రూ.6.29 లక్షల స్టార్ట్ ప్రైస్‌తో ఆకట్టుకుంటున్న 2025 రెనాల్ట్ కైగర్

ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనాల్ట్ గ్రూప్‌ అనుబంధ సంస్థగా ఉన్న రెనాల్ట్ ఇండియా, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో నిన్న కొత్తగా అప్‌డేట్ చేసిన రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ 2025 (Renault Kiger Facelift 2025)ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది కొత్త తరహా డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. సేఫ్టీ పరంగా కూడా బలమైన SUVగా దీన్ని తీర్చిదిద్దారు. ధర పరంగా కూడా కిగర్ ఫేస్‌లిఫ్ట్ అందుబాటులో ఉండటం, ప్రస్తుత పోటీ మార్కెట్లో దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మొత్తంగా, స్టైల్, టెక్నాలజీ, భద్రత, పనితీరుల సమ్మేళనం కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపికగా నిలవనుంది. తక్కువ ధరలో కొత్త కారును కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉన్నవారు దీనిని హాయిగా ఎంచుకోవచ్చు. వినియోగదారుల కోసం ఈ కారు గురించిన పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

పాత వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఆస్తులు అమ్మాల్సిందే

మీరు 20 ఏళ్లకు పైబడిన పాత కారు లేదా బైక్‌ను ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై ఆ వాహనాలను రోడ్లపై నడపాలంటే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. పాత వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం, భద్రతను పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్లకు పైబడిన వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులను దాదాపు రెట్టింపు చేసింది.

ఇండియన్ స్కౌట్ సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?

అమెరికాలో తొలిసారిగా మోటార్‌సైకిల్ తయారీని ప్రారంభించిన బ్రాండ్‌ ఇండియన్ మోటార్‌సైకిల్(Indian Motorcycle). ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లతో సమానంగా పోటీ పడుతూ, తన ప్రత్యేకమైన వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఇదే బ్రాండ్ ఇప్పుడు భారతీయ మార్కెట్‌లో కొత్త సంచలనం సృష్టిస్తోంది. 2025కి సంబంధించిన ఇండియన్ స్కౌట్ సిరీస్‌ను అధికారికంగా భారత్‌లో ఆవిష్కరించింది. ప్రీమియం అమెరికన్ ఇంజనీరింగ్ అనే పదాన్ని నిజంగా అనుభవింపజేసేలా, స్పష్టమైన డిజైన్‌ను ప్రతీ మోడల్‌లో ప్రతిబింబించేలా ఈ కొత్త లైనప్‌ను రూపొందించింది. మొత్తం 8 వేరియంట్లను కంపెనీ పరిచయం చేసింది. ధరల విషయానికి వస్తే, ఈ సిరీస్‌ను రూ.12.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభించింది. కానీ ఈ ధర కేవలం మొదటి మెట్టు మాత్రమే ఎందుకంటే కొత్త స్కౌట్ లైనప్ ఎక్కువ పెరిగింది.

ఓనం సంబరాల్లో MG మోటార్ క్రియేటివ్ ట్విస్ట్.. కార్లతో చేసిన రంగోలీ

కేరళలో ఓనం పండుగ అనగానే అక్కడి ప్రజలలో ఎంత ఉత్సాహం ఉంటుందో చెప్పనక్కర్లేదు. పువ్వుల అంకరణలు, సాంప్రదాయ వంటకాలు, నృత్యాలు, ఉత్సవాలు.. అన్నీ కలిసి ఆ రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. అలాంటి సమయంలో ఆటోమొబైల్ మార్కెట్ కూడా ఉత్సాహంతో కళకళలాడుతుంది. పండుగ సీజన్‌లో కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి వచ్చే వినియోగదారులతో అక్కడి కార్ షోరూమ్‌లు ఎప్పుడూ రద్దీగా కనిపిస్తాయి. ఈసారి ఆ పండుగ ఉత్సవాలను మరో స్థాయికి తీసుకెళ్లింది JSW MG మోటార్. ఓనం సందర్భంగా పూలతో చేసే పువ్వుల రంగోలికి బదులుగా, MG మోటార్ కార్లతో ఓ విశేషమైన రంగోలి ఆకారాన్ని రూపొందించింది. కేరళలో అతిపెద్ద పండుగను తమ వినియోగదారులకు మరింత గుర్తుండిపోయేలా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక కాన్సెప్ట్‌ను తీసుకువచ్చింది.
Advertisement

