కొత్త లుక్‌తో మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మోడళ్లలో మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ఒకటి. నగర ప్రయాణాలకు సరిపోయే కాంపాక్ట్ సైజ్, కుటుంబ అవసరాలకు సరిపడే విస్తృతమైన క్యాబిన్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కలిపి బ్రెజ్జాను మధ్యతరగతి కస్టమర్లకు మొదటి ఎంపికగా నిలబెట్టాయి. ప్రత్యేకంగా భారతీయ రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ SUV, స్టైల్, ప్రాక్టికాలిటీ మధ్య మంచి సమతౌల్యం అందిస్తుంది. ఇప్పుడు ఈ విజయవంతమైన మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు Maruti Suzuki కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

డ్రైవింగ్ లైసెన్స్‌లో ఎన్ని రకాలో తెలుసా?

భారతదేశంలో వాహనం నడపడం అనేది ఒక బాధ్యతతో కూడిన పని. రోడ్ల మీద తిరిగే ప్రతి వాహనదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ప్రాథమిక ఆయుధం వంటిది. ఇది కేవలం ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడే డాక్యుమెంట్ మాత్రమే కాదు, మీరు వాహనం నడపడానికి అర్హులని తెలిపే ఒక చట్టబద్ధమైన ధృవీకరణ పత్రం.

ఈ కారుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది

భారత మార్కెట్‌లో ఆఫ్‌రోడ్ వాహనాల విభాగంలో గట్టి పోటీ నెలకొన్న వేళ, మహీంద్రా థార్ రాక్స్‌కు ప్రత్యర్థిగా నిలిచిన మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) ఇప్పుడు అమ్మకాల పరంగా గమనించదగ్గ పురోగతిని నమోదు చేస్తోంది. ప్రారంభ దశలో ఈ మోడల్ ఆశించిన స్థాయిలో స్పందన పొందకపోయినా, కాలక్రమేణా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకుంటూ తన స్థిర స్థానాన్ని నిర్మించుకుంది. ప్రత్యేకమైన డిజైన్, అసలైన ఆఫ్‌రోడ్ సామర్థ్యం, మారుతి సుజుకి బ్రాండ్ నమ్మకం కలిసివచ్చి జిమ్నీకి కొత్త ఊపునిచ్చాయి. ముఖ్యంగా గత నెల అయిన జనవరి 2026లో మొత్తం 591 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ కావడం ఈ మోడల్‌కు పెరుగుతున్న ఆదరణకు స్పష్టమైన సంకేతం.

ఇంతకంటే గొప్ప బైక్ ఇంకోటి లేదు

యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకోవడంలో టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125) బైక్ ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. 125సీసీ సెగ్మెంట్‌లో స్పోర్టీ లుక్ కావాలనుకునే వారి మొదటి ఛాయిస్ ఇదే. అయితే, అందరికీ ఖరీదైన వేరియంట్లు కొనే బడ్జెట్ ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం టీవీఎస్ కంపెనీ డ్రమ్ వేరియంట్‎ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్ లైనప్‌లో ఇదే అత్యంత చౌకైన మోడల్. తక్కువ ధరలో అద్భుతమైన డిజైన్, నమ్మకమైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఒకసారి ఈ బేస్ మోడల్ ధర, ఫీచర్లు, పెర్ఫార్మెన్స్ వివరాలను తెలుసుకుందాం. టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.82,000 గా ఉంది. ఇదే మోడల్‌లో టాప్ ఎండ్ వేరియంట్ అయిన TFT వెర్షన్ ధర రూ.97,000 వరకు ఉంటుంది. అంటే బేస్ మోడల్‌కు, టాప్ మోడల్‌కు మధ్య దాదాపు రూ.15,000 వ్యత్యాసం ఉంది. మధ్యతరగతి కుర్రాళ్లకు, తక్కువ ఈఎంఐలో స్పోర్టీ బైక్ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ డ్రమ్ వేరియంట్ ఒక వరం లాంటిది. ధర తక్కువైనా, బైక్ ఇచ్చే కిక్కులో మాత్రం ఎలాంటి రాజీ ఉండదు. బేస్ వేరియంట్ కదా అని దీని లుక్ ఏమీ తక్కువగా ఉండదు. ఖరీదైన మోడళ్లలో ఉండే అదే షార్ప్ అండ్ అగ్రెసివ్ డిజైన్ ఇందులోనూ కనిపిస్తుంది. సిగ్నేచర్ స్టైల్ LED హెడ్ల్యాంప్స్, స్టైలిష్ DRLs ఈ బైక్‌కు ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ట్యాంక్ దగ్గర ఉండే స్పోర్టీ ఎక్స్‌టెన్షన్లు, ఇంజిన్ కౌల్ దీనిని ఒక స్పోర్ట్స్ బైక్‌లా మార్చేస్తాయి. ప్రస్తుతానికి ఈ డ్రమ్ వేరియంట్‌ను స్ట్రైకింగ్ రెడ్, వికెడ్ బ్లాక్ రంగుల్లో కంపెనీ విక్రయిస్తోంది. కుర్రాళ్లు రోడ్డు మీద వెళ్తుంటే అందరి కళ్లు ఈ బైక్ పైనే పడటం ఖాయం. బడ్జెట్ ధరలో ఉన్నప్పటికీ, టీవీఎస్ ఇందులో అవసరమైన అన్ని డిజిటల్ ఫీచర్లను అందించింది. ఇందులో రివర్స్ LCD డిజిటల్ కన్సోల్ ఉంటుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఎంప్టీ (ట్యాంక్‌లోని పెట్రోల్‌కు ఇంకెంత దూరం వెళ్తుంది), యావరేజ్ మైలేజ్ వంటి వివరాలన్నీ డిస్‌ప్లేలో స్పష్టంగా కనిపిస్తాయి.
Advertisement

