రూ.97 వేలకే 200కిమీ రేంజ్ ఇచ్చే స్కూటర్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో సామాన్యులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఈవీ స్కూటర్ అంటే ఖరీదైన వాహనం అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రూ. లక్షలోపే మంచి రేంజ్, మంచి ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో స్కూటర్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి.

7 సీటర్ కార్లలో ఇండియాలో బెస్ట్‌ ఇదే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కుటుంబ అవసరాలకు సరిపోయే 7-సీటర్ కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి విభాగంలో ఎన్నో ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మోడల్ Maruti Suzuki Ertiga (మారుతి సుజుకి ఎర్టిగా). తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణికులకు సౌకర్యం, మంచి మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈ MPV దేశవ్యాప్తంగా కుటుంబాల మొదటి ఎంపికగా నిలుస్తోంది. తాజాగా విడుదలైన ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాయి. మారుతి సుజుకి ఎర్టిగా అమ్మకాలు ఈసారి గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.

7 లక్షల మందిని తన ప్రేమలో పడేసిన స్కూటర్

భారతదేశపు ఐకానిక్ స్కూటర్ 'బజాజ్ చేతక్(Bajaj Chetak) మరోసారి తన పూర్వ వైభవాన్ని చాటుకుంటోంది. ఒకప్పుడు పెట్రోల్ స్కూటర్లలో రారాజుగా వెలిగిన చేతక్(Bajaj Chetak), ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న గణాంకాల ప్రకారం, బజాజ్ చేతక్(Bajaj Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్ అక్షరాలా 7 లక్షల మంది భారతీయ వినియోగదారుల మనసు గెలుచుకుని, వారి ఇళ్లలో చేరిపోయింది. కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ఈ స్కూటర్ అమ్మకాలు ఊహించని రీతిలో పుంజుకోవడం విశేషం.

27 కిమీ మైలేజీ.. రూ.20వేలకే లగ్జరీ లుక్..పెద్ద ఫ్యామిలీలకు పర్ఫెక్ట్ కారు

మారుతి సుజుకి నుంచి మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యంగా పెద్ద ఫ్యామిలీలకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. భారత రోడ్లపై దశాబ్దాలుగా తిరుగులేని వ్యాన్‎గా గుర్తింపు పొందిన మారుతి ఈకో (Maruti Suzuki Eeco) ఇప్పుడు సరికొత్త హంగులతో, అదిరిపోయే లుక్‌లో స్టార్ ఎడిషన్ (Star Edition) రూపంలో మార్కెట్లోకి వచ్చింది. కేవలం రూ.20,000 అదనంగా ఖర్చు చేస్తే, మీ సాధారణ ఈకో ఒక లగ్జరీ కార్‌లా మారిపోతుంది. ముఖ్యంగా 26.78 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ కారు గురించి, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ లెక్కలకు తగినట్లుగా ఉండే ఈ కారు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Advertisement

దేశంలో నెంబర్ 1.. SUVలను కూడా దాటేసిన సెడాన్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తక్కువ ధరలో మంచి పనితీరు, అధిక మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో కార్లను అందించడంలో మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పటినుంచో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు కొత్త కారు కొనాలనుకున్నప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే బ్రాండ్ కూడా మారుతి సుజుకినే అని చెప్పాలి. చిన్న పట్టణాల నుంచి మెట్రో నగరాల వరకు ఈ కంపెనీ కార్లకు ఉన్న డిమాండ్ చూస్తే భారత మార్కెట్లో మారుతి ప్రభావం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం దేశంలో SUV కార్ల ట్రెండ్ భారీగా పెరిగింది. ఎక్కువ మంది వినియోగదారులు పెద్ద లుక్స్, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, రోడ్ ప్రెజెన్స్ కోసం SUVల వైపు మొగ్గు చూపుతున్నారు.

