 కార్ల తేడాతో నంబర్ 2 ప్లేస్ గుంజేసిందిగా!

మే 2026 దేశీయ కార్ల సేల్స్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్‌లో ఎప్పటిలాగే మారుతి సుజుకీ తన తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈసారి సేల్స్ చార్టులో మారుతి సుజుకి డిజైర్ కారు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని దూసుకుపోగా, మారుతి ఫ్రాంక్స్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా మార్కెట్‌ను ఏలుతున్న టాటా పంచ్ కారును వెనక్కి నెట్టి, ఫ్రాంక్స్ దేశంలోనే రెండో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. ఫ్రాంక్స్ కారుకు వచ్చిన డిమాండ్ ముందు టాటా పంచ్ ఈసారి కాస్త వెనకబడక తప్పలేదు. మే నెల సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే మారుతి ఫ్రాంక్స్, టాటా పంచ్ మధ్య గట్టి పోటీ నడిచింది. గత నెలలో మారుతి ఫ్రాంక్స్ కారుకు చెందిన 20,686 యూనిట్లు అమ్ముడుపోగా, టాటా పంచ్ కారుకు చెందిన 20,208 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
Advertisement

జనాల గుండెల్లో గుడి కట్టుకున్న కంపెనీ! ఇటీవలి సేల్స్ చూస్తే మీ కళ్లు బైర్లు కమ్ముతాయి!

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో మోటోకార్ప్ తర్వాత అత్యధిక అమ్మకాలు నమోదు చేసే కంపెనీగా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) తన బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా స్కూటర్ విభాగంలో హోండా ఆధిపత్యం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. పేదలకు, మధ్యతరగతికి యూజ్‌ఫుల్ యాక్టివా, షైన్ వంటి మోడళ్లతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించిన హోండా ఇండియాలో ఉండటం మన అదృష్టం. ఈ నేపథ్యంలో 2026 మే నెల కంపెనీకి మరో విజయవంతమైన నెలగా నిలిచింది. దేశీయ మార్కెట్‌లో బలమైన డిమాండ్, కొత్త ఉత్పత్తులపై పెరుగుతున్న ఆసక్తి, అలాగే ఎగుమతుల్లో నమోదైన స్థిరమైన వృద్ధి కారణంగా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మొత్తం 5.18 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాల అమ్మకాలను నమోదు చేసింది.

డస్టర్ రాకముందే దుమ్మురేపిన రెనాల్ట్.. అమ్మకాల్లో భారీ జంప్!

భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరసమైన ధరల్లో, ఉపయోగకరమైన ఫీచర్లతో వాహనాలను అందించడం ద్వారా కంపెనీ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. ముఖ్యంగా క్విడ్, కైగర్, ట్రైబర్ వంటి మోడళ్లకు కొనసాగుతున్న డిమాండ్ కంపెనీ అమ్మకాల వృద్ధికి కీలకంగా మారింది. తాజా అమ్మకాల గణాంకాలు చూస్తే, 2026 మే నెల రెనాల్ట్‌కు ఎంతో విజయవంతమైన కాలంగా నిలిచినట్లు స్పష్టమవుతోంది. కంపెనీ గత నెలలో భారత మార్కెట్లో మొత్తం 4,113 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది.

టాప్ 1లో కేవలం రూ.5.99 లక్షలకే దొరికే ప్రీమియం కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో ఊహించని పెద్ద మార్పు చోటుచేసుకుంది. తాజాగా విడుదలైన మే 2026 నెల వాహన విక్రయాల నివేదిక కార్ల ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా మార్కెట్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న మారుతి సుజుకి వ్యాగన్ఆర్, స్విఫ్ట్ కార్లు ఈసారి వెనకబడిపోయాయి. వీటన్నింటినీ దాటుకుంటూ మారుతి సుజుకి బాలెనో సరికొత్త రికార్డులతో నంబర్-1 హ్యాచ్‌బ్యాక్‌గా అవతరించింది. అయితే ఈ కార్ల అమ్మకాల మధ్య చాలా స్వల్ప తేడా మాత్రమే ఉండడం గమనార్హం.

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్

భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో ఒకప్పుడు ఓలా పేరు మారుమోగేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడితే చాలామందికి ముందుగా గుర్తుకు వస్తున్న పేరు టీవీఎస్ మోటార్ (Tvs Motor). కంపెనీ తీసుకొచ్చిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో భారీ ఆదరణ పొందడంతో, టీవీఎస్ ఈవీ విభాగంలో అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2026 మే నెలలో టీవీఎస్ మోటార్ దేశవ్యాప్తంగా 42,415 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ అమ్మకాలతో భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో అత్యధిక విక్రయాలు నమోదు చేసిన కంపెనీగా నిలిచింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది.
Advertisement

మే నెల ఎలక్ట్రిక్ టూ-వీలర్ సేల్స్ రిపోర్ట్.. టాప్ 10 కంపెనీలు ఇవే

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ రోజురోజుకూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన మే 2026 నెల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రతిసారీ లాగే ఈసారి కూడా ఈవీ మార్కెట్లో టీవీఎస్ మోటార్ కంపెనీ తన తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దేశంలోని టాప్ ఈ-స్కూటర్ కంపెనీల జాబితాలో టీవీఎస్‌తో పాటు బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ అత్యుత్తమ స్థానాల్లో నిలిచాయి. ఒకప్పుడు మార్కెట్‌ను శాసించిన ఓలా ఎలక్ట్రిక్ కూడా టాప్ 5 లో నిలిచినప్పటికీ, దాని అమ్మకాలు దారుణంగా పడిపోవడం టెక్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఏడాదిలోనే 10 వేల ఎలక్ట్రిక్ కార్లు.. భారత మార్కెట్లో విన్‌ఫాస్ట్ భారీ రికార్డు!

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పోటీ రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి, ఎంజీ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (Vinfast) కూడా వేగంగా తన ఉనికిని చాటుకుంటోంది. భారత మార్కెట్‌ను అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ సంస్థ, స్థానిక తయారీకి ప్రాధాన్యం ఇస్తూ 'మేడ్ ఇన్ ఇండియా' వ్యూహంతో ముందుకు సాగుతోంది. VF6, VF7 ఎలక్ట్రిక్ SUVలతో ఇప్పటికే ఆసక్తిని పెంచిన విన్‌ఫాస్ట్, ఇప్పుడు మరో కీలక మైలురాయిని అందుకుంది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఏర్పాటు చేసిన తన అత్యాధునిక తయారీ కేంద్రం నుంచి 10,000వ ఎలక్ట్రిక్ వాహనం ఉత్పత్తి అయినట్లు ప్రకటించింది.

ఈ కారు కావాలంటే కచ్చితంగా క్యూలో నిలబడాల్సిందే

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కేవలం గత 11 రోజుల్లోనే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 8 రూపాయల వరకు పెరగడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారుల చూపు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ (ఈవీ) కార్లకు మార్కెట్లో గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. పెరిగిన ఇంధన ధరల భారాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది కస్టమర్లు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.

రేపే దేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు రివీల్!

భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణ, దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడం, స్వదేశీ ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో దేశం ముందుకు సాగుతున్న వేళ, మారుతి సుజుకి (Maruti Suzuki) ఒక చారిత్రాత్మక అడుగు వేయబోతోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5)కు ముందురోజు అయిన జూన్ 4న, భారతదేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని అధికారికంగా ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమైంది. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
Advertisement

జూన్ 9న దేశం షేక్ అయ్యే కారు రాబోతుంది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చైనా దిగ్గజం బీవైడీ (BYD) సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటివరకు మనదేశంలో కేవలం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయిస్తున్న ఈ సంస్థ.. ఇప్పుడు తన మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) మోడల్‌ను లాంచ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 9న ఈ సరికొత్త హైబ్రిడ్ కారును భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశపెట్టబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

అసలైన కారు మజాను ఎంజాయ్ చేయాలంటే దీనిని కొంటే చాలు

భారత ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేస్తూ రెండు ప్రముఖ విదేశీ కార్ల తయారీ సంస్థలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ప్రముఖ కార్ల బ్రాండ్లు అయిన నిస్సాన్ (Nissan), రెనాల్ట్ (Renault) కంపెనీలకు మే 2026 నెల ఒక లక్కీ పీరియడ్‌లా నిలిచింది. ఈ రెండు కంపెనీలు గత నెలలో భారతీయ మార్కెట్‌లో ఊహించని స్థాయిలో కార్లను విక్రయించి అమ్మకాల కొత్త జెండాలను పాతాయి.