ఆఫీసులకు వెళ్లేవారికి ఇవే బెస్ట్ బైక్స్

హోండా SP 125 తన పరిచయం మొదలైనప్పటి నుండి భారీ ఆకర్షణ కలిగిన మోటార్‌సైకిల్‌గా ప్రసిద్ది చెందింది. ఇది వినియోగదారుల మధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది, అందుకే ఇంటింటికీ సుపరిచితమైన పేరు అయ్యింది. ఈ బైక్ కేవలం లుక్‌కి మాత్రమే కాకుండా, డ్రైవింగ్ అనుభవానికి కూడా ప్రాధాన్యం ఇస్తుంది. హోండా SP 125ను వాడడం అంటే సొగసైన, మన్నికైన డ్రైవ్‌ను అనుభవించడం. మార్కెట్లో దీనికి పోటీగా హీరో గ్లామర్ నిలుస్తుంది. దీని డిజైన్ ఆకట్టుకునేలా రూపొందించబడింది, ప్రత్యేకమైన షేప్, లైన్‌లతో ఇది రోడ్లపై ప్రతిస్పందనను పొందిస్తుంది. ఈ రెండు బైకులు కూడా ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న ధర, ఫీచర్స్ ఇతర వివరాలను ఈ కింది కథణంలో ఇవ్వడం జరిగింది.

దేశంలో ప్రతి గల్లీలో ఈ బైక్ ఉంటుంది

దేశవ్యాప్తంగా పెట్రోల్ స్కూటర్ల అమ్మకాల్లో మకుటం లేని మహారాజులా వెలిగిపోతున్న హోండా సంస్థకు ఎలక్ట్రిక్ సెగ్మెంట్ మాత్రం కోలుకోలేని దెబ్బ తీసింది. 2025 జనవరిలో భారీ అంచనాలతో విడుదలైన హోండా యాక్టివా ఇ (Activa e), క్యూసి1 (QC1) మోడళ్లు ఏడాది తిరిగేసరికి మార్కెట్లో ఘోరంగా విఫలమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రీమియం బైక్ ధరకే 7 సీటర్ కారు

రెనాల్ట్ ట్రైబర్, భారత మార్కెట్లో సులభంగా కొనుగోలు చేయదగిన 7-సీటర్ MPVగా తన ప్రత్యేకతను చూపిస్తుంది. ఈ ఆఫీసు, కుటుంబ ప్రయాణాలకు అనువైన కారు, కేవలం అందుబాటులో ఉన్న స్థలంతో మాత్రమే కాదు, ధర పరంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇటీవల విడుదలైన జనవరి 2026 అమ్మకాల గణాంకాల ప్రకారం, రెనాల్ట్ ట్రైబర్ 2,509 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం, అదే సమయంలో, ఈ కార్లు కేవలం 1,456 యూనిట్లే అమ్ముడయ్యాయి. అంటే కేవలం ఒక ఏడాదికే 1,053 కార్ల విక్రయం పెరుగుదలతో, అమ్మకాల్లో అద్భుతమైన 72 శాతం వృద్ధిని సాధించింది.

