టాటా EV ప్లాన్‌లో కీలక మోడల్.. 2026 చివర్లో అవిన్య ఎలక్ట్రిక్ SUV

టాటా మోటార్స్ (tata motors) ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. నెక్సాన్ EV, టియాగో EV, టిగోర్ EV వంటి మోడళ్లతో ఇప్పటికే బలమైన పునాదిని వేసుకున్న ఈ కంపెనీ, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని స్పష్టంగా గుర్తించింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, రాబోయే సంవత్సరాల్లో మరింత పెద్ద స్థాయిలో తన EV పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు టాటా మోటార్స్ వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికల్లో భాగంగా 2026 ఏడాదిని టాటా మోటార్స్ కీలక సంవత్సరంగా భావిస్తోంది. ఆ ఏడాదిలో పలు కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా 2026లో ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ కొత్త టాటా అవిన్య (Avinya) EVను తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

జనవరి 2న అసలు సినిమా మొదలు

భారతీయ ఎస్‌యూవీ (SUV) విభాగంలో పెద్ద ప్రకంపనలు సృష్టించేందుకు కొత్త తరం కియా సెల్టోస్ సిద్ధమవుతోంది. దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ అయిన కియాకు దేశీయ మార్కెట్‌లో ఒక గుర్తింపు తెచ్చిన ఈ మోడల్, ప్రస్తుతం అమ్మకాలలో హ్యుందాయ్ క్రెటా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి విక్టోరిస్, మారుతి గ్రాండ్ విటారా వంటి వాటి వెనుక ఉంది.

గ్రామీణం నుంచి నగరం వరకు.. HF డీలక్స్‌కు ఫుల్ డిమాండ్

నవంబర్ 2025 నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కార్ల అమ్మకాలతో పాటు ద్విచక్ర వాహనాలు కూడా మంచి ప్రదర్శన చూపించాయి. ముఖ్యంగా కమ్యూటర్ సెగ్మెంట్‌లో హీరో మోటోకార్ప్‌కు చెందిన హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hf Deluxe) బైక్ అమ్మకాల పరంగా ప్రత్యేకంగా నిలిచింది. ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన గణనీయంగా ఉండటంతో, గత నెలలో కంపెనీ మొత్తం 91,082 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 61,245 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 48.72 శాతం వార్షిక వృద్ధిగా నమోదు కావడం విశేషం. ఈ సంఖ్యలు చూస్తేనే HF డీలక్స్ భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఎంత బలమైన స్థానం సంపాదించుకుందో అర్థమవుతుంది.

పొద్దున్న బండి ఇస్తే సాయంత్రానికి రెడీ

ఒకప్పుడు ఇండియా ఈవీ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) అంటే ఒక తిరుగులేని శక్తి. 2024లో ఏకంగా 4 లక్షల స్కూటర్లను అమ్మి, మార్కెట్లో దాదాపు 40 శాతం వాటాను కైవసం చేసుకుంది. కానీ, సేల్స్ పెరిగినంత వేగంగా సర్వీస్ క్వాలిటీ పెరగలేదు. వేల సంఖ్యలో ఫిర్యాదులు, సర్వీస్ సెంటర్ల ముందు కస్టమర్ల నిరసనలతో ఓలా బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్ అయ్యింది.
Advertisement

విదేశాల్లో కేవలం 1-స్టార్ భద్రతా రేటింగ్ మాత్రమే పొందిన కారు

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) భారత మార్కెట్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కాంపాక్ట్ SUVగా ఎదిగింది. భారత్‌లో తయారై ఎగుమతి అవుతున్న ఈ మోడల్, అంతర్జాతీయ మార్కెట్లలో సుజుకి ఫ్రాంక్స్ (Suzuki Fronx) పేరుతో అమ్ముడవుతూ, డిజైన్, ఇంధన సామర్థ్యం, బ్రాండ్ విశ్వసనీయత పరంగా మంచి స్పందనను పొందుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అభివృద్ధి చెందిన ఆటో మార్కెట్లలో కూడా ఈ కారు అడుగు పెట్టడం మారుతి సుజుకి గ్లోబల్ వ్యూహానికి మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఫ్రాంక్స్ భద్రతా ప్రమాణాల విషయంలో చర్చకు దారి తీసింది.

నెక్సాన్ స్పీడ్‎కు బ్రేకుల్లేవ్..లక్ష యూనిట్లతో రికార్డు

టాటా మోటార్స్ అంటేనే చాలా మందికి సేఫ్టీ అనే పదం గుర్తుకు వస్తుంది. అందుకు ప్రధాన కారణం, వారి ప్రయాణంలో మైలురాయిగా నిలిచిన నెక్సాన్ (Nexon) కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ మిడిల్ క్లాస్ ఎస్‌యూవీ ద్వారానే టాటా, కారు సేఫ్టీ విషయంలో కొత్త ప్రమాణాలను సృష్టించింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ, కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు కూడా సేఫ్టీ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు.

కొత్త చరిత్ర సృష్టించిన రతన్ టాటా కంపెనీ

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ (Tata Motors) తన ఆధిపత్యాన్ని మరోసారి బలంగా నిరూపించుకుంది. ఒకప్పుడు ప్రారంభ దశలో ఉన్న EV మార్కెట్‌ను నేడు దేశవ్యాప్తంగా ప్రజల దైనందిన జీవితాల్లోకి తీసుకొచ్చిన బ్రాండ్‌గా TATA.ev నిలిచింది. 2020లో టాటా మోటార్స్ తన తొలి ఎలక్ట్రిక్ కారుగా Nexon.evను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి, ఈ విభాగంలో స్థిరమైన నాయకత్వాన్ని కొనసాగిస్తోంది. కేవలం కొత్త మోడళ్లను విడుదల చేయడమే కాకుండా, వినియోగదారుల నమ్మకాన్ని కూడా దక్కించుకుంటూ EV మార్కెట్ పరిణామానికి దిశానిర్దేశం చేస్తోంది.

ఫ్యామిలీ కారుకు మంగళం పాడుతున్నారా?

మారుతి సుజుకికి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బాలెనో(Baleno) పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. మైలేజీలో రారాజుగా, మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన కారుగా పేరున్న బలేనో విక్రయాలు గత రెండు నెలలుగా దారుణంగా పడిపోతున్నాయి. కేవలం ఒక్క నెలలోనే వేల సంఖ్యలో యూనిట్ల విక్రయాలు తగ్గిపోవడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశమైంది.
Advertisement

తక్కువ ఖర్చుతో ఈ ఆటో డ్రైవర్ల కడుపు నింపుతుంది

డీజిల్ కొట్టించే అవసరం లేదు, ఇంజిన్ ఆయిల్ మార్చే తలనొప్పి లేదు.. కేవలం బ్యాటరీ ఛార్జ్ చేస్తే చాలు, భారీ బరువులను కూడా సులభంగా మోసుకెళ్లవచ్చు. అవును, భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతున్న యుధా(YOUDHA) సంస్థ, రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా తన కొత్త ఎలక్ట్రిక్ కార్గో వాహనం ట్రెవో(Trevo)ను మార్కెట్లోకి విడుదల చేసింది.

మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2026 అవార్ట్ గెలుచుకున్న బైక్ ఇదే

టీవీఎస్ మోటార్ కంపెనీకి (Tvs Motor Company) మరో ప్రతిష్ఠాత్మక ఘనత దక్కింది. కంపెనీ నుంచి తాజాగా వచ్చిన అడ్వెంచర్ ర్యాలీ టూరర్ మోటార్‌సైకిల్ టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ (Apachi RTX), జెకె టైర్ అందించే 2026 ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ (IMOTY) అవార్డును గెలుచుకుని దేశవ్యాప్తంగా ఆటో ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. ఇది టీవీఎస్‌కు మాత్రమే కాదు, భారత మోటార్‌సైకిల్ పరిశ్రమకే గర్వకారణంగా నిలిచింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును పొందడం అంత ఈజీ కాదు. భారతదేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ఆటోమోటివ్ జర్నలిస్టులతో కూడిన 27 మంది సభ్యుల ప్రత్యేక జ్యూరీ టీవీఎస్ అపాచీ RTXను సవివరంగా పరీక్షించి, అన్ని కోణాల్లో మూల్యాంకనం చేసింది.

మార్కెట్‌లో మళ్లీ దూసుకుపోతున్న జూపిటర్

టీవీఎస్ జూపిటర్ (Tvs Jupiter) భారత స్కూటర్ మార్కెట్లో ఎన్నేళ్లుగా బలమైన స్థానం సంపాదించుకున్న మోడల్. ఫ్యామిలీ వినియోగం, కంఫర్ట్ రైడింగ్, మంచి మైలేజ్ వంటి అంశాల కారణంగా ఇది నగరాలు, పట్టణాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృత ఆదరణ పొందుతోంది. ఇప్పుడు నవంబర్ 2025 నెలకు సంబంధించిన అమ్మకాల నివేదిక విడుదల కావడంతో, టీవీఎస్ జూపిటర్ మార్కెట్లో ఎంత బలంగా నిలిచిందో మరోసారి స్పష్టమైంది. ఈ తాజా అమ్మకాల నివేదిక ప్రకారం, నవంబర్ 2025 నెలలో మొత్తం 1,24,782 టీవీఎస్ జూపిటర్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇది కంపెనీకి చాలా పాజిటివ్ సంఖ్యగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం అదే నెలను గుర్తు చేసుకుంటే, అంటే నవంబర్ 2024లో టీవీఎస్ జూపిటర్ అమ్మకాలు 99,710 యూనిట్లకే పరిమితమయ్యాయి.

ఏథర్ ఈవీ ఇక కాస్త కాస్ట్లీ గురూ!

కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026 జనవరి 1వ తేదీ నుండే ఈ పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు,పెరగనున్న ధరల వివరాల గురించి తెలుసుకుందాం.
Advertisement

కియా సెల్టోస్ రివ్యూ.. డిజైన్ నుంచి డ్రైవ్ వరకూ ఎలా ఉంది?

కియా సెల్టోస్ రివ్యూ: డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలు మరియు డ్రైవింగ్ అనుభవం గురించి తెలుసుకోండి. ఇది కాంపాక్ట్ SUV విభాగంలో ఎలా నిలుస్తుందో చూడండి.

బుక్ చేసుకుంటే ఇంటిపైకే ఎయిర్ టాక్సీ

హైదరాబాద్ వంటి మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. ఆఫీస్‌కు వెళ్లాలన్నా, ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలన్నా గంటల తరబడి రోడ్ల మీద వేచి ఉండాల్సిందే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సరళా ఏవియేషన్ సంస్థ భారతీయ గగనతలంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. గాలిలో ఎగిరే టాక్సీలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ సరళా ఏవియేషన్ (Sarla Aviation), ఈ ఏడాది ప్రారంభంలో శూన్య(Shunya) పేరుతో తన ఎయిర్ టాక్సీ ప్రోటోటైప్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం బెంగళూరులో దీనికి సంబంధించిన SYL-X1 అనే డెమో విమానం గ్రౌండ్ టెస్టింగ్‌ను ప్రారంభించింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ శక్తితో నడుస్తుంది కాబట్టి, పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు.

65 కి.మీ మైలేజ్ బైకును కళ్లుమూసుకుని కొనచ్చు!

హోండా షైన్ 125 (Honda Shine 125) భారత మోటార్‌సైకిల్ మార్కెట్లో ఒక నమ్మకమైన పేరు. ఈ బైక్‌ను తొలిసారిగా 2006లో హోండా పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, మంచి మైలేజ్ కోరుకునే వినియోగదారుల మధ్య షైన్ 125 ప్రత్యేకమైన ఆదరణను సంపాదించుకుంది. సింపుల్ డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చులు, హోండా ఇంజిన్ నమ్మకం... ఇవన్నీ కలిసే ఈ బైక్‌ను ఇంత పాపులర్‌గా నిలబెట్టాయి. మీరు కొత్త మోటార్‌సైకిల్ కొనాలనుకుంటున్నట్లయితే, ఖర్చు ఎక్కువ కాకుండా, రోజూ నమ్మకంగా ఉపయోగించుకునే బైక్ కావాలంటే హోండా షైన్ 125 నిజంగా ఒక ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ప్రాక్టికల్ యూజ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది.

