2026లో మార్కెట్ మొత్తం సెల్టోస్ దే

భారతీయ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా సెల్టోస్ (Kia Seltos), ఇప్పుడు పూర్తిగా కొత్త జనరేషన్ (2026 మోడల్) అవతార్‌లో విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ఈ కొత్త ఎస్‌యూవీని ఆవిష్కరించారు. ఈ కొత్త మోడల్ చూడటానికి చాలా బాగుండటమే కాకుండా అనేక అప్‎డేటెడ్ లగ్జరీ ఫీచర్లతో నింపేసింది.

రూ.50 లక్షల రేంజ్‌లో థ్రిల్ కలిగించే డ్రైవింగ్

Explore the 2025 Mini Cooper Convertible review, highlighting its design, features, driving dynamics, and expected India launch in December 2025. | 2025 Mini Cooper Convertible రివ్యూను అన్వేషించండి, దాని డిజైన్, ఫీచర్లు, డ్రైవింగ్ డైనమిక్స్ మరియు డిసెంబర్ 2025లో భారతదేశంలో ప్రారంభించబడే అవకాశం గురించి తెలుసుకోండి.

యూత్ మనసు దోచుకున్న 150సీసీ బైక్స్ ఇవే

భారతదేశంలో టూ వీలర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా 110 సీసీ, 125 సీసీ స్కూటర్లు భారీ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. అయితే ప్రస్తుతం 150 సీసీ స్కూటర్ల సందడి మొదలైంది. ఇవి పెద్ద సైజులో ఉండటంతో కొనుగోలుదారులు వీటిని ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా సరికొత్త 150 సీసీ స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే టీవీఎస్ ఎన్‌టార్క్ 150, హీరో జూమ్ 160, యమహా ఏరోక్స్ 155 మీకు బెస్ట్ ఆప్షన్లు కావొచ్చు. ఈ స్కూటర్ల ధరలు, ప్రత్యేకతల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

టయోటా కారుపై ఏకంగా రూ.1.5లక్షల తగ్గిపు

డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఇయర్ ఎండ్ ఆపర్లతో ముందుకు వస్తాయి. అయితే, ఇండియన్ కస్టమర్లు కేవలం ఆఫర్‌లు ఉన్నాయని కాకుండా, తమకు ఇష్టమైన, ప్రజాదరణ పొందిన మోడళ్లకు ఆఫర్లు ఉంటేనే షోరూమ్‌లకు క్యూ కడతారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు టయోటా షోరూమ్‌లలో కనిపించబోతోంది. ఎందుకంటే లీటర్‌కు 27 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్ ఇచ్చే టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) ఎస్‌యూవీపై ఏకంగా రూ.1.50 లక్షల వరకు భారీ తగ్గింపును ప్రకటించారు. హైరైడర్ మోడల్‌పై ప్రకటించిన ఆఫర్లలో అత్యధిక ప్రయోజనం హైబ్రిడ్ వేరియంట్లపై ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్స్‌పై రూ.96,100 ఎక్స్ఛేంజ్/క్యాష్/కార్పొరేట్ బోనస్‌లతో పాటు, అదనంగా రూ.50,000 లాయల్టీ బోనస్ కూడా లభిస్తుంది. దీనితో కలుపుకొని మొత్తం ప్రయోజనాలు రూ.1.50 లక్షలకు చేరుకుంటుంది.
Advertisement

మాగ్నైట్ పై ఏకంగా రూ.1,36,000 తగ్గింపు

జపనీస్ బ్రాండ్ అయిన నిస్సాన్, తమ ప్రముఖ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ మాగ్నైట్ (Magnite) పై డిసెంబర్ 2025 కోసం ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో నగదు ప్రయోజనాలు (Cash Benefits), ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు, ముందుగా బుక్ చేసుకునే వారికి ప్రత్యేక బోనస్‌లు కూడా ఉన్నాయి. ఎంచుకునే వేరియంట్, ట్రాన్స్‌మిషన్ ఆధారంగా, కస్టమర్లు రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.1,36,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఇది మాగ్నైట్‌ను కొనాలనుకునే వారికి గొప్ప సమయం.

