బజాజ్ అమ్మకాలు చూసి షాక్ అవుతున్న మార్కెట్!

మే నెల ముగియడంతో దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను వరుసగా విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న బజాజ్ ఆటో (Bajaj Auto) కూడా 2026 మే నెలకు సంబంధించిన విక్రయాల వివరాలను ప్రకటించింది. విడుదలైన గణాంకాలు పరిశీలిస్తే, కంపెనీకి దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బలమైన డిమాండ్ కొనసాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బజాజ్ మోటార్‌సైకిళ్లు, త్రీ-వీలర్లకు ఉన్న ఆదరణ కంపెనీ విక్రయాల్లో ప్రతిఫలించింది. ముఖ్యంగా ఎగుమతుల విభాగంలో నమోదైన అద్భుతమైన వృద్ధి కారణంగా కంపెనీ మొత్తం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

మార్కెట్లోకి వస్తున్న 5 అదిరిపోయే సరికొత్త కార్లు ఇవే

కొత్తగా లగ్జరీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు జూన్ నెల కరెక్ట్ టైం. ఈ నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఐదు సరికొత్త కార్లు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఇందులో మధ్యతరగతి వారిని ఆకట్టుకునే ఎలక్ట్రికల్ ఎస్‌యూవీల నుంచి కోటీశ్వరులు మెచ్చే ప్రీమియం లగ్జరీ కార్ల వరకు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మన దేశీ దిగ్గజం టాటా మోటార్స్ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐకానిక్ మోడల్ ఈ నెలే రాబోతోంది. దాంతో పాటు గ్లోబల్ బ్రాండ్లయిన బీవైడీ, స్కోడా, మెర్సిడెస్, బీఎమ్‌డబ్ల్యూ కంపెనీలు కూడా తమ పవర్‌ఫుల్ మోడళ్లను దించడానికి సిద్ధమయ్యాయి. అవి ఏంటంటే..

కోల్పోయిన సింహాసనం కోసం హ్యుందాయ్ పోరాటం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న హ్యుందాయ్ ప్రస్తుతం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా వంటి కంపెనీలు వేగంగా దూసుకెళ్తుండటంతో హ్యుందాయ్ తన పాత స్థానాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సవాల్‌ను అవకాశంగా మార్చుకుని మళ్లీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని కొరియన్ దిగ్గజం గట్టి వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ లక్ష్యంతోనే 2030 నాటికి భారత మార్కెట్లో ఏకంగా 26 కొత్త వాహనాలను విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. కొత్త మోడళ్లు, అప్‌డేటెడ్ వెర్షన్లు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాహనాల ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలని సంస్థ భావిస్తోంది.

కార్లలోనే ఫస్ట్ టైమ్ ఆ ట్యాంక్ టెక్నాలజీ

భాతర ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీలలో మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో దూసుకుపోయే ఈ కారు, ఇప్పుడు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ (Facelift) రూపంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. గత కొన్ని వారాలుగా సరికొత్త బ్రెజ్జా ఫీచర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మీరు కూడా ఈ క్రేజీ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, కంపెనీ ఇందులో ఆఫర్ చేయబోయే కొన్ని అద్భుతమైన ఫీచర్లు, విప్లవాత్మక మార్పుల గురించి తెలుసుకుందాం.
Advertisement

ఈ కంపెనీ కార్లను ఇండియన్స్ తెగ కొంటున్నారు

భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటైన దక్షిణ కొరియా దిగ్గజం హ్యూందాయ్ మోటర్ ఇండియా (Hyundai Motor India), పెరుగుతున్న పోటీ మధ్య కూడా తన మార్కెట్ బలాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా వంటి దేశీయ కంపెనీలు దూకుడుగా కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నప్పటికీ, హ్యుందాయ్ మాత్రం తన ఉత్పత్తుల శ్రేణి, ఆధునిక సాంకేతికత, వినియోగదారుల విశ్వాసంతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తాజాగా 2026 మే నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ వివరాలు పరిశీలిస్తే, హ్యుందాయ్‌కు దేశీయ మార్కెట్లో ఇప్పటికీ బలమైన డిమాండ్ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఆది కైలాష్ లాంటి ప్రమాదకర కొండలపై దూసుకెళ్లిన ఆల్టో

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) కారుకున్న ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుడి సొంత ఇంటి కలలాంటి ఈ చిన్న కారు.. కేవలం మైలేజ్, తక్కువ బడ్జెట్ పరంగానే కాకుండా పర్ఫార్మెన్స్ విషయంలోనూ తానేంటో నిరూపించుకుంది.

BaaS ప్లాన్‌తో ఈ ఎలక్ట్రిక్ కార్లు హాట్ టాపిక్!

పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లపై వినియోగదారుల ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని EV తయారీ సంస్థలు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) వంటి వినూత్న పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ విధానంలో వాహనం ధర నుంచి బ్యాటరీ ఖర్చును వేరు చేయడం వల్ల కారును తక్కువ ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. బ్యాటరీ కోసం ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా, వినియోగదారులు అవసరానికి అనుగుణంగా సేవను ఉపయోగించుకోవచ్చు. దీంతో EVల కొనుగోలు మరింత సులభం కావడంతో పాటు, ఖర్చు భారం కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈ కథణంలో ప్రస్తుతం మార్కెట్లో బాస్ స్కీమ్‌తో లభిస్తున్న 3 కార్లను ఒకసారి చూద్దాం.

క్లచ్ నొక్కే పనిలేదు.. జస్ట్ రూ.5 లక్షల్లో దొరికే టాప్ కార్లు ఇవే

ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మారుస్తూ, క్లచ్ నొక్కలేక విసిగిపోతున్నారా? ఒక మంచి ఆటోమేటిక్ కారు కొనాలని ఉందా.. కానీ బడ్జెట్ తక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లోనే బెస్ట్ ఆటోమేటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. టాటా, మారుతి సుజుకి, నిస్సాన్ వంటి ప్రముఖ కంపెనీలు అదిరిపోయే డిజైన్, పవర్‌ఫుల్ ఇంజన్, అదిరిపోయే ఇంటీరియర్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆటోమేటిక్ కార్లను అందిస్తున్నాయి. రూ.5 లక్షల లోపు ప్రారంభ ధరతో లభించే టాప్ అఫోర్డబుల్ ఆటోమేటిక్ కార్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Advertisement

కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మార్కెట్‌ను షేక్ చేస్తుందా?

భారతదేశంలోని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) మధ్యతరగతి ప్రజల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తమ పాపులర్ హాచ్‌బ్యాక్ కారు టియాగోను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ (Tiago Facelift) అవతారంలో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌ను కేవలం రూ.4.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే కంపెనీ తీసుకురావడం విశేషం. కస్టమర్ల జేబుకు పెద్దగా చిల్లు పడకుండా, తక్కువ ధరలోనే సరికొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఇంటీరియర్, మోడ్రన్ టెక్నాలజీ ఫీచర్లతో ఈ కారును టాటా అద్భుతంగా తీర్చిదిద్దింది. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో ఏయే మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వర్సెస్ క్లాసిక్ 650.. ఏ బైక్ కొంటే బెస్ట్?


అదిరిపోయే లుక్స్‎తో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఎలక్ట్రిక్ కార్లు

భారతదేశపు ఈవీ (EV) మార్కెట్లో టాటా మోటార్స్(Tata Motors) తిరుగులేని నంబర్-1 పొజిషన్‌లో దూసుకుపోతోంది. మార్కెట్లో తన పట్టును మరింత గట్టిగా ఉంచుకోవడానికి కంపెనీ సరికొత్త ప్లాన్‌తో సిద్ధమైంది. రాబోయే రోజుల్లో కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి టాటా కంపెనీ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 500 నుంచి 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే 4 అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి లైన్లో పెట్టింది. ఎంతో కాలంగా కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ ఫోర్ వీలర్స్ వివరాలు మరియు వాటి ప్రత్యేకతలు ఇక్కడ చూద్దాం.

క్రెటా కంటే రూ.లక్ష తక్కువకే లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ

భారతీయ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) మార్కెట్లో సరికొత్త పోరు మొదలైంది. ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) దేశీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు అర్బన్ క్రూజర్ ఎబెల్లా (Urban Cruiser Ebella) టాప్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త కారు ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric) కారుకు నేరుగా సవాల్ విసురుతోంది. మీరు కూడా త్వరలోనే ఒక మంచి ఫ్యామిలీ ఈవీ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఫీచర్లు, ధర, రేంజ్ పరంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షనో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Advertisement

30 కిమీ మైలేజ్, 500 కిమీ రేంజ్4 SUVలతో రెనాల్ట్-నిస్సాన్ ఎంట్రీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తమ పట్టును మరింత బలపరుచుకోవడానికి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్ (Renault), నిస్సాన్ (Nissan) జంట ఒక భారీ గేమ్‌ప్లాన్‌తో ముందుకు వస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు కలిసి ఇండియాలో నాలుగు సరికొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) కార్లను లాంచ్ చేయడానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

మహీంద్రా మాస్టర్ ప్లాన్.. 2031 నాటికి ఏకంగా 16 కొత్త SUVలు!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) భారీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. రాబోయే సంవత్సరాల్లో మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించేందుకు కంపెనీ ఒక మెగా ప్రొడక్ట్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. 2031 నాటికి ఏకంగా 16 కొత్త SUVలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక మహీంద్రా భవిష్యత్తుపై ఎంత పెద్ద ఆశలు పెట్టుకుందో స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ కొత్త వాహనాల్లో సంప్రదాయ ఇంధన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. మొత్తం 16 మోడళ్లలో 10 అంతర్గత దహన ఇంజిన్ (ICE) ఆధారిత పెట్రోల్, డీజిల్ SUVలు ఉండగా, మరో 6 పూర్తిగా ఎలక్ట్రిక్ SUVలు ఉండనున్నాయి.

రూ.6 లక్షల లోపు SUV కొనాలనుకునేవారి ఫేవరెట్ ఇదే!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ SUVల సెగ్మెంట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా 4 మీటర్ల లోపు పొడవు కలిగిన SUVలు స్టైలిష్ డిజైన్, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అందుబాటు ధరల కారణంగా మధ్యతరగతి వినియోగదారుల మొదటి ఎంపికగా మారుతున్నాయి. ఈ విభాగంలో అనేక మోడళ్లు పోటీపడుతున్నప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) తన ప్రత్యేకమైన డిజైన్, ఆకర్షణీయమైన ధరతో మార్కెట్లో మంచి గుర్తింపును సంపాదించింది. భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచే మాగ్నైట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ప్రీమియం లుక్, విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, పోటీ ధరల కలయిక ఈ SUV విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఒక లెజెండ్ తిరిగి వస్తోంది.. కొత్త తరం పజెరోపై భారీ అంచనాలు!

ఒకప్పుడు SUV ప్రియుల కలల వాహనంగా గుర్తింపు పొందిన మిత్సుబిషి పజెరో (Mitsubishi Pajero) మళ్లీ రోడ్లపైకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ ఐకానిక్ SUVను తిరిగి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మిత్సుబిషి మోటార్స్ ప్రకటించింది. దీంతో పజెరో అభిమానుల్లో మరోసారి ఉత్సాహం నెలకొంది. కొత్త తరం పజెరో 2026లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం కావచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. పజెరో పేరు SUV ప్రపంచంలో ఒక ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది. దశాబ్దాల పాటు ఆఫ్‌రోడ్ సామర్థ్యాలు, బలమైన నిర్మాణం, విశ్వసనీయ పనితీరుతో ఈ వాహనం ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
Advertisement

రోజూ 50-100 కి.మీ తిరిగేవారికి బెస్ట్ ఆప్షన్! ఈ స్కూటర్‌కు భారీ డిమాండ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ఒకప్పుడు పెట్రోల్ స్కూటర్లకు మాత్రమే పరిమితమైన వినియోగదారులు, ఇప్పుడు పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, ఆధునిక సాంకేతికత కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మళ్లుతున్నారు. ఈ మార్పును సద్వినియోగం చేసుకుంటూ బజాజ్ చేతక్ దేశీయ ఈవీ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న మోడళ్లలో ఒకటిగా ఎదిగింది. ప్రత్యేకంగా సంప్రదాయ బజాజ్ బ్రాండ్‌పై వినియోగదారుల్లో ఉన్న విశ్వాసం, చేతక్‌కు పెద్ద బలంగా మారింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యువతతో పాటు కుటుంబ వినియోగదారులను కూడా ఆకట్టుకుంటోంది.

14 లక్షల మంది నమ్మిన వ్యాన్.. మారుతి ఈకో క్రేజ్ ఇంకా తగ్గలేదు!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో వ్యాన్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco). దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా భారతీయ కుటుంబాలు, చిన్న వ్యాపారులు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు, వాణిజ్య వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకున్న ఈ వాహనం, తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. 2010లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈకో, కాలానుగుణంగా కొన్ని మార్పులు, అప్‌డేట్‌లతో ముందుకు సాగుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఈకో విజయానికి ప్రధాన కారణం దాని సరళమైన డిజైన్, విశాలమైన క్యాబిన్, తక్కువ నిర్వహణ ఖర్చులు, విశ్వసనీయ పనితీరు.

కొత్త హోండా సిటీపై ఫుల్ రివ్యూ: ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త డిజైన్, ఫీచర్లు, పనితీరు, ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి. Explore the 2026 Honda City Facelift. Sharper styling, advanced features, hybrid options. Full review on performance, interiors, and India pricing.