మీ ఇంటి ముందు కూడా ఉండాల్సిన కార్!

భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ప్రవేశపెట్టిన ప్రీమియం ఎంపీవీ అయిన మారుతి ఎక్స్‌ఎల్6 (XL6) మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించింది. స్టైలిష్ డిజైన్, ఆరు సీట్ల కంఫర్ట్ లేఅవుట్, ఆధునిక ఫీచర్లతో ఈ మోడల్ కుటుంబాల మధ్య మంచి ఆదరణ పొందుతోంది. జనవరి 2026 నెల అమ్మకాల గణాంకాలు వెలువడిన తర్వాత, ఎక్స్‌ఎల్6 మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజా నివేదికల ప్రకారం, ఈ వాహనం జనవరి 2026లో మొత్తం 3,826 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే గత సంవత్సరం ఇదే కాలంలో, అంటే జనవరి 2025లో 4,400 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను పోల్చితే, వార్షిక ప్రాతిపదికన సుమారు 13 శాతం అమ్మకాల తగ్గుదల కనిపిస్తోంది.
Advertisement

మార్కెట్లోకి సరికొత్త మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ లాంచ్

జీప్ ఇండియా (jeep india) ప్రీమియం SUV మార్కెట్‌లో తన ప్రభావాన్ని మరింత బలపరిచే దిశగా కొత్త అడుగు వేస్తోంది. ఈ ప్రయత్నంలో, కంపెనీ తన మెరిడియన్ SUVకి ప్రత్యేకమైన ఎడిషన్ జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ (Jeep Meridian Track Edition)ను పరిచయం చేసింది. పూణేలోని ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆహ్లాదకర వాతావరణంలో అధికారికంగా లాంచ్ చేసిన ఈ వాహనం, పరిమిత ఎడిషన్ మోడల్‌గా ఉండటంతో SUV ప్రేమికుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. డిజైన్ పరంగా, ఈ ట్రాక్ ఎడిషన్ ప్రామాణిక మెరిడియన్ SUVతో పోలిస్తే గమనించదగిన ప్రత్యేకతలు కలిగి ఉంది.

మారుతి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లు కొనండి

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానంలో నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki) దేశంలోనే అత్యధిక సంఖ్యలో కార్లు విక్రయించే సంస్థగా ప్రసిద్ధి చెందింది. సరసమైన ధరలు, అధిక ఇంధన సామర్థ్యం, సర్వీసింగ్ వంటి అంశాలు దీనిని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి. అయితే గతంలో నిర్మాణ నాణ్యత విషయంలో ఈ సంస్థ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కొన్ని మోడళ్లకు తక్కువ సేఫ్టీ రేటింగ్ రావడంతో వినియోగదారుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సంస్థ భద్రతా ప్రమాణాలను గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంది. ఇటీవలి కాలంలో మారుతి వాహనాలు Bharat NCAP పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్‌లు సాధించడం గమనార్హం. మారుతి సుజుకి డిజైర్, విక్టోరిస్, ఇన్విక్టో మోడళ్లను సంస్థ అత్యంత సురక్షితమైన వాహనాలుగా ప్రకటించింది. వీటి గురించి చూద్దాం.

ఇది టాటా పంచ్ రేంజ్ అంటే.. ఏకంగా 600 కిమీ

టాటా మోటార్స్ భారత ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించింది. తన అత్యంత ప్రజాదరణ పొందిన టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లలో మైలేజీ (రేంజ్) తక్కువగా ఉంటుందనే అపవాదు ఉంటుంది. కానీ, తాజాగా జరిగిన ఒక ప్రయోగాత్మక పరీక్షలో ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 593.6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 20న అధికారికంగా లాంచ్ కానున్న ఈ కారు గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం. టాటా మోటార్స్ తన కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ప్రముఖ ఆటోమొబైల్ జర్నలిస్ట్ రాహుల్ కక్కర్‌ను ఆహ్వానించి, ఈ కారు రేంజ్‌ను టెస్ట్ చేయమని కోరింది. మొదటగా రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ఉదయ్‌పూర్ వరకు సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒకే దెబ్బతో అందరి నోళ్లు మూయించిన కొత్త డిజైర్

