క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తున్న టాప్ 5 బడ్జెట్ బైక్స్ ఇవే

బైక్ మీద లాంగ్ జర్నీ అంటే చాలా మందికి ఇష్టం. కానీ, గంటల తరబడి హైవేల మీద ఎక్సలరేటర్ పట్టుకుని ఉంటే చేయి నొప్పి పుట్టడం ఖాయం. ఈ ఇబ్బందిని దూరం చేసేందుకే క్రూయిజ్ కంట్రోల్ (Cruise Control) అనే అద్భుతమైన ఫీచర్ వచ్చింది. ఒకప్పుడు కేవలం లక్షల రూపాయల ఖరీదైన విదేశీ బైకుల్లో మాత్రమే కనిపించే ఈ టెక్నాలజీ, ఇప్పుడు మన సామాన్యుల బడ్జెట్ బైకుల్లోకి కూడా వచ్చేసింది. మీరు ఎక్సలరేటర్ ముట్టుకోకుండానే బైక్ ఒకే వేగంతో సాగిపోతుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మరి మన దేశంలో అత్యంత తక్కువ ధరకే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను అందిస్తున్న టాప్-5 బైక్‌ల వివరాలు తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా చూపించిన ‘సీక్రెట్ వెహికల్’

భారత రక్షణ రంగానికి వెన్నుముకగా నిలిచే మన జవాన్ల కోసం మహీంద్రా గ్రూప్ ఒక అద్భుతమైన వాహనాన్ని సిద్ధం చేసింది. తన అడ్వెంచర్ లుక్స్‌తో ఇండియాను ఊపేస్తున్న మహీంద్రా థార్ రాక్స్ (Thar Roxx) ఆధారంగా రూపొందించిన ఈ సరికొత్త వాహనం పేరు మహీంద్రా ఏటీవీ (Mahindra ATV - All Terrain Vehicle).

రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ అనిపించే టాప్ 4 ఈవీలు ఇవే

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో సామాన్యుడి చూపు ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల(EVs) వైపు మళ్లుతోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కారు అంటే లక్షల్లో ఖరీదు ఉండేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కంపెనీలు తీసుకొచ్చిన BaaS సిస్టమ్ ఆధారంగా మిడిల్ క్లాస్ బడ్జెట్‌కు తగ్గట్టుగా, కేవలం రూ.5 లక్షల ప్రారంభ ధరలోనే అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వచ్చేశాయి. మీరు రోజుకు 20 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించే వారైతే, ఈ కార్లను రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వారం మొత్తం హాయిగా తిరిగేయొచ్చు. సిటీ డ్రైవింగ్‌కు బెస్ట్ అనిపించే ఆ 4 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు తెలుసుకుందాం.

16 ఏళ్లైనా క్రేజ్ తగ్గలేదు.. ఈకో సేల్స్ ఇంకా టాప్‌లోనే!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కొన్ని మోడళ్లు కాలంతో పాటు మారిపోతుంటే, మరికొన్ని మాత్రం సంవత్సరాలు గడిచినా తమ ప్రాధాన్యతను కోల్పోవు. అలాంటి అరుదైన మోడళ్లలో మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) ఒకటి. 2010లో మార్కెట్లోకి వచ్చిన ఈ వాహనం, దాదాపు 16 సంవత్సరాలు గడిచినా ఇంకా వినియోగదారుల ఆదరణను అదే స్థాయిలో కొనసాగించడమే దీని ప్రత్యేకత. ప్రతి నెలా స్థిరంగా అమ్ముడవుతూ వస్తున్న ఈ మోడల్, 2026 ఏప్రిల్ నెలలో కూడా తన దూకుడును కొనసాగించింది. ఆ నెలలో మొత్తం 13,087 యూనిట్లు విక్రయించబడగా, గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 11,438 యూనిట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించింది.
Advertisement

కేవలం 3 మోడళ్లతోనే హోండా మిరాకిల్.. 21% వృద్ధి!

భారతీయ కార్ల మార్కెట్‌లో పోటీ రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో, తన స్థానం నిలబెట్టుకోవడం కోసం హోండా కార్స్ ఇండియా (Honda Cars India)చాలా కాలంగా క్రమంగా ప్రయత్నాలు చేస్తోంది. విస్తృతమైన మోడల్ లైన్‌అప్ లేకపోయినా, నాణ్యత, విశ్వసనీయత, కంఫర్ట్‌పై దృష్టి పెట్టడం ద్వారా హోండా తనకు ఒక ప్రత్యేకమైన కస్టమర్ బేస్‌ను ఏర్పరుచుకుంది. ప్రస్తుతం కంపెనీ భారతదేశంలో ప్రధానంగా హోండా సిటీ, హోండా అమేజ్, హోండా ఎలివేట్ వంటి మూడు మోడళ్లతోనే మార్కెట్లో కొనసాగుతోంది. ఇలాంటి పరిమిత మోడళ్లతో ఉన్నప్పటికీ, హోండా ఇటీవల విడుదల చేసిన ఏప్రిల్ 2026 అమ్మకాల గణాంకాలు కంపెనీకి ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి.

