పల్లెల్లో.. పట్టణాల్లోనూ దీనిదే హవా

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంపాక్ట్ ఎస్‌యూవీ( Compact SUVs)ల మాటే వినిపిస్తోంది. ఒకప్పుడు సెడాన్(sedan), హ్యాచ్‌బ్యాక్ కార్ల వైపు మొగ్గు చూపిన భారతీయ వినియోగదారులు, ఇప్పుడు ఎస్‌యూవీల వైపు వేగంగా మళ్లుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 2026 విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాటా మోటార్స్(Tata Motors) తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, మారుతి సుజుకి(Maruti suzuki), హ్యుందాయ్ సంస్థలు తమ ఉనికిని కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

రెండు ఫ్యామిలీలకు సరిపోయే పర్ఫెక్ట్ కార్లు రాబోతున్నాయ్

ఒకే కారులో రెండు కుటుంబాలు.. లాంగ్ ట్రిప్స్‌కైనా టెన్షన్ లేదు.. ఇప్పుడు భారత మార్కెట్‌లోకి భారీ సైజు 7 సీటర్ SUVల వరద రాబోతోంది.పెద్ద కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లు అయితే అయితే కొద్ది రోజులు ఆగడం మంచిది. ఫార్చ్యూనర్ నుంచి స్కార్పియో వరకు కొత్త అవతారాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ కార్లు పెద్ద కుటుంబాల కలలను నిజం చేసేలా కనిపిస్తున్నాయి.

విజయ్ కాన్వాయ్‌లో కనిపించిన కారు వైరల్!

CM Vijay Convoy : సినీ స్టార్ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా మారిన విజయ్(CM Vijay) ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఆయన ప్రమాణ స్వీకార వేడుక కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది మాత్రం ఆయన కాన్వాయ్‌లో కనిపించిన ఓ పాత కారు. కోట్ల విలువైన భద్రతా వాహనాల మధ్య తనకు ఇష్టమైన పాత స్విఫ్ట్(Maruti Swift) కారును కూడా కొనసాగించడంతో విజయ్ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నారు.

డీజిల్ కార్లకు కౌంట్‌డౌన్ మొదలైందా?

Diesel Cars : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో డీజిల్ కార్ల(Diesel Cars) హవా పూర్తిగా తగ్గిపోయిందనుకుంటున్న సమయంలో మరోసారి ఈ సెగ్మెంట్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా స్కార్పియో, థార్(Thar), ఫార్చ్యూనర్ వంటి SUVలను ఇష్టపడే వారి మధ్య ఇప్పుడు ఒకే చర్చ నడుస్తోంది.. BS7 నిబంధనలు వస్తే డీజిల్ కార్ల(Diesel Cars) భవిష్యత్తు ఏమవుతుంది? అనే ప్రశ్న. ఒకవైపు ఎలక్ట్రిక్ కార్లు(Electric Cars) వేగంగా పెరుగుతున్నా.. మరోవైపు లాంగ్ డ్రైవ్స్, హైవే ప్రయాణాలు చేసే వారు ఇప్పటికీ డీజిల్‌కే పెద్దపీట వేస్తున్నారు.
Advertisement

చుక్క పెట్రోల్ కూడా కొట్టించనక్కర్లేదు.. ఇదేం వింత బైక్ సామీ?

Honda WN7 : దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. ఈ సమయంలో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా(Honda WN7) సరికొత్త విద్యుత్ బైక్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అద్భుతమైన రూపకల్పన, భారీ శక్తి, భవిష్యత్ తరహా టెక్నాలజీతో వస్తున్న ఈ బైక్ ఇప్పుడు వాహన ప్రియుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది.

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. నీలిరంగు చీరలో మెరిసిన త్రిష

Vijay - Trisha : తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. సినీ నటుడి నుంచి ప్రజా నాయకుడిగా ఎదిగిన దళపతి విజయ్(Thalapathy Vijay), నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ భారీ బహిరంగ వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. అయితే, ఈ వేడుకలో రాజకీయ చర్చల కంటే ఎక్కువగా విజయ్ సన్నిహితురాలు, నటి త్రిష కృష్ణన్(Trisha Krishnan) రాక హాట్ టాపిక్ అయింది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష(Trisha Krishnan) అత్యంత హుందాగా హాజరయ్యారు. ఆమె ధరించిన ముదురు నీలిరంగు (Navy Blue) చీర వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం 9 గంటలకే స్టేడియానికి చేరుకున్న ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా ఎగబడ్డారు. గత కొంతకాలంగా విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల నేపథ్యంలో, ఆమె ఈ చారిత్రాత్మక వేడుకలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పెట్రోల్ ఖర్చు సగం తగ్గించే బైకులు ఇవే

పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో సామాన్యుడికి మైలేజ్ బైకులే కొండంత అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పల్లెటూరి రోడ్లు, గతుకుల రహదారుల పై కూడా చెక్కుచెదరకుండా ప్రయాణించే, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే టాప్ మోడళ్ల వివరాలు తెలుసుకుందాం. రోజూ 50కిమీ వెళ్లే ఉద్యోగికి నెలకు రూ.2500 వరకు పెట్రోల్ ఖర్చు తగ్గించే బైకులు కూడా ఇవే.

అమ్మ కోసం అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

Mothers Day 2026 : ఈ మాతృ దినోత్సవం(Mothers Day 2026) వేళ మీ అమ్మకు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే పర్యావరణానికి మేలు చేసే, పెట్రోల్ ఖర్చు లేని ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ ఆప్షన్. నడపడానికి సులభంగా ఉంటూనే, వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం ఉన్న టాప్ మోడళ్ల వివరాలు మీ కోసం ప్రత్యేకంగా ఇక్కడ అందించాం.
Advertisement

ఎన్నో కార్లు వచ్చాయి.. కానీ ఆల్టో క్రేజ్ మాత్రం తగ్గలేదు!

భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో కొన్ని కార్లు కేవలం వాహనాలుగానే కాకుండా, కోట్లాది కుటుంబాల జీవితాల్లో భాగంగా మారిపోయాయి. అలాంటి అరుదైన కార్లలో మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) పేరు ఎప్పటికీ ముందుంటుంది. "మొదటి కారు" అనే కలను మధ్యతరగతి కుటుంబాలకు నిజం చేసిన కారు ఏదైనా ఉందంటే, అది ఆల్టోనే అని చెప్పాలి. 1990ల నుంచే భారత రోడ్లపై తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్, ఇప్పటికీ తన క్రేజ్‌ను ఏమాత్రం కోల్పోలేదు. మొదట్లో 800cc ఇంజన్‌తో వచ్చిన ఆల్టో, కాలానికి అనుగుణంగా మారుతూ ఇప్పుడు 1-లీటర్ K10 పెట్రోల్ ఇంజన్‌తో మరింత ఆధునిక రూపంలో అమ్ముడవుతోంది. ప్రస్తుతం 'ఆల్టో K10' పేరుతో మార్కెట్లో ఉన్న అమ్మకానికి ఉంది.

మైలేజీలో సరికొత్త సంచలనం.. రెనాల్ట్ నుంచి మినీ డస్టర్ వస్తోంది

Renault Bridger : ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో భారీ విప్లవం సృష్టించేందుకు సిద్ధమైంది. బ్రిజర్ పేరుతో సరికొత్త ఎస్‌యూవీని విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీనిని మినీ డస్టర్ అని కూడా పిలుస్తున్నారు. ఈ కారు లీటరుకు ఏకంగా 30 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఇస్తుందని వార్తలు రావడంతో వాహన ప్రియుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది.

హోండా యాక్టివాకు అన్న వచ్చేస్తున్నాడు

భారతదేశంలో స్కూటర్ మార్కెట్ గురించి మాట్లాడితే, హోండా యాక్టివా(Honda Activa) పేరు తప్పకుండా ముందుకు వస్తుంది. సంవత్సరాలుగా భారతీయ కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ స్కూటర్, ఇప్పటికీ అమ్మకాలలో రారాజుగా కొనసాగుతోంది. ప్రతి నెలా లక్షల సంఖ్యలో యాక్టివా యూనిట్లు అమ్ముడవుతుండగా, ఇతర కంపెనీలు దాని స్థాయికి చేరేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు హోండా మరో కొత్త ప్లాన్‌తో భారత మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హోండా భారతదేశంలో ప్రధానంగా యాక్టివా, డియో అనే రెండు స్కూటర్‌లను విక్రయిస్తోంది. ఇవి 110cc, 125cc ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు భారత స్కూటర్ మార్కెట్ వేగంగా మారుతోంది.

రూ.10 లక్షల లోపే ఈ ఫీచర్‌ను పొందిన తొలి SUV..

భారతదేశంలోని కాంపాక్ట్ SUV మార్కెట్‌లో Tata Nexon (టాటా నెక్సాన్)‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భద్రత, బలమైన నిర్మాణ నాణ్యత, ఆధునిక డిజైన్, పెట్రోల్ నుంచి EV వరకు విభిన్న ఇంధన ఎంపికలను అందిస్తూ, ఇది భారతీయ కుటుంబాల ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. అందుకే ప్రతి నెలా 15 వేలకుపైగా యూనిట్లు అమ్ముడవుతూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని, టాటా మోటార్స్ నెక్సాన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలి కాలంలో భారతీయ కస్టమర్లలో సన్‌రూఫ్ కార్లపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న కార్లకు యువత, ఫ్యామిలీ కొనుగోలుదారుల నుంచి భారీ డిమాండ్ వస్తోంది.
Advertisement