100 మందిలో 62 మంది వీరి కార్లకే ఓటు!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు భవిష్యత్ టెక్నాలజీగా భావించిన EVలు ఇప్పుడు సాధారణ వినియోగదారుల ఎంపికగా మారుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, పర్యావరణ హిత ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఎలక్ట్రిక్ కార్ల వైపు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవలి నెలల్లో EV మార్కెట్లో పోటీ కూడా గణనీయంగా పెరిగింది. కొత్త మోడళ్ల రాక, మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, ఎక్కువ డ్రైవింగ్ రేంజ్, ఆధునిక ఫీచర్లు వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి. ఫలితంగా, ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు కేవలం నగర ప్రయాణాలకే పరిమితం కాకుండా కుటుంబ అవసరాలకు కూడా అనువైన ఎంపికలుగా మారుతున్నాయి.

ప్రపంచ సవాళ్లు ఒకవైపు.. MG అమ్మకాల జోరు మరోవైపు!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తనదైన ముద్ర వేస్తున్న జెఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) మరోసారి స్థిరమైన అమ్మకాల ప్రదర్శనతో ఆకట్టుకుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇప్పటికీ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ మొబిలిటీపై పెరుగుతున్న ఆసక్తిని సద్వినియోగం చేసుకుంటూ MG తన వృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా Comet EV, Windsor EV, ZS EV వంటి మోడళ్లకు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణ కంపెనీకి బలంగా మారుతోంది. తాజాగా విడుదల చేసిన అమ్మకాల గణాంకాల ప్రకారం, 2026 మే నెలలో ఎంజీ మొత్తం 6,048 యూనిట్ల హోల్‌సేల్ విక్రయాలను నమోదు చేసింది.
Advertisement

మధ్య తరగతి వాడి కల నెరవేరుస్తున్న కార్లు ఇవే

మన దేశంలో మధ్యతరగతి కుటుంబాల సొంత కారు కలని నిజం చేయడంలో మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పుడూ ముందే ఉంటుంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్, భారీ మైలేజ్ ఇచ్చే కార్లకు మన దేశంలో డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. తాజాగా విడుదలైన మే 2026 కార్ల సేల్స్ నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యంత చౌకైన మారుతి సుజుకి ఆల్టో K10, ఎస్-ప్రెస్సో కార్లు మార్కెట్లో సరికొత్త రికార్డులతో దూసుకుపోయాయి.

తక్కువ ధరలో కొత్త బజాజ్ అవెంజర్ లాంచ్

భారత క్రూయిజర్ బైక్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బజాజ్ అవెంజర్ (Bajaj Avenger) సిరీస్‌కు తాజాగా కొత్త సభ్యుడు చేరాడు. బజాజ్ ఆటో 2026 అవెంజర్ స్ట్రీట్ (Avenger Street 220)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రూ.1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చిన ఈ బైక్, స్టైలిష్ లుక్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, శక్తివంతమైన ఇంజన్‌తో క్రూయిజర్ బైక్ ప్రియులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఇప్పటి వరకు బజాజ్ అవెంజర్ శ్రేణిలో అవెంజర్ స్ట్రీట్ 160, అవెంజర్ క్రూయిజ్ 220 మోడళ్లను విక్రయిస్తూ వచ్చింది. అయితే, కంపెనీ తాజాగా చిన్న ఇంజన్ కలిగిన అవెంజర్ స్ట్రీట్ 160 ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది.

30 రోజుల్లోనే లక్షలకు పైగా బైకులు అమ్మిన దేశీయ దిగ్గజం

భారతీయ బైక్ లవర్లకు రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అంటే ఒక బ్రాండ్ మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. బుల్లెట్ బైక్ పై రోడ్డు మీద వెళ్తుంటే వచ్చే కిక్కే వేరు. అందుకే ఈ దేశీయ దిగ్గజ బైక్ తయారీ సంస్థ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. గత మే 2026 నెల రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి పండగ తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ ఒక్క నెలలోనే లక్షకు పైగా బైకులను విక్రయించి కంపెనీ సరికొత్త సంచలనం సృష్టించింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 15 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి మార్కెట్లో తన హవాను చాటుకుంది.

30 వేల మార్క్ దాటిన టయోటా.. ఎగుమతుల్లో అదిరిపోయే జంప్!