2026లో మార్కెట్‌ను షేక్ చేయబోతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు

భారత ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం ఎలక్ట్రిక్ విప్లవం వైపు వేగంగా పరుగులు తీస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల మంటల నుంచి తప్పించుకోవాలనుకునే వారికి 2026 ఏడాది ఒక సువర్ణావకాశం కాబోతోంది. టాటా మోటార్స్, టయోటా, కియా వంటి దిగ్గజ సంస్థలు సరికొత్త ఈవీ (EV) మోడళ్లను మార్కెట్లోకి వదిలేందుకు సిద్ధమయ్యాయి. మధ్యతరగతి నుంచి లగ్జరీ ప్రియుల వరకు అందరినీ ఆకట్టుకునేలా రాబోతున్న ఆ 5 పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

దేశ ప్రజల మనసు గెలిచిన టీవీఎస్

భారతదేశంలో వాహన మార్కెట్ ఎంత పోటీగా మారిందో తెలిసిందే. అయినప్పటికీ, ఆ పోటీలో తనదైన దూకుడు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న కంపెనీలలో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఒకటి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో, రోజువారీ అవసరాలకు సరిపోయే మోడళ్లను అందించడం ద్వారా ఈ సంస్థ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అందుకే హోండా, బజాజ్, హీరో వంటి దిగ్గజ కంపెనీలతో నేరుగా పోటీ పడుతూ కూడా మార్కెట్లో బలంగా నిలబడుతోంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా విడుదలైన 2026 ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలు టీవీఎస్ ప్రదర్శనను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ నెలలో కంపెనీ మొత్తం 4,73,970 యూనిట్ల వాహనాలను విక్రయించడం గమనార్హం. వీటిలో టూ, త్రీవీలర్, ఈవీ, ఎగుమతులు కలిపి ఉన్నాయి.

30కిమీ మైలేజ్.. ఇప్పుడంతా దీనిదే క్రేజ్

రోడ్డు మీద చూస్తే ప్రతి రెండో కారు ఇదే అనిపిస్తోందా? కారణం ఇదే.. తక్కువ ధర, అదిరిపోయే ఫీచర్లు, 30కిమీ వరకు మైలేజ్.. ఈ మూడు కారణాలతో Maruti Suzuki Baleno ఇప్పుడు మార్కెట్‌ను ఏలేస్తోంది. పైగా మే నెలలో భారీ డిస్కౌంట్లు రావడంతో కస్టమర్లు ఈ కారుపై క్యూ కడుతున్నారు.
Advertisement

ఈ మేలో హోండా బంపర్ ఆఫర్..! రూ.2 లక్షలకు పైగా తగ్గింపుతో కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మరోసారి తన సత్తా చాటేందుకు హోండా కార్స్ ఇండియా (Honda Cars India) గట్టిగా రెడీ అవుతోంది. గత నెలలో అమ్మకాలలో కొంత మందగమనం కనిపించినప్పటికీ, దాన్ని ఒక అవకాశంగా మార్చుకుని ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు వస్తోంది. కొత్త మోడళ్లతో మార్కెట్‌ను ఆకట్టుకోవాలన్న ప్లాన్‌తో పాటు, ప్రస్తుత స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీ ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా, మే 2026 నెల కోసం హోండా భారీ క్లియరెన్స్ సేల్స్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్లలో భాగంగా, గరిష్టంగా రూ. 2.12 లక్షల వరకు ప్రయోజనాలను ప్రకటించడం కొనుగోలుదారులకు పెద్ద ఆకర్షణగా మారింది. అంటే, ఇప్పటి వరకు కొనాలని అనుకున్న వారు ఇప్పుడు మరింత తక్కువ ఖర్చుతో హోండా కారును తమ ఇంటికి తీసుకెళ్లే అవకాశం దక్కుతోంది.

