మీ ఫేవరెట్ విండ్సర్ EV ఇక పాత ధరకే లభించదు.. కొత్తగా ఎంతంటే?

భారతదేశ EV మార్కెట్‌లో సంచలనం సృష్టించిన మోడల్స్‌లో MG విండ్సర్ EV ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. ఇప్పటి వరకు టాటా నెక్సాన్ EVనే ఎక్కువగా అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ కారు అని భావించబడింది. కానీ, దాన్ని మించిపోయిన తొలి మోడల్‌గా MG విండ్సర్ నిలవడం నిజంగా ఓ టర్నింగ్ పాయింట్. దీనికి ప్రధాన కారణం, విస్తృతమైన ఇంటీరియర్ స్థలం, విమానం లాంటి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం. MG విండ్సర్ EV‌ను ఎంతో మంది కుటుంబాలు స్మార్ట్, కంఫర్టబుల్ EVగా ఎంచుకున్నారు.

భారత్ ఎన్‌క్యాప్ 5-స్టార్ రేటింగ్ కార్లు.. మీ సేఫ్టీకి ఇదే బెస్ట్ గైడ్!

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? మైలేజ్, ఫీచర్ల కంటే సేఫ్టీనే ముఖ్యమా?.. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సురక్షితమైన కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు సేఫ్టీ ఎంత ముఖ్యమో ప్రజలు ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో కార్ల భద్రతను పరీక్షించే భారత్ ఎన్‌క్యాప్ టెస్ట్ సిస్టమ్ ఒకటి ఉంది. ఇందులో ఎక్కువ పాయింట్లు సాధించి, అత్యంత సురక్షితమైన టాప్ 5 కార్లు ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

యార్కర్ కింగ్ గ్యారేజ్.. జస్ప్రీత్ బుమ్రా లగ్జరీ కార్ల కలెక్షన్ చూస్తే షాకే

క్రికెట్ పిచ్‌పై తన యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించే జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైదానంలోనే కాదు, రోడ్లపై కూడా బుమ్రా స్టైలే వేరు. ఆయన గ్యారేజీలో ఉన్న కోట్లాది రూపాయల కార్లు చూస్తే ఎవరైనా సరే వావ్! ఏం కలెక్షన్ రా బాబు అనాల్సిందే.

నాడు మీ తాతయ్య వాడిన DX.. ఇప్పుడు మీ కోసం EVగా వచ్చేసింది!

ఎన్నో గుర్తుల్ని, జ్ఞాపకాల్ని మళ్లీ తెచ్చేలా... కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (KEL)తన ప్రతిష్టాత్మక స్కూటర్ డీఎక్స్(DX) ను ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనంగా మార్చి విడుదల చేసింది. కాలంతో పాటు మారుతున్న ట్రెండ్‌లకు అనుగుణంగా, కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్ (inetic Watts and Volts Ltd. (KWV)) అనే ప్రత్యేక ఎలక్ట్రిక్ విభాగం ద్వారా భారత్‌లో ఈ సరికొత్త DX ఎలక్ట్రిక్ స్కూటర్ (DX Electric Scooter)ను విడుదల చేసింది. 1980లలో మనకు సుపరిచితమైన కైనెటిక్ హోండా DXను పూర్తిగా కొత్త రూపంలో, ఎలక్ట్రిక్ అవతారంలో మన ముందుకు తీసుకురావడంలో కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో చెప్పకనే చెబుతుంది. ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తన పాత జ్ఞాపకాల్ని ఇప్పటి తరానికి పరిచయం చేయడానికి కైనటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంతో అట్టహాసంగా ఈ రోజు విడుదల చేసింది.
Advertisement

ఇది బైక్ కాదు.. ఒక ఫీలింగ్! 29,000 మందికి పైగా Classic 350నే ఎంచుకున్నారు

రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield), భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న నమ్మకమైన టూవీలర్ బ్రాండ్. దీని బైకులు కేవలం రోడ్డుపై పరుగెత్తడానికే కాదు, ఒక భావోద్వేగాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. దశాబ్దాల కాలంగా అన్ని వయసుల వారి అభిమానాన్ని పొందుతుంది. కాలానుగుణంగా ఎన్నో మోడళ్లను పరిచయం చేస్తూ, ఇతర టూవీలర్ తయారీదారులకు బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కంపెనీ 350 సీసీ నుంచి మొదలుకుని 650 సీసీ వరకు పలు బైకులను విక్రయిస్తుంది. దీనిలో క్లాసిక్ స్టైల్‌పై ఉన్న ఆసక్తి ఇప్పటికి తగ్గలేదు. దీనిని రుజువు చేస్తూ, జూన్ 2025లో కంపెనీ అత్యధికంగా విక్రయించిన మోడల్‌గా క్లాసిక్ 350 (Classic 350) నిలిచింది. ట్రెడిషనల్ లుక్, విశ్వసనీయ ఇంజిన్ పనితీరు, ఆత్మవిశ్వాసం నింపే రైడింగ్ ఫీల్ కారణంగా ఈ బైక్‌పై ప్రజలకున్న ప్రేమ మరోసారి రుజువైంది.

చిరిగిన ప్యాంట్ వేసుకుని లగ్జరీ కారులో ఎంట్రీ ఇచ్చిన రకుల్

సినిమా తారలు.. వారి లగ్జరీ లైఫ్ స్టైల్.. ఈ రెండూ జనాలకు ఎప్పుడూ ఆసక్తే. ముఖ్యంగా వారు వాడే కార్లు, ఖరీదైన వస్తువుల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి వైరల్ అవుతోంది. రామాయణం సినిమాలో శూర్పణఖ పాత్రలో కనిపించబోతున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. రీసెంట్‌గా ముంబై ఎయిర్‌పోర్టుకు ఒక బ్రాండెడ్ కారులో దిగింది.

ఒకే కారులో అందరికి చోటు.. అందుకే జనాలు దీన్ని ఎంచుకుంటున్నారు!

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీకంపెనీ కియా మోటార్స్ (Kia Motors) భారత్‌లో దూసుకుపోతుంది. ఇక్కడ అడుగుపెట్టిన అతితక్కువ కాలంలోనే దేశీయ దిగ్గజ కంపెనీలు అయినటువంటి మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి వాటికి ధీటుగా అదిరిపోయే డిజైన్లతో, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో భారతీయ ప్రజలను తన వైపు తిప్పుకుంటుంది. ఇదిలా ఉంటే కియా మోటార్స్ జూన్ 2025లో తన అమ్మకాలతో ఒక వైవిధ్యమైన ఫలితాన్ని ఎదుర్కొంది. మొత్తం 20,625 యూనిట్లు దేశీయంగా విక్రయించినప్పటికీ, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 3 శాతం తగ్గుదల. అయినప్పటికీ, కంపెనీ రాబోయే నెలల్లో మరింత గరిష్టంగా ప్రదర్శించేందుకు ఆశాభావంగా ఉంది. ముఖ్యంగా ఈ అమ్మకాల్లో కియా కారెన్స్ క్లావిస్ MPV (Kia Carens Clavis) ఎడిషన్‌కు ప్రత్యేకత నెలకొంది.

హీరో ప్యాషన్ ప్లస్ సేల్స్‌లో భారీ జంప్

కొత్త బైకు కొనాలని ఆలోచిస్తున్నారా? తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైకు కోసం చూస్తున్నారా? అలాంటి వారికో గుడ్ న్యూస్. భారత మార్కెట్లో అత్యధిక ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైకులను విక్రయించే కంపెనీలలో హీరో మోటోకార్ప్ అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న హీరో ప్యాషన్ ప్లస్ బైకు ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతోంది.
Advertisement

విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. VF6, VF7 ధర, ఫీచర్లు, బుకింగ్స్ వివరాలు!

కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? అలాంటి వారికో గుడ్ న్యూస్. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బస్సులతో అలరిస్తున్న కంపెనీ.. ఇప్పుడు ఇండియాలో తన తొలి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. త్వరలోనే రెండు అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు, వీఎఫ్‌6, వీఎఫ్‌7లను విడుదల చేయనుంది. ఈ కార్ల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

లీటరుకు 45కిమీ మైలేజ్..మార్కెట్లో ఈ స్కూటర్కు యమ డిమాండ్

మీరు కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే, మంచి స్కూటర్ కోసం చూస్తున్నారా? అలాగే ఇంట్లో భార్యభర్తలు ఇద్దరూ నడపగలిగే స్కూటర్ కావాలంటే సుజుకి యాక్సెస్ 125 ట్రై చేయవచ్చు. ప్రస్తుతం స్కూటర్‌కు ఇప్పుడు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇది నమ్మకమైన స్కూటర్‌గా, ఆకర్షణీయమైన డిజైన్‌తో, బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది.

రెండు కుటుంబాలు కలిసి హ్యాపీగా టూర్‌కు? ఇది బడ్జెట్‌లోనే బెస్ట్ ఎంపిక

ఇండియాలో కుటుంబం ప్రేమానురాగాలకు ఎంతో విలువ ఇస్తారు. ఇంట్లో వాళ్లు అందరు కలిపి జరుపుకునే పండుగలు అయినా అది ప్రయాణాలకు అయిన ఎంతో సంతోషంగా ఉంటాయి. కరోనా తరువాత మారుతున్న కాలంలో ప్రస్తుతం కుటుంబం అంతా కలిసి ఒకే కారులో ప్రయాణించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మన దేశంలో చాలా మందికి కార్ అంటే, ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేందుకు ఉపయోగపడే సాధనం. పండుగలు అయినా, శనివారం-ఆదివారం టూర్లు అయినా, పెద్ద కుటుంబం ఉంటే అందరినీ ఒకే వాహనంలో తీసుకెళ్లే కార్లకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. షోరూమ్‌కు వచ్చేవారిలో చాలా మంది ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లను అడుగుతున్నారు. అలాంటి వాటిలో ప్రముఖంగా వినిపించే కార్లలో మనకు వెంటనే గుర్తొచ్చే పేరు, మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ప్రధానమైనది.

ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి టాటా సియెర్రా.. ఫీచర్లు ఇవే

టాటా మోటార్స్ తన పెట్రోల్/డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో దూసుకుపోతోంది. రాబోయే కొద్ది నెలల్లోనే పలు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా 2030 క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికి ఏడు కొత్త కార్లను విడుదల చేయాలనే ప్రణాళికలో భాగంగా, మొదటి కారుగా టాటా సియెర్రా రాబోతోంది.
Advertisement

టాటా హారియర్ ఈవీ కోసం ఎగబడుతున్న జనం

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను టాటా మోటార్స్ క్యాష్ చేసుకుంటుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా నెంబర్ వన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టాటా హారియర్ ఈవీ కారుకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కారు బుకింగ్‌లు గత జూలై 2వ తేదీన ప్రారంభమయ్యాయి.

మారుతి ఫ్రాంక్స్ SUVలో కీలక మార్పు.. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులు

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ప్రస్తుతం భారతీయ SUV మార్కెట్‌లో తనదైన స్థానం ఏర్పరచుకుంది. తన ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. ఫంక్షనాలిటీకి స్టైలింగ్‌ను కలిపిన విధానం, యువతను ముఖ్యంగా ఆకర్షిస్తోంది. ఈ కారును మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుంచీ మంచి స్పందన వస్తోంది. నెక్సా ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులో ఉన్న ఈ SUV ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 88,066 యూనిట్లు అమ్ముడుపోయింది. ఈ గణంకాలను చూసినట్లయితే ఈ సెగ్మెంట్‌లో ఫ్రాంక్స్ ఎంతగా ఆకర్షణీయమైందో స్పష్టంగా చూపుతోంది. దీనికి ప్రస్తుతం డిమాండ్ ఉన్న దృష్ట్యా మారుతి తన కారులో మరింత సేఫ్టీని అందించింది.

పెద్దల సభకు పేద్ద కారులో వెళ్లిన కమల్ హాసన్.. నోరెళ్ల బెట్టిన స్థానికులు

భారత సినీ దిగ్గజం, విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చి మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించినా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. అయితే, ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికవ్వడంతో రాజకీయంగా కీలక అడుగు వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతగా, తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ ఆయనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది. దీనిని స్వీకరించి, శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఒక్క నెలలోనే 1 లక్ష మార్క్ దాటేసింది! TVS జూపిటర్ స్కూటర్ జూన్ సేల్స్

భారత మార్కెట్లో హోండా యాక్టివాకు బలంగా ఎదురు నిలిచిన స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్‌ (Tvs Jupiter)కు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత స్కూటర్ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ మోడల్ ఆకట్టుకునే డిజైన్, మైలేజ్, కంఫర్ట్ వంటి అంశాలతో అందరి మనసును గెలుచుకుంది. తాజాగా విడుదలైన జూన్ 2025 విక్రయాల గణాంకాలు చూస్తే ఇది మరోసారి తన డిమాండ్‌ను స్పష్టంగా నిరూపించుకుంది. జూన్ నెలలో టీవీఎస్ సంస్థ ఏకంగా 1,07,980 జూపిటర్ స్కూటర్లను విక్రయించింది. ఇది ఏదో సాధారణ గణాంకం కాదు... బిజీ మార్కెట్లో టఫ్ పోటీతో ఉన్నప్పటికీ, జూపిటర్‌కు ఇంకా అంతగా ఆదరణ ఉందని చెప్పే అద్భుత నిదర్శనం. ఇది స్థిరంగా మార్కెట్లో నిలబడిన స్కూటర్ మాత్రమే కాదు, ఫ్యామిలీ లైఫ్‌స్టైల్‌ను పరిగణలోకి తీసుకుని వచ్చిన క్లాస్‌కి సంబంధించినది కూడా.
Advertisement

రెండూ గట్టివే.. కానీ మీకిష్టమయ్యేది ఒక్కటే! ఏది సెలెక్ట్ చేస్తారు?

దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ (Kia Motors) ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి దేశీయ దిగ్గజ తయారీదారులకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం కియా కార్లు ఢిల్లీ నుంచి మొదలుకుని గల్లీ వరకు కనిపిస్తున్నాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ఆధారిత కార్లను విడుదల చేస్తూనే, అదే సమయంలో ఎలక్ట్రిక్ వేరియంట్లపై కూడా ప్రస్తుతం దృష్టి సారిస్తుంది. అందులో భాగంగా ఒక మోడల్‌ను ఇంధన ఆధారితంగా లాంచ్ చేసిన కొద్ది రోజుల తరువాత అదే కారులో మార్పులు చేసి ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చి ఎలక్ట్రిక్ మోడల్‌లో తీసుకొస్తుంది.

టాటా, ఎంజీలకు గట్టి పోటీ.. ఎక్కువ ఆప్షన్లతో మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు!

భారతదేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ మార్కెట్‌లో తమదైన ముద్ర వేసిన మహీంద్రా అండ్ మహీంద్రా, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. దీనిలో భాగంగా గత ఏడాది విడుదల చేసిన తమ రెండు వినూత్న ఎలక్ట్రిక్ కార్లు BE 6, XEV 9eపోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి సిద్ధమవుతోంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎందుకు అంత పాపులర్?

అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయిన రెండేళ్లలోనే మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అత్యంత వేగంగా లక్ష యూనిట్లను ఎగుమతి చేసిన భారతీయ ఎస్‌యూవీగా రికార్డు సృష్టించడమే కాకుండా, 2025 ఫిబ్రవరిలో వ్యాగన్ఆర్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లను వెనక్కి నెట్టి దేశీయ అమ్మకాల్లో నంబర్ 1 స్థానంలో నిలిచింది.

పెరిగిన పెట్రోల్ రేట్లకి బెస్ట్ సొల్యూషన్.. హోండా యాక్టివా!

భారత స్కూటర్ మార్కెట్‌లో హోండా యాక్టివా (Honda Activa) పేరు చెబితే, ప్రతి ఇంటిలో గుర్తొచ్చే బ్రాండ్. 2001లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ స్కూటర్, అప్పటి నుంచి ఇప్పటివరకు వినియోగదారుల మన్ననలు సంపాదిస్తూ, నంబర్ వన్ స్థానం దక్కించుకుంది. మొదటి వాహనం ఎంచుకుంటున్న వారికి, రోజూ ఆఫీసుకు వెళ్తున్న వారికైనా, కుటుంబ ప్రయోజనాల కోసం చూసే వారికైనా హోండా యాక్టివా ప్రతి తరానికి, ప్రతి అవసరానికీ సరిపోయే విధంగా ఉంది. ఈ స్కూటర్‌కు అనువైన డిజైన్, నమ్మకమైన ఇంజిన్, ఆర్థికంగా సరిపడే నిర్వహణ ఖర్చులు ఉన్నందువల్లే ఇది అనేక మందికి మొదటి ఆప్షన్‌గా మారింది. దేశంలోని పల్లె నుంచి పట్టణం వరకు ఇది రోడ్లపై కనిపిస్తుంది.
Advertisement

మార్వెల్ స్టైల్‌లో టీవీఎస్ NTORQ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ వచ్చేసింది

దేశీయ టూవీలర్ వాహన రంగంలో పేరొందిన సంస్థ టీవీఎస్ మోటార్ (Tvs Motor) కంపెనీ, తమ ప్రముఖ స్కూటర్ మోడల్ అయిన ఎన్‌టార్క్ 125కి మరో ప్రత్యేకతను జోడిస్తూ, మార్వెల్ అవెంజర్స్ సూపర్ స్క్వాడ్ సిరీస్‌లోకి కొత్త ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ (Tvs Ntorq 125 Super Soldier Edition) మార్వెల్ యూనివర్స్‌లోని అభిమానుల హృదయాలను గెలిచిన సూపర్ హీరోల నుంచి ప్రేరణ పొందింది. ఈ సరికొత్త ఎడిషన్, టీవీఎస్ ఎన్‌టార్క్ సూపర్ స్క్వాడ్ సిరీస్ లైనప్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఇందులో అత్యంత ప్రాచుర్యం పొందిన మార్వెల్ పాత్రలైన క్యాప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్ వంటి వీరుల ప్రతిరూపాలను డిజైన్ రూపంలో మనకు దర్శనమిస్తాయి.

పండుగ సీజన్‌లో బజాజ్‌కు బ్యాడ్‌న్యూస్..EV ఉత్పత్తికి బ్రేక్

ప్రపంచమంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తోంది. ముఖ్యంగా స్కూటర్లు, టూవీలర్ల డిమాండ్ బాగా పెరిగింది. కానీ, ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ముఖ్యమైన ఒక ముడిసరుకు ఉంది. దాని పేరు రేర్ ఎర్త్ ఎలిమెంట్. దీన్ని ఎక్కువగా చైనా తయారు చేస్తుంది. ఇప్పుడు చైనా ఈ ముడిసరుకును వేరే దేశాలకు అమ్మకుండా ఆపేసింది.

ఎంజీ కామెట్ ఈవీ ధరల పెంపు.. ఎంత పెరిగిందో తెలుసా?

చిన్న ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో బాగా అమ్ముడవుతున్న ఎంజీ కామెట్ ఈవీ ధరలు పెరిగాయి. జూలై 2025 నుండి ఈ ధరల పెంపు వెంటనే అమల్లోకి వస్తుంది. మోడల్‌ను బట్టి రూ.15,000 వరకు ధరలు పెరుగుతాయని ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. కొత్త ధరలతో ఈ కారు ఇప్పుడు రూ.7.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై, టాప్ మోడల్ రూ.10 లక్షలకు (ఎక్స్-షోరూమ్) దగ్గరగా ఉంటుంది. 2025 ప్రారంభం నుంచి చాలాసార్లు ధరలు పెరిగిన తర్వాత ఇది మరో పెంపు.

కార్ ప్రేమికులకు గుడ్‌న్యూస్.. బ్రిటన్ లగ్జరీ కార్లు త్వరలో చవకగా!

భారతదేశం, బ్రిటన్ మధ్య (India-UK FTA) తాజాగా సంతకమైన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయబోతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ ఈ ఒప్పందం మరింత లాభపడనుంది. ఎంతో కాలంగా జరుగుతున్న చర్చలకు ముగింపు పలుకుతూ,తాజగా లండన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని వాణిజ్య మంత్రుల చేతుల మీదుగా పూర్తయ్యింది. దీన్ని అమలు చేయడానికి భారత మంత్రివర్గం, బ్రిటన్ పార్లమెంట్ నుండి తుది ఆమోదం రావాల్సి ఉంది. అయితే ఈ ఒప్పందం ద్వారా ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ఇప్పటివరకు బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై భారత్ భారీ దిగుమతి సుంకాలు విధిస్తూ వస్తోంది.
Advertisement

ఎలక్ట్రిక్ కారు అంటే ఇదే మరి! 3.2 సెకన్లలో 100 కి.మీ వేగం

JSW-MG మోటార్ ఇండియా ఎట్టకేలకు భారత మార్కెట్‌కి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న కారు ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster) ను అధికారికంగా విడుదల చేసింది. ఇది కేవలం ఓ కొత్త ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు... భారతదేశం లో ఎలక్ట్రిక్ వాహనాల పరిణామానికి కొత్త దిశ చూపించే పవర్‌ప్యాక్ స్పోర్ట్స్ కారు. ఈ సైబర్‌స్టర్ ప్రత్యేకతేంటంటే, ఇది ఆసియాలో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందింది. MG కంపెనీ తన ప్రీమియం ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో ఈ కారును చేర్చి, లగ్జరీ,పెర్ఫార్మెన్స్ లెవెల్స్‌ను మరో మెట్టు ఎక్కించింది. భారత మార్కెట్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.72.49 లక్షలుగా నిర్ణయించబడింది. అయితే, ఈ ధర కేవలం ముందుగానే బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.