ఈ బండిని ఇప్పటికే లక్ష మంది కొన్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌ను స్టార్టప్ బ్రాండ్‌లు ప్రాచుర్యంలోకి తెచ్చినప్పటికీ, ఇప్పుడు దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులు టీవీఎస్, బజాజ్, హీరో మోటోకార్ప్ ఈ మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీల మధ్యే ఎక్కువ పోటీ నెలకొంది. దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ కూడా తమ విడా (Vida) శ్రేణి ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడంలో తమ సామర్థ్యాన్ని నిరూపించింది.

డిసెంబర్లో కారు కొంటే కలిగే లాభనష్టాలేంటి ?

కారు కొనుగోలుదారులను బాగా కన్ఫ్యూజ్ చేసే నెల ఏదైనా ఉందా అంటే అది డిసెంబర్ అని చెప్పాలి. డిసెంబర్‌లో కారు కొనుగోలు చేయడం వల్ల ఇతర నెలల్లో కొనుగోలు చేయడం కంటే ఎక్కువ డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఇయర్-ఎండ్ ఆఫర్లలో కారు కొనడం వల్ల లాభాలే కాదు, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయనే వాస్తవం తెలుసుకున్న తర్వాత కొనుగోలుదారులు గందరగోళానికి గురవుతారు. మీరు ఈ నెలలో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఎలా లాభదాయకమైన డీల్‌ను పొందాలి, ఇయర్-ఎండ్ ఆఫర్‌లో వాహనం కొనడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.

ఈ సారి స్టాక్ అంతా ఖాళీ అవ్వాల్సిందే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాల్లో టాటా మోటార్స్ ఇతర కంపెనీలైన ఎంజీ (MG), మహీంద్రా (Mahindra) కంటే చాలా ముందుంది. ప్రస్తుతం టియాగో, టిగోర్, నెక్సాన్ వంటి ఆరు ఈవీ మోడళ్లను మార్కెట్లో విక్రయిస్తున్న టాటా, పోటీదారులను మరింత దూరం వెనుకకు నెట్టడానికి తమ పూర్తి ఎలక్ట్రిక్ వాహన శ్రేణిపై ఇయర్ ఎండ్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా టాటా అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌లలో ఒకటైన పంచ్ ఈవీ పై ఏకంగా రూ.1.75 లక్షల వరకు భారీ తగ్గింపును డిసెంబర్ నెల కోసం సిద్ధం చేసింది.
Advertisement

ఏకంగా మైలేజ్ 30 కి.మీ. ఇచ్చే కారు

భారత మార్కెట్లో కుటుంబంతో ప్రయాణించే పెద్ద కార్ల (7-సీటర్ ఎస్‌యూవీలు) అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కియా మోటార్స్ సంస్థ అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ D-సెగ్మెంట్ ఎస్‌యూవీ మోడల్‌ను భారతదేశానికి తీసుకురావాలని గట్టిగా యోచిస్తోంది.

XUV 7XO గా మారిన 700

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అత్యంత ప్రజాదరణ పొందిన XUV700 ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇప్పుడు కొత్త పేరుతో మార్కెట్లోకి రానుంది. ఈ అప్‌డేటెడ్ మోడల్ ఇకపై XUV 7XO అనే కొత్త పేరుతో విక్రయించబడుతుందని కంపెనీ ప్రకటించింది.

క్రెటా, ఫార్చ్యూనర్‌లకు గుబులు.. టయోటా మాస్టర్ ప్లాన్

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా (Toyota) కంపెనీకి 2026 సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయి కానుంది. ఈ ఏడాదిలో టయోటా మొత్తం మూడు కొత్త, అప్‌డేటెడ్ మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కంప్లీట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన అర్బన్ క్రూజర్ బీఈవీ (BEV), 9వ జనరేషన్ టయోటా హిలక్స్ పికప్ ట్రక్, అప్‌డేటెడ్ అర్బన్ క్రూజర్ హైరైడర్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మోడళ్లు సరికొత్త డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో పాటు, పోటీ ధరల్లో కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది.

