రూ.99.81 లక్షల ధరకు లిమిటెడ్ ఎడిషన్ ఆడి Q7 లాంచ్
ఆటోమొబైల్స్
- 1 year, 2 month, 29 days ago
జర్మన్ లగ్జరీ కార్ల బ్రాండ్ కంపెనీ ఆడి (audi), ప్రీమియం మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరిచే దిశగా మరో అడుగు వేసింది. ఆటోమొబైల్ పరిశ్రమలో పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి ఈ నెల ప్రారంభంలో Q4 సిగ్నేచర్ ఎడిషన్‌ను తీసుకురాగా, ఇప్పుడు ఆడి Q7 సిగ్నేచర్ ఎడిషన్ (Audi Q7 Signature Edition)ను విడుదల చేసింది. సిగ్నేచర్ సిరీస్‌లో భాగంగా తాజాగా ఆవిష్కరించిన ఈ మోడల్, రూ. 99.81 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కంపెనీ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ కారులో అనేక కొత్త ఫీచర్స్, అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ ఆధారంగా రూపొందించిన అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు ఈ సిగ్నేచర్ ఎడిషన్‌ను మరింత స్పెషల్ చేస్తాయి.