కుటుంబాల మనసు దోచుకున్న ఏథర్ రిజ్టా

భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఒకప్పుడు స్పోర్టీ డిజైన్, యువతకు నచ్చే పెర్ఫార్మెన్స్ మోడళ్లతో గుర్తింపు తెచ్చుకున్న ఏథర్ ఎనర్జీ (Ather Energy), ఇప్పుడు కుటుంబాల కోసం రూపొందించిన 'రిజ్టా (Rizta)' స్కూటర్‌తో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. రోజువారీ ప్రయాణాలకు అనువైన, తక్కువ నిర్వహణ ఖర్చులతో కూడిన, సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలను ఏథర్ రిజ్టా భారీగా ఆకర్షించింది. ఇప్పుడు ఈ స్కూటర్ మరో అరుదైన మైలురాయిని దాటింది. కంపెనీ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, ఏథర్ ఇప్పటివరకు 3 లక్షల రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ గణాంకం కేవలం అమ్మకాల సంఖ్య మాత్రమే కాదు.. భారత మార్కెట్లో రిజ్టా సాధించిన విశ్వాసానికి నిదర్శనం కూడా.

రూ.5 లక్షలకే 366 కి.మీ రేంజ్ ఈవీ కారు?

భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో సామాన్యులకు కూడా ఈవీ అనుభవాన్ని చేరువ చేసిన కార్లలో టాటా టియాగో ఈవీ ( Tata Tiago Ev) ఒకటి. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే కుటుంబాలకు ఇది మొదటి ఎంపికగా మారింది. నగర రోడ్లపై నిశ్శబ్దంగా పరుగులు తీస్తూ, పెట్రోల్ ఖర్చుల నుంచి ఉపశమనం కలిగించిన ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు మరింత కొత్త రూపంలో రాబోతోందనే వార్త ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం టాటా మోటార్స్ కొత్త Tiago Ev Facelift (టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్) మోడల్‌ను భారతీయ రహదారులపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఇప్పటికే పలుమార్లు స్పై చిత్రాల్లో కనిపించిన ఈ కారు, పాత మోడల్‌తో పోలిస్తే మరింత ప్రీమియం లుక్‌తో రానుందని సమాచారం.

కియా సోనెట్ అమ్మకాలు భారీగా పెరిగాయి

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు రోజు రోజుకీ పెరుగుతున్న డిమాండ్ మధ్య, కియా సోనెట్ తన ప్రత్యేక స్థానం నిలబెట్టుకుంటోంది. స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు, అలాగే అందుబాటు ధరల కలయికతో ఈ SUV భారతీయ వినియోగదారుల మనసులను గెలుచుకుంది. ముఖ్యంగా యువత, చిన్న కుటుంబాలు, నగరాల్లో ఎక్కువగా ప్రయాణించే వినియోగదారులు కియా సోనెట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే ఇది సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUV విభాగంలో ఎప్పటికప్పుడు మంచి అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. ఇటీవల విడుదలైన ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా కియా సోనెట్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను మరోసారి స్పష్టంగా చూపించాయి.

కుటుంబం మొత్తానికి సేఫెస్ట్ కారు

భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు కారు కొనాలంటే మొదట చూసేది రెండు విషయాలు.. ఒకటి భద్రత, రెండోది మైలేజ్. ఈ రెండు అంశాల్లోనూ దేశవ్యాప్తంగా నమ్మకం సంపాదించుకున్న SUV టాటా నెక్సాన్ (Tata Nexon). ఇప్పుడు ఈ కారుపై మే 2026 నెలలో భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో మరోసారి ఆటో మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement

87 వేలు పెట్టి కొంటే 60 స్పీడ్‌కే ఇంజిన్ వేడెక్కింది

భారతదేశంలో చాలా మందికి బైక్ అంటే కేవలం ఒక వాహనం కాదు.. అది రోజు ఉద్యోగానికి వెళ్లేందుకు, కుటుంబాన్ని నడిపించేందుకు ఉపయోగపడే ముఖ్యమైన ఆస్తి. అలాంటి సమయంలో కొత్తగా కొనుగోలు చేసిన బైక్ మొదటి నుంచే సమస్యలు పెడితే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేరళలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తక్కువ బడ్జెట్‌లో మోస్ట్ పాపులర్ ఈవీ కార్లు

గత కొన్నేళ్లుగా భారతదేశ ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ వాహనాలకే పరిమితమైన మార్కెట్ ఇప్పుడు క్రమంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళనలు, అలాగే కొత్త టెక్నాలజీల అందుబాటు కారణంగా వినియోగదారుల ఆలోచనల్లో కూడా పెద్ద మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, నగరాల్లో రోజూ ప్రయాణించే ఉద్యోగులు, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే కుటుంబాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రోజూ ఆఫీసులకు వెళ్లేవారు, నగరాల్లో ఎక్కువగా ప్రయాణించే వారు ఇప్పుడు పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కథణంలో టాటా పంచ్ ఈవీ, టియాగో ఈవీ గురించి చూద్దాం.