సేఫ్టీకి శఠగోపం..డబ్బా కారు అంటే ఇదే

మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz) క్రాష్ టెస్ట్ ఫలితాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు లగ్జరీ సెడాన్ విభాగంలో రారాజుగా వెలిగిన ఈ కారు, సేఫ్టీ విషయంలో ఎంత వెనుకబడి ఉందో గ్లోబల్ NCAP నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కారు క్రాష్ టెస్ట్ విశ్లేషణ, భవిష్యత్తుపై లోతైన వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
Advertisement

మారుతి సెలెరియోకు గ్లోబల్ NCAP 3-స్టార్ రేటింగ్

భారత మార్కెట్లో నమ్మకమైన, మైలేజ్‌కు పేరున్న హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి సెలెరియో (Maruti suzuki Celerio)కి ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ధర, మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, నగర ప్రయాణాలకు అనుకూలమైన డిజైన్ కారణంగా ఇది ఎన్నో కుటుంబాల తొలి కారుగా మారింది. అయితే తాజాగా గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్ ఫలితాల్లో 3 స్టార్ రేటింగ్ పొందింది. దీంతో సెలెరియో భద్రతపై కొత్త చర్చ మొదలైంది. ఈ క్రాష్ టెస్ట్ ఫలితాల ప్రకారం, మారుతి సుజుకి సెలెరియో వయోజన ప్రయాణీకుల రక్షణలో మధ్యస్థ స్థాయి పనితీరును చూపించింది. ముందు సీట్లలో కూర్చున్న డ్రైవర్, సహ ప్రయాణీకులకు ప్రమాద సమయంలో సరైన స్థాయిలో రక్షణ లభిస్తుందని పరీక్షలు సూచించాయి. ముఖ్యంగా ఛాతీ, తల రక్షణలో కార్ సరాసరి స్థాయిలో స్కోర్ సాధించినప్పటికీ, కొన్ని భాగాల్లో మెరుగుదల అవసరం ఉన్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇండియాలో రూ.2లక్షల్లోపు మోస్ట్ మొండి బైక్స్

సాధారణంగా మనం కారు కొనాలంటే సేఫ్టీ రేటింగ్స్, బిల్డ్ క్వాలిటీ గురించి ఆరా తీస్తాం. కానీ బైక్ లేదా స్కూటర్ విషయానికి వచ్చేసరికి కేవలం మైలేజీ ఎంత ఇస్తుంది? ధర ఎంత? అనే విషయాలకే ప్రాధాన్యత ఇస్తాం. కానీ టూ వీలర్ పై ప్రయాణించేటప్పుడు మన ప్రాణాలకు రక్షణ ఉండాలన్నా, బైక్ ఎక్కువ కాలం మన్నిక రావాలన్నా దాని బిల్డ్ క్వాలిటీ చాలా ముఖ్యం. ప్యానెల్ ఫిట్టింగ్, క్వాలిటీ బాడీ పార్ట్స్, పెయింట్ ఫినిషింగ్ వంటివి బైక్ లైఫ్‌ను నిర్ణయిస్తాయి. ప్రస్తుతం ఇండియాలో రూ.2లక్షల లోపు లభిస్తున్న అత్యుత్తమ బిల్డ్ క్వాలిటీ గల టాప్ బైక్స్ వివరాలు మీకోసం..

బుల్లెట్ మీద వెళ్తుంటే ఆ కిక్కే వేరు

భారతదేశంలో బైక్ లవర్స్ గురించి మాట్లాడుకుంటే మెజారిటీ జనం కలల బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). ఆ గంభీరమైన రూపం, విలక్షణమైన డుగ్ డుగ్ శబ్దం, రోడ్డుపై వెళ్తుంటే వచ్చే రాజసం.. ఇవన్నీ ఆ బ్రాండ్ సొంతం. అయితే చాలామంది రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే కేవలం లక్షల రూపాయలు ఉన్నవారికే సాధ్యమని, సామాన్యుడికి అందదని భ్రమపడుతుంటారు.

ఫేస్‌లిఫ్ట్ బ్రెజ్జా రోడ్లపై కనిపించింది.. డిజైన్‌లో ఏం కొత్తది?

మారుతి సుజుకి భారత మార్కెట్లో తన అత్యంత విజయవంతమైన కాంపాక్ట్ SUV అయిన బ్రెజ్జా (Brezza) ఆధునికంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ 2026 ప్రారంభంలో కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. 2022లో రెండవ తరం బ్రెజ్జాను పూర్తిస్థాయి అప్‌గ్రేడ్‌గా తీసుకువచ్చిన మారుతి, ఇప్పుడు దానికి తొలి ప్రధాన ఫేస్‌లిఫ్ట్‌ను అందించబోతుండటం విశేషం. ఈ రాబోయే ఫేస్‌లిఫ్ట్‌లో బ్రెజ్జా మరింత ఆధునిక సాంకేతిక ఫీచర్లతో పాటు మెరుగైన ఇంటీరియర్ సౌందర్యాన్ని పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అలాగే సేఫ్టీ ఫీచర్ల పరంగా కొత్త అప్‌డేట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు, క్యాబిన్‌లో ఉపయోగించే మెటీరియల్స్, డిజైన్‌లో కూడా ప్రీమియం ఫీల్ పెంచే మార్పులు చేయవచ్చని భావిస్తున్నారు.
Advertisement

ఈ కారును ప్రతినెలా 4 వేల మంది పైగా కొంటున్నారు

టయోటా గ్లాంజా (Toyota Glanza) ప్రస్తుతం భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. స్టైల్, నాణ్యత, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్ కలిసిన ఈ కారు రోజురోజుకూ ఎక్కువ మంది వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో గ్లాంజా అమ్మకాలు క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. కొనుగోలుదారులు కూడా ఈ కారును ఆసక్తిగా, ఆనందంగా కొనుగోలు చేస్తున్నారని తాజా గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. నవంబర్ నెల గ్లాంజాకు మరింత ప్రత్యేకంగా మారింది. ఈ నెలలో టయోటా గ్లాంజా భారీ సంఖ్యలో అమ్ముడైంది. మొత్తం 5,032 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. ఇదే కారు గత ఏడాది, అంటే 2024లో ఇదే కాలంలో కేవలం 3,806 యూనిట్ల అమ్మకాలకే పరిమితమైంది.

కారు లగ్జరీనే..కానీ ఖర్చు చూస్తే గుండె గుభేల్

ఒకప్పుడు మధ్య తరగతి ప్రజల కారు.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో రారాజుగా వెలిగిన హ్యుందాయ్ i20 (Hyundai i20) ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. అదిరిపోయే లుక్స్, లగ్జరీ ఫీచర్లతో మారుతి సుజుకి బాలెనోకు సైతం గట్టి పోటీనిచ్చిన ఈ కారు, ఇప్పుడు అమ్మకాల్లో వెనుకబడిపోతోంది.

నవంబర్ 2025లో సెడాన్ మార్కెట్‌కు కింగ్‌గా మారుతి డిజైర్!

నవంబర్ 2025లో భారత ఆటోమొబైల్ మార్కెట్ మొత్తంగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పుంజుకున్నట్టు గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. ముఖ్యంగా నవంబర్ 2024తో పోలిస్తే నవంబర్ 2025లో కార్ల అమ్మకాలు కొంత పెరిగాయి. ఈ సానుకూల ధోరణి ప్రభావం తక్కువ ఎత్తు, తక్కువ బాడీ కలిగిన సెడాన్ కార్ల విభాగంలో మరింత స్పష్టంగా కనిపించింది. ఒకప్పుడు డిమాండ్ తగ్గుతోందని భావించిన ఈ సెగ్మెంట్, తాజా గణాంకాలతో మళ్లీ బలంగా నిలబడుతున్నట్టు తెలుస్తోంది. గత నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 35,039 సెడాన్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెల అయిన నవంబర్ 2024లో నమోదైన 24,154 యూనిట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. శాతం పరంగా చూస్తే, సెడాన్ కార్ల అమ్మకాలు ఏకంగా 45.06 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

టాటా సఫారీ పెట్రోల్ వెర్షన్ రివ్యూ

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లో టాటా సఫారి(Tata Safari)కి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. తాజాగా సఫారి తన చరిత్రలో ఒక ముఖ్యమైన అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. అదే కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్ (Turbo Petrol Engine). ఈ కొత్త ఇంజిన్‌తో వచ్చిన మోడల్‌లో ముఖ్యంగా డార్క్ ఎడిషన్ (Dark Edition) దాని ప్రత్యేకమైన ఆల్-బ్లాక్ డిజైన్‌తో అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అద్భుతమైన పెర్ఫార్మెన్స్, స్పెషల్ లుక్‌తో వచ్చిన టాటా సఫారీ రివ్యూ చూద్దాం.
Advertisement

టాటా హారియర్ 1.5L టర్బో పెట్రోల్ రివ్యూ

Explore the Tata Harrier 1.5L turbo petrol: performance, features, and driving experience. Is it a strong contender in the SUV market? | టాటా హారియర్ 1.5L టర్బో పెట్రోల్‌ను అన్వేషించండి: పనితీరు, ఫీచర్లు మరియు డ్రైవింగ్ అనుభవం. ఇది SUV మార్కెట్‌లో బలమైన పోటీదారుగా నిలుస్తుందా?