ఇప్పుడు కొంటే ఏకంగా రూ.1.05లక్షలు ఆదా చేసుకోవచ్చు

కొత్త కారు కొనాలనే మధ్యతరగతి ప్రజల కలను నిజం చేసుకునేందుకు ఇదే సరైన సమయం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ మే 2026 నెలలో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీల నుంచి చిన్న హ్యాచ్‎బ్యాక్ కార్ల వరకు అన్నిటిపైనా భారీగా ధరలను తగ్గించింది. ముఖ్యంగా క్రెటా, అల్కాజార్, గ్రాండ్ i10 నియోస్ వంటి పాపులర్ మోడళ్లపై ఏకంగా లక్ష రూపాయలకు పైగా ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మే నెలకు సంబంధించిన ఈ బంపర్ డీల్స్ వివరాలను తెలుసుకుందాం.

పెట్రోల్ ఖర్చులకు గుడ్‌బై.. CNG గ్రావైట్ వచ్చేసింది!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో పెట్రోల్ తర్వాత అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ఇంధనం CNG. పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో పాటు, మైలేజ్, ఖర్చు పరంగా లాభాలు ఉండటంతో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు CNG వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్‌ను గమనించిన దేశీయ, విదేశీ కార్ తయారీ సంస్థలు వరుసగా కొత్త CNG మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇలాంటి పోటీలో భాగంగా నిస్సాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) కూడా తన స్థానం బలపర్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఒక CNG మోడల్‌ను అందించిన ఈ సంస్థ, ఇప్పుడు తన ప్రముఖ SUV అయిన నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) కోసం ప్రభుత్వ అనుమతి పొందిన CNG రెట్రోఫిట్‌మెంట్ కిట్‌ను ప్రవేశపెట్టింది.

రూ.3.47 లక్షలకే 1200 కిమీ రేంజ్..చైనా బుజ్జి ఈవీ అదుర్స్

పెట్రోల్ ధరలు చూసి బైక్ బయటకు తీయడానికి కూడా భయపడుతున్నారా? అలాంటిది ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం కాదు... నెలరోజులు కూడా టెన్షన్ లేకుండా తిరిగే కారు వస్తే ఎలా ఉంటుంది? అదీ కేవలం రూ.3.5 లక్షల బడ్జెట్‌లోనే అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడు బైక్ బయటకు తీయాలన్నా జేబు తడుముకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మళ్లుతోంది.
Advertisement

500లీటర్లకు పైగా బూట్ స్పేస్ ఉన్న టాప్ 5 కార్లు

ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తే సూట్‌కేసులు, బ్యాగులతో కారు నిండిపోయి టెన్షన్ పడ్డారా ఎప్పుడైనా ? ఇప్పుడు ఆ సమస్యకు చాలా కంపెనీలు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి. మన దేశంలో ఒకప్పుడు కారు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే.. కానీ ఇప్పుడు అది ఒక హోదాకు హోదాకు, సౌకర్యానికి చిహ్నం. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండే మన దేశంలో కారు కొనేటప్పుడు ఇంజిన్ పవర్, మైలేజీతో పాటు చూసే మరో ముఖ్యమైన విషయం బూట్ స్పేస్.

మార్కెట్‌లో రెనాల్ట్ బ్లాస్ట్..! డస్టర్ రీఎంట్రీతో అమ్మకాల జోరు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎక్కువ మోడల్స్ లేకపోయినా, తక్కువ లైనప్‌తోనే బలమైన స్థానం సంపాదించుకున్న కంపెనీగా రెనాల్ట్ ఇండియా (Renault India) ప్రత్యేకంగా నిలుస్తోంది. మార్కెట్లో చాలా కాలంగా కొనసాగుతూ, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని సరైన ధరల్లో ప్రాక్టికల్ కార్లను అందించడం ద్వారా ఈ బ్రాండ్ తనకంటూ ఒక నమ్మకాన్ని ఏర్పరుచుకుంది. ఇప్పుడు తాజాగా ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలు బయటకు రావడంతో, రెనాల్ట్ ఇండియా మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఆ నెలలో కంపెనీ మొత్తం 5,413 యూనిట్ల కార్లను విక్రయించింది. సంఖ్య పరంగా ఇది పెద్దగా కనిపించకపోయినా, అసలు కథ దాని వృద్ధిలో ఉంది.