డాక్టర్లు, ఇంజనీర్లు ఎగబడి కొంటున్న కారు

భారత కార్ మార్కెట్లోకి ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినా, ఎన్ని ఎస్యూవీలు రాజ్యమేలుతున్నా.. సామాన్యుడికి మాత్రం ఇప్పటికీ మారుతి సుజుకి అంటేనే ఒక నమ్మకం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన మారుతి వ్యాగన్ ఆర్ (Maruti WagonR) తాజాగా మరోసారి తన సత్తా చాటుకుంది. ఏప్రిల్ 2026 నెలవారీ అమ్మకాలలో మారుతి వ్యాగన్ ఆర్ కారు తన ప్రత్యర్థులైన స్విఫ్ట్, బాలెనోలను కూడా వెనక్కి నెట్టి హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తక్కువ ధర, భారీ మైలేజీతో ఈ కారు భారతీయ రోడ్లపై రారాజులా దూసుకెళ్తుంది. ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. గడిచిన నెలలో ఈ కారును ఏకంగా 18,648 మంది కొనుగోలు చేశారు. గతేడాది ఏప్రిల్ (2025)లో ఈ సంఖ్య 13,414 యూనిట్లుగా ఉంది. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే 39 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. మొత్తం కార్ల అమ్మకాల్లో మారుతి డిజైర్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలో మాత్రం వ్యాగన్ ఆర్ తిరుగులేని విజేతగా నిలిచింది. దశాబ్దాలుగా వ్యాగన్ ఆర్ సక్సెస్ వెనుక ఉన్న ప్రధాన కారణం దాని టాల్ బాయ్ డిజైన్. కారు లోపలికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ఎంతో సౌకర్యంగా ఉండటం వల్ల వృద్ధులు, పిల్లలు ఉన్న కుటుంబాలకు ఇది మొదటి ప్రాధాన్యత. 2026 మోడల్ లో మారుతి సుజుకి అత్యాధునిక ఫీచర్లను జోడించింది. ఇందులో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ప్రీమియం ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీ, 341 లీటర్ల భారీ బూట్ స్పేస్ దీని ప్రత్యేకతలు. మారుతి వ్యాగన్ ఆర్ రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. 1.0-లీటర్ కె-సిరీస్ ఇంజిన్, కొంచెం ఎక్కువ పవర్ కోరుకునే వారి కోసం 1.2-లీటర్ ఇంజిన్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ (AGS) గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఇస్తోంది. మైలేజీ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ లీటరుకు 23.56 నుంచి 25.19 కి.మీ వరకు ఇస్తుంది. ఇక సిఎన్‌జీ (CNG) వేరియంట్ అయితే కిలోకు 33.47 కి.మీ మైలేజీని ఇచ్చి వాహనదారుల జేబుకు భారం తగ్గించడంలో నంబర్ 1 గా నిలుస్తోంది. ఈ కారును మారుతి తన ఐకానిక్ హార్టెక్ (HEARTECT) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) రేటింగ్‌లో ఇది కేవలం 1-స్టార్ మాత్రమే సాధించినప్పటికీ, కంపెనీ బేసిక్ సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్ గా అందిస్తోంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD), రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్-హోల్డ్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫ్యామిలీ కారుగా దీనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా మారుతి భద్రతపై మరింత దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో వ్యాగన్ ఆర్‌కు మారుతి సెలెరియో, టాటా టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, రెనాల్ట్ క్విడ్ వంటి కార్ల నుంచి గట్టి పోటీ ఉంది. అయినప్పటికీ వ్యాగన్ ఆర్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ మోడల్ రూ.7.45 లక్షల వరకు ఉంటుంది. తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే కారు కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. కొత్త కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి ఈ మే నెలలో తీపి కబురు చెప్పింది. వ్యాగన్ ఆర్ మోడల్ పై ప్రస్తుతం గరిష్టంగా రూ.50,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు (Cash Discount) తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కలిపి ఉన్నాయి. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. వేసవిలో ఫ్యామిలీతో ట్రిప్పులకు వెళ్లాలనుకునే వారికి ఈ డీల్ మంచి అవకాశమని చెప్పాలి.

పెట్రోల్ కాదు.. హైడ్రోజన్‌తో పరుగులు తీసే స్విఫ్ట్ కారు వచ్చేస్తోంది!

భారతదేశ ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం పెద్ద మార్పు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా దేశ రోడ్లపై ఆధిపత్యం చాటిన పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానాన్ని ఇప్పుడు క్రమంగా కొత్త తరహా పర్యావరణ అనుకూల వాహనాలు ఆక్రమిస్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్య సమస్యలు, కఠినమైన ఉద్గార నిబంధనలు వంటి కారణాలతో వినియోగదారులు కూడా ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందుకే ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు, సీఎన్‌జీ మోడళ్లకు భారీ ఆదరణ లభిస్తోంది. ఈ మార్పుకు కేంద్ర ప్రభుత్వం కూడా బలమైన మద్దతు ఇస్తోంది. భారతదేశంలో పర్యావరణహిత ఇంధన వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

మీ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ తగ్గిపోతోందా?

పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooters) వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగిపోతుందని ఈవీలను కొంటున్నారు. అయితే ఈవీ వినియోగదారులను ప్రధాన సమస్య రేంజ్.
Advertisement

హైక్రాస్ కోసం క్యూ కడుతున్న జనాలు!

భారతదేశంలో మల్టీ పర్పస్ వెహికల్ (MPV) సెగ్మెంట్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు టయోటా ఇన్నోవానే. ఎన్నో సంవత్సరాలుగా కుటుంబ వినియోగదారులు, వ్యాపారవేత్తలు, ట్రావెల్ ఆపరేటర్లు, కార్పొరేట్ వర్గాలు ఇలా ప్రతి సెగ్మెంట్‌లోనూ ఇన్నోవా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బలమైన నిర్మాణం, విశ్వసనీయ పనితీరు, విశాలమైన క్యాబిన్, దీర్ఘకాలిక నమ్మకం ఇవన్నీ కలిసి ఇన్నోవాను భారత మార్కెట్లో ఒక ప్రత్యేక బ్రాండ్‌గా మార్చాయి. అందుకే MPV మార్కెట్లో ఇప్పటికీ టయోటా ఇన్నోవా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ MPV రెండు ప్రధాన రూపాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఒకటి ఆధునిక హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) కాగా, మరొకటి సంప్రదాయ డీజిల్ పవర్‌తో కొనసాగుతున్న ఇన్నోవా క్రిస్టా (Innova Crysta).

ఎంజీ మెజెస్టర్ ఎంట్రీతో SUV మార్కెట్ షేక్!

భారతీయ రోడ్ల మీద రారాజుగా వెలుగొందుతున్న టయోటా ఫార్చ్యూనర్ (Fortuner)కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంజీ మోటార్స్ (MG Motors) రెడీ అయింది. తన అమ్ములపొదిలోని సరికొత్త అస్త్రాన్ని ఎంజీ మెజెస్టర్ (MG Majestor) రూపంలో మార్కెట్లోకి వదులుతోంది. ముఖ్యంగా ఫార్చ్యూనర్‌లోని ప్రీమియం వెర్షన్ అయిన లెజెండర్ (Legender) టార్గెట్‌గా ఈ కారు రాబోతుంది. రానున్న కొద్ది వారాల్లోనే భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ టెక్నాలజీ హ్యావీ ఎస్‌యూవీలో ఏముంది? ఇది టయోటా లెజెండర్‌ను ఎలా ఢీకొట్టబోతోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దేశంలో అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కారు ఇదే

భారతదేశంలో కొత్త కారు కొనాలని ఆలోచించే చాలా మంది వినియోగదారుల మనసులో మొదట గుర్తుకు వచ్చే పేరు మారుతి సుజుకి (Maruti Suzuki). దశాబ్దాలుగా భారత మధ్యతరగతి కుటుంబాల నమ్మకాన్ని సంపాదించుకున్న ఈ సంస్థ, తక్కువ ధరలో మంచి మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ వంటి కారణాలతో దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఒకప్పుడు డీజిల్ కార్లతో కూడా మార్కెట్లో బలమైన స్థానం కలిగిన మారుతి, BS6 నిబంధనల తర్వాత డీజిల్ విభాగానికి వీడ్కోలు పలికింది. చాలా మంది అప్పట్లో "డీజిల్ లేకుండా మారుతి మార్కెట్లో ఎలా నిలబడుతుంది?" అని సందేహపడ్డారు. కానీ కంపెనీ మాత్రం పెట్రోల్, CNG కార్లతోనే కొత్త చరిత్రను సృష్టించింది.