మే నెల ముగిసి జూన్ నెల ప్రారంభమైన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను వరుసగా విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా (Toyota) కూడా 2026 మే నెలకు సంబంధించిన విక్రయాల వివరాలను ప్రకటించింది. విడుదలైన గణాంకాలు పరిశీలిస్తే, టయోటా భారత మార్కెట్లో తన స్థిరమైన వృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా SUVలు, MPVలు, హైబ్రిడ్ వాహనాల విభాగాల్లో బలమైన ఉనికిని ఏర్పరచుకున్న టయోటా, భారత వినియోగదారుల విశ్వాసాన్ని మరింతగా సంపాదించుకుంటోంది. ముఖ్యంగా ఇన్నోవా హైక్రాస్, ఫర్చ్యునర్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, రూమియన్ వంటి మోడళ్లకు లభిస్తున్న ఆదరణ కంపెనీ అమ్మకాల పెరుగుదలకు దోహదపడుతోంది.
Advertisement

మన దేశం.. మన కార్లు.. SUV సేల్స్‎లో ఇదే తోపు

భారత ఆటోమొబైల్ మార్కెట్ గతిని మార్చేస్తూ దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది మే 2026 నెల మహీంద్రా కంపెనీకి లాభాల పంట పండించింది. దేశీయ మార్కెట్‌లో మహీంద్రా ఎస్‌యూవీ (SUV) మోడళ్లకు విపరీతమైన క్రేజ్ పెరగడంతో కార్ల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి.

పేద, మధ్యతరగతికి దేవుడు లాంటి కంపెనీ

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki India Limited) మరోసారి తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఘనంగా చాటుకుంది. దేశంలో కార్ల విక్రయాల విషయంలో ఎన్నో సంవత్సరాలుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఈ సంస్థ, 2026 మే నెలలో తన చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ అమ్మకాల రికార్డును సొంతం చేసుకుంది. పెరుగుతున్న పోటీ, వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు, కొత్త కంపెనీల ఎంట్రీ వంటి సవాళ్లు ఉన్నప్పటికీ మారుతి సుజుకి తన బలమైన ఉత్పత్తుల శ్రేణి, విస్తృత డీలర్ నెట్‌వర్క్, వినియోగదారుల విశ్వాసంతో మరోసారి అసాధారణ ఫలితాలను సాధించింది.

ఇప్పుడు ప్రతి ఇల్లు ఈ కంపెనీ కారే కావాలంటోంది

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది. తాజాగా ముగిసిన మే 2026 నెల టాటా కంపెనీకి ఒక మైలురాయిగా నిలిచిపోయింది. పెట్రోల్, డీజిల్ (ICE) కార్లతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలకు (EV) మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరగడంతో.. టాటా మోటార్స్ గత నెలలో ఏకంగా 59,790 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. టాటా కార్ల అమ్మకాల పూర్తి వివరాలు, ఈవీ మార్కెట్లో సృష్టించిన సంచలనాల గురించి తెలుసుకుందాం.

దేశంలోనే ఛీపెస్ట్ 7 సీటర్ కారు.. మైలేజ్ ఏకంగా 27కిమీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో వ్యాన్ (Van) సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) తిరుగులేని రారాజుగా దూసుకుపోతోంది. సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా, ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉండే ఈ కారు.. అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ముగిసిన మే 2026 నెలలో ఈకో వ్యాన్ ఏకంగా 13,240 యూనిట్ల అమ్మకాలతో దుమ్మురేపింది. దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా పేరొందిన మారుతి ఈకో ఫీచర్లు, మైలేజ్, ధరల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Advertisement

మే నెల కియాకు మరపురాని నెల.. చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు

భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రవేశించి కొద్ది సంవత్సరాలే అయినప్పటికీ, దక్షిణ కొరియా దిగ్గజం కియా ఇండియా (Kia India) అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఒకప్పుడు దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీల ఆధిపత్యం ఉండగా, ఇప్పుడు కియా కూడా ఆ జాబితాలో కీలక స్థానాన్ని సంపాదించుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, పోటీ ధరలు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన మోడళ్లతో ఈ బ్రాండ్ భారత కొనుగోలుదారుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం Kia Seltos, Sonet, Carens, Syros వంటి మోడళ్లు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా SUV మరియు MPV సెగ్మెంట్లలో కియా తనదైన ముద్ర వేస్తూ ప్రతి నెలా వేల సంఖ్యలో వాహనాలను విక్రయిస్తోంది.