టాటా కర్వ్ EV కొత్త వేరియంట్లు లాంచ్

ఎలక్ట్రిక్ కార్ కొనాలంటే బ్యాటరీ భయం పెద్ద సమస్య... కానీ ఇప్పుడు టాటా దానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న టాటా మోటార్స్, తన కస్టమర్ల కోసం మరో అదిరిపోయే అప్డేట్ మోసుకొచ్చింది. తన పాపులర్ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ అయిన కర్వ్ ఈవీ (Curvv.ev)లో సరికొత్తగా SeriesX శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

పెట్రోల్‌కు గుడ్‌బై చెప్పే బుల్లెట్..! చెన్నైలో టెస్ట్‌లో E85 క్లాసిక్ 350

బుల్లెట్ అంటేనే గుర్తుకొచ్చే పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). దశాబ్దాలుగా రైడర్ల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) ఇప్పుడు మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. పెట్రోల్‌పై పూర్తిగా ఆధారపడే రోజుల నుంచి బయటకు వచ్చి, పర్యావరణానికి మేలు చేసే మార్గంలో అడుగులు వేస్తోంది. ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన క్లాసిక్ 350 మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటికే చెన్నై నగరంలో ఈ ఐకానిక్ బైక్ కొత్త అవతారంలో టెస్ట్ రన్స్ చేస్తుండటం పెద్ద చర్చకు దారి తీసింది. ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో రూపొందించిన ఈ కొత్త క్లాసిక్ 350, భవిష్యత్ ఇంధన విధానాలకు అనుగుణంగా రూపొందించబడుతోంది.
Advertisement

ట్రెండింగులో త్రిష.. రూ.100 కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్ల డీటెయిల్స్ ఇవే

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటే గుర్తొచ్చే పేరు త్రిష కృష్ణన్. దాదాపు పాతికేళ్లుగా వెండితెరపై మకుటం లేని మహారాణిలా ఏలుతున్న ఈ చెన్నై చిన్నది, ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే కేవలం నటనలోనే కాదు, సంపాదనలోనూ, ఆస్తులు కూడబెట్టడంలోనూ త్రిష ఏమాత్రం తగ్గడం లేదు.

దళపతి సీఎం అయితే ఏ కారు వాడతారు?

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ, కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటి వరకు ద్రవిడ పార్టీలే ప్రధానంగా ఆధిపత్యం చెలాయించిన ఈ రాష్ట్రంలో, ఇప్పుడు టీవీకే (TVK) ముందంజలో నిలవడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇది కేవలం ఎన్నికల ఫలితాల మార్పు మాత్రమే కాదు, తమిళ రాజకీయాల్లో మూడవ శక్తి బలపడుతున్నదానికి ఇది స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా రెండు పార్టీల మధ్యే తిరిగిన రాజకీయ సమీకరణాలకు ఇది ఒక సవాలు. ప్రత్యేకంగా, ఈ విజయంతో విజయ్ (Vijay) సాధించిన ప్రభావం గురించి మాట్లాడుకోవాల్సిందే.

దేశంలోనే ఛీపెస్ట్ కారు పై ఇంకా 37,500 డిస్కౌంట్

మధ్య తరగతి భారతీయుడి సొంత కారు కలను నిజం చేయడంలో ఎల్లప్పుడూ మారుతి సుజుకీనే ముందుంటుంది. తాజాగా మే 2026 నెలలో మారుతి తన పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశంలోనే అత్యంత చౌకైన కార్లలో ఒకటిగా పేరుగాంచిన మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso) పై అదిరిపోయే ఆఫర్లను ఇస్తోంది. తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మారుతి సుజుకి సంస్థ తన ఎస్-ప్రెస్సో మోడల్‌పై ఈ నెలలో గరిష్టంగా రూ.37,500 వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. ఇందులో నేరుగా లభించే క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్లు కారు వేరియంట్, మీరు ఉండే నగరాన్ని బట్టి మారుతుంటాయి. ఈ ఆఫర్ల గురించి పూర్తి క్లారిటీ కావాలంటే మీ సమీపంలోని మారుతి సుజుకి డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది. బడ్జెట్ తక్కువగా ఉండి కొత్త కారు కొనాలనుకునే వారికి ఈ మే నెల ఆఫర్లు కచ్చితంగా కలిసొస్తాయి.

మారుతి తర్వాత టాటా దూకుడు! ఒక్క నెలలో 59 వేల కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పటిలాగే మారుతి సుజుకి అగ్రస్థానంలో దూసుకుపోతూనే ఉంది. కానీ అసలు ఆసక్తికరమైన పోటీ మాత్రం రెండో స్థానానికి. ఈ స్థానం కోసం టాటా మోటార్స్, మహీంద్రా, హ్యూందాయ్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా గట్టిపోటీ కొనసాగుతోంది. ఇటీవల వరకు ఈ రేసులో మహీంద్రా మంచి జోరుతో ముందంజలో నిలిచింది. SUV సెగ్మెంట్‌లో తమ బలమైన ప్రెజెన్స్‌తో రెండో స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఏప్రిల్ నెలలో ఆట పూర్తిగా మలుపు తిరిగింది. ఈసారి టాటా మోటార్స్ తన విక్రయ శక్తిని పూర్తిగా ప్రదర్శిస్తూ మార్కెట్‌ను షాక్‌కు గురి చేసింది. ఏప్రిల్‌లో టాటా మోటార్స్ మొత్తం 59,701 కార్లను విక్రయించడం ద్వారా భారీ మైలురాయిని సాధించింది.
Advertisement

సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 విషయాలు చెక్ చేయండి

ప్రస్తుతం కొత్త కార్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరలో మంచి బ్రాండ్ కారు వస్తుందన్న ఆశతో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ లేదా లోకల్ డీలర్ల దగ్గర కార్లను పరిశీలిస్తుంటారు. OLX, Cars24, Spinny లాంటి ప్లాట్‌ఫార్మ్స్ వల్ల ఇంట్లో కూర్చునే కారు ఫైనల్ చేసేయొచ్చు. అయితే, ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ సృష్టించిన నిస్సాన్

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) మరోసారి భారత మార్కెట్‌పై తన నిబద్ధతను గట్టిగా తెలియజేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వెంటనే, నిస్సాన్ దేశీయ మార్కెట్లో 75 శాతం భారీ వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఇది సాధారణ పెరుగుదల కాదు, మార్కెట్‌లో తమ బ్రాండ్‌పై మళ్లీ వినియోగదారుల నమ్మకం పెరుగుతోందనే సంకేతం. ఏప్రిల్ నెలలోనే ఎగుమతులు, దేశీయ విక్రయాలను కలిపి మొత్తం 5,388 యూనిట్లను అమ్మగలగడం, కంపెనీ పునరుజ్జీవనానికి ఒక స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కాదు, భారత్‌లో నిస్సాన్ బ్రాండ్ మళ్లీ పుంజుకుంటోందని చెప్పే బలమైన కథ. గతంలో ఎదురైన సవాళ్లను దాటుకుని, కొత్త మోడళ్లతో, వినియోగదారులకు చేరువయ్యే వ్యూహాలతో నిస్సాన్ ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందని చెప్పవచ్చు.

ఈ 5 బైక్స్ చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది

భారతదేశంలో ఒకప్పుడు బైక్ ఒకప్పుడు బైక్ అంటే కేవలం ఆఫీసుకో, కాలేజీకో వెళ్లడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నేటితరం యువత బైకులో పవర్, స్టైల్, హ్యాండ్లింగ్.. ఇలా అన్నింటినీ వెతుకుతోంది. అందుకే కంపెనీలు కూడా కేవలం లక్షల్లో ఖర్చు పెడితేనే దొరికే పర్ఫార్మెన్స్ బైక్స్‎ను ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులోకి, అంటే రూ.2 లక్షల లోపు బడ్జెట్‌లోనే తీసుకొస్తున్నాయి. మీరు కూడా కొత్తగా ఒక అదిరిపోయే బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే 2026 మే నెలలో మార్కెట్ను ఊపేస్తున్న టాప్-5 బైక్స్ వివరాలు తెలుసుకుందాం.

చూసి కొనండి.. Activa vs Jupiter రెండింటిలో ఏది బెస్ట్ ?

భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే మొదటి రెండు పేర్లు హోండా, టీవీఎస్. ముఖ్యంగా ఫ్యామిలీ సెగ్మెంట్‌లో 125cc స్కూటర్ కొనాలనుకునే వారికి హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపిటర్ 125 మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకరు బ్రాండ్ వాల్యూ, మైలేజీలో రారాజు అయితే.. మరొకరు ఫీచర్లు, స్టోరేజ్ స్పేస్‌లో కింగ్. మరి 2026లో మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ స్కూటర్ బెస్ట్? ఏది కొంటే మీ డబ్బుకు సరైన విలువ దక్కుతుంది? ఈ కంపారిజన్లో తెలుసుకుందాం.
Advertisement

దేశంలోనే చీపెస్ట్ 7 సీటర్.. ఇప్పుడు కొంటే 37,500 డిస్కౌంట్

భారతదేశంలో ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయే కారు కొనాలి అంటే చాలా మందికి మొదట గుర్తొచ్చేది బడ్జెట్. 7 సీటర్ అంటే ఖచ్చితంగా 10 లక్షలు దాటుతుందని అనుకునే వాళ్లే ఎక్కువ. కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారిపోయింది. తక్కువ ధరలోనే ఫ్యామిలీ మొత్తం కూర్చునే కార్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒక మోడల్ ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అయింది.