టాటా సియెర్రా ఈవీ లీక్.. 500Km రేంజ్‌తో మార్కెట్ షేక్

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఐకానిక్ బ్రాండ్ సియెర్రాను సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో తీసుకురావడానికి సిద్ధమైంది. గత ఏడాది విడుదలైన టాటా సియెర్రా ఐసీఈ (ICE) వెర్షన్ ఇప్పటికే మార్కెట్లో మంచి విజయాన్ని అందుకోగా, ఇప్పుడు అందరి కళ్లు టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV) మీద పడ్డాయి.
Advertisement

రోజూ ఆఫీస్ వెళ్లేవారికి వరం లాంటి బైక్

భారతీయ మార్కెట్లో బైక్ కొనుగోలు చేసే చాలా మంది వినియోగదారుల మొదటి ప్రాధాన్యం మైలేజీకే ఉంటుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారు, వ్యాపార పనుల కోసం ఎక్కువగా ప్రయాణించే వారు, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేవారు ఇలా ప్రతి వర్గానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లగల బైక్‌లపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అందుకే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో 100 సీసీ నుంచి 110 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన బైక్‌లే ముందుంటున్నాయి. ఇవి తక్కువ ఇంధన వినియోగంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గించడంతో మధ్యతరగతి, ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా వీటినే ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో "మంచి మైలేజీతో పాటు బడ్జెట్‌లో దొరికే బైక్ ఏది?" అనే ప్రశ్నతో చాలా మంది షోరూమ్‌లకు వెళ్తున్నారు.

రూ.6 లక్షల కారుపై రూ.60,000 తగ్గింపు

మనదేశంలో మధ్య తరగతి కుటుంబాలకు ఏడుగురు కూర్చునే కారు (7 Seater MPV) కొనడం అనేది ఒక పెద్ద కల. అయితే ఎర్టిగా, కారెన్స్ వంటి కార్ల ధరల బడ్జెట్ పది లక్షల దాటిపోతుండటంతో చాలామంది కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి రెనాల్ట్ ఇండియా ఒక అద్భుతమైన వార్త చెప్పింది. దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా పేరుగాంచిన రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) పై మే 2026 నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కేవలం రూ.5.81 లక్షల ప్రారంభ ధరకే లభించే ఈ కారుపై ఇప్పుడు రూ.60,000 వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. రెనాల్ట్ ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎమ్‌పీవీ ట్రైబర్‌పై మే 2026లో కళ్లు చెదిరే ఆఫర్లను ఇస్తోంది. మీరు ఈ నెలలో ట్రైబర్ కొనుగోలు చేస్తే మొత్తం రూ.60,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ.15,000 నేరుగా నగదు తగ్గింపు (Cash Discount), పాత కారును మార్చుకునే వారికి రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తుంది. వీటికి అదనంగా కస్టమర్ల నమ్మకానికి గుర్తుగా లాయల్టీ బోనస్ కూడా అందుబాటులో ఉంది. అయితే, ఎంట్రీ లెవల్ వేరియంట్లు అయిన అథెంటిక్, ఎవల్యూషన్ ట్రిమ్స్‌పై మాత్రం కేవలం లాయల్టీ, స్క్రాపేజ్ బెనిఫిట్స్ మాత్రమే వర్తిస్తాయి. ప్రాంతాల వారీగా కూడా రెనాల్ట్ కొన్ని ప్రత్యేక ఆఫర్లను ఇస్తోంది. తమిళనాడులో కార్పొరేట్ బోనస్ కింద రూ.15,000 వరకు తగ్గింపు లభిస్తుండగా, మిగిలిన రాష్ట్రాల్లో అంతటా ఇది రూ.10,000గా ఉంది. అంతేకాకుండా, దేశానికి వెన్నెముక అయిన రైతులు, గ్రామ సర్పంచులు, గ్రామ పంచాయతీ సభ్యుల కోసం రూరల్ ఆఫర్ కింద అదనంగా రూ.4,000 ప్రయోజనాన్ని కూడా రెనాల్ట్ అందిస్తోంది. ట్రైబర్ MY2025 స్టాక్ క్లియర్ చేయడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలు రూ.5.81 లక్షల నుంచి ప్రారంభమై రూ.8.48 లక్షల వరకు ఉన్నాయి.భారత మార్కెట్లో 7-సీటర్ విభాగంలో మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా రూమియన్, కియా కారెన్స్ వంటి కార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కానీ వీటి ధరలు సామాన్యుడికి భారం కావచ్చు. అటువంటి సమయంలో రెనాల్ట్ ట్రైబర్ ఒక పర్ఫెక్ట్ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఇది కేవలం తక్కువ ధరకే కాకుండా, నిస్సాన్ కొత్తగా తీసుకురాబోతున్న గ్రావైట్(Gravite)కు కూడా గట్టి పోటీనిస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కోరుకునే వారికి ట్రైబర్ బెస్ట్ ఛాయిస్. రెనాల్ట్ ట్రైబర్‌ను ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో మూన్‌లైట్ సిల్వర్, సీడర్ బ్రౌన్ వంటి డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లు కాంట్రాస్ట్ బ్లాక్ రూఫ్‌తో లభిస్తాయి. కొత్తగా 14-అంగుళాల ఫ్లెక్స్ వీల్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్ తో కూడిన డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. లోపల 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ట్రైబర్‌లో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 71 hp గరిష్ట శక్తిని, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, ఏఎమ్‌టీ (AMT) ఆప్షన్లలో లభిస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు, చిన్నపాటి లాంగ్ ట్రిప్పులకు ఇది సరిగ్గా సరిపోతుంది. మైలేజీ విషయానికి వస్తే, ఇది లీటరుకు 18 నుంచి 19 కిలోమీటర్ల వరకు ఇస్తుందని కంపెనీ పేర్కొంది, ఇది ఒక 7-సీటర్ కారుకు చాలా మంచి మైలేజీ అని చెప్పవచ్చు. ట్రైబర్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని స్పేస్. దీని వీల్‌బేస్ 2,636mm, గ్రౌండ్ క్లియరెన్స్ 182mm గా ఉంది. లోపల కూర్చునే వారికి ఇబ్బంది లేకుండా సీట్లను దాదాపు 100 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. సేఫ్టీ పరంగా కూడా ఇది నమ్మదగ్గది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలకు 4-స్టార్, పిల్లలకు 3-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి. లోడ్ లిమిటర్, ప్రీటెన్షనర్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు అదనపు రక్షణను ఇస్తాయి.