మెర్సిడెస్‎లో మెరిసిన కృతి సనన్

సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ, సినిమాలోని పాటల్లో అదిరిపోయే స్టెప్పులతో ప్రజలను ఆకట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి టాలెంట్ ఉన్న బ్యూటీ కృతి సనన్. మిమి సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న కృతి ఇప్పటికే అనేక హిట్ సినిమాల్లో నటించింది. ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ అయినా, కృతి స్టార్‌డమ్‌కి మాత్రం ఏమాత్రం లోటు రాలేదు. ఆమెను గుర్తుపట్టడానికి పరం పరం పరమ సుందరి పాట ఒక్కటి చాలు.

క్రేజీ లుక్స్‌తో వచ్చేస్తున్న నయా కియా సెల్టోస్

భారతదేశంలో విక్రయించబడుతున్న కియా సంస్థకు చెందిన సెల్టోస్ (Seltos) కారు ముఖ్యమైన న్యూ జనరేషన్ అప్‌గ్రేడ్‌ను పొందనుంది. దీని విడుదల తేదీకి ముందు, కొత్త సెల్టోస్ కారును ఫ్యాక్టరీ సమీపంలోని రోడ్లపై నడిపి, పరీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన స్పై ఫోటోలు రెడిట్ వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి.

సేల్స్‌లో దూసుకెళ్తున్న హంటర్ 350.. ఒక్క జూలైలోనే రికార్డు స్థాయి అమ్మకాలు!

బైకుల ప్రపంచంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అనే పేరు వింటే ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. దాని సౌండ్, లుక్, రోడ్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బైకులు చాలా మంది రైడర్ల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ లైనప్‌లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నది హంటర్ 350 (Hunter 350). హంటర్ 350ని రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత సరసమైన ధరలో అందించడం వల్ల ఇది మధ్యతరగతి యువతకు అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అనుభవాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక అయింది. దాంతో హంటర్ 350 అమ్మకాలు గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి.

త్వరలో లక్షలోపు ధరకే అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుంది. టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అగ్రగామిగా నిలిచింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించి, ఆకట్టుకునే పనితీరు, ఆధునిక ఫీచర్లు, విశ్వసనీయతతో వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది.
Advertisement

మోడీ రాకతో హాట్ టాపిక్ అవుతున్న మారుతి కారు

టాటా, మహీంద్రా వంటి సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో గట్టి పట్టు సాధించాయి. టాటా తన నెక్సాన్, టిగోర్ వంటి మోడళ్లతో ముందంజలో ఉంటే, మహీంద్రా XUV400, BE సిరీస్‌లతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki) మాత్రం ఇప్పటివరకు ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగుపెట్టలేదు. కానీ ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగదని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఎదురుచూపులు ముగియబోతున్నాయి. మారుతి తన తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారా (e-Vitara)ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతోంది. SUV సెగ్మెంట్‌లోకి ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావడం ద్వారా మారుతి తన ఎలక్ట్రిక్ ప్రయాణానికి ఘనమైన ఆరంభం ఇవ్వబోతోంది. ఈ ప్రారంభం కోసం కంపెనీ భారీ ఏర్పాట్లు చేసింది.

వర్షాకాలంలో కారు, బైక్‌ను బయట పార్క్ చేస్తే ఈ సమస్యలు తప్పవు

వర్షం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చినప్పటికీ అది అనేక సమస్యలను కూడా తెస్తుంది. కొన్ని చోట్ల వరదలు వస్తాయి. మరికొన్ని చోట్ల నీళ్లు నిలిచిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవితం కొద్దిగా కష్టంగా మారుతుంది. వర్షంలో బయట తమ వాహనాలను పార్క్ చేసే వారికి కూడా ఇది ఒక పెద్ద సమస్య. వర్షాకాలంలో నిరంతరంగా బయట నిలిచి ఉన్న బైక్ అయినా, కారు అయినా సమస్యలు రావడం మొదలవుతాయి.