కస్టమర్ల నిరీక్షణకు తెర.. లాంగ్ రేంజ్ స్కూటర్ల డెలివరీ షురూ

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఒకప్పుడు సంచలనం సృష్టించింది. క్యాబ్ అగ్రిగేటర్ నుంచి ఈవీ తయారీలోకి అడుగుపెట్టిన ఓలా అద్భుతమైన వృద్ధిని సాధించింది. అయితే గతంలో విక్రయాల తర్వాత సేవల విషయంలో అనేక ఫిర్యాదులు రావడంతో ఓలా కొంత విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ తమ తొలి విజయాల బలంపై విక్రయాలు పర్వాలేదనిపిస్తున్నాయి.
Advertisement

పోటీదారుల దెబ్బకి క్విడ్ అమ్మకాలు నేలచూపు చూశాయి

భారత మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లకు ఎప్పటికీ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. తక్కువ ధర, తక్కువ మెయింటెనన్స్, సులభమైన డ్రైవింగ్, కుటుంబాలకి మొదటి కారుగా సరిగ్గా సరిపోవడం.. ఈ కారణాల వల్లే ఈ సెగ్మెంట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఆ కేటగిరీలో అత్యంత హైలైట్ అయిన మోడళ్లలో రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) ఒకటి. 2015లో భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసి ప్రవేశపెట్టిన ఈ చిన్న కారు, ఆ ప్రారంభ దశలోనే కస్టమర్ల మనసు దోచుకుంది. SUV-స్టైల్ డిజైన్, బడ్జెట్‌ను దాటని ధర, ఆఫర్ చేసిన ఫీచర్లు అన్ని కలిసి క్విడ్‌కు బలమైన ప్రారంభం ఇచ్చాయి. కానీ కాలం మారింది, పోటీ మరింత కఠినమైంది. కొత్త మోడళ్లు, ఆధునిక ఫీచర్లు, సేఫ్టీ మీద వినియోగదారుల అవగాహన పెరగడంతో క్విడ్‌కు ఎదురుదెబ్బ అయ్యాయి. గతంలో కనిపించిన ఆ వేగం, ఆ హడావుడి అమ్మకాల్లో కనిపించడం తగ్గింది.

ప్రతిరోజూ వేల మంది ఈ కంపెనీ టూవీలర్స్ కొన్నారు

నవంబర్ 2025లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) మరోసారి తన మార్కెట్ శక్తిని నిరూపించింది. దేశీయ మార్కెట్‌లోనూ, గ్లోబల్ ఎగుమతుల విభాగంలోనూ హోండా అమ్మకాలు గణనీయంగా పెరిగి కంపెనీకి భారీ ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. మొత్తం మీద, హోండా నవంబర్ నెలను 5,91,136 యూనిట్ల విక్రయాలతో ముగించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 4,72,749 యూనిట్ల నుంచి నేరుగా 25 శాతం కంటే ఎక్కువ వృద్ధి. ఈ ఒక్క సంఖ్యే హోండా బ్రాండ్‌కు కొనసాగుతున్న నమ్మకం ఎంత బలంగా ఉందో చూపుతుంది. ఎగుమతులు బలంగా నిలబడటం, దేశీయ మార్కెట్‌లో రిటైల్ డిమాండ్ తిరిగి మెరుగుపడటం, యాక్టివా-షైన్ వంటి మోడళ్లకు నిరంతరమైన పాపులారిటీ కలిపి హోండా నవంబర్ పనితీరును సానుకూలంగా నిలబెట్టాయి.

లేడీస్ కోసం బెస్ట్ స్కూటర్లు ఇవే

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సెగ్మెంట్. ప్రస్తుతం మార్కెట్లో వివిధ ధరలలో సైజులలో అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. సురక్షితంగా , సులభంగా నడపడానికి వీలుగా ఉండే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మహిళా రైడర్‌ల మధ్య ప్రియారిటీ పెరుగుతోంది.

పేద-మిడిల్‌క్లాస్‌కు దేవుడు.. 47 లక్షల ఇళ్లకు చేరిన ఆనందం

మారుతి ఆల్టో (Maruti Alto) భారత కుటుంబాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న చిన్న కారు. ఇండియాలో కారు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఇదే. ఎందుకంటే ఇది కేవలం ఒక కార్ కాదు... లక్షల్లో మధ్యతరగతి, పేద కుటుంబాల కలలు నెరవేర్చిన ఫ్యామిలీ మెంబర్ లాంటిది. తక్కువ బడ్జెట్‌లో, నమ్మకమైన క్వాలిటీతో, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండడంతో ప్రతి ఇంటి ముందూ ఒక ఆల్టో కనపడటానికి ఇదే కారణం. తండ్రి మొదటిసారి తన కుటుంబాన్ని కారులో తీసుకెళ్లే ఆనందం నుంచి, స్కూల్‌కు వెళ్లే చిన్నారుల నవ్వుల దాకా ఈ కార్ ఎన్నో ఇండియన్ మెమరీలు సృష్టించింది. అందుకే ఆల్టోకు ఇంత భారీ క్రేజ్ సాధారణం కాదు... ఇది భారత రోడ్లపై తిరిగే ఒక భావోద్వేగం.
Advertisement

ఈ రోబోట్ మనతో ముచ్చట్లు చెబుతుంది

ఇప్పటి వరకు మనం మనుషుల పనులు చేసే అనేక రోబోట్‌లను చూశాం.. కానీ జపాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ కవాసకి హెవీ ఇండస్ట్రీస్ ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణకు తెర లేపింది. ఈ కంపెనీ మోటార్‌సైకిళ్లను భర్తీ చేయగల ఒక వినూత్న రోబోట్‌ను రూపొందిస్తోంది. సింహం లాంటి ఆకృతిలో ఉండే ఈ రోబోట్‌ను నడపడం మోటార్‌సైకిల్, గుర్రాన్ని నడిపిన అనుభూతిని ఇస్తుంది. కంపెనీ దీనికి కోరలియో(Corleo) అని పేరు పెట్టింది. ఈ ఆలోచన ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నప్పటికీ కంపెనీ ప్రొజెక్ట్ మేనేజర్ తకాహిరో ఉయనో ధీమా వ్యక్తం చేస్తూ..2035 నాటికి దీని అమ్మకాలు ప్రారంభమవుతాయని ప్రకటించారు.

టాటా సియెర్రా రివ్యూ బయటకు వచ్చింది! పెర్ఫామెన్స్ ఎలా ఉందంటే?

కొత్త టాటా సియెర్రా రివ్యూ చదవండి. ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలు, డ్రైవింగ్ ఇంప్రెషన్‌లు మరియు భద్రతా రేటింగ్‌ల గురించి తెలుసుకోండి. ఇది SUV విభాగంలో బలమైన పోటీదారుగా నిలుస్తుందా? | Read the new Tata Sierra review. Learn about features, engine options, driving impressions and safety ratings. Does it stand as a strong contender in the SUV segment?

రూ.5.99లక్షల మైలేజ్ కింగ్‌పై రూ.70,000 డిస్కౌంట్

2025 క్యాలెండర్ సంవత్సరం ముగియడానికి ఇంకా కేవలం మూడు వారాలే మిగిలి ఉంది. ఈ సంవత్సరాంతపు స్టాక్‌ను పూర్తిగా విక్రయించడానికి కార్ల కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ఈ డిసెంబర్ 2025లో మారుతి సుజుకి తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై భారీ తగ్గింపులను అందిస్తోంది. స్టైలిష్ డిజైన్, ఫీచర్లతో నిండిన క్యాబిన్, అత్యుత్తమ మైలేజ్ కారణంగా టాటా ఆల్ట్రోస్, హ్యుందాయ్ ఐ20 వంటి మోడళ్లకు బాలెనో గట్టి పోటీ ఇస్తోంది. ఈ డిసెంబర్ నెలలో బాలెనోపై ఉన్న ఆఫర్లు, వివరాలు తెలుసుకుందాం.