వేసవిలో పొరపాటున కూడా ఈ 5 చోట్ల పార్క్ చేయకండి

మే నెల వచ్చేసింది.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఎండకాలం అంటే మన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటాం కానీ, మన కారు ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం. బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంటే, ఎండలో పార్క్ చేసిన కారు లోపల ఉష్ణోగ్రత దాదాపు 60 డిగ్రీల వరకు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో కారును ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం వల్ల ఇంజిన్ నుంచి ఇంటీరియర్ వరకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే వేసవిలో ఈ ఐదు చోట్ల కారును అస్సలు పార్క్ చేయవద్దు.

డీజిల్ కార్లలో మహీంద్రా సునామీ.. టాప్ 10లో సగం వాళ్లదే!

కాలుష్య నియంత్రణ నిబంధనలు రోజురోజుకు కఠినతరం అవుతున్న నేపథ్యంలో, డీజిల్ కార్ల యుగం ముగిసిపోతోందనే అభిప్రాయం ఒక దశలో బలంగా వినిపించింది. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ వేగం పెరగడంతో, భవిష్యత్తు మొత్తం ఈవీలదే అనే నమ్మకం చాలా మందిలో ఏర్పడింది. అయితే మార్కెట్‌లో కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులు మాత్రం ఈ అంచనాలకు భిన్నంగా ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో డీజిల్ కార్లకు ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది. నిర్వహణ ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటి మైలేజ్, లాంగ్-డ్రైవ్ సామర్థ్యం, అలాగే శక్తివంతమైన పనితీరు వినియోగదారులను ఇంకా ఆకర్షిస్తూనే ఉన్నాయి.
Advertisement

500 కిమీ రేంజ్.. రూ.1.71 లక్షల డిస్కౌంట్.. మిస్సవద్దు

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా మే 2026 నెలకు సంబంధించి కంపెనీ తన ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ పోర్ట్‌ఫోలియోపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో అన్నింటికంటే ఆకర్షణీయంగా నిలిచింది టాటా కర్వ్ EV. ఈ కారును ఇప్పుడు కొనుగోలు చేస్తే ఏకంగా రూ.1.71 లక్షల వరకు ప్రత్యక్ష ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