డ్రైవర్, ప్రయాణికుల భద్రతలో సైబర్‌ట్రక్ సెన్సేషన్

ప్రముఖ వ్యాపారవేత్త ధనికవంతుడు అయినటువంటి ఎలాన్‌ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా సైబర్‌ట్రక్ (Tesla cybertruck) తన భద్రతా ప్రతిభను మరోసారి రుజువు చేసుకుంది. తాజాగా అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ఈ ఎలక్ట్రిక్ ట్రక్‌కి డ్రైవర్, ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక క్రాష్ టెస్ట్‌లలో ఐదు స్టార్ రేటింగ్‌ను ప్రకటించింది. అంతకుముందు ఈ ఏడాది ప్రారంభంలో మొత్తం భద్రతా పనితీరులో ఐదు స్టార్ రేటింగ్ సాధించిన ఈ వాహనం, ఇప్పుడు వ్యక్తిగత విభాగాల్లోనూ టాప్ రేటింగ్ దక్కించుకుంది. ఫిబ్రవరిలో నిర్వహించిన కఠినమైన పరీక్షల్లో సైబర్‌ట్రక్ అధికారులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ముందుభాగం ఢీకొన్న సందర్భంలో డ్రైవర్‌కు ఐదు స్టార్‌లు రావడం, ముందు సీటు ప్రయాణికుడికి నాలుగు స్టార్‌లు రావడం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.

ఫ్యూచర్ అంతా ఈ బైక్స్ దే మామ.. తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లు

భారతీయ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో ఫీచర్ల పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఖరీదైన టూరింగ్ బైక్‌లలో మాత్రమే కనిపించే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఇప్పుడు మధ్యస్థ ధర బైక్‌లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ రైడర్‌లకు సుదూర ప్రయాణాల్లో అలసటను తగ్గించి, రైడింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. మీరు కూడా హైవేపై ప్రయాణించడానికి కొత్త బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే  ఈ ఫీచర్ ఉన్న కొన్ని బైక్‌ల వివరాలు  తెలుసుకుందాం.
Advertisement

భారత్‌లో EVల భవిష్యత్తుపై GST పన్ను తగ్గింపు ప్రభావం

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఆయన తన ప్రసంగంలో, దీపావళి నాడు భారత ప్రజలకు ఒక పెద్ద బహుమతి అందిస్తామని సూచనప్రాయంగా చెప్పడం, ఆ బహుమతి GST రూపంలో ఉండబోతుందని అర్థమవుతోంది. దీని వలన దేశవ్యాప్తంగా పన్ను విధానాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వాహనాల రంగంలో ఈ మార్పులు ప్రభావం చూపబోతున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో వాహనాలపై 28 శాతం వరకు GST పన్ను విధిస్తున్నారు. దీని వలన వాహనాల ధరలు మరింతగా పెరిగి వినియోగదారులపై భారమవుతున్నాయి.

హీరో న్యూ గ్లామర్ X 125 వచ్చేసింది.. ధర, ఇంజిన్, కొత్త ఫీచర్లన్నీ ఇక్కడే!

దేశంలోని అతిపెద్ద టూవీలర్ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ఇటీవల తన అత్యంత ప్రజాదరణ పొందిన 125సిసి మోటార్‌సైకిల్ గ్లామర్‌కు కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. దీని వల్ల 125సిసి బైక్ సెగ్మెంట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. గ్లామర్ X 125 పేరుతో విడుదలైన ఈ కొత్త మోడల్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.89,999 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.99,999గా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. ఈ ధరల శ్రేణిలో అందించే ఫీచర్లు, టెక్నాలజీలు దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. హీరో గ్లామర్ చరిత్రను చూస్తే, ఇది మొదటిసారి 2005లో భారత మార్కెట్లో ప్రవేశించింది. అప్పటి నుంచి నిరంతరం అప్‌డేట్స్‌తో, మెరుగైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వినియోగదారుల మన్ననలు పొందింది.

