భారత మార్కెట్లో సిట్రోయెన్ పరిస్థితి ఇదేనా? నవంబర్ గణాంకాలు
ఆటోమొబైల్స్
- 9 month, 3 days ago
ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ (Citroën) భారత మార్కెట్లోకి అడుగుపెట్టి కొద్ది కాలమే అయినప్పటికీ, తనదైన గుర్తింపును ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. యూరోపియన్ డిజైన్, కంఫర్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చే సస్పెన్షన్ సెటప్, అలాగే ప్రాక్టికల్ ఫీచర్లతో కంపెనీ భారత వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తోంది. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా తగినంత షోరూమ్‌లు, సర్వీస్ నెట్‌వర్క్ లేకపోవడం సిట్రోయెన్ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపధ్యంలో, కంపెనీ తాజాగా నవంబర్ నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. నవంబర్ 2025లో సిట్రోయెన్ మొత్తం 1,224 కార్లను మాత్రమే విక్రయించింది. అదే సమయంలో, అక్టోబర్ నెలలో 1,426 యూనిట్లు అమ్ముడవ్వడం గమనార్హం. ఈ రెండు నెలల మధ్య పోలిస్తే నవంబర్ అమ్మకాల్లో కొంత తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది.