సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా?

సెకండ్ హ్యాండ్ కారు కొనాలని ఆలోచిస్తున్న చాలామంది మొదటగా ఎంచుకునేది మారుతి సుజుకి ట్రూ వాల్యూనే. తొలిసారిగా వాహనం కొనుగోలు చేసే వారికి కలిగే అన్ని సందేహాలను, ఇబ్బందులను ట్రూ వాల్యూ బృందం నివృత్తి చేస్తుంది. కస్టమర్ల విశ్వాసం, పారదర్శకత, వృత్తిపరమైన సేవలతో ట్రూ వాల్యూ 2001 నుండి ఇప్పటివరకు 60 లక్షల కార్లను విక్రయించి ఒక కొత్త మైలురాయిని చేరుకుంది.

వేల కార్లు ఒకే చోట.. మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్ వీడియో వైరల్!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి (Maruti Suzuki) అనే పేరు వినగానే, ప్రజలలో విశ్వాసం, అందుబాటు ధర, పనితీరు గుర్తుకు వస్తాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారుగా మారుతి సుజుకి తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. పేద, మధ్యతరగతి ప్రజల కోసం సరసమైన ధరలో నాణ్యమైన కార్లను అందించడం ఈ కంపెనీ ప్రధాన బలం. ప్రతి సంవత్సరం లక్షలాది వాహనాలను తయారు చేసే సామర్థ్యం కలిగిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా అనేక ప్లాంట్లు ఉన్నాయి. అందులో గుజరాత్ రాష్ట్రంలోని హన్సల్‌పూర్ ప్లాంట్ ప్రత్యేక ప్రాధాన్యం వహిస్తుంది. సంవత్సరానికి 7,50,000 కంటే ఎక్కువ కార్లను ఉత్పత్తి చేసే శక్తివంతమైన తయారీ యూనిట్‌గా ఇది ప్రసిద్ధి చెందింది.

జూలైలో టీవీఎస్ జూపిటర్ దుమ్మురేపింది.. అమ్మకాల్లో 67% వృద్ధి!

టీవీఎస్ జూపిటర్ (Tvs Jupiter) భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన స్కూటర్లలో ఒకటి అని చెప్పుకోవచ్చు. తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్‌ కలిగిన ఈ స్కూటర్ పేద, మధ్యతరగతి ప్రజలకే కాకుండా, నిత్యవసరాలకు వాహనం అవసరమయ్యే ప్రతి ఒక్కరికీ ఒక మంచి ఎంపికగా మారింది. దీని డిజైన్, కంఫర్ట్, పనితీరు వంటి అంశాలు ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన విక్రయ గణాంకాలు చూస్తే టీవీఎస్ జూపిటర్ ప్రాచుర్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 2025 జూలై నెలలో మాత్రమే ఈ స్కూటర్ 1,24,876 యూనిట్లు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే నెలలో, అంటే 2024 జూలైలో కేవలం 74,663 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

రూ. 4 కోట్లు పెట్టి కొన్న లగ్జరీ కారు కొన్న సంజయ్ దత్

బాలీవుడ్ స్టార్ సంజు బాబా అంటే సంజయ్ దత్, ఒక కొత్త ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. ఆ కారు పేరు మెర్సిడెస్-మేబాచ్ GLS 600. ఈ కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఈ ఎస్‌యూవీని డ్యూయల్-టోన్ రంగుల స్కీమ్‌లో కొనుగోలు చేశారు. మెర్సిడెస్-బెంజ్ ఇండియా లైనప్‌లో ఇది అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీ.
Advertisement

జెలియో నుంచి అదిరిపోయే కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ జెలియో ఇ మొబిలిటీ, త్వరలో భారత మార్కెట్‌లోకి రెండు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. 2026 రెండో త్రైమాసికం నాటికి ఈ స్కూటర్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణించే వారు, విద్యార్థులు, ఉద్యోగులు, పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్న వారి అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త మోడళ్లను తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లు అడ్వాన్సుడ్ టెక్నాలజీ, నాణ్యమైన నిర్మాణం, మెరుగైన పనితీరును కలిగి ఉంటాయని జెలియో చెబుతోంది.

యాన్యువల్ టోల్ పాస్ వల్ల ప్రభుత్వానికి లాభమా ? నష్టమా ?

జాతీయ రహదారులపై వాహనదారులకు భారీ ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వార్షిక టోల్ పాస్ విధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ. 3000 చెల్లించి సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా టోల్ ఫీజుల నుంచి మినహాయింపు పొందవచ్చన్న ఈ పథకం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.

భారత్‌లోకి మారుతి ఈ-విటారా రావడానికి ఆలస్యం ఎందుకు? అసలు కారణం ఇదే!

గుజరాత్‌లోని మారుతి సుజుకి ప్లాంట్‌లో ఆగస్ట్ 26న జరిగిన ఒక విశిష్టమైన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సాక్ష్యమయ్యారు. మారుతి సుజుకి తన తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు, ఈ-విటారాకు ఉత్పత్తి ప్రారంభం ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్న ఈ కారు పూర్తిగా భారతదేశంలో తయారవుతుండటం ప్రత్యేకత. అయితే, ఈ కారు మొదట మన దేశ రోడ్లపైకి రాకముందే ప్రపంచాన్ని చుట్టొస్తుంది. జపాన్‌తో పాటు యూరప్‌లోని యునైటెడ్ కింగ్‌డమ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, హంగేరీ, ఇటలీ, స్వీడన్, ఆస్ట్రియా వంటి దాదాపు 100 దేశాలకు ఈ భారతీయ ఈవీ ఎగుమతవనుంది. పిపావావ్‌ పోర్టు నుంచి తొలి విడత ఎగుమతులు బయలుదేరి యూరప్‌ వీధుల్లో సుజుకి కొత్త యుగాన్ని ప్రారంభించనుంది.

జూలై 2025లో ఇండియాలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ బైకులు

భారతీయ టూవీలర్ మార్కెట్లో ఎప్పటికప్పుడు అధిక డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మైలేజ్ బాగుండే, పనితీరు మెరుగ్గా ఉండే మోడల్స్‌ను వినియోగదారులు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటారు. ఈ కోవలోనే హీరో కంపెనీ నుండి వచ్చిన స్ప్లెండర్ (Splendor) బైక్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. సంవత్సరాల తరబడి భారతీయ రోడ్లపై దూసుకుపోతూ, తన పనితీరును నిరూపించుకున్న ఈ మోడల్, ఇప్పటికీ మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. ఇటీవల ఆటోమొబైల్ తయారీదారులు విడుదల చేసిన జూలై నెల అమ్మకాల గణాంకాలు దీనికి నిదర్శనం. హీరో స్ప్లెండర్ మరోసారి టాప్ 10 బైక్‌ల అమ్మకాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఒక్క జూలై నెలలోనే మొత్తం 2,46,715 యూనిట్లు అమ్ముడవడం ఈ బైక్ స్థిరమైన డిమాండ్‌కు నిదర్శనం.
Advertisement

గంటకు 472 కిమీ BYD ఎలక్ట్రిక్ కారు వరల్డ్ రికార్డ్

ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ సెగ్మెంట్లో కంపెనీలు నిరంతరం కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన బీవైడీ (BYD) సంస్థ ఈ సెగ్మెంట్లో అనేక మైలురాళ్లను అధిగమిస్తోంది. తాజాగా, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు టెక్నాలజీని తాము తయారు చేశామని బీవైడీ ప్రకటించింది.

ఈవీ మార్కెట్‌లో భారత్ ప్లాన్..2030 నాటికి ప్రపంచంలో 4వ స్థానం!

భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో స్పీడుగా దూసుకుపోతోంది. ఈ రంగంలో దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద తయారీదారుగా ఎదగబోతోంది. ఒక నివేదిక ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో భారతదేశం జపాన్, దక్షిణ కొరియాలను కూడా వెనక్కి నెట్టివేయనుంది. తాజాగా, మారుతి సుజుకి తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ విటారాను సిద్ధం చేసింది. ఈ కారుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల గుజరాత్‌లోని మారుతి ప్లాంట్‌లో పచ్చజెండా ఊపారు.

మరో షాకింగ్ ఎంట్రీ.. ఇండియాకి రాబోతున్న BYD Atto 2 ఎలక్ట్రిక్ SUV!

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD (Build Your Dreams) ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తూ 1.3 కోట్లకుపైగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను ఉత్పత్తి చేసిన మొట్టమొదటి ఆటోమేకర్‌గా గుర్తింపు పొందింది. ఇది కేవలం చైనీస్ ఆటోమొబైల్ రంగానికే కాదు, మొత్తం గ్లోబల్ EV ఇండస్ట్రీకి గర్వకారణం. ఇటీవలే BYD తన కొత్త ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV మోడల్ అట్టో 2 (Atto 2)ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. అత్యాధునిక డిజైన్, ఆధునిక సాంకేతికత, ప్రీమియం ఫీచర్ల కలయికగా ఈ కారు నిలిచింది. ముఖ్యంగా, BYD ఇన్నోవేటివ్ E-ప్లాట్‌ఫామ్ 3.0 ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడటం దీని ప్రత్యేకత. ఈ ఆర్కిటెక్చర్ వలన కారు తక్కువ బరువుతో ఉండి, మరింత శక్తివంతమైన పనితీరును అందిస్తుంది.

ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రిక్ కార్లు ఉన్న టాప్ 10 దేశాలివే !

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఐఈఏ గ్లోబల్ ఈవీ అవుట్‌లుక్ (IEA Global EV Outlook) నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రిక్ కార్లు కలిగిన టాప్ 10 దేశాలు ఈవీల డిమాండ్‌ను వేగంగా పెంచుతున్నాయి. ఈ జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉంది. అక్కడ కోట్లాది ఎలక్ట్రిక్ కార్లు నడుస్తున్నాయి. అమెరికా కూడా ట్యాక్స్ క్రెడిట్లు, మౌలిక సదుపాయాల ప్లాన్‌ల సహాయంతో ఈవీలను వేగంగా స్వీకరిస్తోంది. ఈ రోజు మనం ఏ దేశంలో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయో తెలుసుకుందాం. టాప్ 10 జాబితాను ఈ వార్తలో తెలుసుకుందాం.
Advertisement

కొత్త కారు కొనాలనుకుంటున్నారా ?

వినాయక చవితితో దేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. పండుగ సీజన్ ఆటోమొబైల్ పరిశ్రమకు ఎప్పుడూ ప్రత్యేకమే. వినాయక చవితి నుంచి దీపావళి వరకు ఈ పండుగల కాలం కొనసాగుతుంది. ఈ రోజుల్లో కొత్త వాహనాలు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ సీజన్ ప్రారంభం కావడంతోనే, అనేక కార్ల కంపెనీలు తమ డిస్కౌంట్లను ప్రకటించాయి.

ఈసారి సేల్స్ బ్లాక్‌బస్టర్‌గా ఉంటాయంటున్న రేటింగ్ ఏజెన్సీ

భారత టూవీలర్ మార్కెట్ రాబోయే నెలల్లో మరింత వృద్ధి దిశగా పయనించబోతోందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ రేటింగ్ సంస్థ ICRA తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY26) టూవీలర్ వాహనాల వార్షిక అమ్మకాల వృద్ధి సుమారు ఆరు నుంచి తొమ్మిది శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది. ఈ అంచనాకు పలు కారకాలు తోడ్పడుతున్నాయి. ముఖ్యంగా, మార్కెట్లో స్థిరమైన భర్తీ డిమాండ్ కొనసాగుతుండటం ఒక ప్రధాన కారణం. పాత వాహనాలను కొత్త మోడళ్లతో భర్తీ చేయాలనే వినియోగదారుల ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు పట్టణ ప్రాంతాల్లో వినియోగం తిరిగి పుంజుకోవడం కూడా అమ్మకాలపై సానుకూల ప్రభావం చూపుతోంది. గత కొన్నేళ్లుగా కొంత మందగించిన రూరల్ డిమాండ్, ఈ సంవత్సరం సాధారణ రుతుపవనాల కారణంగా పునరుద్ధరించబడుతోంది.

మార్కెట్లోకి అదిరిపోయే బైక్ వచ్చేసింది భయ్యా.. మరి దీన్ని కొనవచ్చా, లేదా?

KTM Duke 160 launched in India at ₹1,79,000. Features include a 160cc engine, sporty design, and digital LCD cluster. | KTM డ్యూక్ 160 భారతదేశంలో ₹1,79,000 వద్ద విడుదల చేయబడింది. 160cc ఇంజిన్, స్పోర్టీ డిజైన్ మరియు డిజిటల్ LCD క్లస్టర్ దీని ప్రత్యేకతలు.