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి (Maruti Suzuki) అగ్రగామి సంస్థగా నిలిచినా, గతంలో నిర్మాణ నాణ్యత విషయంలో విమర్శలు ఎదుర్కొన్నది నిజం. కొన్ని రోడ్డు ప్రమాదాల తర్వాత వాహనాల బాడీ బలం సరిపోదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పాత తరం స్విఫ్ట్ డిజైర్‌ (Swift Dzire) కు కేవలం 2స్టార్ భద్రతా రేటింగ్ మాత్రమే లభించడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే విమర్శలు వచ్చినప్పటికీ అమ్మకాల విషయంలో మారుతి ఎప్పుడూ వెనుకబడలేదు. అందుకు ప్రధాన కారణాలు సరసమైన ధరలు, అధిక ఇంధన సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చులు, అలాగే దేశవ్యాప్తంగా విస్తరించిన విస్తృత సేవా కేంద్రాల వలయం. చిన్న పట్టణం నుంచి మహానగరం వరకు సులభంగా సేవలు అందుబాటులో ఉండటం వినియోగదారుల విశ్వాసాన్ని పెంచింది.
Advertisement

రేపే మార్కెట్లోకి రూ.6లక్షల 7 సీటర్ కారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కలల కారుగా మారబోతున్న నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) ఎట్టకేలకు రేపు (ఫిబ్రవరి 17) అట్టహాసంగా విడుదల కాబోతోంది. 7 సీటర్ కార్ల విభాగంలో ఇప్పటి వరకు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మహీంద్రా బొలెరో, మారుతీ సుజుకీ ఎర్టిగా వంటి కార్లకు ఇది గట్టి సవాల్ విసరబోతోంది. ముఖ్యంగా బొలెరో కంటే దాదాపు రూ.2 లక్షల తక్కువ ధరకే ఇది లభించనుండటం ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి నిస్సాన్ గ్రావైట్ గత నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కంపెనీ దీని విడుదలను వాయిదా వేసింది. నిస్సాన్ సంస్థ నుండి వస్తున్న ఈ బడ్జెట్ 7 సీటర్ కారు కోసం వేల సంఖ్యలో కస్టమర్లు వేచి చూస్తున్నారు. రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడిన ఈ కారు, అతి తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించే సౌకర్యాన్ని అందించనుంది.

దేశంలో ప్రతివారికి ఇష్టమైన మూడు కార్లు

మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనుగోలు చేయాలంటే హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ఇప్పటికీ మొదటి ఎంపికగా నిలుస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే అందుబాటులో ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, అలాగే పట్టణ ట్రాఫిక్‌లో సులభంగా నడపగలగడం వంటి ప్రయోజనాలు ఈ కార్లను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, పిల్లల స్కూల్ డ్రాప్‌లు, వీకెండ్ షాపింగ్ ట్రిప్‌లు ఈ అన్ని అవసరాలకు హ్యాచ్‌బ్యాక్‌లు సరైన సొల్యూషన్‌గా నిలుస్తాయి. భారత మార్కెట్లో ఈ సెగ్మెంట్‌లో బలమైన స్థానం సంపాదించిన కంపెనీలలో మారుతి సుజుకి (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors) ముందంజలో ఉన్నాయి. వీటి హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు మంచి మైలేజ్, విశ్వసనీయత, తక్కువ సర్వీస్ ఖర్చులు వంటి అంశాలతో మధ్యతరగతి వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్నాయి. ఈ కంపెనీలకు చెందిన కొన్ని హ్యచ్‌బ్యాక్‌ల గురించి ఈ కథనంలో.

స్కోడా కొత్త కారుతో అయినా గట్టెక్కుతుందా ?