రూ.6.29 లక్షల నుంచి ప్రారంభమైన కొత్త రెనాల్ట్ కైగర్ 2025 ఫేస్‌లిఫ్ట్

ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనాల్ట్ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ రెనాల్ట్ ఇండియా (Renault India), భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఈరోజు కొత్తగా అప్‌డేట్ చేసిన రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ (Renault Kiger Facelift 2025)ను అధికారికంగా ఆవిష్కరించింది. కొత్త తరహా డిజైన్‌, అధునాతన సాంకేతికత, మెరుగైన భద్రతా ప్రమాణాలతో రూపొందించబడిన ఈ కారు, వినియోగదారులకు మరింత ప్రత్యేకమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించనుంది. ధరల విషయానికి వస్తే, 2025 రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధరను రూ.6.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ ధరతో ఇది భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన SUVలలో ఒకటిగా నిలుస్తోంది. మరింత ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.11.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది.

పదేళ్ల పాటు ఎలాంటి టెన్షన్ లేని ఇండియా బెస్ట్ స్కూటర్!

రోజూ ఆఫీసుకెళ్లే ఉద్యోగి కావొచ్చు, కుటుంబ అవసరాల కోసం స్కూటర్‌ చూడే గృహిణి కావొచ్చు, హోండా యాక్టివా (Honda Activa) అందరికీ సరిపోయేలా రూపొందించబడింది. 2001లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ స్కూటర్, అప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది మంది నమ్మకాన్ని గెలుచుకుంటూ, నంబర్ వన్ స్థానం దక్కించుకుంది. భారత స్కూటర్ మార్కెట్‌లో యాక్టివా పేరు చెబితే, ప్రతి ఇంటి ముందుకొచ్చే వాహనం ఇదే. అందరికీ సులభంగా నడపగలిగే డిజైన్, బలమైన, నమ్మకమైన ఇంజిన్, తక్కువ నిర్వహణ ఖర్చులు.. ఇవన్నీ కలిపి దీన్ని ప్రత్యేకం చేశాయి. పల్లెలోనూ, పట్టణంలోనూ సమానంగా కనిపించే ఈ స్కూటర్‌ సాధారణ ప్రయాణ సాధనాన్ని మించి, జీవనశైలిలో భాగమైంది. ప్రారంభంలో సాధారణ మోడల్‌గా వచ్చిన యాక్టివా, ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కాలానుగుణ మార్పులు పొందుతూ ముందుకు సాగింది.
Advertisement

135 సెకన్లలోనే సోల్డ్ అవుట్.. మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ EV సంచలనం!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న మహీంద్రా (Mahindra), ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో వినియోగదారుల మన్ననలు పొందుతోంది. తాజాగా, తమ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించేందుకు వినూత్నమైన ప్రయత్నం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో కలిసి, ప్రత్యేకమైన BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ EVని ఆవిష్కరించింది. డిజైన్‌లోనే కాకుండా, పనితీరులోనూ సరికొత్త అనుభవాన్ని అందించేలా ఈ ఎడిషన్‌ను రూపొందించారు. బ్యాట్‌మ్యాన్‌ డార్క్ నైట్ స్టైల్, స్పెషల్ గ్రాఫిక్స్, ప్రత్యేక ఇంటీరియర్ టచ్‌లు ఈ వాహనానికి మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. మొదట్లో ఈ ప్రత్యేక ఎడిషన్ EVని కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయాలని మహీంద్రా నిర్ణయించింది.

తల్లికి మొదటి గౌరవం.. కొత్త కారు కొన్న నోయెల్

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో నోయెల్ సీన్ (Noel Sean) ఒకరు. రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన ఈయన, తన గంభీరమైన, శక్తివంతమైన గొంతుతోనే అందరిని ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే వినూత్నమైన రాప్ స్టైల్, వినసొంపైన మాటతీరు, హాస్యభరితమైన ప్రెజెంటేషన్‌ అన్ని కలిసి అతడిని ఎంటర్‌టైన్‌‌మెంట్ రంగంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. చాలా ఏళ్ల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి గాయకుడిగా, నటుడిగా అనేక ప్రాజెక్టుల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. మంత్ర సినిమాలో పాడిన రాప్ సాంగ్‌తో ఆయన పేరు ఇంటింటా మార్మోగింది. అప్పటి నుంచి అనేక సినిమాల్లో రాప్ పాటలు పాడుతూ, తనకంటూ ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకున్నాడు. నటుడిగా కూడా కొన్ని గుర్తుండిపోయే పాత్రల్లో నటించి అభిమానులను అలరించాడు.

రూ.2.49 లక్షల్లో షాడో యాష్ కలర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450

రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) మళ్లీ తన అభిమానులను అలరించేలా కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. బైకుల ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్రాండ్, తన గెరిల్లా 450 (Guerrilla 450) లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ, ఇప్పుడు ఆకర్షణీయమైన షాడో యాష్ అనే కొత్త కలర్ వేరియంట్‌ను పరిచయం చేసింది. 450 సీసీ విభాగంలో గెరిల్లా 450 ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆఫ్-రోడ్ రైడింగ్‌కి సరిపోయే రగ్గడ్ లుక్, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ప్రత్యేకమైన క్లాసిక్ డిజైన్ టచ్‌ ఈ బైక్‌ను మిగతా పోటీదారుల కంటే ఒక మెట్టు ముందుకు నిలబెడతాయి.ఈ కొత్త షాడో యాష్ కలర్ వేరియంట్ బైక్‌కు మరో ప్రత్యేకతను తెస్తోంది.
Advertisement

కేవలం రూ.11,000కే ఈ కారును బుక్ చేసుకోవచ్చు

భారత మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి సిట్రోయెన్ కంపెనీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇటీవలే తమ సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ (Citroen Basalt X) కారు టీజర్‌ను విడుదల చేసింది. ఈ కారు బుకింగ్‌లను కూడా అధికారికంగా ప్రారంభించింది. కేవలం రూ.11,000 చెల్లించి ఈ సరికొత్త ఎస్‌యూవీ కూపే కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారు విశేషాలు, దాని డిజైన్, ఇంజిన్ వివరాలు, మార్కెట్‌లో దాని స్థానం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

ఒక కారు డిజైన్ చేయాలంటే ఇంత కష్టమా

ఒక కారు కొనడానికి వెళ్ళినప్పుడు మనం చూసే మొదటి విషయం దాని డిజైన్. ఆకర్షణీయంగా ఉన్న కారును చూడగానే మన మనసు దానిపైనే పడుతుంది. అందుకే కార్ల కంపెనీలు డిజైన్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తాయి. కానీ మనం చూసే ఆ అద్భుతమైన డిజైన్ వెనుక ఎంతో కష్టం, ఎంతో పరిశోధన ఉంటుంది.

కేవలం రూ.6లక్షలకే ఎస్యూవీ కారు.. ఒక చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్

మారుతున్న కాలానికి తగ్గట్టు కార్ల కంపెనీలు సరికొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. కానీ ధర మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చూస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ భారీగా పెరిగింది. ఈ సెగ్మెంట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తున్న కార్లలో రెనాల్ట్ కైగర్ (Renault Kiger) ఒకటి.

లక్షలోపే స్పోర్టీ లుక్, అదిరిపోయే రైడింగ్ ఎక్స్ పీరియన్స్

స్టైలిష్ బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు, మంచి లుక్‌తో వచ్చే బైక్ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన పాపులర్ ఎక్స్‌ట్రీమ్ 125R సిరీస్‌లో ఒక కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. అదే సింగిల్-సీట్ ఎడిషన్.
Advertisement

రూ.8 లక్షల లోపే డ్యాష్‌క్యామ్ ఉన్న ఎస్‌యూవీ

ఈ పండుగ సీజన్లో కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకోసం హ్యుందాయ్ (Hyundai) అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ. 7.98 లక్షల ప్రారంభ ధరతో, ఖరీదైన కార్లలో మాత్రమే ఉండే ఫీచర్లతో కొత్తగా ఎక్స్టర్ ప్రో ప్యాక్(Exter Pro-Pack) ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ కొత్త వేరియంట్‌లో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి, దాని ధర ఎంత, ఏ రంగుల్లో అందుబాటులో ఉంది అనే వివరాలు తెలుసుకుందాం.