7 సీటర్ కారు ధర రూ.5.65 లక్షలే.. ..ఇండియాలోనే ఫస్ట్ కారు
ఆటోమొబైల్స్
- 3 month, 19 days ago
మధ్యతరగతి కుటుంబాలకు, ఎక్కువ మంది ప్రయాణించే వారికి నిస్సాన్ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. తన అద్భుతమైన 7 సీటర్ మోడల్ గ్రావైట్‌ను ఇప్పుడు సరికొత్త సీఎన్జీ అవతారంలో మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడమే కాకుండా, సామాను పెట్టుకోవడానికి డిక్కీలో తగినంత స్థలాన్ని కేటాయించడం ఈ కారు ప్రత్యేకత. నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన ఆల్-న్యూ నిస్సాన్ గ్రావైట్ కోసం ప్రభుత్వం ధృవీకరించిన సీఎన్జీ కిట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ విభాగంలోనే మొదటిసారిగా స్మార్ట్ ట్విన్-సిలిండర్ టెక్నాలజీని పరిచయం చేశారు. సాధారణంగా సీఎన్జీ కార్లలో సిలిండర్ వల్ల డిక్కీలో స్థలం ఉండదు, కానీ గ్రావైట్లో రెండు చిన్న సిలిండర్లను అమర్చడం ద్వారా ఏడుగురు కూర్చున్నా సరే, లగేజీ పెట్టుకోవడానికి తగినంత స్థలం లభిస్తుంది. దీనివల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.