షోరూమ్‌లలో సందడి చేస్తున్న రూ. 5.65 లక్షల కారు
ఆటోమొబైల్స్
- 6 month, 22 days ago
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో 7 సీటర్ కారును అందించడం చిన్న విషయం కాదు. అయితే అదే సవాల్‌ను స్వీకరించి ముందుకొచ్చింది నిస్సాన్ (Nissan). తాజాగా ఈ కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త మోడల్ నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా 7 సీటర్ కార్లు అంటే ఎక్కువ ధర, భారీ ఖర్చు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ గ్రావైట్ ఆ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. సరసమైన ధరలో పెద్ద కుటుంబాలకు సరిపోయే స్పేస్‌ను అందిస్తూ, రెండు కుటుంబాలు కూడా సౌకర్యంగా కూర్చుని ప్రయాణించగల విధంగా ఈ కారును డిజైన్ చేశారు.