మెర్సిడెస్ బెంజ్ CLAలో నోరా ఫతేహి ఎంట్రీ..!

నోరా ఫతేహి (Nora Fatehi).. అందం, డ్యాన్స్, నటన, ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఎవరికి తెలియదు? హిందీ సినిమాలకే పరిమితం కాకుండా తెలుగు, మలయాళం, తమిళం వంటి అనేక భాషా చిత్రాలలో తన నటనతో మెప్పించిన నోరా, ఇప్పుడు పాన్-ఇండియా స్టార్‌గా మారింది. కెనడాలో జన్మించిన ఈ అందాల తార ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో బిజీగా గడుపుతోంది. తన కెరీర్‌లోని ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె వ్యక్తిగత జీవితం కూడా తరచూ హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, లగ్జరీ బ్రాండ్స్ అంటే నోరాకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లగ్జరీ కార్లపై ఆమెకున్న క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది.
Advertisement

యూత్‎ను ఆకట్టుకునేందుకు టీవీఎస్ కొత్త వ్యూహం

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ టీవీఎస్ రైడర్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. హాలీవుడ్‌లోని అత్యంత ప్రసిద్ధ మార్వెల్ పాత్రలైన డెడ్‌పూల్, వోల్వరైన్‌ల నుండి ప్రేరణ పొందిన ఈ తాజా ఎడిషన్, టీవీఎస్ రైడర్‌కు బోల్డ్ డిజైన్ ఇచ్చి, సూపర్ స్క్వాడ్ సిరీసును నెక్ట్స్ లెవల్‎కు తీసుకువెళ్తుందని టీవీఎస్ మోటార్ తెలిపింది. కొత్త ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.

కారు కొనే ముందు ఈ ఫీచర్ అడిగి కొనండి

నేటి ఆధునిక కార్లలో విస్తృతంగా లభిస్తున్న అత్యంత అడ్వాన్సుడ్ ఫీచర్లలో ఒకటి కనెక్టెడ్ కార్ టెక్నాలజీ. కారు ఎక్కడ ఉందో నిజ సమయంలో తెలుసుకోవడానికి, కారులో తలెత్తే సమస్యలను ఎక్కడి నుంచైనా తెలుసుకోవడానికి కనెక్టెడ్ కార్ ఫీచర్లు చాలా సహాయపడతాయి.

రూ.90 వేలు, ఆఫీసుకు వెళ్లే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్!

ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైకుగా బజాజ్ ఫ్రీడమ్ 125 (bajaj Freedom 125) ఆటోమొబైల్ రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును సాధించింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల మధ్య, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే బైకుల కోసం చూస్తున్న వారికి ఇది నిజంగా పరిష్కారంగా నిలుస్తోంది. పర్యావరణానికి మేలు చేస్తూనే, ఖర్చులను తగ్గించే ఈ బైక్, కొత్తగా టూవీలర్ కావాలనుకునే వారికి ఎంతో డబ్బును ఆదా చేయగలదు. బజాజ్ ఫ్రీడమ్ 125 డిజైన్ విషయానికి వస్తే, ఇది లేటెస్ట్ లుక్‌తో పాటు ప్రాక్టికల్ యూజ్‌ఫుల్ ఫీచర్లతో వస్తోంది. బలమైన బాడీ స్ట్రక్చర్, కంఫర్టబుల్ సీటింగ్, డైలీ కమ్యూట్‌కి అనువైన రైడింగ్ పొజిషన్ వంటి ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి. కేవలం స్టైలిష్ లుక్ మాత్రమే కాకుండా, ఉపయోగకరమైన అంశాలు కూడా ఇందులో ప్రధాన ఆకర్షగణ.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌కు ఎందుకంత డిమాండ్?

భారతదేశంలో మిడిల్ క్లాసు ఫ్యామిలీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏ కంపెనీలు అయినా ఈ ఫ్యామిలీలను బేస్ చేసుకుని వస్తువులను రిలీజ్ చేస్తుంటాయి. ఆటోమొబైల్ మార్కెట్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. భారతీయ కస్టమర్ల మధ్య కమ్యూటర్ బైక్‌లకు మంచి ఆదరణ ఉంది.
Advertisement

రూ.11.93 లక్షలకే MPV.. కానీ కొనుగోలుదారులు ఎందుకు దూరంగా ఉన్నారు?

మారుతి సుజుకి (Maruti Suzuki) దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అగ్రగామిగా నిలిచిన కంపెనీ. ఇలాంటి సంస్థ నుండి వచ్చిన XL6 అనే MPV వినియోగదారులలో విశేషమైన ఆదరణ పొందిన మోడల్‌గా నిలిచింది. ఆకర్షణీయమైన డిజైన్, ఫ్యామిలీ అవసరాలకు తగ్గ ఫీచర్లు, ప్రీమియం లుక్‌.. ఇవన్నీ కలిపి ఈ కారును ప్రత్యేకంగా నిలబెట్టాయి. నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతున్న ఈ మోడల్ తన లగ్జరీ టచ్‌తో కూడా వినియోగదారులను ఆకట్టుకుంటూ వచ్చింది. అయితే, గత కొంతకాలంగా ఈ కారుకు మార్కెట్‌లో డిమాండ్ తగ్గుముఖం పట్టడం గమనార్హం. ముఖ్యంగా 2025 జూలైలో అమ్మకాల గణాంకాలు ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నాయి.

ఈవీలకు భారీ ఊరట.. ఇకపై టోల్ ఫీజు కట్టనవసరం లేదు!

సుదూర ప్రయాణాలు చేసే చాలామందికి టోల్ ప్లాజాలు తలనొప్పిగా మారాయి. అయితే ఇప్పుడు వార్షిక పాస్ తీసుకుంటే భారతదేశంలో ఎక్కడికైనా ధైర్యంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రయాణించవచ్చు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు టోల్ లేకుండా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది.

మారుతి తొలి ఎలక్ట్రిక్ SUV ఇ-విటారా లాంచ్.

దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ క్షణం ఇప్పుడు సాకారమైంది. ఎలక్ట్రిక్ విభాగంలోకి ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్న ఆటోమొబైల్ మార్కెట్‌కు, వినియోగదారులకు ఇది ఒక మైలురాయిగా మారింది. ఆగస్టు 26, మంగళవారం గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో జరిగిన ఒక విశిష్టమైన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా జెండా ఊపి మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ SUV ఇ-విటారా (e-Vitara)ను ప్రారంభించారు. ఇది కేవలం ఒక కొత్త వాహన ఉత్పత్తి ప్రారంభం మాత్రమే కాదు, భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా వేస్తున్న ఒక బలమైన అడుగని చెప్పాలి.

యమహా బైకులంటే జనాలకు మోజు తీరిందా ?

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా మోటార్స్ తన R3, MT-03 బైకుల అమ్మకాల్లో భారీ క్షీణతను చూసింది. ఈ రెండు బైక్‌లను కలిపి గత జూలై నెలలో కేవలం 8 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఒక నెల మొత్తం శ్రమించినా ఎందుకు 8 బైక్‌లు మాత్రమే అమ్ముడయ్యాయి? అసలు ఈ బైక్‌లలో ఏం లోపాలున్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Advertisement

రూ.6.29 లక్షల స్టార్ట్ ప్రైస్‌తో ఆకట్టుకుంటున్న 2025 రెనాల్ట్ కైగర్

ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనాల్ట్ గ్రూప్‌ అనుబంధ సంస్థగా ఉన్న రెనాల్ట్ ఇండియా, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో నిన్న కొత్తగా అప్‌డేట్ చేసిన రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ 2025 (Renault Kiger Facelift 2025)ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది కొత్త తరహా డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. సేఫ్టీ పరంగా కూడా బలమైన SUVగా దీన్ని తీర్చిదిద్దారు. ధర పరంగా కూడా కిగర్ ఫేస్‌లిఫ్ట్ అందుబాటులో ఉండటం, ప్రస్తుత పోటీ మార్కెట్లో దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మొత్తంగా, స్టైల్, టెక్నాలజీ, భద్రత, పనితీరుల సమ్మేళనం కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపికగా నిలవనుంది. తక్కువ ధరలో కొత్త కారును కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉన్నవారు దీనిని హాయిగా ఎంచుకోవచ్చు. వినియోగదారుల కోసం ఈ కారు గురించిన పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.