TVS నుంచి కొత్త బాంబ్!.. iQube S 4.7 kWh వేరియంట్ లాంచ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కూడా తమ స్థాయిని బలపరచుకోవడానికి కొత్త మోడళ్లను తీసుకువస్తోంది. ఈ పోటీలో ముందంజలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company), తన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని మరింత బలపరచే దిశగా మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న TVS iQube లైనప్‌లోకి, ఇప్పుడు మరింత సామర్థ్యం గల కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. కొత్తగా iQube S 4.7 kWh వేరియంట్‌ను విడుదల చేసింది. పేరుతోనే తెలుస్తున్నట్లుగా పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. దీని వల్ల స్కూటర్‌కు మెరుగైన రేంజ్, అలాగే రోజువారీ వినియోగానికి మరింత సౌకర్యం లభించే అవకాశం ఉంది.

నెలకు రూ.8000 సేవ్ చేయాలా?

EV vs Petrol : భారత ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం ఒక చారిత్రాత్మక మలుపులో ఉంది. ఒకప్పుడు పెట్రోల్ కార్లంటేనే క్రేజ్.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా 'గ్రీన్ నంబర్ ప్లేట్' ఉన్న ఎలక్ట్రిక్ కార్లే కనిపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు సెంచరీ దాటి ఎప్పుడో పరుగులు తీస్తుంటే, సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే ఎలక్ట్రిక్ కారే దిక్కు అనే పరిస్థితి వచ్చింది. మరి 2026లో మీరు కారు కొనాలనుకుంటే.. పెట్రోల్ కారు తీసుకోవాలా? లేక ఎలక్ట్రిక్ కారు (EV) తీసుకోవాలా? అసలు మీ డబ్బుకు ఏది సరైన విలువను ఇస్తుంది? ఈ రెండింటి మధ్య ఉన్న అసలు యుద్ధం ఏంటో లోతుగా విశ్లేషిద్దాం.

భవిష్యత్తు స్కూటర్ వచ్చేస్తుంది.. హైడ్రోజన్‌తో పరుగులు!

పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్వేషణలో, ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే ఒక ప్రధాన దిశగా మారాయి. నగరాల్లోనూ, హైవేలపై కూడా ఈవీల వినియోగం పెరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇంతటితో ఆగకుండా, మరింత శుభ్రమైన, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైడ్రోజన్ ఇంధనం మరో ఆసక్తికరమైన ఎంపికగా ముందుకు వస్తోంది. హైడ్రోజన్‌ను ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ద్వారా ఉపయోగించడం గానీ, అంతర్గత దహన యంత్రాల్లో (ICE) వినియోగించడం గానీ, రెండూ పర్యావరణానికి అనుకూలంగా ఉండే మార్గాలుగా పరిశీలించబడుతున్నాయి.
Advertisement

ఏప్రిల్‌లో ఎలక్ట్రిక్ కార్ల దుమ్మురేపే సేల్స్.. నం.1గా టాటా మోటార్స్

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల మంట నుంచి తప్పించుకోవడమే కాకుండా, పర్యావరణ హితంగా ఉండాలనే ఉద్దేశంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఏప్రిల్ 2026 నెలకి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల నివేదిక విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం, దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, మిగిలిన కంపెనీలు కూడా గట్టి పోటీని ఇచ్చాయి. ఏప్రిల్ 2026 గణాంకాల ప్రకారం భారత్‌లో మొత్తం 22,677 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. మార్చి నెలతో పోలిస్తే (23,097 యూనిట్లు) అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, ఓవరాల్‌గా మార్కెట్ ఊపు కొనసాగుతోంది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలలతో పోలిస్తే విక్రయాలు భారీగా మెరుగుపడ్డాయి. దీనికి ప్రధాన కారణం కొత్త మోడల్స్ మార్కెట్లోకి రావడం, ఛార్జింగ్ సదుపాయాలు కాస్త పెరుగుతుండటమే.

ఈ లుక్ చూసారా? హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్ రచ్చ!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న టాటా మోటార్స్ (Tata Motors), ఇప్పుడు మరోసారి తన ప్రీమియం SUV లైనప్‌కు స్టైలిష్ టచ్‌ను జోడించింది. కంపెనీకి చెందిన ప్రముఖ SUVలు హారియర్ (Harrier), సఫారీ (Safari) డీజిల్ వెర్షన్‌లలో కొత్తగా "అల్ట్రా ట్రిమ్"తో పాటు "రెడ్ డార్క్ ఎడిషన్"ను అధికారికంగా విడుదల చేయడం ద్వారా మార్కెట్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ ఏడాది జనవరిలో పెట్రోల్ వేరియంట్లతో పరిచయం చేసిన రెడ్ డార్క్ థీమ్, ఇప్పుడు డీజిల్ ఆప్షన్‌లో కూడా అందుబాటులోకి రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. డీజిల్ లైనప్‌లో ఇది అత్యంత ప్రీమియం, ఫుల్లీ లోడెడ్ ట్రిమ్‌గా నిలుస్తోంది. అంటే ఫీచర్ల పరంగా ఎలాంటి రాజీ లేకుండా, టాప్ ఎండ్ అనుభూతిని అందించేందుకు ఈ ఎడిషన్ రూపొందించబడింది.

ప్రతి నెల వేల రూపాయలు ఆదా చేసే ఈ కార్లలో ఏది బెస్ట్ ?

ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా నడుస్తోంది. యుద్ధం కారణంగా నెలకొన్న ఇంధన సంక్షోభం కారణంగా పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టడం కంటే, ఇంట్లోనే మొబైల్‌లా కార్లను ఛార్జ్ చేసుకోవడం మంచిదని అంతా కరెంట్ కార్లనే కొంటున్నారు. అయితే, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ప్రస్తుతం మార్కెట్‌లో టాటా పంచ్ EV (Tata Punch EV), MG కామెట్ EV (MG Comet EV) మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఒకటి చూడటానికి రగ్గడ్ SUVలా ఉంటే, మరొకటి క్యూట్ అండ్ కాంపాక్ట్ గాడ్జెట్‌లా కనిపిస్తుంది. మరి మీ డబ్బుకు ఏ కారు సరైన విలువనిస్తుంది? ఈ రెండింటిలో మీ ఫ్యామిలీకి ఏది సెట్ అవుతుంది? వివరంగా తెలుసుకుందాం.

ఇంత మంచి స్కూటర్‌ అమ్మకాలను నిలిపివేసిన కంపెనీ

భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో పోటీ రోజురోజుకీ వేడెక్కుతోంది. ఈ పోటీలో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తన సత్తాను నిరూపించుకుంది. ఒకప్పుడు కొత్తగా భావించిన ఈవీ సెగ్మెంట్‌ను ముందుగానే అంచనా వేసి, టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) రూపంలో వినియోగదారుల ముందుకు తీసుకువచ్చిన కంపెనీ, ఇప్పుడు మార్కెట్‌లో అగ్రస్థానాన్ని అందుకోవడం చిన్న విషయం కాదు. Ola Electric, Ather Energy, Bajaj Auto వంటి దిగ్గజాల మధ్య నిలబడి, ఐక్యూబ్ తనదైన స్థానం సంపాదించుకుంది. ఇలాంటి విజయోత్సాహం మధ్యలోనే కంపెనీ తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా, నిశ్శబ్దంగా TVS iQube S వేరియంట్ అమ్మకాలను నిలిపివేయడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Advertisement

క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తున్న టాప్ 5 బడ్జెట్ బైక్స్ ఇవే

బైక్ మీద లాంగ్ జర్నీ అంటే చాలా మందికి ఇష్టం. కానీ, గంటల తరబడి హైవేల మీద ఎక్సలరేటర్ పట్టుకుని ఉంటే చేయి నొప్పి పుట్టడం ఖాయం. ఈ ఇబ్బందిని దూరం చేసేందుకే క్రూయిజ్ కంట్రోల్ (Cruise Control) అనే అద్భుతమైన ఫీచర్ వచ్చింది. ఒకప్పుడు కేవలం లక్షల రూపాయల ఖరీదైన విదేశీ బైకుల్లో మాత్రమే కనిపించే ఈ టెక్నాలజీ, ఇప్పుడు మన సామాన్యుల బడ్జెట్ బైకుల్లోకి కూడా వచ్చేసింది. మీరు ఎక్సలరేటర్ ముట్టుకోకుండానే బైక్ ఒకే వేగంతో సాగిపోతుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మరి మన దేశంలో అత్యంత తక్కువ ధరకే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను అందిస్తున్న టాప్-5 బైక్‌ల వివరాలు తెలుసుకుందాం.