ఒక్క SUVతో కుటుంబం మొత్తం కంఫర్ట్
ఆటోమొబైల్స్
- 6 month, 28 days ago
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారత మార్కెట్లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ SUVగా 'టేరాన్ ఆర్-లైన్'ను ఘనంగా విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 46.99 లక్షలుగా నిర్ణయించిన ఈ ప్రీమియం ఏడు సీట్ల SUV, బ్రాండ్ లైనప్‌లో కీలకమైన మార్పును సూచిస్తోంది. ఇప్పటివరకు మూడు వరుసల సెగ్మెంట్‌లో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పెస్ స్థానాన్ని ఈ కొత్త టేరాన్ ఆర్-లైన్ భర్తీ చేయడం విశేషం. ఈ నెల ప్రారంభంలోనే ఫోక్స్‌వ్యాగన్ ఈ 7-సీటర్ SUV కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లతో పాటు బ్రాండ్ అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా బుకింగ్ సౌకర్యం కల్పించింది. కేవలం రూ. 51,000 టోకెన్ అమౌంట్‌తో వినియోగదారులు టేరాన్ ఆర్-లైన్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంది.