జీఎస్టీ మార్పులు.. చిన్న కార్లు చౌక, లగ్జరీ కార్లు ఖరీదు

భారతదేశంలో వస్తు సేవల పన్ను (GST) వ్యవస్థను మరింత సరళీకృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం (GoM) జీఎస్టీ రేట్లను కొత్తగా నిర్ణయించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, సాధారణ, నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గే అవకాశం ఉంది. అయితే, దీనికి విరుద్ధంగా లగ్జరీ కార్లపై 40% జీఎస్టీ విధించాలని మంత్రి బృందం సిఫార్సు చేసింది. దీనితో లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

జూలైలో హోండా సిటీకి షాక్.. అమ్మకాలు కేవలం 646 యూనిట్లు!

భారతీయ కార్ల మార్కెట్‌లో ఒకప్పుడు సెడాన్‌లు రాజులు. కుటుంబ కార్లలోనూ, స్టైల్ కోరుకునే యువతలోనూ సెడాన్‌లకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఆ కాలంలో హోండా సిటీ వంటి కార్లు చాలమంది కలల కారు. ఆకట్టుకునే డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, విశ్వసనీయమైన పనితీరు.. ఇవన్నీ హోండా సిటీని ప్రత్యేకం చేశాయి. కానీ, SUVల రాకతో మార్కెట్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. SUVల బలమైన డిజైన్, హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్, ఆల్-రౌండ్ యూజ్ వంటి లక్షణాలు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించాయి. ఈ మార్పు ప్రభావం హోండా సిటీ వంటి ప్రాచుర్యం పొందిన సెడాన్‌లపై కూడా పడింది. తాజాగా వెలువడిన జూలై 2025 అమ్మకాల గణాంకాలు దీనిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గత నెలలో మొత్తం 4,050 కార్లను హోండా విక్రయించినప్పటికీ, అందులో హోండా సిటీ కేవలం 646 యూనిట్లతోనే పరిమితమైంది.

మారుతి గ్రాండ్ విటారాకు కొత్త రంగులు, ధర పాతదే

భారత మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యాన్ని చెరిపేయడానికి మారుతి సుజుకి ఎంతో శ్రమించి తయారు చేసిన మోడల్ గ్రాండ్ విటారా. టయోటాతో భాగస్వామ్యంలో రూపొందించిన ఈ కారు, మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి విజయవంతంగా దూసుకుపోతోంది. దీనికి ప్రధాన కారణం, అద్భుతమైన మైలేజ్ అని చెప్పవచ్చు.

జిమ్నీకి ఏమైంది? జూలైలో అమ్మకాలు కేవలం 362 యూనిట్లు మాత్రమే!

మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) ఒకప్పుడు ఆఫ్-రోడ్ ప్రియుల కలల SUVగా నిలిచింది. ఆకర్షణీయమైన డిజైన్, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, అనేక లేటెస్ట్ ఫీచర్లతో ఈ కారు మార్కెట్లోకి అడుగుపెట్టినప్పుడు మంచి డిమాండ్‌ను సొంతం చేసుకుంది. అయితే, గత కొన్ని నెలలుగా ఈ కారు అమ్మకాలలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజా గణాంకాలను పరిశీలిస్తే, జూలై నెలలో మారుతి సుజుకి జిమ్నీ కేవలం 362 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 2,429 యూనిట్ల అమ్మకాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. అంటే, ఒక్క సంవత్సరంలోనే అమ్మకాలు సుమారు 85.10 శాతం మేరకు పడిపోయాయి. ఇది ఈ మోడల్ కోసం ఆందోళన కలిగించే పరిస్థితి.
Advertisement

మహీంద్రా కొత్త కారుకు అదిరిపోయే రెస్పాన్స్

మహీంద్రా సంస్థ ఇటీవల విడుదల చేసిన BE 6 ఎలక్ట్రిక్ కారు బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌కు వినియోగదారుల నుంచి ఊహించని స్పందన లభించింది. ఈ కారు మార్కెట్‌లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే విపరీతమైన బుకింగ్స్‌ను పొందింది. మొదటగా 300 యూనిట్లు మాత్రమే తయారు చేయాలని నిర్ణయించుకున్న మహీంద్రా, పెరిగిన డిమాండ్ కారణంగా ఇప్పుడు ప్రొడక్షన్‌ను 999 యూనిట్లకు పెంచింది. బుకింగ్స్ భారీగా పెరగడంతో ప్రతి కస్టమర్‌కి ఈ కారు అందుబాటులో ఉండేలా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

చిన్న వ్యాపారాలకే కాదు, పెద్దలకూ వరం.. టీవీఎస్ కింగ్ కార్గో HD EV వచ్చేసింది!

టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో సరుకు రవాణాకు వినూత్న పరిష్కారాన్ని అందించడానికి కింగ్ కార్గో HD EV ని విడుదల చేసింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద డెలివరీ నెట్‌వర్క్‌ల వరకు అందరికి సులభంగా సరిపోయేలా దీన్ని రూపొందించారు. ఆధునిక సాంకేతికతను కలిపి తయారు చేసిన ఈ వాహనం, రోజువారీ రవాణా అవసరాలను తేలికగా తీర్చగలిగే సామర్థ్యం కలిగిఉంది. కఠినమైన నగర ట్రాఫిక్‌లో సైతం సులభంగా నడిపించుకునేలా దీని డిజైన్‌ను రూపొందించారు. దీని డిజైన్‌నే కాకుండా పనితీరు విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎలక్ట్రిక్ వేరియంట్‌లో శక్తివంతమైన మోటార్, లాంగ్ బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగించి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందేలా తయారు చేశారు.

రూ.10 లక్షల లోపు ఎక్కువ బూట్ స్పేస్ ఉన్న బెస్ట్ కార్లు

కొత్త కారు కొనేటప్పుడు చాలా మంది గమనించే విషయం బూట్ స్పేస్. అంటే కారు వెనుక భాగంలో సామాన్లు పెట్టుకునే స్థలం. కారు సైజు పెద్దగా ఉంటే బూట్ స్పేస్ కూడా పెద్దగా ఉంటుంది. కానీ, పెద్ద కార్ల ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే రూ.10 లక్షల లోపే ఎక్కువ బూట్ స్పేస్ ఉన్న కార్లు ఉన్నాయి. అటువంటి కొన్ని కార్ల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం. రేనాల్ట్ ట్రైబర్ (Renault Triber):భారతదేశంలో తక్కువ ధరలో లభించే ఎంపీవీ కారు ఇది. ఇటీవల రేనాల్ట్ కంపెనీ అప్‌డేట్ చేసిన కొత్త ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ కారును విడుదల చేసింది. రూ.6.25 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న ఈ కారు సైజులో పెద్దగా ఉంటుంది. దీని బూట్ స్పేస్ ఏకంగా 625 లీటర్లు. ఎక్కువ సామాన్లు తీసుకెళ్లడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

QC1కి మంచి డిమాండ్.. Activa E మాత్రం ఎక్కడో నిలిచిపోయింది!

ఈ సంవత్సరం ఆరంభంలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMIL) తన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. వాటిలో QC1, Activa E ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ రెండు మోడళ్లతో హోండా అధికారికంగా దేశీయ ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఆవిష్కరణ తర్వాత QC1కి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తోంది. మార్కెట్లోకి వచ్చి కొద్దికాలమే అయినా, వినియోగదారులు దీనిని మెరుగైన సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన Activa E మాత్రం ఆ స్థాయి ఉత్సాహాన్ని రాబట్టలేకపోతోంది. వినియోగదారులు ఇంకా దీన్ని కొనడంలో కొంత వెనుకంజ వేస్తున్నారు.
Advertisement

మార్కెట్లో డిమాండ్ కోల్పోతున్న MG గ్లోస్టర్

ఎంజి మోటార్ (Mg Motor) గురించి చెప్పుకుంటే, ఇది భారతీయ మార్కెట్‌లో మంచి స్థానం సంపాదించుకున్న ఒక బ్రిటిష్ బ్రాండ్. ముఖ్యంగా, దీని ఎలక్ట్రిక్ కార్లు కస్టమర్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. విండ్సర్, కామెట్ ఈవీ లాంటి మోడళ్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతుంటే, కంపెనీకి ఉన్న పెద్ద ఎస్‌యూవీ ఎంజీ గ్లోస్టర్ (MG Gloster) మాత్రం పూర్తిగా నిరాశ కలిగిస్తోంది. జూలై నెలలో విడుదలైన అమ్మకాల గణాంకాలు దీనికి స్పష్టమైన నిదర్శనం. టయోటా ఫార్చ్యూనర్‌కు ప్రత్యర్థిగా MG గ్లోస్టర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చినా, కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఇది పూర్తిగా విఫలమైంది. ఒకప్పుడు ప్రీమియం ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో మార్కెట్‌లో హైప్ క్రియేట్ చేసిన ఈ కారు, ఇప్పుడు మాత్రం షోరూమ్‌లలో ఖాళీగా నిలబడి ఉంది.

ఆగస్టు 24న రెనో కైగర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్!

భారతదేశంలోని కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెనోకు ఉన్న ఆయుధం కైగర్. మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వంటి పెద్ద కార్లతో పోలిస్తే ఇది సాధారణ కారుగా ఉన్నప్పటికీ, సామాన్య ప్రజలకు నమ్మకమైన కారుగా మార్కెట్‌లో అడుగుపెట్టి చాలా కాలమే అయింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్స్ గోవా ట్రిప్‎కు రెడీనా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తమ కస్టమర్ల కోసం గోవాలోని వాగటార్ ప్రాంతంలో 2025 సంవత్సరానికి సంబంధించిన మోటోవెర్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం నవంబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరుగుతుంది. దీని కోసం బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

థియేటర్ అనుభవం కారు లోపలే.. డాల్బీ అట్మాస్‌తో మహీంద్రా XUV 3XO కొత్త సెన్సేషన్

సాధారణంగా మనం సినిమా చూసే సమయంలో మంచి సౌండ్ అనుభూతి కలిగితే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. వీడియో నుంచి వచ్చే ప్రతి సన్నివేశానికి సంబంధించిన మాటలు లేదా పాటలు స్పష్టమైన సౌండ్ ఎఫెక్ట్స్ అందరు కావాలని కోరుకుంటారు. ప్రధానంగా ఈ రోజుల్లో డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన సౌండ్ అనుభూతిని పొందడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ టెక్నాలజీ అందించే ధ్వని మరింత క్లారిటీతో, లోతుగా, అన్ని వైపుల నుంచి వినిపించే రీతిలో ఉంటుంది. అలాంటి అనుభవాన్ని కారు డ్రైవ్‌లో పొందడం ఒక విభిన్నమైన అనుభూతి అని చెప్పాలి. ఈ మారుతున్న ట్రెండ్‌ను సరిగ్గా అర్థం చేసుకున్న మహీంద్రా, తన SUVలలో డాల్బీ అట్మోస్‌ను ఒక కీలక హైలైట్‌గా తీసుకొస్తోంది.
Advertisement

టాటా నుండి 2030 నాటికి 7 కొత్త మోడల్స్

భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్, ఇప్పుడు ఒకటో, రెండో కాదు.. ఏకంగా 7 కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయబోతోంది. ఇటీవల జరిగిన ఇన్వెస్టర్ మీట్‌లో టాటా మోటార్స్ తమ భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను వెల్లడిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

కొత్త కారు కొనే ముందు తెలుసుకోవాల్సిన గోల్డెన్ రూల్స్!

ప్రస్తుతం కారు కొనడం అనేది అందరి డ్రీమ్ అయిపోయింది. ఒకప్పుడు బైకు ఉంటే చాలు అనుకునే రోజులు పోయి, కారు ఉంటే బాగుండు అనే రోజులు వచ్చాయి. మార్కెట్లో వాహన తయారీదారులు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అందుబాటు ధరలో కొత్త కొత్త డిజైన్లతో అధునాతన ఫీచర్స్‌తో కూడిన కార్లను విడుదల చేస్తున్నారు. కారు కొనడం అంటే సాధారణంగా ఒక పెద్ద డ్రీమ్ నెరవేర్చుకున్నట్టే. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ బయ్యర్స్‌కి ఇది మరింత ఎమోషనల్ జర్నీగా ఉంటుంది. కానీ కేవలం కలతో కాకుండా, కొన్ని విషయాలు ముందుగానే ఆలోచిస్తే తరువాత ఇబ్బందులు రాకుండా ఉంటుంది. కారు కొనుగోలు చేయడానికి వెళ్లే ముందు వాటి గురించి ముందస్తు సన్నద్ధం కావడం వలన మీకు నచ్చిన కార్లను సంతోషంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆ వివరాలు ఈ కథనంలో..

మహీంద్రా థార్ రాక్స్ కావాలంటే ఎన్ని నెలలు వెయిట్ చేయాలంటే ?

భారతీయ మార్కెట్లో యువతలో థార్‌పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే మహీంద్రా కంపెనీ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్‌లలో థార్‌ను లాంచ్ చేస్తూనే ఉంది. ఆగస్టు 2024లో విడుదలైన మహీంద్రా థార్ రాక్స్ మొదటి రోజు నుంచే ప్రజలను ఆకట్టుకుంటోంది. దీన్ని పూర్తిగా ఆఫ్-రోడింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. థార్ రాక్స్ బుక్ చేసుకుంటే ఎంతకాలం వేచి ఉండాలో ఈ వార్తలో తెలుసుకుందాం.

పండగ సీజన్‌లో వరుసగా లాంచ్ కానున్న బ్లాక్‌బస్టర్ కార్లు

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో ఒకటి. ముఖ్యంగా కార్ల విభాగంలో ఇక్కడి డిమాండ్ ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చుకుంటే ఎంతో ముందంజలో ఉంటుంది. రోడ్లపై పెరుగుతున్న వాహనాల సంఖ్య, పెరుగుతున్న మధ్యతరగతి కుటుంబాల అవసరాలు, కొత్త టెక్నాలజీలపై ఆసక్తి ఇవన్నీ కలిపి భారతదేశాన్ని ఒక అతిపెద్ద ఆటోమోటివ్ కేంద్రంగా నిలబెట్టాయి. 2025 సంవత్సరం ఈ మార్కెట్‌కు మరింత ఉత్సాహాన్ని తెచ్చేలా ఉంది. ఎందుకంటే ఈ ఏడాదిలో అనేక ఆటోమేకర్లు తమ అత్యంత ప్రతిష్టాత్మక మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. భారతీయ కస్టమర్లు ఎప్పుడూ కొత్త మోడళ్లకు, ఆకర్షణీయమైన డిజైన్‌లకు, సరికొత్త టెక్నాలజీకి ఆసక్తి చూపుతుంటారు. అందుకే ఈసారి రాబోతున్న లాంచ్‌లు మరింత ఆసక్తికరంగా మారాయి.
Advertisement

కొత్తగా వస్తున్న స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్

భారతీయ వాహన మార్కెట్లో తనదైన కొత్త వ్యూహాలతో ముందుకు దూసుకుపోతోంది చెక్ రిపబ్లికన్ కార్ల తయారీ సంస్థ స్కోడా. ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా మొదట వచ్చిన కుషాక్ పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్కోడా తన క్రేజీ కారును సరికొత్తగా ముస్తాబు చేస్తోంది.

మైలేజ్ కావాలా? బడ్జెట్ బైక్ కావాలా? ఈ మూడు బెస్ట్ ఆప్షన్స్!

మన దేశంలో సాధారణ మధ్యతరగతి, పేద కుటుంబాల జీవనశైలిలో టూవీలర్ ఇప్పుడు ఒక అవసరంలా మారిపోయింది. ఉద్యోగాలకు వెళ్లాలన్నా, కాలేజీకి వెళ్లాలన్నా, చిన్న చిన్న వ్యాపారాలు చేయాలన్నా.. బైక్ లేకుండా ఒక అడుగు కూడా ముందుకేయలేని పరిస్థితి వచ్చింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీద ఆధారపడితే టైం ఎక్కువగా వృధా అవుతుంది, ఖర్చు కూడా తగ్గదనే అనిపించదు. అందుకే చాలా కుటుంబాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల వైపు మళ్లిపోతున్నాయి. ఇలాంటి డిమాండ్ ఉన్న సెగ్మెంట్‌లో 125cc బైకులు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇవి మైలేజ్ బాగానే ఇస్తాయి, పవర్ సరిపడా ఉంటుంది, అంతేకాదు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఎక్కువ కావు. ఈ కేటగిరీలో మూడు బైకులు టీవీఎస్ రైడర్ 125, బజాజ్ పల్సర్ 125, హోండా షైన్ 125 గురించి చూద్దాం.

మైలేజ్ కింగ్ ప్లాటినా.. తక్కువ ధరలో అందించే బైక్ స్పెషల్ ఫీచర్స్!

బజాజ్ ప్లాటినా (Bajaj Platina) పేరు వినగానే మనసులోకి వచ్చే మొదటి విషయం తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్. 2006లో తొలిసారిగా మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ బైక్, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం చిన్న విషయం కాదు. మారుతున్న ట్రెండ్స్, పెరుగుతున్న పోటీ మధ్య ప్లాటినా ఎందుకు తనదైన క్రేజ్‌ను కొనసాగించగలుగుతోంది అంటే, దాని వెనుక ఉన్న ప్రధాన కారణం సింప్లిసిటీ విత్ యూజ్‌ఫుల్ ఫీచర్స్. ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్లే వారైనా, కాలేజీకి వెళ్లే స్టూడెంట్ అయినా, లేదా చిన్న వ్యాపారం చూసుకునే వ్యక్తి అయినా... ప్లాటినా అందరికీ సరిపోయే ఒక ఆప్షన్‌గా మారింది. తక్కువ ధరలో దొరకడం, పెట్రోల్ ధరలు ఎంత పెరిగినా భారం కాకుండా 70 నుండి 90 కి.మీ. పైగా మైలేజ్ ఇవ్వగలగడం దీని నిజమైన బలం.

డ్రైవింగ్ ఎంజాయ్ చేసే కార్లు ఇవే

ఈ రోజుల్లో ఆటోమేటిక్ కార్ల పాపులారిటీ బాగా పెరిగిపోతోంది. ఎందుకంటే వీటిని నడపడం చాలా సులభం. పైగా కొన్ని ఆటోమేటిక్ మోడల్స్ మంచి మైలేజీ కూడా ఇస్తున్నాయి. ఇంట్లో మహిళలు కూడా నడపడానికి సులభంగా ఉంటుందని చాలా మంది ఆటోమేటిక్ కార్లనే కొంటున్నారు. అయితే, ఇప్పటికీ కొంతమందికి ముఖ్యంగా పురుషులకు, మాన్యువల్ కార్లు అంటేనే ఇష్టం. క్లచ్ నొక్కుతూ, గేర్లు మారుస్తూ ప్రయాణించడంలో వారికి ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది.
Advertisement

ఈ కారు ఎక్కితే సేఫ్టీ సున్నా.. మరి ఎలా కొంటారు సార్

ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్, భారతదేశంలో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నప్పటికీ అమ్మకాలలో మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఇటీవల విడుదలైన జూలై నెల అమ్మకాల నివేదికలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సంస్థకు చెందిన ఒక ప్రముఖ ఎలక్ట్రిక్ కారు మోడల్ చాలా తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. కేవలం 70 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇంత తక్కువ అమ్మకాలకు కారణం ఏమిటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇన్విక్టోపై ప్రజలు ఎందుకు ఇంతగా ఆసక్తి చూపుతున్నారు?

మారుతి సుజుకి (Maruti Suzuki) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కంపెనీ. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల కోసం అందుబాటు ధరలో కార్లు అందించడం ఈ కంపెనీకి పెద్ద పేరును తెచ్చిపెట్టింది. చిన్న కార్ల నుంచి ఫ్యామిలీ కార్ల వరకు మారుతి ప్రతి సెగ్మెంట్‌లోనూ తనదైన స్థాయిని నిలుపుకుంటూ వస్తోంది. కస్టమర్లలో నమ్మకం, సులభమైన మెయింటెనెన్స్, అధిక రీసేల్ విలువ ఇవన్నీ కలిపి మారుతి కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండేలా చేస్తాయి. ఈ క్రమంలో, కంపెనీకి ప్రాధాన్యత కలిగిన MPV మోడల్ ఇన్విక్టో (Invicto) అమ్మకాల వివరాలను తాజాగా వెల్లడించింది. జూలై 2025లో ఈ పెద్ద ఫ్యామిలీ కారు 351 యూనిట్లు అమ్ముడైంది. ఇది ఒక MPV మోడల్‌కి తగిన స్థాయిలోనే కాకుండా, గత ఏడాదితో పోల్చితే గణనీయమైన వృద్ధిని చూపిస్తోంది.

కస్టమర్ల మనసు దోచుకున్న కారు.. ఇప్పుడు మాత్రం పట్టించుకోని స్థితి!

హ్యుందాయ్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి నెల సేల్స్‌ను వెల్లడించే సందర్భంలో ఈ కంపెనీ మోడల్స్‌లో ఎక్కువ భాగం మంచి సేల్స్‌ను కనబరుస్తుంటాయి. అయితే, అన్ని మోడల్స్ ఒక్కసారిగా స్థిరమైన సేల్స్‌ను ఇవ్వలేవు. తాజాగా విడుదలైన జూలై 2025 సేల్స్ నివేదికలో ఈ విషయం మరొక్కసారి రుజువైంది. ముఖ్యంగా కంపెనీకి ప్రాధాన్యత కలిగిన మిడ్-సైజ్ సెడాన్ అయిన హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) గురించి చెప్పుకోవాలి. గత కొన్ని నెలలుగా ఈ కారు సేల్స్‌లో క్రమంగా తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ, జూలైలో ఆ స్థాయిని మించి గణనీయంగా వెనుకబడింది. నివేదికల ప్రకారం, ఈ కారు జూలై నెలలో కేవలం 826 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. ఇది ఒకప్పుడు మార్కెట్‌లో హాట్-సెల్లింగ్ కార్లలో ఒకటిగా నిలిచిన వెర్నాకు పెద్ద లోటు అని చెప్పుకోవాలి.

కొత్త మారుతి ఎర్టిగా వచ్చేసింది.. ఆకట్టుకునే ఫీచర్లు, అదిరిపోయే మైలేజ్

మారుతి ఎర్టిగా.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7-సీటర్ ఎమ్‌పీవీలలో ఒకటి. తన సెగ్మెంట్‌లో టయోటా రుమియన్, కియా కారెన్స్ వంటి మోడళ్లను కూడా వెనక్కి నెట్టి ఈ కారు భారీ డిమాండ్‌ను సాధించింది. ఇప్పుడు ఈ కారు కొత్త మోడల్ అంటే 2025 ఎర్టిగా షోరూమ్‌లకు చేరుకుంది. ఈ కొత్త మోడల్ అనేక అద్భుతమైన అప్‌డేట్‌లు, సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది. మీరు కొత్త ఎర్టిగా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Advertisement

లగ్జరీ కార్లలో ఓ రేంజ్‌.. కానీ కియా కార్నివాల్ జూలై సేల్స్ విన్నాక షాక్ అవ్వాలి!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కియా కార్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కియా కార్నివాల్ (carnival) కారుకు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. లగ్జరీ టచ్‌తో పాటు పెద్ద కుటుంబాలకు అనువైన ఈ కారుకు ఎప్పటినుంచో ఒక స్థిరమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే జూలై 2025 అమ్మకాల గణాంకాలు చూసినప్పుడు కొంత ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. కంపెనీ తాజాగా వెల్లడించిన డేటా ప్రకారం, జూలై నెలలో కేవలం 62 యూనిట్ల కియా కార్నివాల్ మాత్రమే అమ్ముడైంది. ఇది చూసినప్పుడు కొంత నిరాశ కలిగించినా, గత నెల జూన్‌తో పోలిస్తే మాత్రం ఈ సంఖ్య కొంచెం మెరుగైనదే అని చెప్పాలి. జూన్ నెలలో కేవలం 47 యూనిట్ల కార్నివాల్ మాత్రమే అమ్ముడైంది.