మీరు అనుకున్నదానికంటే తక్కువ ధరలో లగ్జరీ కారు

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ (Kia Motors) ఆటోమొబైల్ తయారీ శక్తిని భారత మార్కెట్‌లో కచ్చితంగా చూపిస్తుంది. ఈ కంపెనీకి చెందిన సెల్టోస్ (Seltos) SUV ఇప్పటికే దేశంలో పెద్ద ఆదరణ పొందింది, కస్టమర్లు దీన్ని విశ్వసనీయ, శక్తివంతమైన ఎంపికగా భావిస్తున్నారు. ఈ విజయాన్ని కొనసాగించడానికి, కియా మోటార్స్ ఇప్పుడు అదే SUVని రెండవ తరం రూపంలో విడుదలకు సన్నాహాలు చేస్తోంది. కొత్త కియా సెల్టోస్ ప్రపంచం ముందుకు డిసెంబర్ 10న బుధవారం ఆవిష్కరించబడనుంది. ప్రస్తుత మోడల్ కంటే మరింత ప్రీమియం ఫీచర్లు, ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన ఇంటీరియర్‌తో, కొత్త మోడల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
Advertisement

కస్టమర్ బాధ అర్థం చేసుకున్న హార్లీ

అమెరికన్ మోటార్‌సైకిల్ దిగ్గజం హార్లీ-డేవిడ్‌సన్ (Harley-Davidson) భారత మార్కెట్‌ను ఆకర్షించేందుకు దేశంలోనే అత్యంత తక్కువ ధర కలిగిన ఎక్స్440 (X440) సిరీస్‌లో భాగంగా, కొత్త ఎక్స్440 టి(X440 T) మోటార్‌సైకిల్‌ను రూ.2.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పరిచయం చేసింది. ఈ కొత్త బైక్‌ను ఒకే వేరియంట్‌లో పియరల్ బ్లూ, రెడ్, వైట్, వివిడ్ బ్లాక్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

మార్కెట్‌లో మళ్లీ బజాజ్ ధమాకా! నవంబర్ అమ్మకాలు 8% పెరిగాయి

2025 నవంబర్ నెల బజాజ్ (Bajaj) ఆటోకి మరోసారి బలమైన పనితీరును నమోదు చేసిన నెలగా నిలిచిపోయింది. దేశీయ ద్విచక్ర వాహనాల డిమాండ్ పెద్దగా పెరుగకపోయినా, విదేశీ మార్కెట్ల నుండి వచ్చిన బలమైన కొనుగోలు ఉత్సాహం, వాణిజ్య వాహన విభాగంలోని గణనీయమైన వృద్ధి కంపెనీ మొత్తం అమ్మకాల్ని గట్టిగా నిలబెట్టాయి. ప్రత్యేకించి, ఎగుమతుల విభాగంలో బజాజ్ ఆటో చూపించిన వేగం కంపెనీకి ఆర్థికంగా కీలకమైన లాభాలను అందించడమే కాక, గ్లోబల్ ప్రెజెన్స్‌ను మరింత బలపరిచింది. నవంబర్ 2025లో కంపెనీ మొత్తం ఏకీకృత అమ్మకాలు 4,53,273 యూనిట్లు చేరాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదు చేసిన 4,21,640 యూనిట్లతో పోలిస్తే ఎనిమిది శాతం వృద్ధి. ఈ పెరుగుదల బజాజ్ ఆటో మార్కెట్‌లో కొనసాగుతున్న ప్రభావాన్ని, అలాగే కొత్తగా వెల్లువెత్తుతున్న గ్లోబల్ డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.