ఊహించని విధంగా ఒక్కసారిగా ఈ కారు అమ్మకాలు పెరిగాయి

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంతో ఆసక్తి, భారీ అంచనాల నడుమ అడుగుపెట్టిన మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) ప్రారంభంలో ఆశించిన స్థాయిలో అమ్మకాలను నమోదు చేయలేకపోయింది. ప్రత్యేకంగా ఆఫ్‌రోడింగ్ విభాగంలో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించుకున్న మహీంద్రా థార్ వంటి మోడళ్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకావడంతో జిమ్నీ విక్రయాలు కొంతకాలం మందగించాయి. అయితే, తన ప్రత్యేకమైన డిజైన్, నిజమైన 4x4 సామర్థ్యాలు, అలాగే మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కారణంగా ఈ SUV క్రమంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 2026 ఏప్రిల్ నెల జిమ్నీకి ఎంతో సానుకూల ఫలితాలను తీసుకొచ్చింది.
Advertisement

7గురు ఒకేసారి హ్యాపీగా జర్నీ చేసే 5 అదిరిపోయే కార్లు ఇవే

సెలవులు వచ్చాయంటే చాలు.. భార్యాపిల్లలు, అమ్మానాన్నలతో కలిసి హ్యాపీగా ట్రిప్స్ వేయడంలో ఉండే మజాయే వేరు. ఒక మంచి ఫ్యామిలీ కారు అంటే కేవలం సీట్లు ఉండటం కాదు.. ప్రయాణంలో పెద్దలు, పిల్లలకు అలసట లేకుండా లగ్జరీగా కూర్చునేలా ఉండాలి. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో రకాల వాహనాలు ఉన్నప్పటికీ.. దేశీయ కుటుంబాల అవసరాలను తీరుస్తూ అమ్మకాల్లో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న 5 మోస్ట్ పాపులర్ 7-సీటర్ కార్ల (Best 7 Seater Cars) వివరాలను, వాటి మైలేజ్, ధరల గురించి తెలుసుకుందాం.

బ్యాటరీ లేకుండానే టాటా టియాగో EV కొనొచ్చు

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించిన టాటా మోటార్స్ (Tata Motors) ఇప్పుడు మరోసారి సంచలన నిర్ణయంతో ముందుకొచ్చింది. తక్కువ ధరలో పంచ్ EVను అందించి మార్కెట్‌లో భారీ చర్చకు దారితీసిన ఈ సంస్థ, ఇప్పుడు టియాగో EV ధర విషయంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది. దీంతో "ఎలక్ట్రిక్ కారు కొనడం అంటే చాలా ఖర్చు" అనే అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయాలని టాటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్లు మధ్యతరగతి కుటుంబాలకు కాస్త దూరంగానే అనిపించేవి. కానీ ఇప్పుడు టాటా తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌తో పరిస్థితి పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ప్రారంభించిన బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ కార్యక్రమం ద్వారా, వినియోగదారులు బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించే విధంగా కారును తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నారు.

భారత‌లో టెస్లా కారు హల్‌చల్.. 500KM రేంజ్‌‌తో మోడల్ వై ప్రీమియం ఎంట్రీ

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త దిశ చూపించిన సంస్థగా టెస్లా (Tesla) పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలాన్ మస్క్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద EV తయారీదారుగా గుర్తింపు పొందింది. ఇలాంటి బ్రాండ్ భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించడం సహజంగానే భారీ ఆసక్తిని రేకెత్తించింది. టెస్లా ఎంట్రీని ఆటోమొబైల్ రంగంలో ఒక పెద్ద మైలురాయిగా కూడా భావించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్లా గత ఏడాది భారత మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే మొదటగా పరిచయం చేసిన మోడల్ వైపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, కొన్ని మార్కెట్ పరిస్థితులు, స్థానిక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

జస్ట్ రూ.4.69 లక్షలకే టాటా సరికొత్త సంచలనం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు నమ్మకమైన బ్రాండ్ టాటా మోటార్స్(Tata Motors). సేఫ్టీ, మైలేజ్ విషయంలో తిరుగులేని రికార్డు సృష్టించిన టాటా.. తన మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కార్ టాటా టియాగో(Tata Tiago 2026)ను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో మార్కెట్లోకి దించింది. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్‌ను పూర్తిగా మార్చేసి మునుపెన్నడూ లేని రేంజ్‌లో అగ్రెసివ్ ప్రైస్‌తో ఈ కారును లాంచ్ చేసింది.
Advertisement

ఈ స్కూటర్‌లో ఫీచర్లు చూస్తే కార్లను గుర్తు చేస్తాయి

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్ గురించి మాట్లాడితే, స్కూటర్లకు ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాల కోసం స్కూటర్లు ఇప్పుడు లక్షలాది మంది జీవితాల్లో భాగమయ్యాయి. ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించగలగడం, తక్కువ నిర్వహణ ఖర్చులు, కుటుంబ వినియోగానికి అనువుగా ఉండటం వంటి కారణాలతో స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో ప్రజల ఆలోచనల్లో కూడా పెద్ద మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ టూవీలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను గమనించిన తయారీ సంస్థలు కూడా వరుసగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.