జర్మన్ ఇంజనీరింగ్ మెరుపులు, యూరోపియన్ స్టైల్ కలబోతగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన స్కోడా కుషాక్ (Skoda Kushaq) ప్రస్థానంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. ఒకప్పుడు మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను ఒక ఊపు ఊపిన ఈ మోడల్, తాజాగా అమ్మకాల విషయంలో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. అయితే ఈ క్షీణత వెనుక ఒక వ్యూహాత్మక కారణం ఉందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. కుషాక్ అమ్మకాలు ఎందుకు పడిపోయాయి? రాబోయే కొత్త వెర్షన్‌లో ఎలాంటి అద్భుతాలు ఉండబోతున్నాయి? అనే పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. 2026 జనవరి నెలలో స్కోడా ఇండియా వెల్లడించిన విక్రయాల గణాంకాలు ఆ సంస్థను విస్మయానికి గురిచేశాయి. ఈ ఏడాది జనవరిలో కేవలం 434 యూనిట్ల కుషాక్ ఎస్‌యూవీలు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో (జనవరి 2025) 1,371 యూనిట్లు విక్రయించిన స్కోడా, ఇప్పుడు ఏకంగా 68 శాతం క్షీణతను మూటగట్టుకుంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ప్రత్యర్థులు వేల సంఖ్యలో అమ్మకాలు జరుపుతుంటే, కుషాక్ వందల సంఖ్యకు పడిపోవడం చర్చనీయాంశంగా మారింది.

రూ.5 లక్షల లోపే స్టైలిష్ కార్? క్విడ్ ఫేస్‌లిఫ్ట్ త్వరలోనే!

రెనాల్ట్ ఇండియా (Renault India) భారత మార్కెట్లో క్రమంగా తన స్థానాన్ని బలపరుచుకుంటూ ఒక ప్రముఖ కార్ల తయారీదారుగా ఎదుగుతోంది. ఇప్పటికే 2025లో ట్రైబర్ MPV, కైగర్ SUVలకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను పరిచయం చేసి కస్టమర్ల దృష్టిని ఆకర్షించిన సంస్థ, ఇప్పుడు తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా కొత్త రూపంలో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రెనాల్ట్ క్విడ్ మంచి డిజైన్, తక్కువ ధర, మంచి మైలేజ్‌తో యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే క్విడ్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రాబోతోందన్న వార్త ఆటో రంగంలో ఆసక్తి రేపుతోంది. ఇటీవల ఈ కొత్త మోడల్ టెస్ట్ డ్రైవ్‌ల సమయంలో కనిపించగా, దాని స్పై ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో కారు అభిమానుల్లో చర్చ మొదలైంది.
Advertisement

మధ్య తరగతి మనసు దోచిన హ్యాచ్ బ్యాక్ కార్లు ఇవే

2026 ప్రారంభంలో భారత ఆటోమొబైల్ రంగం కొత్త ఉత్తేజాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా జనవరి నెలలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అమ్మకాలు పెను మార్పులకు లోనయ్యాయి. కొన్ని మోడళ్లు రికార్డు వృద్ధిని సాధించగా, మరికొన్ని భారీ పతనాన్ని చవిచూశాయి. మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని కాపాడుకున్నప్పటికీ, టాటా, హ్యుందాయ్ నుంచి గట్టి సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి కారు అమ్మకాల తీరును విడివిడిగా విశ్లేషిస్తే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.

పెద్ద ఫ్యామిలీ అయినా ఒక్క కారులోనే వెళ్లొచ్చు

ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడం అనేది ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతి. అందుకే భారతదేశంలో 7 సీటర్ కార్లకు (7-Seater Cars) ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ అందరినీ ఒకే కారులో తీసుకెళ్లడానికి ఈ ఎంపీవీ (MPV), ఎస్‌యూవీ (SUV) మోడళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఒక్క నెలలోనే అన్ని లక్షల అమ్మకాలా?

భారతదేశ ఆటోమొబైల్ రంగం 2026 ప్రారంభంలోనే సరికొత్త చరిత్రను లిఖించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జనవరి నెలలో రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ప్యాసింజర్ వెహికల్స్, టూ వీలర్స్, త్రీ వీలర్ వెహికల్స్ విభాగాల్లో డబుల్ డిజిట్ వృద్ధిని సాధించడం విశేషం.

ఈ కార్లు కొంటే పెట్రోల్ బంక్ ఓనర్లు ఏడుస్తారు

భారతదేశంలో ఒక సామాన్యుడు కారు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు మొట్టమొదట అడిగే ప్రశ్న మైలేజీ ఎంత ఇస్తుంది?. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ మండిపోతున్న తరుణంలో, వాహన తయారీ సంస్థలు కూడా తమ వ్యూహాలను మారుస్తున్నాయి. కేవలం లుక్స్, ఫీచర్లు మాత్రమే కాకుండా, జేబుకు చిల్లు పడకుండా అత్యధిక ఇంధన సామర్థ్యాన్ని ఇచ్చే హైబ్రిడ్, కొత్త ఇంజన్ టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నాయి.
Advertisement

రూ.10లక్షల బడ్జెట్ ధరలో బుజ్జి ఈవీలివే

భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతుండటంతో మధ్యతరగతి సామాన్యుడి చూపు సహజంగానే ఈవీల వైపు మళ్లుతోంది. అయితే, మార్కెట్లో లభించే మెజారిటీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు 15 లక్షల రూపాయలకు పైగానే ఉండటం చాలా మందిని వెనకడుగు వేయిస్తోంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థలు 2026లో సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నాయి.

ఎప్పుడొచ్చామన్నది కాదన్నా.. మార్కెట్ దున్నేశామా లేదా ?

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కౌంటర్ పార్ట్ హ్యుందాయ్‌కు తోడుగా, కమ్-బ్యాక్ ఇచ్చిన కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ కియా ఇండియా ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో నిజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026 ప్రారంభంలోనే కౌంటర్ అటాక్ మొదలుపెట్టిన ఈ సంస్థ, జనవరి నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అదిరిపోయే సేల్స్ గ్రోత్‌ను నమోదు చేసింది.

ధర తగ్గించి, ఫీచర్లు పెంచిన హ్యుందాయ్

ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక ఆసక్తికరమైన యుద్ధం సాగుతోంది. కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఎవరికీ అందనంత ఎత్తులో మొదటి స్థానంలో దూసుకుపోతుండగా.. రెండో స్థానం కోసం మాత్రం మూడు దిగ్గజ కంపెనీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అటు దేశీయ సంస్థలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇటు దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మధ్య పోటీ పీక్స్‌కు చేరింది. ఈ రేసులో తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టి మళ్ళీ పట్టు సాధించేందుకు హ్యుందాయ్ (Hyundai) ఇప్పుడు భారీ అస్త్రాన్ని ప్రయోగించింది. ఫిబ్రవరి నెలకు గాను తన పాపులర్ కార్ల మోడళ్లపై ఏకంగా రూ.75,000 వరకు భారీ డిస్కౌంట్లు, బెనిఫిట్లను ప్రకటించి కస్టమర్లను ఊరిస్తోంది.

ఒక్క కారులో 9 మంది వెళ్లొచ్చు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో స్థిరత్వానికి, నమ్మకానికి మరో పేరు అంటే అది మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తయారు చేసిన మహీంద్రా బొలెరో (Mahindra Bolero)నే అని చెప్పాలి. పావు శతాబ్దానికి పైగా దేశవ్యాప్తంగా రోడ్లపై తన సత్తా చాటుకుంటూ వస్తున్న ఈ ఎస్యూవీ, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి వర్గం వినియోగదారుడి విశ్వాసాన్ని గెలుచుకుంది. భారత మార్కెట్లోకి అడుగుపెట్టి దాదాపు 26 సంవత్సరాలు పూర్తిచేసుకున్నప్పటికీ, బొలెరోకు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. కాలానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసుకుంటూ వచ్చినా, తన అసలు స్వభావమైన దృఢత్వం, పనితీరును మాత్రం అలాగే కొనసాగిస్తోంది.
Advertisement

కస్టమర్లు రాకపోయే సరికి దోమలు కొట్టుకుంటున్న డీలర్లు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా (Kia india) భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే విశేష గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా సెల్టోస్, సోనెట్, కారెన్స్ వంటి మోడళ్లతో మధ్య తరగతి కొనుగోలుదారుల మనసును గెలుచుకుని, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. డిజైన్, ఫీచర్లు, ధర ఈ మూడు అంశాల్లోనూ కియా తనదైన ముద్ర వేసింది. అయితే ఇదే బ్రాండ్‌కు ప్రస్తుతం ఒక గంభీరమైన సవాలు ఎదురవుతోంది. కియా ఎంతో ఆశలు పెట్టుకున్న తన కాంపాక్ట్ ఎస్యూవీ సిరోస్‌ (kia syros) కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ మోడల్‌ను కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ఒక వినూత్న ప్రయోగంగా, టాల్‌బాయ్ శైలిలో స్పోర్ట్ యుటిలిటీ వాహనంగా పరిచయం చేశారు.