బిగ్ ఫ్యామిలీకి బెస్ట్ చాయిస్!7-సీటర్.. 17 కి.మీ మైలేజ్

మహీంద్రా XUV700 గురించి చెప్పాలంటే, ఇది నేటి భారతీయ కుటుంబాల అవసరాలను అచ్చుగుద్దినట్టుగా తీర్చగలిగే పూర్తి స్థాయి ఫ్యామిలీ SUV గా మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కారు అందించే స్పేస్, కంఫర్ట్, సేఫ్టీ.. మూడు విభాగాల్లోను తన తరగతిలోనే కాదు, ఉన్నత సెగ్మెంట్‌ల కార్లకూ పోటీ ఇస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. లోపల కూర్చుంటే ఒక పెద్ద, శుభ్రమైన, ఎయిరీ కేబిన్ ఫీలవుతుంది. రెండు కుటుంబాలు కలిసి ప్రయాణించినా కూడా ఇబ్బంది లేకుండా కంఫర్ట్‌గా కూర్చోగలిగే ఇంత పెద్ద స్పేస్‌ను మహీంద్రా అద్భుతంగా డిజైన్ చేసింది. బయట నుంచి చూడగానే ఆకట్టుకునే ప్రెజెన్స్ కలిగిన ఈ SUV, తన షార్ప్ లైన్లు, డామినెంట్ గ్రిల్, LED లైట్ సిగ్నేచర్‌తో క్షణాల్లోనే దృష్టిని ఆకర్షిస్తుంది.

19 గంటల్లోనే 1030 కి.మీ ప్రయాణం.. అది కూడా ఇలాంటి కారుతో!

హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి చిన్న SUV సెగ్మెంట్‌లో మంచి పేరు సంపాదించుకుంది. ప్రాక్టికల్ డిజైన్, ఫీచర్లు, మైలేజ్ అన్ని ఒక ప్యాకేజ్‌గా భావిస్తూ చాలామంది దీనిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఒక వినియోగదారుడు ఈ కారుతో చేసిన ప్రయాణ అనుభవం సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. బెంగళూరుకు చెందిన ఈ వ్యక్తి కొత్తగా కొనుగోలు చేసిన ఎక్స్‌టర్ AMT వేరియంట్‌తో కేవలం 19 గంటల్లో 1030 కి.మీ ప్రయాణించి తన అనుభవాన్ని రెడ్డిట్‌లో పంచుకున్నారు. అదీగాక, ఆయన చేసిన ఈ ప్రయాణం సాదాసీదా రోడ్లపై కాదు. భారీ వర్షాలు, పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు, ట్రాఫిక్‌తో నిండిన ప్రాంతాలు.. ఇవన్నీ ఎదురైనా ఎక్స్‌టర్ తన పనితీరులో ఎక్కడా రాజీపడలేదని ఆయన వివరించాడు. దీనికోసం అతను ఎక్స్‌టర్ AMT కారును ఉపయోగించాడు
Advertisement

గోవా బీచ్ వైబ్స్‌తో Tvs కొత్త బైక్ అడుగుపెట్టింది

టీవీఎస్ మోటార్ (tvs motor) కంపెనీ ప్రతి ఏడాది మోటార్‌సైకిల్ ప్రేమికుల కోసం నిర్వహించే ప్రత్యేక వేడుక 'టీవీఎస్ మోటోసౌల్'. ఈ వేడుక ఇప్పటికే బైక్ కల్చర్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఈసారి ఐదవ వార్షికోత్సవ వేడుకలో టీవీఎస్ అందరి చూపులను తన వైపు తిప్పుకునేలా ఒక ప్రత్యేక మోడల్‌ను ఆవిష్కరించింది, అదే టీవీఎస్ రోనిన్ అగోండా (tvs ronin agonda). ఇది కేవలం ఒక కొత్త ఎడిషన్ కాదు, రోనిన్ బ్రాండ్ కథను మరింత లోతుగా చెబుతూ, డిజైన్‌లో కస్టమ్-కల్చర్ ఆత్మను ప్రతిబింబించేలా రూపొందించిన లిమిటెడ్-ఎడిషన్ వెర్షన్. ముందుగా ధర విషయానికి వస్తే, టీవీఎస్ రోనిన్ అగోండా రూ.1,30,990 (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదలైంది.