హీరో ముఖంలో చిరునవ్వు.. డెస్టినీ సేల్స్ భారీగా జంప్
ఆటోమొబైల్స్
- 4 month, 25 days ago
భారతదేశ ద్విచక్ర వాహన రంగంలో హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఒక అగ్రగామి సంస్థగా నిలుస్తోంది. ముఖ్యంగా స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి బలమైన పోటీదారులతో గట్టిగా పోటీ పడుతోంది. ఈ రెండు మోడళ్లు మార్కెట్‌లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో, హీరో కూడా పలు స్కూటర్ మోడళ్లను ప్రవేశపెట్టి తన స్థానాన్ని బలపరచడానికి ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాల్లో ఎక్కువగా నిలబడలేకపోయినా, హీరో డెస్టినీ (Hero Destini) మాత్రం తెలివిగా ముందుకు సాగుతూ మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ తన స్కూటర్ వ్యూహాన్ని మరింత స్పష్టంగా మార్చుకుంది.