యువత నుంచి ఫ్యామిలీల వరకు అందరి ఛాయిస్ ఇదే!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా SUV సెగ్మెంట్‌కు భారీ స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న సైజులో SUV లుక్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, మంచి ఫీచర్లు, భద్రత కలిగిన కార్లను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి సమయంలో టాటా మోటార్స్ తీసుకొచ్చిన టాటా పంచ్ భారతీయ మార్కెట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. చిన్న మైక్రో-ఎస్‌యూవీ అయినప్పటికీ, భారీ SUV ఫీలింగ్ ఇవ్వడం వల్ల ఈ కారు యువత నుంచి కుటుంబాల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా విడుదలైన ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా టాటా పంచ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ vs ఎలక్ట్రిక్ బైక్.. ఏది బెస్ట్ ?

మనదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల ట్రెండ్ నడుస్తోంది. పెట్రోల్ ధరలు సెంచరీ దాటేయడం, మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోవడంతో సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరూ ఈవీల వైపు చూస్తున్నారు. అయితే, ఒక ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకున్నప్పుడు కస్టమర్ల మెదడులో మెదిలే మొదటి ప్రశ్న.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా? లేక ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? అని. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయం మీ అవసరాలు, మీ వాడకంపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలు, లాభనష్టాలను వివరంగా తెలుసుకుందాం.
Advertisement

మారుతి ఇన్విక్టోపై భారీ ఆఫర్లు!.. ఏకంగా రూ.2.80 లక్షల వరకు డిస్కౌంట్లు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రతి నెలా వినియోగదారులను ఆకట్టుకునేందుకు కార్ల కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా పండుగల సీజన్ కాకపోయినా, అమ్మకాలను పెంచేందుకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు వంటి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా ఈ మే నెలలో పలు మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అయితే అందులో అత్యధిక తగ్గింపులు పొందిన మోడల్‌గా మారుతి ఇన్విక్టో ఎంపీవీ ( Invicto MPV) ప్రత్యేకంగా నిలిచింది. పెద్ద కుటుంబాల కోసం ప్రీమియం 7/8 సీటర్ ఎంపికగా మార్కెట్లో ఉన్న మారుతి ఇన్విక్టోపై ఈసారి కంపెనీ భారీ తగ్గింపులను అందిస్తోంది.

ఉద్యోగస్తులకు దేవుడిచ్చిన వరం లాంటి బండి

భారతదేశంలోని మధ్య తరగతి కుటుంబాలకు బైక్ అంటే కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అది వారి రోజువారీ కష్టార్జితాన్ని కాపాడే ఒక ఆస్తి. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, సామాన్యుడికి పెద్ద ఊరటనిచ్చే పేరు బజాజ్ ప్లాటినా (Bajaj Platina). దశాబ్ధాలుగా భారతీయ రోడ్లపై రారాజులుగా తిరుగుతున్న ఈ బైక్, తాజాగా తన అమ్మకాల్లో కొత్త రికార్డులను సృష్టించింది.

మధ్యతరగతి ఫేవరెట్ కార్ మళ్లీ హిట్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి విభాగంలో ఎన్నో ఏళ్లుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మోడల్ మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno). స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు వంటి అంశాలతో ఈ కారు యువత నుంచి కుటుంబాల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా విడుదలైన ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా బాలెనోపై భారతీయ వినియోగదారుల విశ్వాసం ఏ స్థాయిలో ఉందో మరోసారి స్పష్టంగా చూపించాయి. గత నెలలో, అంటే ఏప్రిల్ 2026లో, మారుతి సుజుకి బాలెనో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది.

రూ.97 వేలకే 200కిమీ రేంజ్ ఇచ్చే స్కూటర్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో సామాన్యులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఈవీ స్కూటర్ అంటే ఖరీదైన వాహనం అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రూ. లక్షలోపే మంచి రేంజ్, మంచి ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో స్కూటర్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి.
Advertisement

7 సీటర్ కార్లలో ఇండియాలో బెస్ట్‌ ఇదే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కుటుంబ అవసరాలకు సరిపోయే 7-సీటర్ కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి విభాగంలో ఎన్నో ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మోడల్ Maruti Suzuki Ertiga (మారుతి సుజుకి ఎర్టిగా). తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణికులకు సౌకర్యం, మంచి మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈ MPV దేశవ్యాప్తంగా కుటుంబాల మొదటి ఎంపికగా నిలుస్తోంది. తాజాగా విడుదలైన ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాయి. మారుతి సుజుకి ఎర్టిగా అమ్మకాలు ఈసారి గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.